చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్‌లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్‌లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్‌తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది.
ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్‌లోకి చేరుతుంది.
అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్‌ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్‌లా మార్చుకుని బ్యాగ్‌లో వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment