ఎమ్మెల్యేపై ‘పిడమర్తి’ విమర్శలా.?  | Criticizes on MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై ‘పిడమర్తి’ విమర్శలా.? 

Published Tue, Mar 27 2018 9:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Criticizes on MLA  - Sakshi

మాట్లాడుతున్న గొర్ల సంజీవరెడ్డి

సత్తుపల్లి : నియోజకవర్గ ఎల్లలే తెలియని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై విమర్శలు చేస్తే సహించేది లేదని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ ప్రజల సంక్షేమం పట్టించుకోని ప్రభుత్వాలకు భిన్నంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజా గొంతుకుగా మారి అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తుతూ ఎంతో మందికి మేలు చేశారన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఏమిటో గతంలో ఆయన వెంట తిరిగి రంగులు మార్చిన నేతలకు తెలుసన్నారు. మళ్లీ ఇక్కడే పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధించి.. పిడమర్తి రవికి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. నియోజకవర్గంలో తాగునీటి బోర్లు, సిమెంట్‌ రహదారులు ఏర్పాటు చేయించటమే కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో ఎమ్మెల్యే సండ్ర పాలుపంచుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మహేష్, నాయకులు కూసంపూడి రామారావు, ఎస్‌కే చాంద్‌పాషా, తడికమళ్ల ప్రకాశరావు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, దూదిపాల రాంబాబు, ఎస్‌కే మున్నీర్, చిల్లపల్లి చక్రవర్తి, మదీనాపాషా, రతికంటి గిరిగోవర్ధన్, మల్లూరు మోహన్, సత్యనారాయణ, కోటి, యునస్, కృష్ణ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement