
ప్రతి ఇంట్లో మిక్సీలు, గ్రైండర్లు, కుకర్లలానే.. కాఫీ, టీ మేకర్స్ కూడా నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. ఇప్పుడంతా కాఫీ అయినా టీ అయినా.. స్విచ్ నొక్కి నచ్చిన ఫ్లేవర్ అందిపుచ్చుకోవడమే కదా! అలాంటి వారికి ఈ మెషిన్ భలే ఉపయోగడుతుంది. లాటే, కాపుచినో, కోల్డ్ వంటి ఆప్షనల్ బటన్స్ డివైస్‌కి కుడివైపు ఉంటాయి.
ఎడమవైపు మినీ వాటర్ ట్యాంకర్ ఉంటుంది.ఇందులో ఆరుగురికి, ఎనిమిది మందికి, పది మందికి లేదా పన్నెండు మందికి ఒకేసారి కాఫీ లేదా టీని సిద్ధం చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ రీయూజబుల్ కాఫీ ఫిల్టర్ లాంటిది. చల్లని లేదా వేడి పాల నురుగుని తయారుచేస్తుంది. దీన్ని శుభ్రం చేయడమూ తేలికే.
కప్పులు, మగ్గులు.. డివైస్ ముందువైపు పెట్టుకుంటే, అందులోకే కాఫీ లేదా టీ వచ్చి చేరుతుంది. బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు ఈ కాఫీ మేకర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ మేకర్ ధర 229 డాలర్లు(రూ.18,844)
Comments
Please login to add a commentAdd a comment