కప్పు కాఫీ@ 5,000 | cup of coffee price 5 thousand rupees in costly restaurants | Sakshi
Sakshi News home page

కప్పు కాఫీ@ 5,000

Published Tue, Aug 12 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

కప్పు కాఫీ@ 5,000

కప్పు కాఫీ@ 5,000

ఇది పునుగు పిల్లి. దీని చర్మం నుంచి వెలువడే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ తయారీలో కూడా దీని పాత్ర ఉందన్న సంగతి మనకు తెలుసా? కోపీ లువాక్ అని పిలిచే ఆ కాఫీ గింజలు ధర కిలో రూ.35 వేలకు పైమాటే. ఖరీదైన రెస్టారెంట్లలో అయితే.. కప్పు కాఫీ ధర రూ.5 వేలు! ఇంతకీ ఈ కాఫీ ఎలా త యారుచేస్తారంటే.. ముందుగా వీటితో కాఫీ పళ్లను తినిపిస్తారు. పునుగు పిల్లులు వాటిని తిని.. జీర్ణం చేసుకోగా.. మిగిలిపోయిన గింజలను విసర్జిస్తాయి.
 
  వాటిని ఎండబెట్టి.. అమ్ముతారు. పునుగు పిల్లి విసర్జించిన గింజలతో చేసిన కాఫీ రుచి మృదుమధురంగా ఉంటుందట. ఎందుకిలా అంటే.. పునుగు పిల్లులకు ఎన్ని కాఫీ పళ్లు పెట్టినా.. నాణ్యమైన వాటినే తింటాయట. పైగా.. వాటి జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల గింజలకు ఆ ప్రత్యేకమైన రుచి వస్తుందట. ముఖ్యంగా ఇండోనేసియాలో ఈ తరహా కాఫీ తయారీ ఎక్కువ. ఈ కాఫీకి బాగా డిమాండ్ ఉండటంతో ఇందుకోసం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే పునుగు పిల్లులను పట్టి.. చిన్నచిన్న పంజరాల్లో బంధించి.. హింసిస్తున్నారంటూ వన్యప్రాణి హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement