జోరు తగ్గిన హైరింగ్ కార్యకలాపాలు | Hiring in banking, real estate sectors sluggish in August | Sakshi
Sakshi News home page

జోరు తగ్గిన హైరింగ్ కార్యకలాపాలు

Published Tue, Sep 24 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Hiring in banking, real estate sectors sluggish in August

న్యూఢిల్లీ: హైరింగ్ కార్యకలాపాలు ఆగస్టు నెలలో మందగించాయని ప్రముఖ జాబ్ పోర్టల్  మాన్‌స్టర్‌డాట్‌కామ్ తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలతో సహా చాలా రంగాల్లో ఆగస్టు నెలలో కొత్త కొలువులివ్వడం తగ్గిందని పేర్కొంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో కంపెనీలు ఆచి తూచి వ్యవహరించడమే దీనికి కారణమంటున్న  ఈ నివేదిక వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు...,
 
 జూలైతో పోల్చితే ఆగస్టులో ఉద్యోగ నియామక కార్యకలాపాలు తగ్గాయి. అన్ని రంగాల్లోనూ అదే పరిస్థితి. జూలైలో 123 పాయింట్లుగా ఉన్న ఆన్‌లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ ఆగస్టులో 122 పాయింట్లకు పడిపోయింది. గతేడాది ఆగస్టులో ఈ ఇండెక్స్ 126 పాయింట్లుగా ఉంది.
 
 బ్యాంకింగ్/ఆర్థిక సేవలు/ బీమా, రియల్ ఎస్టేట్, టెలికాం/ఐఎస్‌పీ తదితర రంగాల్లో హైరింగ్ కార్యకలాపాలు తగ్గాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement