New job joiners
-
కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్ఇన్ తెలిపింది.లింక్డ్ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంకఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఉంటే తక్కువ వడ్డీకే లోన్!
ముంబై: మీరు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ? తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే, మీ సోషల్ మీడియా అకౌంట్లలో స్నేహితులు, ఆఫీసు సహచరులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కాస్త మంచిదే!. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మాదిరిగానే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వ్యక్తుల సోషల్ మీడియా రిలేషన్స్ బట్టి లోన్ లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వ్యక్తి సోషల్ వర్త్, పర్సనల్ డిటైల్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు అతను లేదా ఆమె ఏ మేరకు లోన్ ను తిరిగి చెల్లించగలరనే అంశాన్ని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మొదటి సారి లోన్ కి దరఖాస్తు చేసుకునే వారికి సోషల్ వర్త్ బాగా కీలకంగా మారుతోంది. వ్యక్తి సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి బ్యాంకులు కొత్త విధానాలను ఉపయోగిస్తున్నాయని క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పుంజా తెలిపారు. తమకు ఇప్పటికే ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఉందని లోన్ ప్రాససింగ్ లో ఈ పద్దతిని ఫాలో అయిపోతున్నట్లు వివరించారు. తాము ఎక్కువగా ఇప్పుడే ఉద్యోగం లో చేరిన వారికి లోన్ లను కల్పిస్తున్నట్లు చెప్పారు. వారి గురించిన సమాచరాన్ని సేకరించడానికి ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, లింక్డ్ ఇన్ లపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లోన్ తీసుకోవాలని అనుకుంటే కచ్చితంగా సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తూ ఉండాలని చెప్పారు.