Monster.com
-
జోరుజోరుగా ఆన్లైన్ నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : మునపటి కాలంలో ఉద్యోగం కావాలంటే.. సర్టిఫికేట్లన్నీ పట్టుకుని కాళ్లు అరిగేలా కంపెనీల చుట్టూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. రోడ్డుపై తిరగాల్సినవసరం లేదు. మన అర్హతలన్నీ తెలపుతూ రూపొందించిన రెజ్యూమ్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. మన క్వాలిఫికేషన్‌కు తగ్గ ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది. ఆగస్టు నెలలో ఆన్లైన్ నియామకాలు 14 శాతం వృద్ధిని నమోదుశాయని తాజా రిపోర్టులో తెలిసింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లలో ఎక్కువగా ఆన్లైన్ ద్వారా నియమాకాలు జరిగినట్టు మాన్స్టర్.కామ్‌లో వెల్లడైంది. వచ్చే నెలల్లో కూడా ఉద్యోగ అవుట్‌లుక్ బాగుంటుందని రిపోర్టులో తెలిసింది. ఆగస్టు నెల మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ గతేడాది కంటే 14 శాతం వృద్ది చెంది 279కి పెరిగింది. హోమ్ అప్లియెన్సస్, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో వృద్ధి ఇలానే నమోదవుతుందని, రియల్ఎస్టేట్, రిటైల్, బీపీఓ-ఐటీ, ప్రొడక్షన్, మానుఫ్రాక్ట్ర్చరింగ్ వంటి రంగాల్లో కొంతకాలం వేచిచూడాల్సి ఉందని మాన్స్టర్.కామ్ మిడిల్-ఈస్ట్ ఎండీ, ఏపీఏసీ సంజయ్ మోదీ చెప్పారు. పండుగ సీజన్ నేపథ్యంలో గృహోపకరణాల రంగం నియామకాల చార్ట్‌లో ఆగస్టు నెలలో ఏడాది ఏడాదికి 54 శాతం వృద్ధి నమోదుచేసిందని రిపోర్టులో తెలిసింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో నియామకాలు గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధిని నమోదుచేశాయి. కొత్త జీఎస్టీ పన్నుల విధానం కూడా సులభతర వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతుందని, ఉద్యోగ మార్కెట్ మరింత ముందుకు వెళ్తుందని రిపోర్టు చెప్పింది. ఎక్కువ నియామకాలు కోల్‌కత్తాలో 46 శాతంగా జరిగాయి. అనంతరం ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 8 శాతం, బెంగళూరులో 4 శాతం నమోదయ్యాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో మాత్రం వార్షిక వృద్ధి నెమ్మదించింది. -
కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం. ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి. ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి. -
జోరు తగ్గిన హైరింగ్ కార్యకలాపాలు
న్యూఢిల్లీ: హైరింగ్ కార్యకలాపాలు ఆగస్టు నెలలో మందగించాయని ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలతో సహా చాలా రంగాల్లో ఆగస్టు నెలలో కొత్త కొలువులివ్వడం తగ్గిందని పేర్కొంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో కంపెనీలు ఆచి తూచి వ్యవహరించడమే దీనికి కారణమంటున్న ఈ నివేదిక వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు..., జూలైతో పోల్చితే ఆగస్టులో ఉద్యోగ నియామక కార్యకలాపాలు తగ్గాయి. అన్ని రంగాల్లోనూ అదే పరిస్థితి. జూలైలో 123 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ఆగస్టులో 122 పాయింట్లకు పడిపోయింది. గతేడాది ఆగస్టులో ఈ ఇండెక్స్ 126 పాయింట్లుగా ఉంది. బ్యాంకింగ్/ఆర్థిక సేవలు/ బీమా, రియల్ ఎస్టేట్, టెలికాం/ఐఎస్పీ తదితర రంగాల్లో హైరింగ్ కార్యకలాపాలు తగ్గాయి. -
జూలైలో తగ్గిన ఆన్లైన్ హైరింగ్
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం ఆన్లైన్ హైరింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జూలైలో ఆన్లైన్ ద్వారా ఉద్యోగ నియామకాల కార్యకలాపాలు 4 శాతం తగ్గాయని ఆన్లైన్ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. అయితే హైదరాబాద్‌లో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు 2 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో 131 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ జూలైలో 6 శాతం క్షీణించి 123 పాయింట్లకు పడిపోయిందని వివరించింది. గడ్డుగా ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని మాన్‌స్టర్‌డాట్‌కామ్ (ఇండియా) ఎండీ సంజయ్ మోడీ చెప్పారు. కాగా ఆన్లైన్ హైరింగ్ టెలికాం/ఐఎస్పీ రంగాల్లో 20 శాతం మెరుగుపడిందని చెప్పారు. ఆన్లైన్ హైరింగ్ బీపీఓ/ఐటీఈఎస్ రంగంలో 18 శాతం పెరగ్గా , రసాయనాలు/ప్లాస్టిక్/రబ్బరు, పెయింట్స్, ఎరువులు రంగాల్లో 13 శాతం తగ్గిందని వివరించారు. ఇక కస్టమర్ సర్వీస్‌లో 18 శాతం పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో హాస్పిటాలిటి, పర్యాటక రంగాలు (10 శాతం) నిలిచాయని పేర్కొన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన హైరింగ్ 56 శాతం తగ్గిందని తెలిపారు.