సాక్షి, రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ‘మన శక్తిని చూస్తే దుర్జనులకు భయం కలుగుతోంది. సమాజ శ్రేయస్సు కోరే సజ్జనుల్లో ప్రేమ పుడుతుంది’అని ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో దేశ భక్తి పెంపొందించేలా పని చేయాలని కరసేవకు లకు పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల మున్సి పాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ విజయ సంకల్ప శిబిరం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లా డుతూ..
సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వమే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. ప్రవర్తన, భాష, సమాజహితం కోరే ఆలోచ నలు స్వయం సేవకులకు ముఖ్యమని, వాటి ని తెలియజేసే విధానం కార్య విస్తర ణలో కీలకమని, వీటిని ఎప్పుడూ విస్మరించ కూడ దని చెప్పారు. శిబిరం, సార్వజనికోత్స వం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిం చారు. ఇదే స్ఫూర్తితో స్వయం సేవకులు తమ కార్య క్షేత్రాల్లో పని చేయాలని ఆకాంక్షించారు.
నేను చీఫ్‌ను కాదు..: ‘బయట నన్ను అందరూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అంటున్నారు. నేను మీకు చీఫ్‌ను కాదు. మీరు నియమించుకున్న వ్యక్తిని’అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దండాలు పెట్టడం, దండలు వేయడం, ఫొటో ఫ్లెక్సీలు పెట్టడం హిందూ సమాజ సంస్కృతి కాదని చెప్పారు. ఇతర సంఘాలకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు తేడా ఉందని, మనకంటూ ప్రత్యేకత
ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, హిందు సమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారతీయ సహసర్ కార్యవాహ్ ముకుందా, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యామ్‌కుమార్, దూసి రామకృష్ణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డీకే ఆరుణ, విజయ రామారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.
కార్యకర్తలతో కలసి భోజనం..
మోహన్ భాగవత్‌తో పాటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులకు కూడా ఒకే రకమైన భోజనం వడ్డించారు. అందరూ సాధారణ కార్యకర్తలతో కలిసే భోజనం చేశారు. ఆహార పదార్థాలు వృథా కాకుండా ప్రతి ఒక్కరు భుజించడం ప్రత్యేకంగా కన్పించింది. కాగా, శిబిరం ముగింపు కార్యక్రమం వేదికపై మోహన్ భాగవత్‌తో పాటు దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్‌చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి ఉన్నారు. అయితే మోహన్ భాగవత్ ఒక్కరే ప్రసంగించారు.
క్రమశిక్షణకు మారుపేరుగా..
మూడు రోజుల పాటు భారత్ కళాశాలలో సంఘ్ కార్యకర్తలు వసతి పొందారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన 7,940 స్వయం సేవకులు, మరో వెయ్యి మంది ప్రబంధకులు కలసిమెలసి ఉన్నారు. శిబిరం ముగియడంతో వారంతా తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ ప్రాంగణంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు చక్కటి నడవడిక, సమయ పాలన పాటించడాన్ని చూసి ఆహూతులు మంత్రముగ్ధులయ్యారు.
విజయ సంకల్ప శిబిరంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment