coffee maker
-
చిక్కటి, చక్కటి.. ఇండక్షన్ కాఫీ మేకర్..
ఈ రోజుల్లో టీ, కాఫీల కోసం పాత్రలు, వడకట్టులు వాడేవారు తగ్గిపోయారు. స్విచ్ ఆన్ చేస్తే గ్లాసు నిండిపోయే మెషిన్ ్సకే ఓటేస్తున్నారు. అయితే మెషిన్ కాఫీ అంటే అంతగా ఇష్టపడని వారికీ.. చిక్కటి, చక్కటి ఫ్లేవర్ కాఫీని కోరుకునే వారికీ ఈ మేకర్ తెగ నచ్చేస్తుంది.యాంటీ–స్కాల్డింగ్ హ్యాండిల్, నాన్–స్లిప్ ఫినిషింగ్‌తో రూపొందిన ఈ డివైస్.. నాణ్యమైన స్టెయిన్ లెస్ స్టీల్‌తో ఆకట్టుకుంటోంది. దీని కిందున్న బౌల్లో నీళ్లు నింపుకుని.. దానిపై అమర్చుకునే ఫిల్టర్‌లో కాఫీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే చాలు. పైనున్న బౌల్లోకి కాఫీ పొంగి.. నిండుతుంది. ఇదే మోడల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. 4 గ్లాసులు, ఎనిమిది గ్లాసులు అందించే 2 రకాల సైజులూ దొరుకుతున్నాయి. అయితే రెండిటికీ మధ్య ధరల్లో పెద్దగా తేడా కనిపించదు.పోర్టబుల్ స్మోకర్..కొందరు గ్రిల్డ్ ఐటమ్స్ తినేటప్పుడు.. స్మోకీ ఫ్లేవర్‌ని కోరుకుంటారు. అలాంటి వారికోసమే ఈ స్మోకర్. ఇది కేవలం ఆహారానికి లేదా పానీయాలకు.. గుబాళించే స్మోకీ ఫ్లేవర్లను అందిస్తుంది. ఈ డివైస్‌కి పైనున్న గుంతలో చెక్కపొట్టు, మూలికలు, టీ పొడి, ఎండిన గులాబీ పువ్వులు ఇలా వేటినైనా సరే ఇంధనంగా వేసి మండిస్తే.. దీనికి అటాచ్డ్గా ఉన్న గొట్టం నుంచి పొగ వస్తుంది. దాన్ని బౌల్‌తో కప్పి.. ఆహారానికి లేదా పానీయాలకు ఫ్లేవర్‌ని అందించొచ్చు. అందుకు వీలుగా డివైస్‌కి బ్యాటరీలు అమర్చుకుని.. పవర్ బటన్ ఆన్ చేస్తే సరిపోతుంది.సింక్ ర్యాక్..వంటింటి పనుల్లో సింక్ క్లీనింగే కష్టమైనది. గిన్నెలు కడగడం ఒకెత్తయితే సింక్‌లో జామ్ అయిన చెత్తను తీయడం ఒకెత్తు. ఎప్పటి చెత్తను అప్పుడు సింక్‌లోకి వెళ్లకుండా ఆపగలిగితే.. మిగిలిన పని ఒక లెక్కే కాదు. ఈ ర్యాక్ చేసేది అదే! దీన్ని సింక్ పక్కనో.. ఎదురుగానో పెట్టుకుని.. దీనికి డిస్పోజబుల్ మెష్ బ్యాగ్ అమర్చి.. చెత్త సింక్ తూముకు అడ్డం పడకుండా చేసుకోవచ్చు.ఈ ర్యాక్ అటూ ఇటూ కదలకుండా.. మిక్సీకి ఉన్నట్లుగా యాంటీ స్లిప్ మినీ బూట్ ఒకటి అడుగున ఉంటుంది. ఆ బ్యాగ్ నిండగానే.. జాగ్రత్తగా దాన్ని చెత్తబుట్టలో వేసుకోవచ్చు. క్లీనింగ్ తర్వాత.. ఈ ర్యాక్‌ని సులభంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. దాని వల్ల స్థలమూ ఆక్రమించదు. తడి టవల్ వంటివి ఆరేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ ర్యాక్ తుప్పుపట్టదు. ఎప్పటికప్పుడు నెట్ బ్యాగ్ తీసిపారేస్తూ ఉంటాం కాబట్టి.. కూరగాయలు, పండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మెస్ బ్యాగ్స్‌ను వాడుకోవచ్చు.ఇవి చదవండి: ఆ వాహనం కాలం చెల్లిందే -
వచ్చే ఐదేళ్లలో ఐదువేల స్టోర్లు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకానమీగా ఇండియా ఎదుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా చాలాదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. దేశీయ వినియోదారులను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో విదేశీ కంపెనీలు స్టోర్లు ఓపెన్ చేయడానికి సుమారు 160 బ్రాండ్లు లోకల్ సంస్థలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్ పార్టనర్లను వెతకడంలో సాయపడే ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. విదేశీ కంపెనీలు వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఫలితంగా దాదాపు రూ.2078 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటున్న కంపెనీల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ ఛైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్, కాఫీ చెయిన్స్ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్ ఫ్రాంచైజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ అమెజాన్, యూఎస్ కంపెనీ పీట్స్ కాఫీ వంటి కంపెనీలు ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో స్టార్‌బక్స్ కూడా తన విస్తరణను వేగవంతం చేసింది. -
రోజూ కాఫీ తాగకుండా ఉండలేరా? అయితే ఇది మీకు బెస్ట్ ఛాయిస్
యూనివర్సల్ డిజైన్‌తో, స్టెయిన్ లెస్ స్టీల్ ఇంటీరియర్ థర్మల్ ట్రావెల్ మగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాఫీ మేకర్.. 60 సెకన్లలోపే తాజా కాఫీని తయారు చేస్తుంది. ప్రయాణ సమయాల్లో, ఉదయం లేవగానే.. బిజీ లైఫ్ కోసం విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ స్టైలిష్, కాంపాక్ట్ 600 వాట్స్ కాఫీ మేకర్‌తో వేడిగా, తాజాగా తయారుచేసిన కాఫీని ఆస్వాదించొచ్చు. వన్–టచ్ ఆప్షన్‌తో కాఫీ కేఫ్‌ల ముందు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన కష్టం ఉండదు. ఇది చాలా తక్కువ స్థలం తీసుకుంటుంది. మన్నికైన మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. వినియోగించడం చాలా సులభం. కాఫీ క్యాప్సూల్స్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన మినీ బాస్కెట్‌తో పాటు.. కాఫీ పౌడర్ వేసుకోవడానికి మినీ ఫిల్టర్ ఉంటుంది. దాంతో దీన్ని యూజ్ చేయడం చాలా తేలిక. ధర 21 డాలర్లు (రూ.1,737) -
అలాంటి వాళ్లకు ఈ కాఫీ మేకర్ భలే ఉపయోగపడుతుంది..
ప్రతి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు, కుకర్లలానే.. కాఫీ, టీ మేకర్స్ కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. ఇప్పుడంతా కాఫీ అయినా టీ అయినా.. స్విచ్ నొక్కి నచ్చిన ఫ్లేవర్ అందిపుచ్చుకోవడమే కదా! అలాంటి వారికి ఈ మెషిన్ భలే ఉపయోగడుతుంది. లాటే, కాపుచినో, కోల్డ్ వంటి ఆప్షనల్ బటన్స్ డివైస్‌కి కుడివైపు ఉంటాయి. ఎడమవైపు మినీ వాటర్ ట్యాంకర్ ఉంటుంది.ఇందులో ఆరుగురికి, ఎనిమిది మందికి, పది మందికి లేదా పన్నెండు మందికి ఒకేసారి కాఫీ లేదా టీని సిద్ధం చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ రీయూజబుల్ కాఫీ ఫిల్టర్ లాంటిది. చల్లని లేదా వేడి పాల నురుగుని తయారుచేస్తుంది. దీన్ని శుభ్రం చేయడమూ తేలికే. కప్పులు, మగ్గులు.. డివైస్ ముందువైపు పెట్టుకుంటే, అందులోకే కాఫీ లేదా టీ వచ్చి చేరుతుంది. బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు ఈ కాఫీ మేకర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ మేకర్ ధర 229 డాలర్లు(రూ.18,844) -
ప్రయాణాల్లో కాఫీ తాగాలనుందా? ఈ మేకర్‌తో సులువుగా..
చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్‌తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్‌లోకి చేరుతుంది. అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్లా మార్చుకుని బ్యాగ్‌లో వేసుకోవచ్చు. -
హై స్పీడ్ ట్రైన్...అదిరే ఫీచర్స్
ముంబై : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజేక్టుల్లో బుల్లెట్ ట్రైన్ ఒకటి. జపాన్ సహకారంతో ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వారి అధ్వర్యంలో బంద్రా కుర్ల కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం 108 గ్రామాలలోని 10వేల మంది నుంచి భూమిని సేకరించారు. ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,10,000 కోట్లు కాగా ఆ మొత్తంలో 88వేల కోట్లను 0.1శాతం వడ్డీతో జపాన్ నుంచి అప్పుగా తీసుకోనున్నారు. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాలలోపు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్లో సదుపాయాలు కూడా ఆ విధంగానే ఉండబోతున్నాయని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోకంటే అత్యాధునిక సాంకేతికతను బుల్లేట్ రైలులో వినియోగించనున్నారు. తిరిగే కుర్చీలు, కాఫీ మేకర్స్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 508 కి.మీ మార్గంలో 468 కి.మీ ఎత్తైన ట్రాక్ మార్గం, 27కి.మీ సొరంగ మార్గం, 13కి.మీ మైదాన ప్రాంతంలో నిర్మించనున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రైలు దేశంలోనే పెద్దదైన సొరంగం గుండా 21కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మరో 7కిలోమీటర్లు సముద్రం గుండా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుకుని 12 స్టేషన్లను ప్రతిపాదించారు. జపాన్ టెక్నాలజీతో నిర్మితం కానున్న ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 300కిమీ వేగంతో ప్రయాణించిప్పటికి కుదుపులు ఉండవని, నిలబడి కూడా హాయిగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్లో 10కార్లు (కోచ్‌లు) ఉంటాయని తెలిపారు. 2033 వరకూ మరో 6కార్లను అదనంగా వీటికి జత చేయనున్నారు. ప్రసుతం ఉన్న కార్లలో 750 సీట్లు ఉంటాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 1250కి పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణ చార్జీలు బీకేసీ నుంచి థానే వరకూ రూ.250గా, బీకేసీ నుంచి విరార్ వరకూ రూ.500గా, బీకేసీ నుంచి బోయిసర్ వరకూ రూ.750గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉండబోయే 10కార్లలో ఒకటి బిజినెస్ క్లాస్ కాగా మిగితావి జనరల్ కంపార్ట్మెంట్స్. ముంబాయి - అహ్మదాబాద్ మధ్య ప్రతిరోజు 40వేల మంది బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించవచ్చని అంచనా. బుల్లెట్ ట్రైన్‌ను చేరుకునేందుకు 14వేల మంది తమ సొంత వాహనాలను, 6500మంది విమానం ద్వారా, మిగితావారు ఇతర రైలు మార్గాల ద్వారా చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023 వరకూ పూర్తి కానున్నట్లు అధికారులు తెలపగా, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ మాత్రం 2022, ఆగస్ట్ 15నాటికి పూర్తి చేస్తానని ప్రకటించారు. -
వంటింటికి మల్టీపర్పస్ సోకు..!
♦ పెరుగుతున్న కిచెన్ అప్లయన్సెస్ వాడకం ♦ పలు పనులు చేసేలా మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులు ♦ రూ.13,000 కోట్లకు చేరిన మార్కెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జ్యూసర్, కాఫీ మేకర్, ఓవెన్, సాండ్విచ్ మేకర్, టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్స్... ఇలా చెప్పుకుంటూ పోతే వంటగదిలో ఉండే ఉపకరణాలు... అవేనండీ కిచెన్ అప్లయన్సెస్ లిస్టు బోలెడంత ఉంటుంది. చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిపోవటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, భిన్నమైన ఆహారపు అలవాట్లు.. వెరశి వంటింట్లో ఇప్పుడీ ఉపకరణాల జాబితా పెరుగుతూనే వస్తోంది. దీంతో విభిన్న అవసరాలకు తగ్గట్టుగా వినూత్న, అత్యాధునిక పరికరాలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టేస్తున్నాయి. సమయం వెంట పరుగులు తీస్తున్న నేటి తరం... వంట వేగంగా చేసేందుకు వీలుగా కిచెన్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. రూ.13,000 కోట్ల భారత వ్యవస్థీకృత రంగ కిచెన్ అప్లయన్సెస్ విపణిలో విదేశీ కంపెనీలకు దీటుగా దేశీ బ్రాండ్లు చొచ్చుకు పోతున్నాయి. నెల వాయిదాల్లో వస్తువుల్ని ఆఫర్ చేస్తూ కస్టమర్లకు చేరువవుతున్నాయి. విభిన్న పనులను చేసేలా... ఎగువ మధ్య తరగతి, సంపన్న కుటుంబాలైతే వంటింట్లో అన్ని ఉపకరణాలు ఉండాల్సిందేనని అంటున్నారు. వంట చేసే సమయంలో బంధువులు, స్నేహితులు వంటింట్లోకి కూడా వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు.. కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే రీతిలో కలర్‌ఫుల్ అప్లయన్సెస్‌తో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటితో స్టేటస్ చూపించుకునేవారు కొందరైతే అవసరానికి ఉపకరణాలను కొనేవారూ ఉన్నారు. ఇక వంటింటి స్థలం పరిమితంగా ఉన్న కుటుంబాలైతే విభిన్న పనులను చేసే మల్టీ టాస్క్ ఉపకరణాలు కావాలంటున్నారని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ సీఈవో రూపేంద్ర యాదవ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కొత్త ఇల్లు కొనుక్కున్నా, వివాహ సమయంలోనైనా నూతన ఉపకరణాలను కొంటున్నారని తెలియజేశారు. ‘‘ఇవి ఔరా అనిపించే ఫీచర్లతో వస్తున్నాయి. అయితే తయారీ కంపెనీలు వీటిపట్ల మరింత అవగాహన కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయి’’ అని టీఎంసీ బేగంపేట మేనేజర్ కె.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఇదీ మార్కెట్ తీరు..: అంతర్జాతీయంగా బ్లెండర్ల వాడకం ఎక్కువ. ఇండియాలోనైతే మిక్సర్ గ్రైండర్ల వాడకం అధికం. వీటి వ్యాపార పరిమాణం దేశంలో రూ.2,600 కోట్లు. కాకపోతే దేశంలో 25-30% ప్రాంతంలోనే వీటిని వినియోగిస్తున్నారు. దక్షిణాదిలో ఇది 40% కాగా, తమిళనాట ఏకంగా 70%. దక్షిణాదికే పరిమితమైన వెట్ గ్రైండర్ల విపణి పరిమాణం రూ.500 కోట్లు. ఎలక్ట్రిక్ కుకర్ల రంగం విలువ రూ.1,000 కోట్లు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 40%. వ్యవస్థీకృత రంగంలో కిచెన్ అప్లయెన్సెస్ విపణి 3-4% వృద్ధి రేటుతో రూ.13,000 కోట్లుందని ప్రీతి కిచెన్ అప్లయన్సెస్ అంటోంది. వినూత్న ప్రొడక్టును రూపొం దించినా దీర్ఘకాలిక ప్రక్రియ కావడంతో పేటెంట్ల దరఖాస్తుకు కంపెనీలు దూరంగా ఉంటున్నాయి. ఉపకరణాల ధర ఏటా 4-5% పెరుగుతోంది. కొన్ని పరికరాల ఉదాహరణలుఇవిగో... ప్రీతి జోడియాక్ మిక్సర్ గైండర్ పండ్ల రసం తీయడం, గోధుమ పిండిని ముద్దగా చేయడం, కూరగాయలను తురమడం, ముక్కలుగా చేయడం వంటి పనులను చక్కబెడుతుంది. ధర రూ.8,960. ప్రీతి కిచెన్ చాంప్ 17 రకాల పనులను ఇట్టే చేస్తుంది. పిండి కలపడం, కూరగాయలు ముక్కలు చేయడం, తురమడం, కలపడం, ఆర బెట్టడం, పిండి రుబ్బడం, పొడి చేయడం వీటిలో కొన్ని. ఏడాది వారంటీతోపాటు లైఫ్ లాంగ్ ఉచిత సర్వీసును కంపెనీ ఆఫర్ చేస్తోంది. ధర రూ.4,199. ఉషా ఇన్ఫినిటీ కుక్ హాలోజెన్ ఓవెన్ ఇది. ఇతర ఓవెన్లతో పోలిస్తే చాలా భిన్నమైంది. నీళ్ల అవసరం లేకుండా కోడి గుడ్లను ఉడికిస్తుంది. బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, ఎయిర్ ఫ్రైస్, ఎయిర్ డ్రయింగ్, టోస్టింగ్ వంటి పనులనూ చేస్తుంది. ఆయిల్ ఫ్రీ కుకింగ్ దీని ప్రత్యేకత. బ్రెడ్ ర్యాక్, చికెన్ రోస్టర్, ఫ్రయింగ్ ప్యాన్ తదితర 9 యాక్సెసరీన్ పొందుపరిచారు. ధర రూ.11,990. ఉషా న్యూట్రిప్రెస్ ఖరైదైన జ్యూసర్లలో ఇది ఒకటి. ధర రూ.27,990. కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, పండ్ల నుంచి రసం తీస్తుంది. ఇతర జ్యూసర్లతో పోలిస్తే అధిక మొత్తంలో రసం అందిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ వ్యవస్థ ఉండడంతో జ్యూస్ తీసే క్రమంలో పోషకాలు, ఎంజైములు, విటమిన్లు కోల్పోవని కంపెనీ తెలిపింది. బజాజ్ మాస్టర్ షెఫ్ 3.0 ఫుడ్ ప్రాసెసర్ దీనితో 15 రకాల అటాచ్మెంట్స్ ఉన్నాయి. పచ్చడి చేయడం, ముక్కలు తరగడం, కొబ్బరి తురమడం, పిండి కలపడం, జ్యూస్, రుబ్బడం, ఫ్రెంచ్ ఫ్రైస్, తురమడం వంటివి చిటికెలో చేసిపెడుతుంది. ధర రూ.5,984.