
అమిత్ షా పర్యటన వాయిదా: మురళీధర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో ఎన్టీఏ పక్షాల కీలక సమావేశం కారణంగా శుక్రవారం నాటి పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో మురళీధర్‌రావు మాట్లాడుతూ.. పార్ల మెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నాయకుల పర్యటనలూ వాయిదా పడ్డాయన్నారు.
షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడిందే తప్ప రద్దు కాలేదని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. కొన్ని ముఖ్య బిల్లుల విషయంలో ఎన్డీఏ పక్షాలను సమన్వయపరిచే బాధ్యతను షాకు ప్రధాని మోదీ అప్పగించడంతో పర్యటనలో మార్పు జరిగిందన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి షా తప్పకుండా వస్తారని, ఈ నెలలోనే కార్యక్రమం ఉంటుందన్నారు.