Coffee making
-
ప్రయాణాల్లో కాఫీ తాగాలనుందా? ఈ మేకర్‌తో సులువుగా..
చాలామందికి కాఫీ లేనిదే రోజు గడవదు. అలాంటి వారికి ప్రయాణాల్లో కూడా చక్కటి కాఫీని అందిస్తుంది ఈ మేకర్. చూడటానికి, వెంట తీసుకెళ్లడానికి చిన్న బాటిల్లా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే మేకర్, కప్ రెండూ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఈ బాటిల్లో కాఫీ పౌడర్ వేసుకోవడానికి, కలుపుకోవడానికి వీలుగా వేరువేరు స్పూన్స్‌తో పాటు మినీ ఫిల్టర్ ఉంటుంది. ఇందులో ఒకేసారి మూడు కప్పల కాఫీని తయారు చేసుకోవచ్చు. చిత్రంలో చూపిన విధంగా ఒకదానిపై ఒకటి అడ్జస్ట్ చేసుకుని.. అందులో కాఫీ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని.. పై నుంచి గట్టిగా ప్రెస్ చేస్తే కొద్దికొద్దిగా లిక్విడ్ కప్‌లోకి చేరుతుంది. అందులో హాట్ వాటర్ లేదా కూలింగ్ వాటర్ లెక్క ప్రకారం(వేసుకున్న కాఫీ పౌడర్ని బట్టి) కలుపుకుని.. హాట్ కాఫీ లేదా కోల్డ్ కాఫీని తయారు చేసుకోవచ్చు. కాఫీ పెట్టుకోవడం పూర్తి అయిన తర్వాత క్లీన్ చేసుకుని, మళ్లీ చిన్న బాటిల్లా మార్చుకుని బ్యాగ్‌లో వేసుకోవచ్చు. -
కప్పు కాఫీ@ 5,000
ఇది పునుగు పిల్లి. దీని చర్మం నుంచి వెలువడే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ తయారీలో కూడా దీని పాత్ర ఉందన్న సంగతి మనకు తెలుసా? కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో అయితే.. కప్పు కాఫీ ధర రూ.5 వేలు! ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు. పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి. వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట. ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ. ఈ కాఫీకి బాగా డిమాండ్ ఉండటంతో ఇందుకోసం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే పునుగు పిల్లులను పట్టి.. చిన్నచిన్న పంజరాల్లో బంధించి.. హింసిస్తున్నారంటూ వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.