జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినూత్న కోర్సులను ప్రవేశపెట్టడంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ముందుంది. ఈ యూనివర్సిటీ అందిస్తునన్ని కోర్సులను మరే యూనివర్సిటీ ఆఫర్ చేయడం లేదు. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని ీపీహెచ్‌డీ కోర్సుల వరకు ఇగ్నోలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులే. ఇగ్నో అందిస్తున్న కోర్సుల వివరాలు..
సర్టిఫికెట్ కోర్సులు: ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌లైన్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్, బీ కీపింగ్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్-బీపీవో-ఐటీఈఎస్, లైఫ్‌లాంగ్ లెర్నింగ్, యూత్ ఇన్ డెవలప్‌మెంట్ వర్క్, టెలిసెంటర్/విలేజ్ నాలెడ్జ్ సెంటర్ మేనేజ్‌మెంట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ఐటెమ్స్, డిస్పెన్సింగ్ ఆప్టిక్స్, కమ్యూనిటీ రేడియో, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, క్రాఫ్ట్ అండ్ డిజైన్, ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, క్రియేటివ్ మీడియా ఆర్ట్స్- డిజిటల్ సౌండ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఫంక్షనల్ ఇంగ్లిష్ (ప్రాథమిక స్థాయి), ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ మొదలైనవి. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: కోర్సులను బట్టి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అర్హతలున్నాయి.
పీజీ డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు: కార్పొరేట్ గవర్నెన్స్, రూరల్ బ్యాంకింగ్, పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్, బుక్ పబ్లిషింగ్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
అర్హత: గ్రాడ్యుయేషన్
డిప్లొమా కోర్సులు: ఆక్వాకల్చర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, రేడియో ఇమేజినింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, పంచాయతీ లెవల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్, డెయిరీ టెక్నాలజీ, హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, క్రిటికల్ కేర్ నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎర్లీచైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ .
వ్యవధి: ఏడాది, అర్హత: 10+2.
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: బీఎస్సీ: నాటికల్ సైన్స్, నర్సింగ్ (పోస్ట్ బేసిక్), హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, లెదర్‌గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్/టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీఎస్సీ ఆనర్స్: ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్.
బీఏ: ఇంగ్లిష్, హిందీ, 3డీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఉర్దూ, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, టూరిజం స్టడీస్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అప్పారెల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్. ఇతర కోర్సులు: బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఎల్‌ఐఎస్సీ, బీఎస్‌డబ్ల్యు, బీబీఏ (రిటైలింగ్), బీకాం, బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్).
మాస్టర్స్ డిగ్రీ కోర్సులు: ఎంఎస్సీ: యాక్చూరియల్ సైన్స్, క్లినికల్ ట్రైల్స్, కెమిస్ట్రీ, డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్. ఎంఏ: అడల్డ్ ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్, ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, హిందీ, హిస్టరీ, ఫిలాసఫీ, లేబర్ అండ్ డెవలప్‌మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, రూరల్ డెవలప్‌మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, సోషియాలజీ, టూరిజం మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్, అప్పారెల్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్.
ఇతర పీజీ కోర్సులు: ఎంఎస్‌డబ్ల్యు, ఎంఎఫ్‌ఏ (పెయింటింగ్), ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంఎల్‌ఐఎస్సీ, ఎంకాం, ఎంకాం (మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్), (బిజినెస్ పాలసీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్), ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్), (కార్పొరేట్ గవర్నెన్స్), (ఫైనాన్షియల్ మార్కెట్స్), (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్), ఎంటెక్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్, ఐటీ.
నిరుద్యోగ యువత అవకాశాలకు ఇగ్నో..
బీకాం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎంఏ సైకాలజీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉంది. వచ్చే జూలై నుంచి పీజీ డిప్లొమాలో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిని అందుకునేలా ఎన్నో కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులు విలువైన సమయాన్ని నష్టపోకుండా తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా టూరిజం, హెల్త్, లీగల్, అగ్రికల్చర్, టీచింగ్ వంటి రంగాల్లో అపార అవకాశాలున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే కోరుకున్న కెరీర్‌లో ఆశించిన స్థాయికి చేరొచ్చు. యూజీసీ, సంబంధిత సంస్థల గుర్తింపు ఉన్న కోర్సులను పూర్తిచేస్తే విలువైన సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా చేసిన కోర్సుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
- డాక్టర్ కామేశ్వరిమూర్తి, రీజనల్ డెరైక్టర్, ఇగ్నో, హైదరాబాద్.