ఆగస్టు 6న సెట్స్ మీదకు..! | pawans next finally gets a start date | Sakshi
Sakshi News home page

ఆగస్టు 6న సెట్స్ మీదకు..!

Published Sun, Jul 24 2016 8:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఆగస్టు 6న సెట్స్ మీదకు..! - Sakshi

ఆగస్టు 6న సెట్స్ మీదకు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు డేట్ కుదిరింది. చాలా రోజులుగా ఈసినిమా విషయంలో వస్తున్న రూమర్స్కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆగస్టు తొలి వారంలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

ముందుగా ఈ సినిమాను ఎస్ జె సూర్యను దర్శకుడిగా ఎంపిక చేసినా.. సూర్య నటుడిగా బిజీ అవ్వటంతో ఆ స్థానంలో డాలీని తీసుకున్నారు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement