జోరుజోరుగా ఆన్‌లైన్ నియామకాలు
జోరుజోరుగా ఆన్‌లైన్ నియామకాలు
Published Tue, Sep 12 2017 4:58 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
సాక్షి, న్యూఢిల్లీ : మునపటి కాలంలో ఉద్యోగం కావాలంటే.. సర్టిఫికేట్లన్నీ పట్టుకుని కాళ్లు అరిగేలా కంపెనీల చుట్టూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. రోడ్డుపై తిరగాల్సినవసరం లేదు. మన అర్హతలన్నీ తెలపుతూ రూపొందించిన రెజ్యూమ్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. మన క్వాలిఫికేషన్‌కు తగ్గ ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది. ఆగస్టు నెలలో ఆన్‌లైన్ నియామకాలు 14 శాతం వృద్ధిని నమోదుశాయని తాజా రిపోర్టులో తెలిసింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా నియమాకాలు జరిగినట్టు మాన్‌స్టర్.కామ్‌లో వెల్లడైంది. వచ్చే నెలల్లో కూడా ఉద్యోగ అవుట్‌లుక్ బాగుంటుందని రిపోర్టులో తెలిసింది.
ఆగస్టు నెల మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ గతేడాది కంటే 14 శాతం వృద్ది చెంది 279కి పెరిగింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో వృద్ధి ఇలానే నమోదవుతుందని, రియల్‌ఎస్టేట్, రిటైల్, బీపీఓ-ఐటీ, ప్రొడక్షన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్ వంటి రంగాల్లో కొంతకాలం వేచిచూడాల్సి ఉందని మాన్‌స్టర్.కామ్ మిడిల్-ఈస్ట్ ఎండీ, ఏపీఏసీ సంజయ్ మోదీ చెప్పారు. పండుగ సీజన్ నేపథ్యంలో గృహోపకరణాల రంగం నియామకాల చార్ట్‌లో ఆగస్టు నెలలో ఏడాది ఏడాదికి 54 శాతం వృద్ధి నమోదుచేసిందని రిపోర్టులో తెలిసింది.
బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో నియామకాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదుచేశాయి. కొత్త జీఎస్టీ పన్నుల విధానం కూడా సులభతర వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుందని, ఉద్యోగ మార్కెట్ మరింత ముందుకు వెళ్తుందని రిపోర్టు చెప్పింది. ఎక్కువ నియామకాలు కోల్‌కత్తాలో 46 శాతంగా జరిగాయి. అనంతరం ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 8 శాతం, బెంగళూరులో 4 శాతం నమోదయ్యాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మాత్రం వార్షిక వృద్ధి నెమ్మదించింది.
Advertisement
Advertisement