'రాష్ట్రంలో టీఆర్‌ఎస్సే మా ప్రధాన రాజకీయ శత్రువు' | Muralidhar Rao Says TRS Is Our Main Political Enemy In The State | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో టీఆర్‌ఎస్సే మా ప్రధాన రాజకీయ శత్రువు'

Published Thu, Dec 12 2019 2:12 AM | Last Updated on Thu, Dec 12 2019 2:14 AM

Muralidhar Rao Says TRS Is Our Main Political Enemy In The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో తమ ప్రధాన రాజకీయ శత్రువు టీఆర్‌ఎస్‌ పార్టీనేనని, టీఆర్‌ఎస్‌తో యుద్ధం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా చిట్‌చాట్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇక కోలుకునే పరిస్థితి లేదని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. దక్షిణాదిలో పాత రాజకీయాలు పోయి కొత్త రాజకీయాలు రాబోతున్నాయన్నారు.

ఆర్టీసీ విషయంలో ప్రజలు, కార్మికుల దృష్టిలో కేసీఆర్‌ ఓడిపోయారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓవైసీ భూతం పట్టిందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్‌ను ఆ పార్టీ వ్యతిరేకించిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ, ఆ ఎన్నికకు ఇంకా టైం ఉందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నేతలు మురళీధరరావును సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement