references
-
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్‌డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
నిర్మలమ్మకు 2023–24 వార్షిక బడ్జెట్ వినతులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్ఐ దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్‌లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్‌లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది. ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్‌ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్‌ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్‌పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పీఎల్ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా రాబోయే బడ్జెట్లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్‌తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం. లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్ఓ యోగేష్ పటేల్ కోరారు. ఆర్అండ్డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్‌లైఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్‌లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్‌లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు. ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు మానవ వనరుల (హెచ్ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్‌గా మిగిలిపోయిందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
వాటిని రెండ్రోజులు వాడొద్దు
న్యూఢిల్లీ/జైపూర్: కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మంగళవారం రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు. ‘ఒక రాష్ట్రం నుంచి ఈ విషయమై ఫిర్యాదు వచ్చింది. వేరే 3 రాష్ట్రాలతో మాట్లాడాము. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఫలితాలకు, ల్యాబ్ పరీక్షల ఫలితాలకు మధ్య తేడాలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అందువల్ల రెండు రోజుల పాటు ఆ కిట్స్ వాడవద్దని రాష్ట్రాలకు సూచించాం’అని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ చెప్పారు. ఈ వ్యాధిని గుర్తించి మూడున్నర నెలలే గడిచినందున నిర్ధారణ పరీక్షల తీరును మెరుగుపర్చాల్సి ఉందన్నారు. కేసులు రెట్టింపయ్యే సమయం గణనీయంగా పెరిగిందని, అందువల్ల భారీగా కేసులు నమోదయ్యే పరిస్థితి రాకపోవచ్చని పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90% çసరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4% మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు తెలిపారు. ల్యాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినవారికి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా జరిపిన పరీక్షలో నెగటివ్ వస్తోందన్నారు.‘ఇవి చైనాలో తయారైన కిట్స్. ఐసీఎంఆర్ ఉచితంగా 30 వేల కిట్స్‌ను రాష్ట్రానికి ఇచ్చింది. అదనంగా 10 వేల కిట్స్‌ను కొనుగోలు చేశాం’అని రాజస్తాన్ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ తెలిపారు. ఈ కిట్స్ రక్త పరీక్ష ద్వారా, అత్యంత తక్కువ సమయంలో కరోనాను నిర్ధారిస్తాయి. ఈ కిట్స్ ద్వారా పాజిటివ్‌గా తేలిన వారికి మళ్లీ ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ ఉద్యోగికి కరోనా లోక్‌సభ సెక్రెటేరియెట్‌లో పారిశుధ్య విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. అతడు గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. 19 వేలకు చేరువలో.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య మంగళవారం సాయంత్రానికి 18,985కి, మరణాల సంఖ్య 603కి చేరింది. సోమవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో 1,329 కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 11 రాజస్తాన్‌లో, 10 గుజరాత్లో, 9 మహారాష్ట్రలో, 3 యూపీలో, 2 చొప్పున ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ల్లో, ఒకటి కర్ణాటకలో సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 3,259 మంది కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని మంగళవారం వెల్లడించింది. 17% పైగా పేషెంట్లు కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 232 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసులవారీగా కూడా మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 4,669 కేసులు నమోదయ్యాయి. కరోనాపై టెలిఫోనిక్ సర్వే కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు టెలిఫోన్ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ టెలిఫోన్ సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. 1921 అనే నంబర్ నుంచి ఫోన్ వస్తుందని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. ఇలాంటి సర్వే పేరుతో ఇతర నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు స్పందించవద్దని సూచించింది. ► ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5– 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ► గతవారం ఐదు లక్షల కిట్స్‌ను ఐసీఎంఆర్ చైనాకు చెందిన రెండు సంస్థల నుంచి కొనుగోలు చేసి, కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న రాష్ట్రాలకు పంపించింది. ► చైనా ఉత్పత్తుల్లో నాణ్యతాపరమైన లోపాలున్నట్లు వస్తున్న వార్తలపై గతవారం చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జి రాంగ్ స్పందిస్తూ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసేలా తమ దేశంలో కఠినమైన నిబంధనలున్నాయన్నారు. -
వినయ విధేయ రాహుల్
బెంగళూరు: టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిషేధం ఎదుర్కొన్న లోకేశ్ రాహుల్ ఆ ఘటన తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని అన్నాడు. ఆ సమయంలో ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టి20ల్లో రాహుల్ 50, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. విరామం సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వద్ద తగిన సూచనలు తీసుకున్నట్లు అతను వెల్లడించాడు. ‘ఆటగాడిగా, వ్యక్తిగతంగా కూడా అది నాకు చాలా కఠిన సమయం. టీవీ షో తర్వాతి పరిణామాలు నన్ను ఎంతో మార్చేశాయి. మరింత వినయంగా, సంయమనంగా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. ఇకపై తలవంచుకొని ఆటపై మాత్రమే దృష్టి పెడతాను. నిషేధం కారణంగా లభించిన సమయంలో నా ఆటలో లోపాలు అధిగమించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ద్రవిడ్‌తో గడిపిన సమయం ఎంతో ఉపయోగపడింది. ఇకపై వ్యక్తిగా మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం ప్రకటించిన ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రాహుల్ ఆరో స్థానంలో నిలిచాడు. భారత్‌నుంచి టాప్–10లో అతనొక్కడే ఉన్నాడు. -
12 నెలలు సూచనలు
‘‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉంది.. మహా అయితే నటించగలదు, డ్యాన్స్ చేయగలదు.. వాక్చాతుర్యం ఉంటుందా? అని తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు ప్రియాంకా చోప్రా షాకిచ్చారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనేలా మాట్లాడి, అందర్నీ అబ్బురపరిచారు. ఓ ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ నిర్వహించిన ‘యాన్యువల్ లెక్చర్’లో భాగంగా మాట్లాడటానికి ఆమెను ఆహ్వానించారు. రచయితలు, కథకుల మధ్య జరిగే సదస్సులో ప్రియాంక ఏం మాట్లాడతారని కొందరు పెదవి విరిచారు. కానీ, తన అద్భుతమైన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘మన ఆశలను, మన కలలను నిజం చేసుకోవాలంటే మనం బెస్ట్ అయ్యుండాలి. బెస్ట్ అనిపించుకోవాలంటే కొన్ని పాటించాలి’’ అంటూ ప్రియాంక కొన్ని సూచనలు కూడా చెప్పారు. ధైర్యంగా నిలబడగలగటం: మనం కన్న కలలకి, ఆశయాలకి మొట్టమొదటి శత్రువు మనలోని భయమే. ఆ భయంతో పోరాడాలి. ధైర్యంగా నిలబడి, గెలవాలి. సరైన నిర్ణయాలు తీసుకోగలగటం: మనం ఏం కావాలనుకుంటున్నామో అవి మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అవకాశాల్ని అందిపుచ్చుకోండి: అవకాశాలు తరచుగా రావు. చాలా అరుదు. అందుకే దొరికిన వాటిని అందిపుచ్చుకోండి. స్వార్థంగా ఉండండి: ‘ఇది లేక అది... ఏదో ఒకటి’ అంటూ మన కళ్ల ముందు ఒక్కోసారి రెండు చాయిస్‌లు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో స్వార్థంగా ఉండండి. రెంటినీ సద్వినియోగం చేసుకోండి. కాంప్రమైజ్ కావద్దు: మీకు నచ్చిన విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్ప పరిస్థితులు లేదా ఇంకొకరు కాదు. ఫెయిల్ అవ్వండి.. ఫెయిల్ అవుతూనే ఉండండి: మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా బాధపడకండి. ఫీనిక్స్ పక్షిని ఆదర్శంగా తీసుకోండి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్లండి. రిస్క్ తీసుకోండి: మనం ఎంత గొప్ప విజయం సాధించాలంటే అంత గొప్ప రిస్క్ తీసుకోవాలి అని నమ్ముతాను నేను. పాజిటివిటీ: మన సక్సెస్ మన చుట్టూ ఉన్న వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే పాజిటివ్ పీపుల్‌తో స్నేహం ఏర్పరచుకోండి. అందర్నీ గెలవలేం: ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సాధించినా అందర్నీ సంతృప్తిపరచలేం. అందర్నీ గెలవలేం. అవతలివాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ముందుకు వెళం్లడి. మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకోకండి: మనం ఏం రాకెట్లు తయారు చేయడంలేదు. కూల్‌గా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి. తిరిగి ఇచ్చేయండి: మన వంతుగా సమాజానికి సహాయం చేయాలి. మార్పు మనతో మొదలవ్వాలి. మూలాల్ని మరువకండి: ఎక్కణ్ణుంచి వచ్చామన్నది మరచిపోవద్దు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏడాదికి 12 నెలలు. ప్రియాంక కూడా 12 సూచనలు చెప్పారు. ఒక్కో నెల ఒక్కటి ఫాలో అయినా ‘మనం బెస్ట్’ అనిపించుకోవచ్చేమో. -
ప్రజలతో మమేకమవ్వండి
ముస్సోరి: ప్రజలకు సేవచేసేందుకు వారితో మమేకమవ్వటం అవసరమని శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలతో కలిసిపోయే సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 92వ వ్యవస్థాపక కోర్సు శిక్షణలో ఉన్న అధికారులకు శుక్రవారం మోదీ పలు సూచనలు చేశారు. ’పుస్తకాల ద్వారా నేర్చుకోవటం సరే.. కానీ వీటినుంచి బయటకు వచ్చి ప్రజల గురించి అర్థం చేసుకోవటం ద్వారా వారికి మరింత సేవ చేసేందుకు వీలుంటుంది. ఇలా చేయటం ద్వారానే విజయవంతమైన ఆఫీసర్లుగా పేరుతెచ్చుకుంటారు‘ అని ప్రధాని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల మధ్య వారధిలా అధికారులు వ్యవహరించాలని కోరారు. అధికారులు వేర్వేరుగా పనిచేయటం ద్వారా ఫలితాలు రావని.. జట్టుగా పనిచేస్తేనే అద్భుతాలు చేయవచ్చన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజాస్వామ్యంలో మార్పులొస్తాయన్న మోదీ.. ఇందుకోసం ఐఏఎస్ లు ఉత్ప్రేరకాలుగా పనిచేయాలన్నారు. అశోక స్థూపం పైనున్న నాలుగు సింహాల్లో కనిపించని నాలుగో సింహమే మీరని ప్రశంసించారు. ‘కేరీర్ కోసం కష్టపడి ఇక్కడికొచ్చారు. ప్రజాసేవను మిషన్‌గా భావించి పనిచేయండి‘ అని సూచించారు. -
పన్ను వివాదాల పరిష్కారానికి పెద్దపీట: సీబీడీటీ
న్యూఢిల్లీ: పన్ను అపరిష్కృత అంశాలు న్యాయస్థానాల్లో పెరిగిపోకుండా చూడ్డంలో భాగంగా అధికారులకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) కీలక సూచనలు చేసింది. ఏకమొత్తంగా ఒకేసారి పన్ను సమస్య పరిష్కార పథకంపై అసెస్సీలకు అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సూచించింది. జూన్ 1న ప్రారంభించిన ఈ పథకం డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఈ పథనిర్దేశం చేసింది. కమిషనర్ (అప్పీల్) ముందు పెండింగులో దాదాపు 2.59 లక్షల కేసులు ఉన్న నేపథ్యంలో సీబీడీటీ మార్గదర్శకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 29 వరకూ లభిస్తున్న ఐటీ గణాంకాల ప్రకారం పేరుకుపోయిన కేసుల్లో రూ.10 లక్షలపైబడిన అప్పీళ్ల సంఖ్య 73,402 కాగా, రూ.10 లక్షల లోపు కేసుల సంఖ్య 1,85,858. -
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్స్టాప్ పెట్టేది ఇండక్షన్ స్టవ్. దీని వాడకంలో కొన్ని సూచనలు పాటిస్తే మేలు. అవేంటంటే.. ⇒ మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టివ్ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం. ⇒ వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ⇒ స్టవ్‌ను మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్ చేయరాదు. మన్నికైన స్వీచ్బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌లను వాడటం మంచిది కాదు. ⇒ వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్చాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి. -
‘పరీక్ష’ కాలం!
♦ సమతుల ఆహారం తీసుకోండి ♦ కనీసం 6 గంటల నిద్ర తప్పనిసరి ♦ అతి ఆందోళన ప్రమాదకరం ♦ తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం ♦ ఇది ఒక అవకాశమే... జీవితం కాదు ♦ విద్యార్థులకు నిపుణుల సూచనలు.. సలహాలు సాక్షి, సిటీబ్యూరో: పరీక్షల సీజన్ మొదలైంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఇంటర్మీడియెట్.. డిగ్రీ... ఆ తర్వాత పదో తరగతి... అనంతరం వివిధ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తరగతులు ముగిశాయి. పునఃశ్చరణ జోరుగా కొనసాగుతోంది. దాదాపు 3 నెలలు ఒకదాని తర్వాత మరొకటి జరిగే పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే విజయం సొంతమవుతుంది. గంటల తరబడి చదివినా.. ఏకాగ్రత తప్పకూడదు. చదువుపైనే మనసు లగ్నం కావాలి. ఇవన్నీ సజావుగా సాగాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మలచుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. చదువు పైనే మనసు కేంద్రీకృతం కావాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆందోళనను దరిచేరనీయవద్దని స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రులకు సూచనలు ‘చద వండి’ అంటూ పదే పదే విద్యార్థులను విసిగించొద్దు. పరీక్షల సమయంలో అతిగా చదివినా... పెద్దగా లాభం ఉండదు. కాకపోతే ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో వారికి తెలియజేయండి. పరీక్షలు ముగిసే వరకు వారికి పనులు చెప్పకపోవడమే మంచిది. విద్యార్థులు ఆందోళనపడుతున్నట్లు గుర్తిస్తే.. వారితో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. టీవీ చూడడం... మొదటిపేజీ తరువాయి సంగీతాన్ని ఆస్వాదించడం... పార్క్‌కు వెంట తీసుకెళ్లడం..వంటి వాటితో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న చోటనేమీరూ చిన్న చిన్న పనులు చేస్తూ గడిపితే వారికి కొంత విశ్వాసం పెరుగుతుంది. వీలైతే ఫలితాల గురించి కాకుండా.. చదివిన అంశాలను ఏవిధంగా పూర్తి స్థాయిలో పేపర్‌పై పెట్టవచ్చో చూపిస్తే మంచిది. ఇంట్లో నిశ్శబ్దం పాటించాలి. టీవీలు, రేడియోలు కట్టిపడేస్తే అంతరాయం ఉండదు. అంతా మంచే జరుగుతుందని విద్యార్థులకు ధైర్యం చెప్పాలి. విద్యార్థులు పాటించాల్సినవి భవిష్యత్‌కు మేలిమలుపుగా నిలిచే టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇతర వ్యాపకాలను విడిచిపెట్టాలి. ప్రధానంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల నుంచి ఆలోచనలను చదువు వైపు మళ్లించాలి. లేదంటే సమయం వృథా కావడమే కాక.. భావోద్వేగాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్నేహితులతో సరదా తిరుగులు వదిలేయండి. పుస్తకాన్నే స్నేహితుడిగా భావించి.. నిత్య నూతనోత్సాహంతో సన్నద్ధం కావాలి. ముఖ్యంగా బృందాలుగా చదవడం ఎంతో సహకరిస్తుంది. పాఠ్యాంశాలపై దగ్గరి స్నేహితులతో కలిసి రోజుకు 2-3 గంటలపాటు చర్చిస్తే.. సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. అంతేగాక సందేహాలు నివృత్తి అవుతాయి. ఆందోళన దూరమవడమే కాకుండా మన చదువుపై ఓ అంచనాకు రావచ్చు. విరామంలేకుండా అదేపనిగా చదువకూడదు. ఇలా చేయడం వల్ల పాఠ్యాంశాలన్నీ గుర్తుండడం కష్టం. తెల్లవారుజామున పుస్తకం పట్టేందుకు అధిక ప్రాధాన్యంఇవ్వండి. చదవడంలో ఒక పద్ధతిని అవలంబిస్తే మేలు. ఎంతసేపు చదివామన్నది కాకుండా.. ఎంత చదివామన్నది... చదివింది ఎంత గుర్తుందన్నది ముఖ్యం. గుర్తున్న పాఠ్యాంశాలను సమాధాన పత్రాలపై పూర్తి స్థాయిలో రాయడం అవసరం. మన దగ్గర పరీక్షలన్నీ.. రాత పద్ధతిలోనే జరుగుతాయి. ఈ క్రమంలో చదువుతూ రాసే విధానాన్ని విద్యార్థులు అలవర్చుకుంటే.. మతిమరుపు అనే సమస్య దరిచేరదు. ద్రవాహారం తీసుకోవాలి పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వేపుడు పదార్ధాలకు బదులు ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లు లభించే ఆహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు సమయానికి ఆహారం అందించాలి. తరచుగా పండ్లు, పళ్ల రసాలు ఇస్తే నీరసం రాదు. ప్రోటీన్లు అధికంగా లభించే పాలు, గుడ్లు, లస్సీ తదితర పదార్థాలు తీసుకునేందుకు మొగ్గు చూపాలి. తద్వారా రోగ నిరోధక శక్తితోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. తినే పళ్లెంలో ఎంతగా రంగురంగుల కూరగాయలు ఉంటే.. అంతగా శ రీరానికి మేలు జరుగుతుంది. పరీక్షలంటే ఒత్తిడి సహజం. దీని నుంచి బయట పడేందుకు ఆల్కహాల్ ని ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం ఉండకపోవడమేగాక.. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారం తీసుకోకపోవడమే మంచిది. - డాక్టర్ రాధ, పోషకాహార నిపుణురాలు అతి ఆందోళన ప్రమాదకరం పరీక్షల పేరు చెబితే 30-40 శాతం విద్యార్థులు విపరీతంగా ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్య 8-16 ఏళ్ల వయసు వారిలో అధికంగా ఉంటుంది. అటువంటి వారిలో మిగతా విద్యార్థులతో పోల్చుకుంటే తీవ్ర ఆందోళన వల్ల జ్ఞాపక శక్తి 30-50 శాతం తగ్గుతుంది. సక్రమంగా సమాధానాలు రాయలేరు. పరీక్ష అనేది ఒక అవకాశమే తప్ప..అదే జీవితం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఉన్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి సారించాలి. ఏకాగ్రత, హార్డ్‌వర్క్ గురించే ఆలోచించాలి. ఫలితాల మాట మనసులోకి రానివ్వద్దు. ఆందోళన మితిమీరితే జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చదువు పేరుతో చాలామంది నిద్రను దూరం చేసుకుంటారు. ఇది పొరపాటు. పరీక్షల సమయంలో కనీసం ఆరేడు గంటలైనా నిద్రకు కేటాయించాలి. చాలామంది రాత్రిళ్లు విడతల వారీగా అలారం పెట్టుకుని.. చదువుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి పెద్దగా ఒరిగేదేముండదు. ఒక పని తర్వాత ఒకటి చేస్తే.. నిద్రకు భంగం కలగదు. ఎటువంటి అంతరాయం లేకుండా చదువుకోవచ్చు. - డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు టీవీలు కట్టేయడమే ఉత్తమం తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే.. విద్యార్థుల దృష్టి దీనిపై పడుతుంది. దీనికి ఉత్తమ పరిష్కారం.. పరీక్షలు ముగిసేంత వరకు ఇంట్లో టీవీలు కట్టేయడమే. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు పరోక్షంగా మేలు జరిగినట్లే. మొబైల్స్‌కు దూరంగా ఉండాలి. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. బయటి ఆహారానికి పుల్‌స్టాప్ పెట్టి.. ఇంటి వంటలే చేసి పెట్టాలి. విద్యార్థులను ప్రోత్సహించకున్నా ఫర్వాలేదు కానీ.. నిరుత్సాహ పర చవద్దు. - సుబ్రహ్మణ్యం, ఇంటర్ విద్యార్థిని తండ్రి, కొండాపూర్ భావోద్వేగాలను వాయిదా వేసుకోండి సాక్షి,సిటీబ్యూరో:‘ఎలాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులైనా ప్రణాళిక ప్రకారం చదివితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. భావోద్వేగాలకు అతీతమైన ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం మంచిద’ని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ వీరేందర్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేరయ్యే సమయంలో పాటించవలసిన నియమాలను వివరించారు. ఆంగ్లంలో సిక్స్ ‘పీ’స్ (ఆరు ‘పీ’లు) ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరని చెప్పారు. అవి... 1) ప్రిపేర్ స్టడీ వెదర్: ఇంట్లో ఒక్కో గది ఒక్కో రకమైన అవసరానికి ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ రూమ్‌లో టీవీ.. వంటగదిలో ఆహార పదార్ధాలు... బెడ్రూమ్లో పడక... మన ఆలోచనలను ప్రభావితం చేస్తా యి. ఇలాంటి వాటికి దూరంగా ఇంట్లోనే ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ స్థలంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చిత్రాలు, నినాదాలు, సూత్రాలు, సిద్ధాంతాలు గోడలపైన ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు త మ ఆశయాలను, లక్ష్యాలను రాసి పెట్టుకోవాలి. 2) పుల్ స్టడీ టైమ్: రోజులోని 24 గంటల సమయం వివిధ రకాల అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్... స్కూల్‌కు వెళ్లడం... మధ్యాహ్నం భోజనం... సాయంత్రం ఆటలు, కాలక్షేపం, రాత్రి నిద్ర వంటి అవసరాలు ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని దైనందిన అవసరాల సమయాన్ని కుదించుకొని స్టడీ అవర్స్‌ను పెంచుకొనే విధంగా ప్లాన్ వేసుకోవాలి. ఉదయం పూట చదివితే బాగుంటుందని కొందరు అంటారు. కానీ మనస్తత్వ విశ్లేషణ ప్రకారం కొందరు రాత్రుళ్లలో చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు పగలంతా కష్టపడి చదివి పెందరాళే నిద్రకు ఉపక్రమిస్తారు. విద్యార్థులు తమకు ఇష్టమైన వేళల్లోనే చదవడం మంచిది. 3)పోస్ట్‌పోన్ ఎమోషన్స్: ఇది చాలా ముఖ్యమైనది. పరీక్షల సమయంలో అన్ని రకాల భావోద్వేగాలను వాయిదా వేసుకోవాలి. స్నేహితులతో పోట్లాటలు, వాదోపవాదాలు, తగవులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని వారు ఒత్తిళ్లకు గురి చేసినా పట్టించుకోకుండా చదువుపై ధ్యాస ఉంచాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచేలా, నిరుత్సాహానికి గురి చేసేలా మాట్లాడకూడదు. 4) ప్రిపేర్ స్టడీ ప్లాన్: రోజులో ఎన్ని సబ్జెక్టులు చదవాలి అనేది ముఖ్యం. రోజుకు 3 సబ్జెక్టుల చొప్పున వారంలో అన్ని సబ్జెక్టులు పూర్తయ్యే విధంగా చదువుకోవాలి. సులభంగా ఉన్నవి ఎక్కువగా చదవడం, కష్టంగా ఉన్నవి తక్కువగా చదవడం మంచిది కాదు. అలా అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కష్టం. 5) ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ : గత 5 ఏళ్లుగా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 6) ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్ : పరీక్షలకు ముందు ఇంట్లోనే మనకు మనం ఒక సెల్ఫ్‌టెస్ట్ పెట్టుకోవాలి. దీని వల్ల భయాందోళనలు తొలగిపోతాయి. -
తెలంగాణ-కమిటీలు, సూచనలు
తెలంగాణలో ఉద్యోగ, సామాజిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా నాటి ప్రభుత్వాలు కొన్ని కమిటీలను నియమించాయి. ఎన్నో ఉద్యమాలు...ఎన్నో కమిటీలు, నాటి ముల్కీ నిబంధనలపై ఏర్పాటు చేసిన లలిత్ క మిటీ నుంచి మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు. ఏ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు! సంబంధిత కమిటీ సూచనలు ఏంటి! ప్రభుత్వాలు వాటిని ఎంతవరకు అమలు చేశాయి! గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ఈ నేపథ్యంలో వివిధ కమిటీలపై గ్రూప్స్ గెడైన్స్... కమిటీ నెం.1: కుమార్ లలిత్ కమిటీ జై తెలంగాణ ఉద్యమం(1969) కంటే ముందు ముల్కీ ఉద్యమంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి కుమార్ లలిత్ కమిటీని నియమించారు. కమిటీ కర్తవ్యం: 1. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలు సేకరించటం. 2. తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయటం. నివేదికలో ఏముంది? 1) కమిటీ తన నివేదికలో 4,500 మంది ఆంధ్రా ఉద్యోగులు అక్రమంగా ఉన్నారని తేల్చింది. 2) తెలంగాణాలో మిగులు నిధులు రూ.30 కోట్లని పేర్కొంది. తెలంగాణ వాదుల ఆందోళన 1. 1969లోనే అక్రమ ఉద్యోగుల సంఖ్య 4,500 ఉంటే అది 2014 నాటికి లక్షల్లోకి చేరి ఉంటుందని తెలంగాణ వాదుల ప్రధాన ఆరోపణ. 2. అప్పట్లోనే మిగులు నిధులు రూ.30 కోట్ల మేర ఉన్నాయని లలిత్ కమిటీ తెలిపింది. అప్పట్నుంచి 2014 వరకు వేల కోట్ల తెలంగాణ నిధులను ఆంధ్ర ప్రాంతాలకు తరలించారనే విమర్శలు. మిగులు నిధుల్లోంచి ఒక్క రూపాయి అయినా తెలంగాణాలో ఖర్చు చేశారా! తెలంగాణ రైతులను ఆదుకున్నారా! చేనేత కార్మికులకు చేయూతనిచ్చారా! అనే ఆరోపణలు చేశారు. కమిటీ నెం: 2, భార్గవ కమిటీ లలిత్ కమిటీ పరిశీలించిన అంశాలపై 1969, ఏప్రిల్ 22న భార్గవ్ కమిటీని నియమించారు. సభ్యులు: కమిటీ చైర్మన్‌గా జస్టిస్ వశిష్ఠ భార్గవ్, సభ్యులుగా ఫ్రొ.ఎం.విహారి మాధూర్, హరిభూషణ్ బార్లు, సెక్రటరీగా టీఎన్ కృష్ణస్వామి. ఈ కమిటీ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,500, తెలంగాణ మిగులు నిధులు రూ.28 కోట్లుగా లెక్కతేల్చింది. కమిటీ నెం.3: వాంఛూ కమిటీ ముల్కీ నిబంధనలు ‘కొనసాగించడానికి’ రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడం కోసం కేంద్రం ఈ కమిటీని 1969లో ఏర్పాటు చేసింది. కమిటీ- ఏం చెప్పింది 1. కమిటీ ఆంధ్ర పాలకులకు అనుకూలంగా ‘ముల్కీ నిబంధనలు విరుద్ధం’ అని తేల్చింది. 2. తెలంగాణలో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్ర ప్రాంతం వారు కూడా అర్హులని చెప్పింది. కమిటీ నెం.4: భరత్‌రెడ్డి-సుందరేషన్ కమిటీ ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను అంచనా వేసేందుకు ఈ కమిటీని నియమించింది. 1956 నుంచి 1985 వరకు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా వచ్చినవారు,ఉద్యోగాల్లో చేరినవారు తెలంగాణలో కొనసాగాలా!వద్దా! అనే అంశాలను కమిటీ పరిశీలించింది. కమిటీ ఏం చెప్పింది 1. 1976 అక్టోబరు నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన తెలంగాణేతరులు అందర్నీ 1986 మార్చి 30 నాటికి వెనక్కి పంపాలి. 2. ఆ స్థానాల్లో తెలంగాణా వారిని నియమించి, ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణేతరుల కోసం సూపర్‌న్యూమరరీ పోస్టులను తెలంగాణాలో సృష్టించాలి. 3. జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, శ్రీరాంసాగర్‌లో ఉన్న గెజిటెడ్ ఉద్యోగులను వారి సొంత జోన్లకు పంపాలి. 4. సచివాలయంలో వివిధ శాఖల హెచ్ఓడీల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలి. 5. బోగస్ లోకల్ సర్టిఫికేట్ల ద్వారా నియమితులైన తెలంగాణేతరులపై చర్యలు తీసుకోవాలి. 6. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో చేరిన వారిని, ప్రమోషన్లలో చేరిన వారిని గుర్తించి వెనక్కి పంపించాలి. వాస్తవంగా ఏం జరిగింది: 1. 1956 నుంచి అక్రమంగా చేరిన వారి ప్రస్తావన లేకుండా కమిటీ నివేదికను ఇవ్వడంతో వాంఛూ కమిటీ వివాదాస్పదం. తెలంగాణలో 1976 నుంచి అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తిస్తాం అని ప్రభుత్వం చెప్పడంతో విమర్మలు వచ్చాయి. 2. కాని 1976 నుంచి 1985 మధ్య ఉద్యోగాలను పొందిన వారిని వెనక్కి పంపే ప్రక్రియ కూడా జరగలేదు. దీంతో మళ్లీ ఉద్యమాలు, విమర్శలు రేకెత్తి ప్రతేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీశాయి. కమిటీ నెం.5 జేఎమ్ గిర్గ్లానీ కమిటీ 1. 2001 జూన్‌లో జీవో ‘610’ అమలును పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు. 2. 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు. 3. కమిటీకి ఎవరూ సహకరించలేదు? 4. కమిటీ చాలా కష్టపడి తన రిపోర్టును సమర్పించింది. కమిటీ- రిపోర్ట్ 1. అన్ని శాఖల్లోనూ సమగ్ర విచారణ చేయాలి. అన్నీ చోట్లా అక్రమాలు జరిగాయి. 2. బోగస్ సర్టిఫికేట్ల ద్వారా ఆంధ్ర ప్రాంతం వారు ఎంత మంది ఉద్యోగాలు పొందారో తేల్చటం కష్టం. ఆ సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పటం కష్టం. 3. తెలంగాణలోని ఓపెన్ పోస్టులను లోకల్, నాన్‌లోకల్‌గా విభజించాలి. 4. న్యాయ శాఖలో చాలా ఉల్లంఘనలు, అక్రమ నియామకాలు జరిగాయి. 5. బ్యాగ్‌లాగ్ పోస్టులను‘ ఓపెన్ కేటగిరీ’లో చేర్చి నాన్‌లోకల్స్‌కు అంటే తెలంగాణేతరులకు అందించారు. కేంద్రం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.. శ్రీకృష్ణ కమిటీని ఈ కింది అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. 1. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకువాస్తవ అంశాలు ఏమిటి? 2. తెలంగాణ రాష్ట్రం ఏమేరకు అవసరం ? 3. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి రాజధాని‘ హైదరాబాద్ ’ లేదా ప్రత్యామ్నాయం ఉందా! 4. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాల్సి ఉందా! 5. ‘రాయల-తెలంగాణ’ ఏర్పాటు! ప్రత్యామ్నాయం ఉందా! సభ్యులు 1. వి.కె.దుగ్గల్: కార్యదర్శి(కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి) 2. రవీందర్ కౌర్: (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్) 3. రణ్‌బీర్ సింగ్: నల్సార్ వ్యవస్థాపక దిల్లీ జాతీయ యూనివర్సిటీ, వైస్ చాన్స్‌లర్ 4. అబుసలే షరీఫ్: ఆర్థికవేత్త ఈ కమిటీ 2010, డిసెంబర్ చివరి నాటికి తన నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం గడువు విధించింది. 2010, ఫిబ్రవరి 12న ఈ కమిటీ రాష్ట్రంలో తొలి పర్యటన జరిపింది. కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు అందజేసింది. ఈ కమిటీ తీరు ఒక ప్రశ్నకు రెండు ప్రశ్నల్లా సాగింది. నివేదికలోని కొన్ని అంశాలను షీల్డ్ కవర్ ద్వారా కేంద్ర హాం శాఖకు సమర్పించగా, మరికొన్నిటిని ఓపెన్ కవర్లో పెట్టి బహిర్గతం చేసింది. నివేదిక స్వరూపం: 9 చాప్టర్స్: 505 పేజీలు కమిటీ ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆరు ప్రతిపాదనలు చేసింది 1. తెలంగాణ సమస్యను శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, కేంద్రసాయంతో రాష్ట్రప్రభుత్వం పర్యవేక్షించటం. 2. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి. 3. హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు. 4. {పత్యేక తెలంగాణ ఏర్పాటు. గుంటూరు, కర్నూల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని మండలాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు. 6. {పధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగ బద్ధ రక్షణ కల్పించడం, రాష్టాన్ని సమైక్యంగా ఉంచడం కమిటీ చివర్లో 6వ ప్రతిపాదన తన ప్రాధాన్యతగా చెప్తూ తెలంగాణ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని, ప్రత్యేక తెలంగాణ అవసరం లేదని పరోక్షంగా పేర్కొంది. 6వ ప్రతిపాదన అమలు సాధ్యం కాకపోతే 5వ ప్రతిపాదన తమ రెండో ప్రాధాన్యతగా చెప్పింది. కమిటీ నెం.6: ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీ గడువు ఎనిమిది వారాలు. సభ్యులు: 1.రఘువంశ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ (బీహార్) 2.దయానిధి మారన్, డీఎంకే (తమిళనాడు) దేశ వ్యాప్తంగా 36 పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. మాజీ ప్రధానులు వీపీ సింగ్, ఐకే గుజ్రాల్ తదితరులు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతునిచ్చారు. 2008లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాకు అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. -
పింఛన్‌దారుల మెడపై సర్వే కత్తి
సాక్షి, చిత్తూరు: గ్రామంలో అర్హులైన వారు ఎందరున్నా ఏ ఐదారుగురికో 75 రూపాయల పింఛన్ వస్తుండేది. అది కూడా నాలుగు, ఐదునెలలకోసారి ఇచ్చేవారు. ఎవరికైనా కొత్త పింఛను ఇవ్వాలంటే తీసుకుంటున్న వారిలో ఒకరు చనిపోవాలి. లేదంటే కొత్త పింఛను రాదు. ...ఇది 2004కు ముందు పరిస్థితి. గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అందరికీ పింఛన్లు అందాయి. అది కూడా 200 రూపాయల చొప్పున ఠంచన్‌గా ఒకటో తేదీ జీతంలాగా ఇచ్చేవారు. కొత్త పింఛన్ కావాలంటే మండలానికి పోతే చాలు అర్హత ఉంటే తక్షణమే ఇచ్చేవారు. ...ఇది 2004 తర్వాత పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చిన టీడీపీ వాటి అమలు కోసం ఉద్యోగులు, సంక్షేమపథకాల లబ్ధిదారుల కడుపు కొడుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు పింఛన్దారులవైపు చూస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు అర్హులా? కాదా అని నిర్ణయించేందుకు ప్రభుత్వం అధికారులు కమిటీలను నియమించారు. అయితే కమిటీలో ప్రభుత్వ అధికారులు కాకుండా రాజకీయనేతలకు చోటు కల్పించారు. తద్వారా టీడీపీ సానుభూతిపరులకు పింఛన్లు దక్కేలా చూసి, తమ దారిలో నడవనివారికి నిర్ధాక్షిణ్యంగా పింఛన్లను తొలగిచేందుకు ‘పచ్చ’పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి తనిఖీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మండల, గ్రామ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసేలా పథకరచన చేశారు. కమిటీలు ఇవే! గ్రామస్థాయిలో: గ్రామ సర్పంచ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు, స్వయంసహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఇద్దరు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి. మునిసిపాలిటీల్లో: వార్డు సభ్యుడు అధ్యక్షుడు. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సామజిక కార్యకర్తలు, ఒక బిల్‌కలెక్టర్. కార్పొరేషన్లో: కార్పొరేటర్ అధ్యక్షుడు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ముగ్గురు, బిల్‌కలెక్టర్ ఒకరు.ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను మండలస్థాయి కమిటీ, ఆపై జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించి లబ్ధిదారుల తుదిజాబితాను ఖరారు చేస్తారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం, శనివారం తనిఖీ లు నిర్వహించనున్నారు. కమిటీల ఏర్పాటు, తనిఖీ ల తేదీలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. గురువారం పత్రికల్లో కథనాలు వచ్చాయి. శుక్ర, శనివారాల్లో సర్వే ఉంది. ఉన్న ఫళంగా సర్వే నిర్వహిస్తే...లబ్ధిదారుల్లో చాలామంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉంటారు. వీరంతా కమిటీ ముందు హాజరు కాకపోతే పింఛన్లు తొలగి స్తారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు నిర్వహించడాన్ని విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అలాగే సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు కమిటీలో చోటు దక్కించుకుని కానివారిపై కక్షపూరితంగా వ్యవహరించనున్నారు. పైగా పింఛన్‌దారుడికి తప్పనిసరిగా ఆధార్ ఉండేలా నిబంధన ఉంచారు. ఆధార్ లేకపోయినా, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా అనర్హుని కింద లెక్కగట్టనున్నారు. కొత్త సమస్యకు తెరతీస్తున్న బీపీఎల్ తనిఖీలో బీపీఎల్(బిలో పావర్టీ లైన్)కొత్త సమస్యగా మారనుంది. రేషన్‌కార్డు ఉన్నవారంతా బీపీఎల్ కిందకు వస్తారు. వీరంతా పింఛన్‌కు అర్హులవుతారు. అయితే సరిపోని వారంతా బీపీఎల్ కిందకు రారని టీడీపీ నేతలు వితండవాదం చేసి పింఛన్లు తీసేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు గదుల ఇళ్లు ఉన్నా పింఛన్ ఇవ్వరని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై కూడా గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 4.01 లక్షల మంది లబ్ధిదారుల్లో సగం మందిని తొలగించాలనే యోచనతోనే తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. -
8,9 తేదీల్లో సీఎం పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నక్కపల్లి: ఈనెల 8,9 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైందని జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. తొమ్మిదో తేదీన నక్కపల్లి చినజీయర్‌స్వామినగర్‌లో ముఖ్యమంత్రి పాల్గొనే మహిళా సదస్సు వేదిక ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. సభా నిర్వహణపై స్థానిక అధికారులకు తగు సూచనలు చేశారు. 8వ తేదీన జరిగే అంతర్జాతీయ గిరిజిన దినోత్సవంలో సీఎం పాల్గొంటారని ఈ దినోత్సవం ఎక్కడ జరిపేదీ త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. తొమ్మిదో తేదీన ఉపమాక వేంకటేశ్వరస్వామిని చంద్రబాబునాయుడు దర్శించుకుంటారని, అనంతరం మహిళా సదస్సులో పాల్గొంటారని తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, సీఈవో మహేశ్వరరెడ్డి, ఆర్డీవో సూర్యారావు, తహశీల్దార్ జగన్నాథరావు పాల్గొన్నారు. ఉగ్గినపాలెంలో స్థల పరిశీలన కశింకోట: మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడానికి ఆదివారం జిల్లా కలెక్టర్ యువరాజ్ పరిశీలించారు. ఉగ్గినపాలెం వద్ద అమలోద్భవి హోటల్ వద్ద ఖాళీ మైదానాన్ని, తాళ్లపాలెంలోని ఎస్సీ హాస్టల్ పక్కనున్న స్థలాన్ని పరిశీలించారు. సుమారు రెండు వేల మంది రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తూ స్థలాలను తనిఖీ చేశారు. అలాగే హెలిపాడ్ కోసం కూడా స్థల పరిశీలన చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్ కె.రమామణి, దేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?
అయితే ఒకసారి ఇది చదవండి.... చదువు పూర్తయిన వెంటనే కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీరు ఈ సూచనలు పాటిస్తే ఉద్యోగంలో కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. టైమ్ విషయంలో కచ్చితత్వాన్ని పాటించండి. ఉద్యోగంలో క్రమశిక్షణకు ఇదే మొదటి మెట్టు. ఎలా పడితే అలా కాకుండా సీట్లో హుందాగా కూర్చోవాలి. ఆఫీసులో అడుగు పెట్టిన తరువాత వ్యక్తిగత ఫోన్లు మాట్లాడడం తగ్గించండి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ‘‘ఆఫీసు నుంచి వచ్చిన తరువాత చేస్తాను’’ అని నిర్మొహమాటంగా చెప్పండి. మీరు పని చేస్తున్న డెస్క్ చిందరవందరగా కాకుండా నీట్‌గా కనిపించాలి. టేబుల్ గందరగోళంగా ఉంటే, అది మీ మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో గట్టిగా మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడం లాంటివి చేయవద్దు. పనికి సంబంధించి మీలో ఏ కొత్త ఐడియా వచ్చినా మీ పై అధికారితో పంచుకోండి. ‘ఇది నా డ్యూటీ కాదు’ అనే మాట ఎప్పుడూ నోటి నుంచి రానివ్వవద్దు. రిజర్వ్‌గా ఉండడం అనేది మీ అలవాటైతే కావచ్చుగానీ, ఎంత కలుపుగోలుగా ఉంటే అంత మంచిది. {పతి విషయానికీ పక్క వారి మీద ఆధారపడకూడదు. సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగరీత్యా అప్పగించిన బాధ్యతలు అస్పష్టంగా ఉంటే, సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ‘అడిగితే ఏమనుకుంటారో’ అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు. గాసిప్‌లకు దూరంగా ఉండండి. పని మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టండి. ‘ఈ పని నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం కళ్లలో ఎప్పుడూ కనబడాలి.