కెరీర్‌కు గేట్‌వే.. సర్టిఫికెట్ కోర్సులు | Certificate courses in career | Sakshi
Sakshi News home page

కెరీర్‌కు గేట్‌వే.. సర్టిఫికెట్ కోర్సులు

Published Thu, Nov 21 2013 12:59 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Certificate courses in career

తక్కువ ఖర్చుతో.. అతి స్వల్పకాలంలో ఉద్యోగం పొందాలంటే దానికి ఏకైక మార్గం జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికెట్ కోర్సులు. రెండు వారాల నుంచి ఏడాది వ్యవధి వరకు ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని మన రాష్ట్రంలో, దేశంలో వివిధ యూనివర్సిటీలు, సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. అలాంటి  సర్టిఫికెట్ కోర్సులపై ప్రత్యేక ఫోకస్..


 
 కంప్యూటర్ సంబంధిత కోర్సులు
 నేడు ఇంటా బయట కంప్యూటర్ల వాడకం తప్పనిసరైంది. ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ రోజువారీ విధుల కోసం కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు అభ్యసించినవారికి అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.


 
 కోర్సులు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్
 కమ్యూనికేషన్ అండ్ ఐటీ స్కిల్స్
 కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ బీపీవో, ఐటీ సంబంధిత రంగాలు
 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 వీటిని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 మన రాష్ట్రంలో సెట్విన్ కంప్యూటర్ సంబంధిత సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సుల వివరాలు..
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్
 (వ్యవధి: మూడు నెలలు)
 అర్హత: పదో తరగతి పాస్/ఫెయిల్
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ
 (బేసిక్, అడ్వాన్స్‌డ్) (వ్యవధి: 45 రోజులు)
 అర్హత: బేసిక్ కోర్సుకు ఇంటర్, అడ్వాన్స్‌డ్‌కు బీకాంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
 వెబ్‌సైట్: www.setwinapgov.org
 అవకాశాలు: హార్డ్‌వేర్ కోర్సులు పూర్తిచేస్తే కంప్యూటర్ సర్వీసెస్ రంగాల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అవకాశాలుంటాయి. అకౌంటెన్సీ కోర్సులు పూర్తిచేసినవారు వివిధ వ్యాపార, వాణిజ్య కార్యాలయాల్లో అకౌంటెంట్‌గా పనిచేయొచ్చు.
 వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.10,000 అందుకోవచ్చు.


 
 మెడికల్/హెల్త్‌కేర్
 ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లకు వైద్య రంగం దీటుగా బదులిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల సురక్షిత ఆరోగ్య జీవనానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ క్రతువులో భాగం పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సంబంధిత రంగాల్లో అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. మెడికల్ సంబంధిత రంగాల్లో ఎన్నో యూనివర్సిటీలు, సంస్థలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..


 
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్:
 ట హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్; ట న్యూబోర్న్ అండ్ ఇన్‌ఫాంట్ నర్సింగ్; ట మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్; ట డయాబెటీస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్క్; ట హోమ్ బేస్డ్ హెల్త్‌కేర్; ట ఫుడ్ అండ్ న్యూట్రిషన్; ట న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్; ట అడోల్‌సెంట్ హెల్త్ అండ్ కౌన్సెలింగ్; ట ఆయుష్ నర్సింగ్; ట లేబొరేటరీ టెక్నిక్స్.
 అందిస్తోన్న సంస్థ: ఇగ్నో (www.ignou.ac.in)
 
 మణిపాల్ వర్సిటీ అందించే సర్టిఫికెట్ కోర్సులు:
 పబ్లిక్ హెల్త్ ట గ్లోబల్ హెల్త్
 వ్యవధి: ఆరు నెలలు
 మన రాష్ట్రంలో సెట్విన్ కూడా హెల్త్ సర్వీసెస్‌లో స్వల్పకాలిక కోర్సులను అందిస్తోంది. హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఆర్‌ఐ టెక్నీషియన్ ట్రైనింగ్, సిటీస్కాన్ టెక్నీషియన్ ట్రైనింగ్, రేడియాలజీ టెక్నీషియన్ ట్రైనింగ్, కార్డియాక్ టెక్నీషియన్ ట్రైనింగ్, అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ మొదలైన కోర్సులు ఉన్నాయి. వీటి వ్యవధి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది.
 అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు

 
 కెరీర్:
 హెల్త్‌కేర్/మెడికల్ సంబంధిత కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వారి కోర్సులను బట్టి అవకాశాలుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజారోగ్యానికి పాటుపడుతున్నాయి. వీటిల్లోనూ ఉద్యోగాలను పొందొచ్చు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తించవచ్చు.
 
 వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.10,000 నుంచి వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత, పనితీరు అనుభవాన్ని బట్టి మరింత ఆదాయాన్ని సంపాదించొచ్చు.
 


 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
 పోటీ ప్రపంచంలో ఎక్కువ సమాచారం ఉన్నవారే విజేతలుగా నిలుస్తున్నారు. ప్రతి సంస్థ, కంపెనీ సమాచారాన్ని ఆస్తిగా భావిస్తున్నాయి. రేపటి అవసరాలను ఈనాడే గుర్తించి దానికి కావాల్సిన విజ్ఞాన వనరులు సిద్ధం చేస్తున్నాయి. పాత అనుభవాలు, ఆనాటి సవాళ్లు నేటి తరానికి తెలియడానికి వాటి చిట్టాను పొందుపరుస్తున్నాయి. కళాశాలలు, పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా కేంద్రాలు, డెవలప్‌మెంట్ సెంటర్లు.. ఇలా ప్రతిచోటా లైబ్రరీలు ఏర్పడుతున్నాయి. విద్యాలయాలైతే మా లైబ్రరీ విస్తీర్ణం ఇంత.. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఇన్ని అంతర్జాతీయ జర్నల్స్ అని విద్యార్థులను ఆకర్షించడానికి లైబ్రరీని ఒక అస్త్రంగా చెప్పుకుంటున్నాయి. పెరుగుతోన్న పాఠశాలలు, విస్తరిస్తోన్న కార్యాలయాలు, కంపెనీలు లైబ్రరీ సైన్స్ చదివినవారికి అవకాశాల్లో ఢోకా ఉండదని చెబుతున్నాయి.
 
 లైబ్రేరియన్ విధులు..
 వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా సమాచారం అందించడం
 సబ్జెక్ట్ ఆధారంగా ప్రచురణల కొనుగోలు, లైబ్రరీలో అమరిక
 లైబ్రరీ నిర్వహణ, సిబ్బందిపై పర్యవేక్షణ
 పుస్తకాలు, రాతప్రతులు, ప్రత్యేక ప్రచురణల సేకరణ, సంరక్షణ
 
 అవకాశాలు అపారం:
 చాలామంది ఇప్పటికీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కున్న ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. కానీ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు ఆహ్వానం పలుకుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కారణం.. పెరుగుతున్న డాక్యుమెంటేషన్ సెంటర్లు, మ్యూజియంలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ముద్రణ సంస్థలు, రీసెర్చ్ సంస్థల్లో లైబ్రేరియన్ల కొరత వేధిస్తుండటమే. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో అవకాశాలు అపారమని చెప్పొచ్చు.
 
 కోర్సులు:
 మన రాష్ట్రంలో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబర్రీ ఇన్ఫర్మేషన్ సైన్స్‌ను అందిస్తున్నారు. మొత్తం 12 ప్రభుత్వ గ్రంథాలయాలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన ఏటా ఆగస్టు/సెప్టెంబర్‌ల్లో వెలువడుతుంది. అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీ ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తోంది. దీనికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఝ్చజీఞ్చ.్ఛఛీఠ
 
 కెరీర్:
 సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేస్తే లైబ్రరీ క్లర్క్ లేదా లైబ్రరీ అటెండెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి అసిస్టెంట్ లైబ్రేరియన్; డిప్యూటీ లైబ్రేరియన్; లైబ్రేరియన్/చీఫ్ లైబ్రేరియన్; రీసెర్చర్/అప్లికేషన్ స్పెషలిస్ట్; కన్సల్టెంట్/రిఫరెన్స్ లైబ్రేరియన్; టెక్నికల్ అసిస్టెంట్/రికార్డ్స్ మేనేజర్ హోదాలకు చేరుకోవచ్చు.
 
 వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ. 15,000 వరకు ఉంటుంది.
 
 ఫారెన్ లాంగ్వేజెస్
 ప్రపంచీకరణతో.. బహుళజాతి సంస్థలు భారత్‌కు రావడం.. అదేవిధంగా స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తుండటం.. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ తదితర వ్యవహారాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో సంబంధిత ఫారెన్ లాంగ్వేజ్ తెలిసి ఉండటం.. వ్యాపారపరంగా చాలా అవసరం. ఈ కారణంగా ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులు నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా మన దేశం.. వివిధ దేశాలతో కుదుర్చుకున్న అవగాహనల ఫలితంగా.. వచ్చే సమాచారాన్ని క్రోడీకరించడం, నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడం వంటి కారణాలతో విదేశీ భాషలను కెరీర్‌గా ఎంచుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
 
 కోర్సులు:
 సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ ఇన్ అరబిక్/ఫ్రెంచ్/ఇటాలియన్/చైనీస్/పర్షియన్, కొరియన్ (పార్ట్‌టైం)
 వ్యవధి: ఏడాది (రెండు సెమిస్టర్లు)
 అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత.
 ఎంపిక: అకడెమిక్ ప్రతిభ ఆధారంగా.
 క్యాంపస్: ఇఫ్లూ- హైదరాబాద్
 సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఫ్రెంచ్/జర్మన్/స్పానిష్ (పార్ట్‌టైం)
 క్యాంపస్‌లు: ఇఫ్లూ - షిల్లాంగ్, లక్నో
 వెబ్‌సైట్: www.ifluniversity.ac.in
 సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫ్రెంచ్
 ఈ కోర్సును తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ పార్ట్‌టైం విధానంలో అందిస్తోంది.
 అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
 వ్యవధి: ఏడాది.
 వెబ్‌సైట్: www.mkuniversity.org
 
 దూరవిద్య విధానంలో:
 సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ జపనీస్ లాంగ్వేజ్, (వ్యవధి: ఏడాది)
 ఫ్రెంచ్ లాంగ్వేజ్, (వ్యవధి: ఆరు నెలలు)
 అరబిక్ లాంగ్వేజ్, (వ్యవధి: ఆరు నెలలు)
 అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. కనీసం 18 ఏళ్ల వయసుండాలి.
 అందిస్తోంది: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 
 కెరీర్:
 ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లో అవకాశాలున్నాయి. సంబంధిత విదేశీ భాషలు వచ్చినవారిని రాయబార కార్యాలయాల్లో నియమించుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారు. అంతేకాకుండా వివిధ భాషల్లో మంచి పేరున్న పుస్తకాలను మరో భాషలోకి అనువదిస్తున్నారు. కాబట్టి అనువాదకులుగానూ పనిచేయొచ్చు. కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో కూడా ఇంగ్లిష్, హిందీలతోపాటు మూడో లాంగ్వేజ్‌గా ఏదైనా విదేశీ భాషను నేర్పిస్తున్నారు. వీటిల్లోనూ అవకాశాలు కోకొల్లలు.
 
 వేతనాలు: అనువాదకులకు భాష ఆధారంగా ఒక్కో పేజీకి దాదాపు రూ. 200 నుంచి రూ. 500 వరకు లభిస్తుంది. నెలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు జీతాలు అందుకోవచ్చు. అధ్యాపకులకు ప్రారంభంలో రూ. 25వేలకుపైగా వేతనం ఉంటుంది. తర్వాత పనితీరు, అనుభవం ఆధారంగా మరింత ఆదాయం పొందొచ్చు.
 
 కుకరీ, హోటల్ మేనేజ్‌మెంట్
 హోటళ్ల పరిశ్రమ మనదేశంలో శరవేగం విస్తరిస్తోంది. సరికొత్త దేశీ, విదేశీ రుచులతో వినియోగదారుల మనస్సులను చూరగొంటోంది. ఎన్నో దేశ, విదేశీ కంపెనీలు ఈ రంగంలో నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోటల్ రంగం నిష్ణాతులైన నిపుణులకు స్వాగతం పలుకుతోంది. ఇందులో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. అనేక సంస్థలు రెండు వారాల నుంచి ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి.
 మణిపాల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్సెస్ ఇన్ కుకరీ ఫర్ హోమ్ మేకర్స్, ఫుడ్ సర్వీస్ అండ్ వెయిటింగ్ ఇన్ రెస్టారెంట్స్, కుకరీ ఫర్ కమర్షియల్ కుక్స్, బేకరీ ఫర్ కమర్షియల్ బేకర్స్‌ను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి రెండు వారాల నుంచి నెల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.manipal.edu చూడొచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్‌ఆర్ నిథిమ్ కూడా షార్ట్‌టర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 
 అవకాశాలు:
 హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సంబంధిత పరిశ్రమలు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అవకాశాలుంటాయి. సొంతంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను లేదా రెస్టారెంట్‌ను ప్రారంభించొచ్చు. తాజ్‌గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఒబెరాయ్ వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మరికొన్ని కొత్త సంస్థలు ఈ రంగంలోకి రానున్నాయి. వాటిల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు.
 వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.15,000 వరకు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement