ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ నియామకాలు ఏప్రిల్‌లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్‌లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది.
టాప్–5లో ఎడ్‌టెక్..
ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్‌లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్‌టెక్ ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ/ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్‌లో గణనీయ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్‌లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి.
జోరుగా రిటైల్ రంగం..
రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్‌లెట్లలో నిపుణులకు డిమాండ్‌ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది.
ఇతర విభాగాల్లో ఇలా..
ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్‌జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్‌లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్‌ఎస్‌ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది.
ఏప్రిల్‌లో ఆన్‌లైన్ హైరింగ్ తగ్గింది
Published Thu, May 11 2023 3:40 AM | Last Updated on Thu, May 11 2023 9:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment