Induction Stove
-
చిక్కటి, చక్కటి.. ఇండక్షన్ కాఫీ మేకర్..
ఈ రోజుల్లో టీ, కాఫీల కోసం పాత్రలు, వడకట్టులు వాడేవారు తగ్గిపోయారు. స్విచ్ ఆన్ చేస్తే గ్లాసు నిండిపోయే మెషిన్ ్సకే ఓటేస్తున్నారు. అయితే మెషిన్ కాఫీ అంటే అంతగా ఇష్టపడని వారికీ.. చిక్కటి, చక్కటి ఫ్లేవర్ కాఫీని కోరుకునే వారికీ ఈ మేకర్ తెగ నచ్చేస్తుంది.యాంటీ–స్కాల్డింగ్ హ్యాండిల్, నాన్–స్లిప్ ఫినిషింగ్‌తో రూపొందిన ఈ డివైస్.. నాణ్యమైన స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఆకట్టుకుంటోంది. దీని కిందున్న బౌల్లో నీళ్లు నింపుకుని.. దానిపై అమర్చుకునే ఫిల్టర్‌లో కాఫీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే చాలు. పైనున్న బౌల్లోకి కాఫీ పొంగి.. నిండుతుంది. ఇదే మోడల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. 4 గ్లాసులు, ఎనిమిది గ్లాసులు అందించే 2 రకాల సైజులూ దొరుకుతున్నాయి. అయితే రెండిటికీ మధ్య ధరల్లో పెద్దగా తేడా కనిపించదు.పోర్టబుల్ స్మోకర్..కొందరు గ్రిల్డ్ ఐటమ్స్ తినేటప్పుడు.. స్మోకీ ఫ్లేవర్‌ని కోరుకుంటారు. అలాంటి వారికోసమే ఈ స్మోకర్. ఇది కేవలం ఆహారానికి లేదా పానీయాలకు.. గుబాళించే స్మోకీ ఫ్లేవర్లను అందిస్తుంది. ఈ డివైస్‌కి పైనున్న గుంతలో చెక్కపొట్టు, మూలికలు, టీ పొడి, ఎండిన గులాబీ పువ్వులు ఇలా వేటినైనా సరే ఇంధనంగా వేసి మండిస్తే.. దీనికి అటాచ్డ్గా ఉన్న గొట్టం నుంచి పొగ వస్తుంది. దాన్ని బౌల్‌తో కప్పి.. ఆహారానికి లేదా పానీయాలకు ఫ్లేవర్‌ని అందించొచ్చు. అందుకు వీలుగా డివైస్‌కి బ్యాటరీలు అమర్చుకుని.. పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది.సింక్ ర్యాక్..వంటింటి పనుల్లో సింక్ క్లీనింగే కష్టమైనది. గిన్నెలు కడగడం ఒకెత్తయితే సింక్‌లో జామ్ అయిన చెత్తను తీయడం ఒకెత్తు. ఎప్పటి చెత్తను అప్పుడు సింక్‌లోకి వెళ్లకుండా ఆపగలిగితే.. మిగిలిన పని ఒక లెక్కే కాదు. ఈ ర్యాక్ చేసేది అదే! దీన్ని సింక్ పక్కనో.. ఎదురుగానో పెట్టుకుని.. దీనికి డిస్పోజబుల్ మెష్ బ్యాగ్ అమర్చి.. చెత్త సింక్ తూముకు అడ్డం పడకుండా చేసుకోవచ్చు.ఈ ర్యాక్ అటూ ఇటూ కదలకుండా.. మిక్సీకి ఉన్నట్లుగా యాంటీ స్లిప్ మినీ బూట్ ఒకటి అడుగున ఉంటుంది. ఆ బ్యాగ్ నిండగానే.. జాగ్రత్తగా దాన్ని చెత్తబుట్టలో వేసుకోవచ్చు. క్లీనింగ్ తర్వాత.. ఈ ర్యాక్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దాని వల్ల స్థలమూ ఆక్రమించదు. తడి టవల్ వంటివి ఆరేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ర్యాక్ తుప్పుపట్టదు. ఎప్పటికప్పుడు నెట్ బ్యాగ్ తీసిపారేస్తూ ఉంటాం కాబట్టి.. కూరగాయలు, పండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మెస్ బ్యాగ్స్‌ను వాడుకోవచ్చు.ఇవి చదవండి: ఆ వాహనం కాలం చెల్లిందే -
ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అయ్యే సరికొత్త కుకింగ్ స్టవ్‌లు, ఫ్యాన్లు!
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈఈఎస్ఎల్ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్డీసీ ఫ్యాన్లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్ కుకిగ్ స్టవ్‌లను పంపిణీ చేస్తోంది. వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకీ ఈ ఇండక్షన్ స్టవ్‌లు, బీఎల్డీసీ ఫ్యాన్ల ఉపయోగం, ప్రయోజనాలు ఏమిటి? ఇవి సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయా? ఈ కుకింగ్ స్టవ్ ప్రత్యేకత.. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ) తీసుకువచ్చిన ఈ ఇండక్షన్ ఆధారిత కుకింగ్ స్టవ్ సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో ఇంధనం ఆదా అవ్వడమే గాక తక్కువ ఖర్చుతో మంచి వంటను అందించగలుగుతాం. భారతదేశం అంతట ఈ ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం హితకరంగా ఉంటుంది. అంతేగాదు వాతావరణంలో గాలి స్వచ్ఛంగా ఉండటమే గాక పౌరులకు మెరుగైన ఆరోగ్యం అందుతుంది. ఈ స్టవ్‌లను ఈఈఎస్ఎల్, మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్(ఎంఈసీఎస్)ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున దేశంలో పంపిణీ చేస్తోంది. దీంతో వంటశాలల్లో ఈ ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాల హవా వేగవంతంగా విస్తరించడమే గాకుండా వంట పద్ధతుల్లో వేగవంతంమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ స్టవ్ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకత ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ) ఎల్సీడీ బల్బులు మాదిరిగా విద్యుత్ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు కలిగించేలా ఈ సీలింగ్ ఫ్యాన్లను అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాన్ వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. విద్యుత్ వినియోగంలో 35% తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునాత ఫ్యాన్లను తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకమునుపు ఎల్ఈడీ బల్బులను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో అవి ఉండేలా విజయవంతమైంది. మళ్లీ అదేవిధమైన విజయం పునరావృత్తమయ్యేలా ఈ ఆధునాత ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లు, ఇండక్షన్ స్టవ్‌లను తీసుకొచ్చింది. ప్రయోజనం ఈ రెండు ఆధునాత ఎలక్రిక్ పరికరాల వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా త్గగుతాయి అలాగే 12 జీడబ్ల్యూ గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని నిరోధించగలం వినియోగదారులకు విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌లు భారతీయ గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం తోపాటు కార్బన్ ఉద్గారాల పాదముద్రలను తగ్గించేలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అంతకమునుపు ఉజ్వలా కింద జాతీయ వీధిలైట్ల కార్యక్రమంలో మిలియన్ల కొద్దీ ఎల్ఈడీ బల్బుల పంపిణీని తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో శక్తి వినియోగాన్ని, గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని తగ్గించి గణనీయమైన ఫలితాన్ని పొందేలా చేసింది ఈఈఎస్ఎల్ . అదేవిధంగా ఈ ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లు, సీలింగ్ ఫ్యాన్లు శక్తి వినియోగాన్ని, కార్గన్ ఉద్గారాలను తగ్గించి పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆ కాంక్షిస్తున్నారు. (చదవండి: చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..) -
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్స్టాప్ పెట్టేది ఇండక్షన్ స్టవ్. అయితే ఈ కరెంట్ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఇండక్షన్ స్టవ్ వాడకంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... ♦ మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పై నుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్చాఫ్ చేయడం మరిచిపోవద్దు. ♦ ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టివ్ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం. ♦ వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ♦ ఇండక్షన్ స్టవ్‌లను క్లీన్ చేయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్ చేయకూడదు. ♦మన్నికైన స్విచ్‌బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌లను వాడటం ఏమాత్రం మంచిది కాదు. ♦ వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి. -
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్స్టాప్ పెట్టేది ఇండక్షన్ స్టవ్. దీని వాడకంలో కొన్ని సూచనలు పాటిస్తే మేలు. అవేంటంటే.. ⇒ మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టివ్ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం. ⇒ వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ⇒ స్టవ్‌ను మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్ చేయరాదు. మన్నికైన స్వీచ్బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌లను వాడటం మంచిది కాదు. ⇒ వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్చాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి. -
ఎంతవరకు పాత్ర ఉంటే.. అంతవరకే వేడి!
హౌ ఇట్ వర్క్స్? / ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్‌ల గురించి మీరు విన్నారా? వినే ఉంటారులెండి. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయాయి ఇవి. గ్యాస్కంటే తక్కువ ఖర్చుతో వంట చేసుకోవచ్చునని, పిల్లలు ముట్టుకున్నా అపాయం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది వీటిపై. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే ఇవి ఎలా పనిచేస్తాయన్నది మాత్రం చాలా ఆసక్తికరం. ఏదైనా మెటల్ తీగచుట్టలోకి కరెంటు ప్రవహిస్తే ఏమవుతుంది? ఆ తీగచుట్ట కాస్తా అయస్కాంతంగా మారుతుంది. ఫలితంగా దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇండక్షన్ కుక్కర్లో జరిగే తంతూ ఇదే. నిజానికి ఇండక్షన్ అంటేనే అయస్కాంతం సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేయడమని అర్థం. ఇంకోలా చెప్పాలంటే విద్యుదయస్కాంత తత్వం తాలూకూ రెండు రూపాలు విద్యుత్తు, అయస్కాంత శక్తి అన్నమాట. ఇండక్షన్ స్టవ్లోనూ ఓ తీగచుట్ట ఉంటుంది. స్విచ్ ఆచ్ చేయగానే దాంట్లోకి కరెంటు ప్రవహిస్తుంది. విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌పై ఏదైనా పాత్రను ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం పాత్రపై కూడా ప్రభావం చూపుతుంది. పాత్రలోని ఎలక్ట్రాన్లు క్షేత్రానికి తగ్గట్టుగా ప్రవహిస్తాయి. ఈ కదలికలు అడ్డదిడ్డంగా ఉండటం వల్ల విపరీతమైన శక్తి పుడుతుంది. ఉష్ణం రూపంలో వెలువడుతూంటుంది. దీని ద్వారా పాత్ర లోపల ఉన్న పదార్థాలూ వేడెక్కుతాయన్నమాట. అంతే! స్టవ్‌పై పాత్ర ఉన్న ప్రాంతంలో మాత్రమే అయస్కాంత క్షేత్రాల్లో తేడాలు రావడం, ఉష్ణం పుడుతుంది కాబట్టి మిగిలిన చోట్ల అంతా మామూలుగానే ఉంటుంది. ఇంకో విషయం. ఇండక్షన్ స్టవ్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలంటే వీలైనంత వరకూ ఇరన్ పాత్రలు లేదా అడుగున ఐరన్ పూత ఉన్న పాత్రలు వాడటం మేలు. -
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త ఇలా...
ఉన్నట్టుండి గ్యాస్ అయిపోయినప్పుడు వంట చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇండక్షన్ స్టవ్. అందుకే వీటి వినియోగం ఇటీవల బాగా పెరుగుతోంది. అయితే వాడకం తెలియక కొందరు వీటితో ఇబ్బందులు పడుతున్నారు. కేర్ తీసుకోవడం రాక వాటిని పాడు చేస్తున్నారు కూడా. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇండక్షన్ స్టవ్ మీద కేవలం స్టీలు లేక ఇనుప పాత్రలనే ఉపయోగించాలి. ఇది విద్యుత్‌తో పని చేస్తుంది కాబట్టి నీటిని దూరంగా ఉంచాలి. సిమెంటు నేల, సిరామిక్ టైల్స్ మీద పెట్టవచ్చు కానీ... తడిగా ఉన్న నేలమీద పెట్టి మాత్రం వండకూడదు. నిజానికి ఏ చెక్క టేబుల్ మీదో పెట్టుకోవడం ఉత్తమం. మెటల్ టేబుల్ మీద పెట్టకూడదు. ఈ స్టవ్‌లో ప్రవహించే విద్యుత్ విపరీతమైన వేడిని పుట్టిస్తుంది. అది కొంత దూరం వరకూ కూడా ప్రవహిస్తుంది. కాబట్టి దీనికి దగ్గర్లో పొరపాటున కూడా బట్టలు, కాగితాలు పెట్టకూడదు. మెటల్ వస్తువులను కూడా దగ్గరలో ఉంచకూడదు. రేడియో, టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి చాలా దూరంలో ఈ స్టవ్‌ను పెట్టాలి. లేకపోతే అయస్కాంత ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్‌ని దేనికి పడితే దానికి కనెక్ట్ చేయకూడదు. అంటే ఎక్స్టెన్షన్ బాక్సులవీ వాడకూడదు. మామూలు స్టవ్‌లను కడిగినట్టు సబ్బునీటితో రుద్దడం చేయకూడదు. అమ్మోనియా, బ్లీచ్ ఉండేవాటిని అస్సలు ఉపయోగించకూడదు. అసలు తడి తగలకుండా మెత్తని బట్టతో శుభ్రం చేయాలి. పొరపాటున స్టవ్ మీద చిన్న పగులు ఏర్పడినా దాన్ని వాడకూడదు. అలాగే వాడటం పూర్తవగానే స్విచ్ ఆఫ్ చేసి ఊరుకోకూడదు. తప్పకుండా డిస్కనెక్ట్ చేసెయ్యాలి. - సమీ