
వచ్చే ఎన్నికల్లో దక్షిణాది కీలకం
► బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
► తెలంగాణలో పూర్తి స్థాయిలో బలపడేందుకు కార్యాచరణ
► ఏపీలో పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది కీలకం కానుందని, అన్ని దక్షిణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బలపడేం దుకు క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తున్నట్లు పేర్కొ న్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరిం చారు. ఇప్పటి వరకూ బీజేపీ గెలవని 150 స్థానా లపై ప్రత్యేక దృష్టిసారించినట్టు వివరించారు. ఏపీ, తెలంగాణలో ఒంటరిగా బలపడేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు.
ఎన్నికలప్పుడే నిర్ణయం: ఏపీలో బీజేపీ ఒంటరిగా బలోపేతమయ్యేం దుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు మురళీధర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో త్వరలో పర్యటిస్తారన్నారు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయడమా లేక పోత్తులు పెట్టుకోవడమా.. లేదం టే ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకోవడమా అనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణలో బలపడేందుకు అస్త్రాలు..
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అన్ని ప్రయ త్నాలు చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతే తమ ప్రధాన అస్త్రమని, సరైన సమయం లో పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎంఐఎం అడుగులకు టీఆర్‌ఎస్ మడుగులొత్తు తూ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందని, తాము దాన్ని జరిపితీరుతామన్నారు. రాష్ట్ర పార్టీలో భారీ చేరికలు ఉంటాయని, బీజేపీకి జైకొట్టే వాళ్లందరినీ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. తమిళనాడు రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాక కేంద్ర కేబినెట్, బీజేపీలో మార్పులు ఉంటాయన్నారు. అప్పుడే పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలు జరుగుతాయన్నారు.