తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..? | Pawan kalyan new movie budget 100 crores | Sakshi
Sakshi News home page

తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..?

Published Wed, Jun 29 2016 1:40 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..? - Sakshi

తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..?

తెలుగు సినిమా బడ్జెట్ పరిధులు చెరిగిపోతున్నాయి. రీజినల్ సినిమా కూడా వందకోట్ల వసూళ్లు సాధించగలదని తేలిపోవటంతో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే బాహుబలి, పులి లాంటి సినిమాలు వెండితెర మీద సందడి చేయగా.., మరిన్ని చిత్రాలు అదే కోవలో రూపొందనున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై ఇలాంటి వార్తే బయటకు వచ్చింది. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా ఎస్ జె సూర్యను ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోపాల గోపాల దర్శకుడు డాలీని తీసుకొని షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. చిత్రయూనిట్ నుంచి బయటకు రాకముందే సినిమా విశేషాలను తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సూర్య. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు.

పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు వందకోట్ల బడ్జెట్ను కేటాయించినట్టు తెలిపారు. సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నారని,  సినిమా అంతా పంచెకట్టులోనే ఉంటారని తెలిపారు. అయితే తనకు రాయలసీమ ప్రాంతంపై అవగాహన లేని కారణంగా కథాకథనంలో ఆకుల శివ సహాయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి ప్రస్తుత దర్శకుడు డాలీ, సూర్య ప్లాన్ చేసినట్టుగానే తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement