సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో జాబ్ మార్కెట్ మెరుగుపడుతోంది. అక్టోబర్ నెలలో ఆన్‌లైన్ నియామకాలు 9 శాతం వృద్దిని నమోదుచేశాయని రిపోర్టు పేర్కొంది. గతేడాది 1,580గా ఉన్న ఆన్‌లైన్ నియామకాలు, ఈ ఏడాది అక్టోబర్ నెలలో 9 శాతం వృద్ధిని నమోదుచేసి, 1,728గా రికార్డైనట్టు నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ పేర్కొంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి కీలక పరిశ్రమల్లో నియామకాలు అక్టోబర్ నెలలో 28 శాతం వృద్ధిని రికార్డు చేసినట్టు రిపోర్టు తెలిపింది. నగరాల పరంగా చూసుకుంటే, అన్ని 13 నగరాల్లోనూ నియామకాలు పెరిగినట్టు పేర్కొంది.
ఇది జాబ్ మార్కెట్ మెరుగుపడిందనే దానికి సంకేతంగా నిలుస్తున్నట్టు నౌకరి.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ సురేష్ తెలిపారు. ఏడాది ఏడాదికి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 9 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు పేర్కొన్నారు. ఐటీ రంగం కూడా మెల్లగా కోలుకుంటున్నట్టు చెప్పారు. ఆటో, నిర్మాణం/ఇంజనీరింగ్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్‌ల్లో 23 శాతం, 22 శాతం, 15 శాతం వృద్ధి రికార్డయ్యాయి. అనుభవ పరంగా చూసుకుంటే, 16 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి వారికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం వృద్ధి ఉందని తెలిసింది. 0-3 ఏళ్ల అనుభవమున్న జాబ్ సీకర్స్‌కు 13 శాతం, 13-16 ఏళ్ల మధ్యలో అనుభమున్న వారికి 10 శాతం వృద్ధి, 4-7 ఏళ్ల అనుభవమున్న వారికి 8 శాతం వృద్ధి నమోదైనట్టు రిపోర్టులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment