సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని భారీ షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ను వీడగా.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు. తాజాగా మహబూబ్‌నగర్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. రామ్ మాధవ్‌తో దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్‌పై షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమిత్ షా హామీతో ఆమె ఢిల్లీ పయనమయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు సమక్షంలో అరుణ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమె మహబూబ్ నగర్ లోక్ సభ నుంచి ఎన్ని కల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీకే ఆరుణతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇప్పటికే చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment