రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ | dont give bail to revanthreddy, ACB in counter petition | Sakshi

రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ

Published Tue, Jun 23 2015 8:49 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలకదశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా విచారణాధికారి ముందు హాజరు కాలేదని ఏసీబీ తన పిటిషన్ లో పేర్కొంది. మరో నిందితుడు ముత్తయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హైకోర్టుకు విన్నవించింది. ఇటువంటి కీలక సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. విచారణకు ఆటంకం ఏర్పడుతుందని ఏసీబీ అధికారులు తమ కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement