- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
- భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారం బీజేపీదేనని ధీమా
సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో వ్యవస్థలో మార్పునకు పునాదులు వేసే అంశాలు కేంద్ర బడ్జెట్‌లో ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ తీరుతెన్నులపై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి వచ్చిన రూ. 14 లక్షల కోట్ల పైచిలుకు డబ్బంతా వైట్‌మనీ కాదని, ఇందులోంచి పన్ను కట్టని వారిని గుర్తించే ఏర్పాట్ల వల్ల ప్రభుత్వానికి డబ్బు వచ్చి తీరుతుందన్నారు. దేశంలో రాజకీయాల ప్రక్షాళ న దిశగా బీజేపీ ముందుకు వెళుతోందని, ఇది తమ పార్టీ మాత్రమే చేయగలుగుతుందన్నారు.
తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో బీజేపీ దే అధికారమని, అవినీతి లేని ప్రభుత్వాన్ని బీజేపీ ఇవ్వగలదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకె ళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లోగా దేశంలో భారీగా మౌలిక సదుపా యాలు కల్పించిన ఘనతను మోదీ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మ ణ్ మాట్లాడుతూ ఇది అక్షరాలా పేదల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అభివర్ణించారు. సమావేశంలో పార్టీ నాయకులు చింతా సాంబ మూర్తి, డా. జి. మనోహర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేం దర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్‌లకు వివిధ జిల్లాల పసుపు రైతులు విజ్ఞíప్తి చేశారు. మద్దతు ధర పెంచేలా కేంద్ర ప్రభుత్వం దృíష్టికి తీసుకెళ్లాలని కోరారు. శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ నాయకులు జి. ప్రేమేందర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన రెడ్డి సమక్షంలో నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల పసుపు రైతులు ఈ మేరకు బీజేపీ నాయ కులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సంద ర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ పసుపు సహా ఇతరత్రా పంటల విషయం లో ఆదుకోవాలని కోరేవారు తమ ప్రాం తాల నుంచి బీజేపీని గెలిపించాలన్నారు.