తెలుగు 'కృష్ణుడు' ఎవరు?
తెలుగు 'కృష్ణుడు' ఎవరు?
Published Wed, Feb 12 2014 12:22 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM
కనుమరుగైపోతున్న మల్టీ స్టారర్ చిత్రాలకు గత సంవత్సరం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మరోసారి టాలీవుడ్ నటుడు వెంకటేశ్ ఊపిరిపోశాడు. సీతమ్మ వాకిట్లో.. విజయం తర్వాత మరోసారి వెంకటేశ్ మల్టీ స్టారర్ చిత్రానికి సిద్ధమైనట్టు సమాచారం. హిందీలో ఘన విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వెంకీ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. గుజరాతీ నాటకం 'కంజి విరుద్ కంజి', ఆస్ట్రేలియన్ చిత్రం 'ది మ్యాన్ హూ స్యూడ్ గాడ్' లను స్పూర్తిగా తీసుకుని బాలీవుడ్ లో 'ఓ మై గాడ్' చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేశ్ రావెల్ ప్రధాన పత్రాలు పోషించారు. పరేశ్ రావెల్ పాత్రలో వెంకటేశ్ నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో కృష్ణ పరమాత్ముడి పాత్ర అత్యంత కీలకం. అయితే ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కృష్ణుడి పాత్రకు నలుగురి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణుడి పాత్రకు సూపర్ స్టార్ రజనీ కాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు పేర్లపై నిర్మాత డి సురేశ్ బాబు దృష్టిని సారించినట్టు తెలుస్తోంది.
ఒకవేళ నలుగురు అగ్రనటుల్లో కృష్ణుడి పాత్రను పోషించడానికి ఎవరు ముందుకు వచ్చినా, తెలుగు 'ఓ మై గాడ్' చిత్రానికి బ్రహ్మండమైన క్రేజ్ వస్తుందని సినీ విమర్శకులు, పండితులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణుడి పాత్రకు రజనీ, చిరంజీవి, పవన్, మహేశ్ లో ఎవరు ఓకే చెబుతారో అని అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.
Advertisement
Advertisement