ఈ రోజుల్లో టీ, కాఫీల కోసం పాత్రలు, వడకట్టులు వాడేవారు తగ్గిపోయారు. స్విచ్ ఆన్ చేస్తే గ్లాసు నిండిపోయే మెషిన్ ్సకే ఓటేస్తున్నారు. అయితే మెషిన్ కాఫీ అంటే అంతగా ఇష్టపడని వారికీ.. చిక్కటి, చక్కటి ఫ్లేవర్ కాఫీని కోరుకునే వారికీ ఈ మేకర్ తెగ నచ్చేస్తుంది.
యాంటీ–స్కాల్డింగ్ హ్యాండిల్, నాన్–స్లిప్ ఫినిషింగ్‌తో రూపొందిన ఈ డివైస్.. నాణ్యమైన స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఆకట్టుకుంటోంది. దీని కిందున్న బౌల్‌లో నీళ్లు నింపుకుని.. దానిపై అమర్చుకునే ఫిల్టర్‌లో కాఫీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే చాలు. పైనున్న బౌల్‌లోకి కాఫీ పొంగి.. నిండుతుంది. ఇదే మోడల్‌లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. 4 గ్లాసులు, ఎనిమిది గ్లాసులు అందించే 2 రకాల సైజులూ దొరుకుతున్నాయి. అయితే రెండిటికీ మధ్య ధరల్లో పెద్దగా తేడా కనిపించదు.
పోర్టబుల్ స్మోకర్..
కొందరు గ్రిల్డ్ ఐటమ్స్ తినేటప్పుడు.. స్మోకీ ఫ్లేవర్‌ని కోరుకుంటారు. అలాంటి వారికోసమే ఈ స్మోకర్. ఇది కేవలం ఆహారానికి లేదా పానీయాలకు.. గుబాళించే స్మోకీ ఫ్లేవర్‌లను అందిస్తుంది. ఈ డివైస్‌కి పైనున్న గుంతలో చెక్కపొట్టు, మూలికలు, టీ పొడి, ఎండిన గులాబీ పువ్వులు ఇలా వేటినైనా సరే ఇంధనంగా వేసి మండిస్తే.. దీనికి అటాచ్డ్‌గా ఉన్న గొట్టం నుంచి పొగ వస్తుంది. దాన్ని బౌల్‌తో కప్పి.. ఆహారానికి లేదా పానీయాలకు ఫ్లేవర్‌ని అందించొచ్చు. అందుకు వీలుగా డివైస్‌కి బ్యాటరీలు అమర్చుకుని.. పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది.
సింక్ ర్యాక్..
వంటింటి పనుల్లో సింక్ క్లీనింగే కష్టమైనది. గిన్నెలు కడగడం ఒకెత్తయితే సింక్‌లో జామ్ అయిన చెత్తను తీయడం ఒకెత్తు. ఎప్పటి చెత్తను అప్పుడు సింక్‌లోకి వెళ్లకుండా ఆపగలిగితే.. మిగిలిన పని ఒక లెక్కే కాదు. ఈ ర్యాక్ చేసేది అదే! దీన్ని సింక్ పక్కనో.. ఎదురుగానో పెట్టుకుని.. దీనికి డిస్పోజబుల్ మెష్ బ్యాగ్ అమర్చి.. చెత్త సింక్ తూముకు అడ్డం పడకుండా చేసుకోవచ్చు.
ఈ ర్యాక్ అటూ ఇటూ కదలకుండా.. మిక్సీకి ఉన్నట్లుగా యాంటీ స్లిప్ మినీ బూట్ ఒకటి అడుగున ఉంటుంది. ఆ బ్యాగ్ నిండగానే.. జాగ్రత్తగా దాన్ని చెత్తబుట్టలో వేసుకోవచ్చు. క్లీనింగ్ తర్వాత.. ఈ ర్యాక్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దాని వల్ల స్థలమూ ఆక్రమించదు. తడి టవల్ వంటివి ఆరేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ర్యాక్ తుప్పుపట్టదు. ఎప్పటికప్పుడు నెట్ బ్యాగ్ తీసిపారేస్తూ ఉంటాం కాబట్టి.. కూరగాయలు, పండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మెస్ బ్యాగ్స్‌ను వాడుకోవచ్చు.
ఇవి చదవండి: ఆ వాహనం కాలం చెల్లిందే
Comments
Please login to add a commentAdd a comment