
సాక్షి, హైదరాబాద్: పైకి బలంగా కనిపిస్తున్నట్టుగా ఉండే టీఆర్‌ఎస్ అధికారం కోల్పోతే ఉఫ్ అంటే గల్లంతవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ తెలంగాణ ఓబీసీ మోర్చా సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓబీసీ మోర్చా బలం వల్లనే కర్ణాటకలో మంచి ఫలితాలు సాధించిన బీజేపీకి తెలంగాణలో కూడా ఓబీసీ మోర్చా ప్రధాన బలం కావాలని సూచించారు. బీసీ కోటాలో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్‌లు కల్పించటం ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment