
సీమాంధ్ర ఉద్యమం వెనుక కాంగ్రెస్: బీజేపీ
సీమాంధ్రలో ఉద్యమానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు.
కరీంనగర్: సీమాంధ్రలో ఉద్యమానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు రాజకీయ పొత్తులపై ఇప్పుడేం చెప్పలేమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్‌లోనే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని అంతకుముందు మురళీధర్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమానికి సీఎం కిరణే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.