సమాచార చేరవేతలో దూసుకు పోతున్న సోషల్ మీడియా వినియోగాన్ని గ్రా మీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ...
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
హన్మకొండ : సమాచార చేరవేతలో దూసుకు పోతున్న సోషల్ మీడియా వినియోగాన్ని గ్రా మీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో శనివారం భారత్‌నీతి సంవాద్ అధ్వర్యంలో ‘సోషల్ మీడియా’ పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరి గినందున ప్రజలందరికీ సోషల్ మీడియాపై అవగాహన కల్పించాలన్నారు. రైతులు తయా రు చేస్తున్న విత్తనాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా దోహదపడుతుందన్నారు. సాంస్కృతి క కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్‌లో సో షల్ మీడియాపై వర్‌షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్రమో డీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నిర్వాహకు డు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, రఘునందన్, సుధీర్‌ఆర్యా, కిరణ్, రఘు, భరద్వాజనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అ శోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, మురళీమనోహర్, మొగిలి, సత్యనారాయణరావు పాల్గొన్నారు.
ఎంజీఎం స్వచ్ఛ భారత్‌లో...
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌లో బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సమస్యలు, సూపరింటెండెంట్ తీరు ను ఎంజీఎం పరిరక్షణ సమితి సభ్యులు ఆయనకు వివరించారు. కాగా, ఆయన తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తిని ప్రత్యేక అభినందించిన ఆనంతరం మాట్లాడుతూ ఎం జీఎం పరరిక్షణ సమితి సభ్యులతో పాటు ఐఎంఏ ప్రతినిధులు, ఆస్పత్రి యా జమాన్యంతో కలిసి ప్రతినిధి బృందంగా ఢిల్లీకి రావాలని సూచించారు. ప్రతి నిధి బృందాన్ని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి వద్దకు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. కాగా, తాను ఈ ఆస్పత్రిలో గతంలో టైఫాయిడ్ వ్యాధితో 21 రోజులు చికిత్స పొందినట్లు మురళీధర్‌రావు గుర్తు చేసుకున్నారు. సభ్యులు టీఎన్.స్వామి, దాచవేని సీతారాం పాల్గొన్నారు.