'మరింత మంది పేర్లు బయటపెడతాం'
ఢిల్లీ: విదేశాల్లోని బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతున్న నల్లధనం విషయంలో మరింత మంది పేర్లను బయటపెడతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. తాము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదంటూనే రాబోవు రోజుల్లో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకొస్తాయన్నారు. అక్టోబర్ 31న హైదరాబాద్ లో 'ఐక్యతా పరుగు'(రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆ కార్యక్రమంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని మురళీధర్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ నిర్వహిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందులో పాల్గొవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.