సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గత ఆదివారం జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు చోటు కల్పించింది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. అయితే, ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర్‌రావును పక్కన పెట్టేయడంపై ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందు నుంచీ పార్టీకీ విధేయులుగా సేవలు చేస్తున్నవారిని ఎందుకు దూరం పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
(చదవండి: ఆపరేషన్ 2023)
మరోవైపు రామ్ మాధవ్, మురళీధర్‌రావుకు ప్రధాని మోదీ కేబినెట్‌లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకనే జాతీయ కార్యదర్శులుగా తప్పించానేది ఆ వార్తల సారాంశం. అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్న రామ్ మాధవ్‌కు విదేశాంగ శాఖ, వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్ రావుకు వాణిజ్య శాఖలు కేటాయిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్న ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం.
(చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ)
Comments
Please login to add a commentAdd a comment