
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావ్యతిరేక విధానాల పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సలైట్లు, ఆక్రమణ దారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్‌ఎస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనేది టీఆర్‌ఎస్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదన్నారు.
కర్నాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో ద్వారం తెరుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం లేదని, ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ పతనానికి వేగం పెంచే నాయకుడు రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment