Certificate courses
-
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
కోర్సు చెయ్యి.. పంట వెయ్యి
సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఏ పంటలు వేయాలని ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో వీళ్లను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. రైతులు, యువ రైతులకు కొత్త పంటలపై అవగాహన పెంచేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని రెండు పరిశోధన స్థానాల్లో 3 సర్టిఫికెట్ కోర్సులను మొదలుపెట్టబోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పరిశోధన స్థానంలో కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకం గురించి.. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలోని పరిశోధన స్థానంలో ఆయిల్ పామ్ పెంపకం, నిర్వహణ గురించి సర్టిఫికెట్ కోర్సుకు శిక్షణ ఇవ్వనుంది. ఆయిల్ పామ్ శిక్షణ ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు.. కూరగాయలు, పూల మొక్కల పెంపకం కోర్సులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు కొనసాగనున్నాయి. ఒక్కో కోర్సు 10 రోజులు.. ఫీజు రూ. 5 వేలు కోర్సుకు సంబంధించిన ప్రతి బ్యాచ్‌లో 20 మందికి థియరీ, ప్రాక్టికల్స్‌ను వివరించను న్నారు. వీటికి స్టడీ మెటిరీయల్నూ అందించనున్నారు. ఒక్కో కోర్సు 10 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కోర్సుకు రూ. 5 వేల ఫీజు వసూలు చేయనున్నారు. కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు www.rktrhu. ac.in వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రూ. 5 వేల డీడీతో పాటు దరఖాస్తును ‘ది డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వన విశ్వవి ద్యాలయం, ములుగు, జిల్లా సిద్దిపేట’కు పంపాలి. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లను అందిస్తారు. తొలి విడతలో మూడు కోర్సు లు, త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభిం చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యువ రైతులు సద్వినియోగం చేసుకోవాలి పంటల సాగుపై సర్టిఫికెట్ కోర్సులను వర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి ప్రారంభిస్తున్నాం. చాలా మంది నెట్లో చూసి నేర్చుకుంటున్నా.. వాళ్లకు కావాల్సింది తెలియదు. ఈ కోర్సు శిక్షణలో వారికి కావాల్సింది నేర్పిస్తారు. ఉద్యాన శాఖ అమలు చేసే ప్రభుత్వ పథకాలను ఆ శాఖ వారు వచ్చి ఓ రోజు వివరిస్తారు. 10 రోజులు శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందిస్తాం. దరఖాస్తులకు చివరి తేదీ లేదు. ఒక్కో బ్యాచ్ 20 మందితో నిర్వహిస్తాం. – భగవాన్, వర్సిటీ రిజిస్ట్రార్ -
జేఎన్ఏఎఫ్ఏయూ సర్టిఫికెట్ కోర్సులు
సాక్షి,హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ ( జేఎన్ఏఎఫ్ఏయూ) రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రకటించింది. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్టూడియో ప్రాక్టీస్( ఎగ్ టెంపిరా), సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రాక్టీస్( ఆయిల్ ఆన్ క్యాన్వాస్)లను మే 14 నుంచి ప్రారంభించనుంది. ఆసక్తి గల వారు మే 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి. కనీస అర్హతను ఇంటర్‌గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9849661555 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
ఇగ్నో.. వినూత్న కోర్సులు..
జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినూత్న కోర్సులను ప్రవేశపెట్టడంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ముందుంది. ఈ యూనివర్సిటీ అందిస్తునన్ని కోర్సులను మరే యూనివర్సిటీ ఆఫర్ చేయడం లేదు. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని ీపీహెచ్డీ కోర్సుల వరకు ఇగ్నోలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులే. ఇగ్నో అందిస్తున్న కోర్సుల వివరాలు.. సర్టిఫికెట్ కోర్సులు: ఎయిర్ టికెటింగ్, ఎయిర్‌లైన్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్, బీ కీపింగ్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్-బీపీవో-ఐటీఈఎస్, లైఫ్‌లాంగ్ లెర్నింగ్, యూత్ ఇన్ డెవలప్మెంట్ వర్క్, టెలిసెంటర్/విలేజ్ నాలెడ్జ్ సెంటర్ మేనేజ్మెంట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ఐటెమ్స్, డిస్పెన్సింగ్ ఆప్టిక్స్, కమ్యూనిటీ రేడియో, పీసీ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, క్రాఫ్ట్ అండ్ డిజైన్, ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, క్రియేటివ్ మీడియా ఆర్ట్స్- డిజిటల్ సౌండ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఫంక్షనల్ ఇంగ్లిష్ (ప్రాథమిక స్థాయి), ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మొదలైనవి. వ్యవధి: ఆరు నెలలు. అర్హత: కోర్సులను బట్టి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అర్హతలున్నాయి. పీజీ డిప్లొమా/అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు: కార్పొరేట్ గవర్నెన్స్, రూరల్ బ్యాంకింగ్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, బుక్ పబ్లిషింగ్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొదలైనవి. అర్హత: గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు: ఆక్వాకల్చర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ టెక్నాలజీ, రేడియో ఇమేజినింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, పంచాయతీ లెవల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్, డెయిరీ టెక్నాలజీ, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, క్రిటికల్ కేర్ నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్‌కేర్ ఎడ్యుకేషన్, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఎర్లీచైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ . వ్యవధి: ఏడాది, అర్హత: 10+2. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు: బీఎస్సీ: నాటికల్ సైన్స్, నర్సింగ్ (పోస్ట్ బేసిక్), హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, లెదర్‌గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్/టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బీఎస్సీ ఆనర్స్: ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్. బీఏ: ఇంగ్లిష్, హిందీ, 3డీ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఉర్దూ, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, టూరిజం స్టడీస్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అప్పారెల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్. ఇతర కోర్సులు: బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఎల్ఐఎస్సీ, బీఎస్‌డబ్ల్యు, బీబీఏ (రిటైలింగ్), బీకాం, బీకాం (ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్). మాస్టర్స్ డిగ్రీ కోర్సులు: ఎంఎస్సీ: యాక్చూరియల్ సైన్స్, క్లినికల్ ట్రైల్స్, కెమిస్ట్రీ, డైటిటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్. ఎంఏ: అడల్డ్ ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంగ్లిష్, ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, హిందీ, హిస్టరీ, ఫిలాసఫీ, లేబర్ అండ్ డెవలప్మెంట్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, రూరల్ డెవలప్మెంట్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, సోషియాలజీ, టూరిజం మేనేజ్మెంట్, ట్రాన్స్లేషన్ స్టడీస్, ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్, అప్పారెల్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఇతర పీజీ కోర్సులు: ఎంఎస్డబ్ల్యు, ఎంఎఫ్ఏ (పెయింటింగ్), ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), ఎంఎల్ఐఎస్సీ, ఎంకాం, ఎంకాం (మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్), (బిజినెస్ పాలసీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్), ఎంబీఏ, ఎంబీఏ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్), (కార్పొరేట్ గవర్నెన్స్), (ఫైనాన్షియల్ మార్కెట్స్), (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్), (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్), ఎంటెక్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్, ఐటీ. నిరుద్యోగ యువత అవకాశాలకు ఇగ్నో.. బీకాం అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎంఏ సైకాలజీలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉంది. వచ్చే జూలై నుంచి పీజీ డిప్లొమాలో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిని అందుకునేలా ఎన్నో కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులు విలువైన సమయాన్ని నష్టపోకుండా తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకునేందుకు డిస్టెన్స్ కోర్సులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా టూరిజం, హెల్త్, లీగల్, అగ్రికల్చర్, టీచింగ్ వంటి రంగాల్లో అపార అవకాశాలున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే కోరుకున్న కెరీర్లో ఆశించిన స్థాయికి చేరొచ్చు. యూజీసీ, సంబంధిత సంస్థల గుర్తింపు ఉన్న కోర్సులను పూర్తిచేస్తే విలువైన సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా చేసిన కోర్సుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. - డాక్టర్ కామేశ్వరిమూర్తి, రీజనల్ డెరైక్టర్, ఇగ్నో, హైదరాబాద్. -
కెరీర్‌కు గేట్‌వే.. సర్టిఫికెట్ కోర్సులు
తక్కువ ఖర్చుతో.. అతి స్వల్పకాలంలో ఉద్యోగం పొందాలంటే దానికి ఏకైక మార్గం జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికెట్ కోర్సులు. రెండు వారాల నుంచి ఏడాది వ్యవధి వరకు ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని మన రాష్ట్రంలో, దేశంలో వివిధ యూనివర్సిటీలు, సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. అలాంటి సర్టిఫికెట్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్.. కంప్యూటర్ సంబంధిత కోర్సులు నేడు ఇంటా బయట కంప్యూటర్ల వాడకం తప్పనిసరైంది. ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ రోజువారీ విధుల కోసం కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు అభ్యసించినవారికి అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. కోర్సులు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ బీపీవో, ఐటీ సంబంధిత రంగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తోంది. వెబ్సైట్: www.ignou.ac.in మన రాష్ట్రంలో సెట్విన్ కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల వివరాలు.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ (వ్యవధి: మూడు నెలలు) అర్హత: పదో తరగతి పాస్/ఫెయిల్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ (బేసిక్, అడ్వాన్స్డ్) (వ్యవధి: 45 రోజులు) అర్హత: బేసిక్ కోర్సుకు ఇంటర్, అడ్వాన్స్‌డ్‌కు బీకాంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వెబ్సైట్: www.setwinapgov.org అవకాశాలు: హార్డ్‌వేర్ కోర్సులు పూర్తిచేస్తే కంప్యూటర్ సర్వీసెస్ రంగాల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో అవకాశాలుంటాయి. అకౌంటెన్సీ కోర్సులు పూర్తిచేసినవారు వివిధ వ్యాపార, వాణిజ్య కార్యాలయాల్లో అకౌంటెంట్‌గా పనిచేయొచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.10,000 అందుకోవచ్చు. మెడికల్/హెల్త్‌కేర్ ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లకు వైద్య రంగం దీటుగా బదులిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల సురక్షిత ఆరోగ్య జీవనానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ క్రతువులో భాగం పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సంబంధిత రంగాల్లో అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. మెడికల్ సంబంధిత రంగాల్లో ఎన్నో యూనివర్సిటీలు, సంస్థలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్: ట హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్; ట న్యూబోర్న్ అండ్ ఇన్ఫాంట్ నర్సింగ్; ట మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్; ట డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్క్; ట హోమ్ బేస్డ్ హెల్త్‌కేర్; ట ఫుడ్ అండ్ న్యూట్రిషన్; ట న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్; ట అడోల్సెంట్ హెల్త్ అండ్ కౌన్సెలింగ్; ట ఆయుష్ నర్సింగ్; ట లేబొరేటరీ టెక్నిక్స్. అందిస్తోన్న సంస్థ: ఇగ్నో (www.ignou.ac.in) మణిపాల్ వర్సిటీ అందించే సర్టిఫికెట్ కోర్సులు: పబ్లిక్ హెల్త్ ట గ్లోబల్ హెల్త్ వ్యవధి: ఆరు నెలలు మన రాష్ట్రంలో సెట్విన్ కూడా హెల్త్ సర్వీసెస్‌లో స్వల్పకాలిక కోర్సులను అందిస్తోంది. హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఆర్ఐ టెక్నీషియన్ ట్రైనింగ్, సిటీస్కాన్ టెక్నీషియన్ ట్రైనింగ్, రేడియాలజీ టెక్నీషియన్ ట్రైనింగ్, కార్డియాక్ టెక్నీషియన్ ట్రైనింగ్, అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ మొదలైన కోర్సులు ఉన్నాయి. వీటి వ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కెరీర్: హెల్త్‌కేర్/మెడికల్ సంబంధిత కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వారి కోర్సులను బట్టి అవకాశాలుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజారోగ్యానికి పాటుపడుతున్నాయి. వీటిల్లోనూ ఉద్యోగాలను పొందొచ్చు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తించవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.10,000 నుంచి వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత, పనితీరు అనుభవాన్ని బట్టి మరింత ఆదాయాన్ని సంపాదించొచ్చు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పోటీ ప్రపంచంలో ఎక్కువ సమాచారం ఉన్నవారే విజేతలుగా నిలుస్తున్నారు. ప్రతి సంస్థ, కంపెనీ సమాచారాన్ని ఆస్తిగా భావిస్తున్నాయి. రేపటి అవసరాలను ఈనాడే గుర్తించి దానికి కావాల్సిన విజ్ఞాన వనరులు సిద్ధం చేస్తున్నాయి. పాత అనుభవాలు, ఆనాటి సవాళ్లు నేటి తరానికి తెలియడానికి వాటి చిట్టాను పొందుపరుస్తున్నాయి. కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా కేంద్రాలు, డెవలప్మెంట్ సెంటర్లు.. ఇలా ప్రతిచోటా లైబ్రరీలు ఏర్పడుతున్నాయి. విద్యాలయాలైతే మా లైబ్రరీ విస్తీర్ణం ఇంత.. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఇన్ని అంతర్జాతీయ జర్నల్స్ అని విద్యార్థులను ఆకర్షించడానికి లైబ్రరీని ఒక అస్త్రంగా చెప్పుకుంటున్నాయి. పెరుగుతోన్న పాఠశాలలు, విస్తరిస్తోన్న కార్యాలయాలు, కంపెనీలు లైబ్రరీ సైన్స్ చదివినవారికి అవకాశాల్లో ఢోకా ఉండదని చెబుతున్నాయి. లైబ్రేరియన్ విధులు.. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడం సబ్జెక్ట్ ఆధారంగా ప్రచురణల కొనుగోలు, లైబ్రరీలో అమరిక లైబ్రరీ నిర్వహణ, సిబ్బందిపై పర్యవేక్షణ పుస్తకాలు, రాతప్రతులు, ప్రత్యేక ప్రచురణల సేకరణ, సంరక్షణ అవకాశాలు అపారం: చాలామంది ఇప్పటికీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కున్న ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. కానీ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కారణం.. పెరుగుతున్న డాక్యుమెంటేషన్ సెంటర్లు, మ్యూజియంలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ముద్రణ సంస్థలు, రీసెర్చ్ సంస్థల్లో లైబ్రేరియన్ల కొరత వేధిస్తుండటమే. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో అవకాశాలు అపారమని చెప్పొచ్చు. కోర్సులు: మన రాష్ట్రంలో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబర్రీ ఇన్ఫర్మేషన్ సైన్స్‌ను అందిస్తున్నారు. మొత్తం 12 ప్రభుత్వ గ్రంథాలయాలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన ఏటా ఆగస్టు/సెప్టెంబర్‌ల్లో వెలువడుతుంది. అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీ ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తోంది. దీనికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చజీఞ్చ.్ఛఛీఠ కెరీర్: సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీ క్లర్క్ లేదా లైబ్రరీ అటెండెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి అసిస్టెంట్ లైబ్రేరియన్; డిప్యూటీ లైబ్రేరియన్; లైబ్రేరియన్/చీఫ్ లైబ్రేరియన్; రీసెర్చర్/అప్లికేషన్ స్పెషలిస్ట్; కన్సల్టెంట్/రిఫరెన్స్ లైబ్రేరియన్; టెక్నికల్ అసిస్టెంట్/రికార్డ్స్ మేనేజర్ హోదాలకు చేరుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ. 15,000 వరకు ఉంటుంది. ఫారెన్ లాంగ్వేజెస్ ప్రపంచీకరణతో.. బహుళజాతి సంస్థలు భారత్‌కు రావడం.. అదేవిధంగా స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ తదితర వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో సంబంధిత ఫారెన్ లాంగ్వేజ్ తెలిసి ఉండటం.. వ్యాపారపరంగా చాలా అవసరం. ఈ కారణంగా ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులు నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా మన దేశం.. వివిధ దేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో విదేశీ భాషలను కెరీర్‌గా ఎంచుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కోర్సులు: సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ ఇన్ అరబిక్/ఫ్రెంచ్/ఇటాలియన్/చైనీస్/పర్షియన్, కొరియన్ (పార్ట్‌టైం) వ్యవధి: ఏడాది (రెండు సెమిస్టర్లు) అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: అకడెమిక్ ప్రతిభ ఆధారంగా. క్యాంపస్: ఇఫ్లూ- హైదరాబాద్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఫ్రెంచ్/జర్మన్/స్పానిష్ (పార్ట్‌టైం) క్యాంపస్‌లు: ఇఫ్లూ - షిల్లాంగ్, లక్నో వెబ్సైట్: www.ifluniversity.ac.in సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫ్రెంచ్ ఈ కోర్సును తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ పార్ట్‌టైం విధానంలో అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాది. వెబ్సైట్: www.mkuniversity.org దూరవిద్య విధానంలో: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ జపనీస్ లాంగ్వేజ్, (వ్యవధి: ఏడాది) ఫ్రెంచ్ లాంగ్వేజ్, (వ్యవధి: ఆరు నెలలు) అరబిక్ లాంగ్వేజ్, (వ్యవధి: ఆరు నెలలు) అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. కనీసం 18 ఏళ్ల వయసుండాలి. అందిస్తోంది: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వెబ్సైట్: www.ignou.ac.in కెరీర్: ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లో అవకాశాలున్నాయి. సంబంధిత విదేశీ భాషలు వచ్చినవారిని రాయబార కార్యాలయాల్లో నియమించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారు. అంతేకాకుండా వివిధ భాషల్లో మంచి పేరున్న పుస్తకాలను మరో భాషలోకి అనువదిస్తున్నారు. కాబట్టి అనువాదకులుగానూ పనిచేయొచ్చు. కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో కూడా ఇంగ్లిష్, హిందీలతోపాటు మూడో లాంగ్వేజ్‌గా ఏదైనా విదేశీ భాషను నేర్పిస్తున్నారు. వీటిల్లోనూ అవకాశాలు కోకొల్లలు. వేతనాలు: అనువాదకులకు భాష ఆధారంగా ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తుంది. నెలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు జీతాలు అందుకోవచ్చు. అధ్యాపకులకు ప్రారంభంలో రూ. 25వేలకుపైగా వేతనం ఉంటుంది. తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా మరింత ఆదాయం పొందొచ్చు. కుకరీ, హోటల్ మేనేజ్మెంట్ హోటళ్ల పరిశ్రమ మనదేశంలో శరవేగం విస్తరిస్తోంది. సరికొత్త దేశీ, విదేశీ రుచులతో వినియోగదారుల మనస్సులను చూరగొంటోంది. ఎన్నో దేశ, విదేశీ కంపెనీలు ఈ రంగంలో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ రంగం నిష్ణాతులైన నిపుణులకు స్వాగతం పలుకుతోంది. ఇందులో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. అనేక సంస్థలు రెండు వారాల నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. మణిపాల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్సెస్ ఇన్ కుకరీ ఫర్ హోమ్ మేకర్స్, ఫుడ్ సర్వీస్ అండ్ వెయిటింగ్ ఇన్ రెస్టారెంట్స్, కుకరీ ఫర్ కమర్షియల్ కుక్స్, బేకరీ ఫర్ కమర్షియల్ బేకర్స్‌ను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి రెండు వారాల నుంచి నెల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.manipal.edu చూడొచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ నిథిమ్ కూడా షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవకాశాలు: హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సంబంధిత పరిశ్రమలు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అవకాశాలుంటాయి. సొంతంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను లేదా రెస్టారెంట్‌ను ప్రారంభించొచ్చు. తాజ్‌గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఒబెరాయ్ వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మరికొన్ని కొత్త సంస్థలు ఈ రంగంలోకి రానున్నాయి. వాటిల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.15,000 వరకు ఉంటాయి.