
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ జేబు సంస్థలుగా మారాయని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఈ 2 పార్టీలకు దీటుగా తెలంగాణ, ఏపీల్లో బీజేపీ ప్రత్యా మ్నాయ శక్తిగా ఎదుగుతున్నదన్నారు. ఆదివారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ నడిపిస్తోందని ధ్వజమెత్తారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు టీఆర్‌ఎస్ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. ‘మిషన్’అనే పదంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కమీషన్ల కోసమేనన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ జేబులో పెట్టారన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాల అవినీతి, వైఫల్యాలపై త్వరలోనే ప్రజలముందు చార్జ్ షీట్ పెడతామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని, ప్రస్తుతమున్న సర్కారు ఎక్కువ రోజులుండదని జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉంటుందన్నారు. సమావేశంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment