'డ్రైవర్ల ఎంపికలోనూ జాగ్రత్త పడ్డారు' | sandra team carefull in selection of drivers | Sakshi

'డ్రైవర్ల ఎంపికలోనూ జాగ్రత్త పడ్డారు'

Jul 7 2015 12:59 PM | Updated on Aug 17 2018 12:56 PM

(ఫైల్) ఫోటో - Sakshi

(ఫైల్) ఫోటో

మోతీనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల చుట్టే ఈ వ్యవహారం జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది.

హైదరాబాద్ :  మోతీనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల చుట్టే ఈ వ్యవహారం జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే కీలక భేటీలు జరిగాయని, పార్టీ ఆఫీసు ముందు, క్యాంటీన్లలోనూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భేటీలు జరిగాయని రిపోర్టులో తేలింది. మొదటి మూడు రోజులు పక్కా ప్లాన్ చేసుకుని, మే 30 న రేవంత్ రెడ్డిని ఈ ఆపరేషన్ లోకి సండ్ర దించినట్లు రిపోర్టు కథనంలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏం చేసినా జనార్ధన్ అనే వ్యక్తికి సండ్ర, సెబాస్టియన్ అప్డేట్ చేసేవారు.
 
కొందరు వ్యక్తులను కలవడానికి టీడీపీ నేతలు క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ సాయం తీసుకున్నారు. రెండు పార్టీలు కలుసుకునే విషయంలో సండ్ర టీమ్ చాలా జాగ్రత్తులు తీసుకుంది. సులభంగా గుర్తుపట్టే అడ్రస్లు చెప్పాలంటూ సండ్ర సూచనలిచ్చేవారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టుపై సెబాస్టియన్ ఎస్ఎమ్ఎస్లు పంపేవాడని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement