న్యూఢిల్లీ: అధిక ప్రభుత్వ వ్యయాలు, సంకీర్ణ ప్రభుత్వ డిమాండ్లపై దృష్టి సారించినప్పటికీ మధ్యకాలానికి ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) తగ్గించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ఫిచ్ రేటింగ్స్ కితాబునిచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్ లక్ష్యాలను భారత్ విజయవంతంగా చేరుకోగలుగుతోందని తాజా నివేదికలో పేర్కొంది. తద్వారా ద్రవ్య విశ్వసనీయతను మెరుగుపరుచుగలుగుతోందని వివరించింది.
2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును తగ్గించుకోడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డివిడెండ్లను కేంద్రం వినియోగించుకోనుందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి ఆర్‌బీఐ రూ. 2.11 లక్షల కోట్ల మిగులు నిధులను బదలాయించిన సంగతి తెలిసిందే.
తోటి దేశాలతో పోల్చితే...నిరాశే..
కాగా, ‘‘బీబీబీ’’ కేటగిరి సావరిన్ రేటింగ్ ఉన్న తోటి దేశాలతో పోలి్చతే భారత్ ద్రవ్యలోటు, వడ్డీ: ఆదాయాలు–రుణ నిష్పత్తులు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయని ఫిచ్ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.16,13,312 కోట్లుగా (జీడీపీలో 4.9 శాతం కట్టడి అంచనా) ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. జూలై నాటికి రూ.2,76,945 కోట్లకు చేరింది.
ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతానికి కట్టడి జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. భారత్‌కు ఫిచ్ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్’ సావరిన్ రేటింగ్ ఇస్తోంది. ఇది ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment