
ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటోన్న అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ లేఆఫ్‌లను అమలు చేస్తోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ఇంజినీరింగ్ టెక్నాలజీ సెంటర్ నుంచి 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విమాన తయారీ సంస్థ భారత్ లో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.
బోయింగ్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. భారత్‌లో ఇటీవల 2024 డిసెంబర్ త్రైమాసికంలో జరిగిన తొలగింపులు ఇందులో భాగంగానే జరిగాయి. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అయితే వీటి ప్రభావం కస్టమర్లు, కార్యకలాపాలపై పెద్దగా ఉండదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
కంపెనీలో కొన్ని ఉద్యోగాలు తగ్గినప్పటికీ అదే సమయంలో సర్వీస్, సేఫ్టీ, నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కొత్త ఉద్యోగాలను కూడా కంపెనీ సృష్టించింది. బెంగళూరు, చెన్నైలోని బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) అధునాతన ఏరోస్పేస్ పనులను నిర్వహిస్తోంది. కంపెనీ బెంగళూరు క్యాంపస్.. యూఎస్ వెలుపల అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడులలో ఒకటి.
ఇదిలావుండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి 2029 నాటికి జర్మనీలో 7,500 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 2024లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు 23,382 మంది ఉద్యోగులను తొలగించగా, 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023లో అత్యధికంగా 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను తొలగించాయి.
Comments
Please login to add a commentAdd a comment