
సాక్షి, హైదరాబాద్: మే 3 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమని, అప్పటి పరిస్థితిని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం మీడియాతో వర్చువల్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. దేశంలో మరో ఏడాది వరకు పబ్లిక్ మీటింగ్‌లు ఉండకపోవచ్చన్నారు. శుక్రవారం దేశంలోని అన్ని గ్రామాల సర్పంచులతో, శనివారం ఆర్థికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడతారని చెప్పారు. చదవండి: సగానికిపైగా సేఫ్!
Comments
Please login to add a commentAdd a comment