'కాంగ్రెస్‌కు మరో ఆభరణం దొరికింది'
న్యూఢిల్లీ: సోలార్ కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రలు ఎక్కుపెట్టింది. అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చాందీ మరో ఆభరణంగా మారిపోయారంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, కరప్షన్ పర్యాయపదాలుగా మారిపోయాయని ఆరోపించారు.
సోలార్ స్కాంలో చాందీ బాధ్యుడని తెలుస్తోందని ఆయన అన్నారు. 'కాంగ్రెస్ విముక్త కేరళ'ను ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారం నుంచి వేరుచేస్తే తప్ప ఆ పార్టీని అవినీతి నుంచి దూరం చేయలేమని మండిపడ్డారు. సోలార్ కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి కూడా ప్రమేయముందని వెలుగుచూడటం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.