సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఫుల్‌స్టాప్ పెట్టేది ఇండక్షన్ స్టవ్. అయితే ఈ కరెంట్ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం పొరపాటుగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఇండక్షన్ స్టవ్ వాడకంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి...
♦ మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పై నుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్చాఫ్ చేయడం మరిచిపోవద్దు.
♦ ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టివ్ వస్తువులు, బట్టలు ఉంటే ప్రమాదకరం.
♦ వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్ట్టవ్ మన్నిక తగ్గడంతో పాటూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
♦ ఇండక్షన్ స్టవ్‌లను క్లీన్ చేయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో గానీ క్లీన్ చేయకూడదు.
♦మన్నికైన స్విచ్‌బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లను వాడటం ఏమాత్రం మంచిది కాదు.
♦ వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొలగించడం కూడా తప్పనిసరి.
ఇండక్షన్ స్టవ్‌తో జాగ్రత్త!
Published Sat, Sep 1 2018 3:51 AM | Last Updated on Sat, Sep 1 2018 3:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment