Online Hiring
-
ఏప్రిల్‌లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్‌లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్‌లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్‌లో గణనీయ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్‌లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్‌ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్‌లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
ఆన్లైన్ నియామకాలు పెరిగాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో జాబ్ మార్కెట్ మెరుగుపడుతోంది. అక్టోబర్ నెలలో ఆన్లైన్ నియామకాలు 9 శాతం వృద్దిని నమోదుచేశాయని రిపోర్టు పేర్కొంది. గతేడాది 1,580గా ఉన్న ఆన్లైన్ నియామకాలు, ఈ ఏడాది అక్టోబర్ నెలలో 9 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,728గా రికార్డైనట్టు నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ పేర్కొంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి కీలక పరిశ్రమల్లో నియామకాలు అక్టోబర్ నెలలో 28 శాతం వృద్ధిని రికార్డు చేసినట్టు రిపోర్టు తెలిపింది. నగరాల పరంగా చూసుకుంటే, అన్ని 13 నగరాల్లోనూ నియామకాలు పెరిగినట్టు పేర్కొంది. ఇది జాబ్ మార్కెట్ మెరుగుపడిందనే దానికి సంకేతంగా నిలుస్తున్నట్టు నౌకరి.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ సురేష్ తెలిపారు. ఏడాది ఏడాదికి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 9 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు పేర్కొన్నారు. ఐటీ రంగం కూడా మెల్లగా కోలుకుంటున్నట్టు చెప్పారు. ఆటో, నిర్మాణం/ఇంజనీరింగ్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్‌ల్లో 23 శాతం, 22 శాతం, 15 శాతం వృద్ధి రికార్డయ్యాయి. అనుభవ పరంగా చూసుకుంటే, 16 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి వారికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం వృద్ధి ఉందని తెలిసింది. 0-3 ఏళ్ల అనుభవమున్న జాబ్ సీకర్స్‌కు 13 శాతం, 13-16 ఏళ్ల మధ్యలో అనుభమున్న వారికి 10 శాతం వృద్ధి, 4-7 ఏళ్ల అనుభవమున్న వారికి 8 శాతం వృద్ధి నమోదైనట్టు రిపోర్టులో వెల్లడైంది. -
జోరుజోరుగా ఆన్లైన్ నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : మునపటి కాలంలో ఉద్యోగం కావాలంటే.. సర్టిఫికేట్లన్నీ పట్టుకుని కాళ్లు అరిగేలా కంపెనీల చుట్టూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. రోడ్డుపై తిరగాల్సినవసరం లేదు. మన అర్హతలన్నీ తెలపుతూ రూపొందించిన రెజ్యూమ్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. మన క్వాలిఫికేషన్‌కు తగ్గ ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది. ఆగస్టు నెలలో ఆన్లైన్ నియామకాలు 14 శాతం వృద్ధిని నమోదుశాయని తాజా రిపోర్టులో తెలిసింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆన్లైన్ ద్వారా నియమాకాలు జరిగినట్టు మాన్స్టర్.కామ్‌లో వెల్లడైంది. వచ్చే నెలల్లో కూడా ఉద్యోగ అవుట్‌లుక్ బాగుంటుందని రిపోర్టులో తెలిసింది. ఆగస్టు నెల మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ గతేడాది కంటే 14 శాతం వృద్ది చెంది 279కి పెరిగింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో వృద్ధి ఇలానే నమోదవుతుందని, రియల్ఎస్టేట్, రిటైల్, బీపీఓ-ఐటీ, ప్రొడక్షన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్ వంటి రంగాల్లో కొంతకాలం వేచిచూడాల్సి ఉందని మాన్స్టర్.కామ్ మిడిల్-ఈస్ట్ ఎండీ, ఏపీఏసీ సంజయ్ మోదీ చెప్పారు. పండుగ సీజన్ నేపథ్యంలో గృహోపకరణాల రంగం నియామకాల చార్ట్‌లో ఆగస్టు నెలలో ఏడాది ఏడాదికి 54 శాతం వృద్ధి నమోదుచేసిందని రిపోర్టులో తెలిసింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో నియామకాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదుచేశాయి. కొత్త జీఎస్టీ పన్నుల విధానం కూడా సులభతర వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుందని, ఉద్యోగ మార్కెట్ మరింత ముందుకు వెళ్తుందని రిపోర్టు చెప్పింది. ఎక్కువ నియామకాలు కోల్‌కత్తాలో 46 శాతంగా జరిగాయి. అనంతరం ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 8 శాతం, బెంగళూరులో 4 శాతం నమోదయ్యాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మాత్రం వార్షిక వృద్ధి నెమ్మదించింది. -
ఆన్లైన్ హైరింగ్ జోరు
కొత్త ప్రభుత్వంతో కొత్త కొలువులు : మాన్‌స్టర్‌డాట్‌కామ్ వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్లైన్ హైరింగ్ జోరు ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఈ ఏడాది మేలో ఈ ఆన్లైన్ హైరింగ్ 19 శాతం వృద్ధి చెందిందని ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ సర్వేలో తేలింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అత్యంత అధిక వృద్ధిరేటని వివరించింది. కొత్త ప్రభుత్వం కారణంగా ఆర్థిక వృద్ధి జోరు పెరుగుతుందని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటోందని, ఫలితంగా భారీ సంఖ్యలో కొత్త కొలువులు వస్తాయని మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎండీ సంజయ్ మోడి చెప్పారు. ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., * ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు నిలకడగా పెరుగుతున్నాయి. * గత ఏడాది మేలో 127 పాయింట్లుగా ఉన్న ద మాన్‌స్టర్‌డాట్‌కామ్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 19 శాతం (24 పాయింట్లు) వృద్ధితో ఈ ఏడాది 151 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్‌లో కూడా ఇదే స్థాయి వృద్ధిని సాధించింది. * 27 పారిశ్రామిక రంగాల్లో 16 రంగాల్లో ఉద్యోగ నియామక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. హైరింగ్ విషయంలో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం అత్యధిక వృద్ధిని (59 శాతం) సాధించింది. * ఇక సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగింది. * ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 13 నగరాల్లో ఆన్లైన్ హైరింగ్ పెరిగింది. 37 శాతం వృద్ధితో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై(27% వృద్ధి), ఢిల్లీ-ఎన్సీఆర్(20 %), హైదరాబాద్(19%), చెన్నై(17%) ఉన్నాయి. -
ఆన్లైన్ హైరింగ్‌లో 11 శాతం వృద్ధి
మాన్స్టర్.కామ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆన్లైన్ హైరింగ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 11 శాతం వృద్ధి నమోదైందని జాబ్ పోర్టల్ మాన్స్టర్.కామ్ వెల్లడించింది. ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 15 పాయింట్లు(11 శాతం) పెరిగింది. జనవరి నుంచి నియామకాల్లో హెచ్చుదల కనపడుతోందని వివరించింది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనడానికి ఏప్రిల్ నియామకాల సూచి(ఇండెక్స్) నిదర్శనమని మాన్స్టర్ ఇండియా ఎండీ సంజయ్ మోడి పేర్కొన్నారు. ఐటీ, ట్రావెల్/టూరిజం రంగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, సిమెంటు, నిర్మాణ రంగం, ఐరన్/స్టీలు రంగాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీనియర్ మేనేజ్మెంట్ పోస్టులకు డిమాండ్ 51 శాతం వృద్ధి కనబరిచింది. హైదరాబాద్‌లో 11 శాతం.. ఐటీ, ఐటీఈఎస్, టెలికం రంగంలో హైదరాబాదీయులకు ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్స్ నుంచి భాగ్యనగరంలో నియామకాలు పెరిగాయని హెచ్ఆర్ రంగ సంస్థ టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆన్లైన్ నియామకాల్లో 50-60 శాతం ఈ పోర్టల్స్ నుంచే ఉంటాయని చెప్పారు. తయారీ, మౌలిక రంగంలో నియామకాల ఊసే లేదని చెప్పారు. కాగా, మాన్స్టర్ నియామక సూచి ప్రకారం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 13 నగరాలకుగాను 10 నగరాలు వృద్ధి కనబరిచాయి. అహ్మదాబాద్ అత్యధికంగా 26 శాతం, బెంగళూరు 22, పునే 15, ముంబై 14, హైదరాబాద్‌లో 11% హెచ్చుదల నమోదైంది. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.