ఇండక్షన్ స్టవ్తో జాగ్రత్త! | induction stove using references | Sakshi
Sakshi News home page

ఇండక్షన్ స్టవ్తో జాగ్రత్త!

Published Fri, Jul 15 2016 10:32 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

ఇండక్షన్ స్టవ్తో జాగ్రత్త! - Sakshi

ఇండక్షన్ స్టవ్తో జాగ్రత్త!

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్‌స్టాప్ పెట్టేది ఇండక్షన్ స్టవ్. దీని వాడకంలో కొన్ని సూచనలు పాటిస్తే మేలు. అవేంటంటే..

మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టివ్ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం.

వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

స్టవ్‌ను మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్ చేయరాదు. మన్నికైన స్వీచ్‌బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లను వాడటం మంచిది కాదు.

వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్చాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement