'సవాళ్లు ఎదురైనప్పుడు ప్రజలు మార్పునే కోరుకుంటారు' | BJP National General Secretary Muralidhar rao in hyderabad | Sakshi
Sakshi News home page

'సవాళ్లు ఎదురైనప్పుడు ప్రజలు మార్పునే కోరుకుంటారు'

Published Fri, Feb 20 2015 9:58 PM | Last Updated on Fri, Mar 29 2019 8:33 PM

'సవాళ్లు ఎదురైనప్పుడు ప్రజలు మార్పునే కోరుకుంటారు' - Sakshi

'సవాళ్లు ఎదురైనప్పుడు ప్రజలు మార్పునే కోరుకుంటారు'

హైదరాబాద్: దేశంలో సవాళ్లు ఎదురైనప్పుడల్లా ప్రజలు మార్పునే కోరుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో మురళీధర్రావు మాట్లాడుతూ... మతపరమైన రాజ్యాన్ని భారతదేశం ఎన్నడూ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల వికేంద్రీకరణే ఈ దేశ ఎదుగులకు తోడ్పాడుతుందన్నారు.

ప్రపంచశాంతి నిలవాలంటే భారతదేశ రక్షణే ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రక్షణ ఉత్పత్తులు ఈ దేశంలోనే జరగాలన్నారు. కార్మిక విధానాలు కొత్త ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా ఉండకూడదని మురళీధర్రావు అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement