
సాక్షి, తూర్పుగోదావరి : కృష్ణా, గోదావరి నదుల్లో వచ్చే సుడి గుండాల మాదిరిగా పోలవరం ప్రాజెక్టుపై చర్చ నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. కాకినాడలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై ఎవ్వరికీ అనుమానం ఉండాల్సిన పని లేదన్నారు. పోలవరం నిర్మించే బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానిదని తెలిపారు. డబ్బుల కోసం వెనకాడకు అని చంద్రబాబు నాయుడికి చెప్పిన కారణంగానే పోలవరం ప్రాజెక్టు సాగుతోందన్నారు. టీ కప్పులో తుఫాన్లను చూసి నిజమైన తుఫాన్లు అనుకుని భ్రమపడవద్దని మురళీధర్ రావు హితవు పలికారు.