బిగ్‌షాక్‌; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు | Gangula Pratap Reddy Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

Published Thu, Aug 1 2019 8:52 PM | Last Updated on Thu, Aug 1 2019 9:04 PM

Gangula Pratap Reddy Joins BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి (నంద్యాల), పసుపులేటి సుధాకర్ (కావలి జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి), కంచర్ల హరిప్రసాద్ (రిటైర్డ్ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్), డి. వెంకయ్య (టీడీపీ చిత్తూరు ఓబీసీ సెల్ సెక్రెటరీ), సి. చంద్రప్ప(బిసి వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్- శ్రీకాళహస్తి) షేక్ నిజాముద్దీన్, మాజహర్ భేగ్ కమలం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో ఇతర పార్టీ నుంచి నాయకులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement