కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభానికి తమ పార్టీ కారణం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయాలే కర్ణాటకలో సంక్షోభానికి కారణమని విమర్శించారు.