సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(పాత చిత్రం)
సత్తుపల్లి: రాజకీయ ఫిరాయింపులతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద భారం వేస్తున్న పార్టీలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సత్తుపల్లి మండలం రామనగరం గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి టీడీపీ ప్రజాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కలిసి వచ్చే శక్తులను కలుపుకుని తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించారు.
ఎన్నికలకు గడువు ఉన్నా ముందస్తు ఎన్నికలకు ఎందుకు ప్రయత్నిస్తుందో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజకీయ సేవ చేసే ప్రజా నాయకులకు పదవీ వ్యామోహం ఉండదు..ప్రజాసేవలోనే రాజకీయ నాయకుడికి తుది శ్వాస విడిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment