Telugu Desam Party
-
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్‌కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్‌కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
ఉదయగిరి ఎమ్మెల్యే కర్ర సా(స్కా)ము
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ఎమ్మెల్యేలు సహజ వనరులను దోపిడీ ఘరూ చేశారు. ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్ మెటల్‌ను దోచేస్తున్న నేతలు తాజాగా అగ్రిగోల్డ్ భూములపై కన్నేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వందలాది ఎకరాల్లోని జామాయిల్ కర్రను అక్రమంగా నరికించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కార్యాలయం నుంచే అక్రమ దందా పర్యవేక్షణ జరుగుతుండడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా వారికి సహకరిస్తోంది. 450 ఎకరాల్లో అగ్రిగోల్డ్ జామాయిల్ తోటలుఉదయగిరి నియోజవర్గంలోని వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు మండలాల్లో సుమారు 450 ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములను ఆ సంస్ధ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంది. సంస్థ దివాలా తీయడంతో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భూముల్లో జామాయిల్, మామిడి, ఎర్ర చందనం, శ్రీగంధం తదితర మొక్కలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అందులో ఉన్న విలువైన సంపద చోరీ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో తెలుగుదేశం నాయకులు వరికంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న భాస్కరపురం, జంగం రెడ్డిపల్లి, కనియంపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా ప్రణాళికభాస్కరపురం రెవెన్యూలో 69 నుంచి 112 వరకు పలు సర్వే నెంబర్లలో సుమారు 140 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు బినామీ పేర్లపై ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా అగ్రిగోల్డ్ ఆస్తులుగా నమోదు కాలేదు. పైగా ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా అవి అగ్రిగోల్డ్ సంస్థకు చెందినట్లుగా తెలిపే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానికులకు, రెవెన్యూ అధికారులకు తప్ప మిగితా వారు ఆ భూములు గుర్తించలేరు. దీనిని ఆసరా చేసుకున్న ఒక అధికార ప్రజాప్రతినిధి రెవెన్యూ, పోలీసు అధికారులను మ్యానేజ్ చేశారు. ఎవరైనా ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులను అడిగితే అవి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు అని చెప్పి తప్పించుకుంటున్నారు. విషయం తెలిసిన స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసుల పేరుతో భయపెడుతున్నారు.తరలుతున్న సంపదవరికుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న అగ్రిగోల్ట్ భూముల్లో సుమారు 12,500 టన్నుల వరకు జామాయిల్ కర్ర ఉందని అంచనా. ప్రస్తుతం టన్ను జామాయిల్ రూ.8 వేలు వరకు విక్రయిస్తున్నారు. దీంతో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే కర్రను గత వారం రోజుల నుంచి నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి నాలుగు ముఠాలను రప్పించి రోజువారీగా నరికిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులుఅగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కలప నరికివేత విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేత ఒకరు ప్రశ్నించగా పోలీస్ తరహాలో బెదిరింపులు వెళ్లాయి. ఈ విషయం వెలుగులోకి తెచ్చినా, అడ్డుకున్నా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తాజాగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచే పర్యవేక్షణ జరుగుతుండడంతో పాటు పది రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం అధికారులను, నాయకులను మ్యానేజ్ చేసుకుని పక్కాగా జామాయిల్ కర్రను నరికించేసి విలువైన సంపదను దోచుకుంటున్నారు. -
‘కోటి’ మాయల మెంబర్షిప్
సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రలోభాలు, బలవంతాలు, మాయమాటలు, బెదిరింపులు.. అధికార తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల వెనుక తతంగమిది. ప్రజల్ని మాయ చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఆడిన మరో మాయ నాటకమిది. ఈ కోటి సభ్యత్వాల వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని మూడు నెలలుగా టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం సాగించిన దందా దాగి ఉంది. ఓ పక్క బీమా ఆశ చూపించడం, మరోపక్క పథకాలు ఆగిపోతాయన్న బెదిరింపులు, ఇంకోపక్క మాయమాటలు.. ఇలా సభ్యత్వాలన్నీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించినవేనని టీడీపీ నేతలే చెబుతున్నారు.టీడీపీ సభ్యత్వం (TDP Membership) తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా ఉంటుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. సభ్యత్వాల నమోదు ప్రారంభానికి ముందే చంద్రబాబు గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఈ బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాని గురించి ప్రచారం చేయడంతోపాటు ప్రతి గ్రామంలోని ఓటర్లలో 80 శాతం మందిని సభ్యులుగా చేర్చాలని నేతలపై ఒత్తిడి చేశారు. సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా రూ.5 లక్షల బీమా వస్తుందని ప్రజల్ని నమ్మించారు. సభ్యత్వం ఉంటేనే పథకాలని బెదిరింపులు మరోపక్క టీడీపీ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయని, లేకుంటే రావని ఇంటింటికీ తిరిగి బెదిరింపులకు దిగారు. ప్రజల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని పేర్లు రాసేసి, సభ్యత్వ రుసుము రూ.100 కూడా నాయకులే కట్టేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం సభ్యత్వాలు అయ్యాయో విశ్లేషిస్తూ తగ్గిన నియోజకవర్గాల నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు పలుసార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి తక్కువ సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు గ్రామాలు, వార్డుల్లో తిష్టవేసి బలవంతంగా సభ్యత్వాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా 80, 90 శాతం ఓటర్లను తమ సభ్యులుగా చేర్పించేశారు. ముచ్చర్లలో బయటపడిన బాగోతం విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో ఏకంగా గ్రామంలోని వంద శాతం ఓటర్లను సభ్యులుగా నమోదు చేశారు. వంద శాతం సభ్యత్వ నమోదు జరిగిన గ్రామంగా ముచ్చర్లను ప్రకటించి సీఎం తనయుడు లోకేశ్‌తో అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి సభ్యత్వాల లోగుట్టును వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ బయటపెట్టడంతో లోకేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముచ్చర్ల ఈనాం అన్ సెటిల్డ్ గ్రామం కావడంతో అక్కడున్న 600 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి, గ్రామస్తుల ఆధార్ కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించినట్లు బయటపడింది.నిజానికి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులంతా వైఎస్సార్సీపీకి చెందినవారు. ఆ గ్రామంలో సుమారు 1,350 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 600కిపైగా ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి గ్రామంలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వాల నమోదు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం కరువైంది. అందుకే ఆ గ్రామానికి రాకుండా లోకేశ్ జారుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే రీతిలో టీడీపీ శ్రేణులు బోగస్ సభ్యత్వాలు చేయించారు.వైఎస్సార్ బీమాను పణంగా పెట్టి..మరోవైపు టీడీపీ సభ్యత్వాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరికీ అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని ప్రతి ఒక్కరితో వలంటీర్లు ఈ బీమాకు దరఖాస్తు చేయించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనే చనిపోతే నేరుగా వారి ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ అయ్యేది. మృతుని కుటుంబానికి తక్షణం రూ.10 వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేసి, టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు. వైఎస్సార్ బీమా లేదు కాబట్టి ఇదైనా వస్తుందనే ఆశతో చాలామంది తప్పనిసరై సభ్యత్వం తీసుకున్నారు. కానీ, ఎవరికీ బీమా వర్తించడంలేదు. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన ఆరేపల్లి సత్యనరేంద్ర వరప్రసాద్ (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. వైఎస్సార్ బీమా ఉంటే అతనికి రూ.5 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పరిహారం అందక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీమా పేరుతో టీడీపీ చేస్తున్న మోసపూరిత సభ్యత్వ నమోదుకు ఇదో నిదర్శనం. -
పాత స్నేహితుడిని అరెస్ట్ చేయించిన మంత్రి సుభాష్
సాక్షి టాస్క్‌ఫోర్స్: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వ్యక్తిని ఆ మంత్రి పండగ రోజుల్లో కటకటాలు లెక్కించేలా చేశారు. ఆ వివరాలివీ.. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో మంచి స్నేహితుడు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మండపేటలో చంద్రబాబు నిర్వహించిన శ్రీరా..కదలిరా..శ్రీ సభలో సుభాష్‌తో పాటు మేడిశెట్టి ఇశ్రాయేల్ కూడా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో సుభాష్ రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత దొంగల బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ.. అటు టీడీపీకి, ఇటు శెట్టిబలిజ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఇశ్రాయేల్ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలకు వివరించేవారు. శెట్టిబలిజ పెద్దలకు మెదడు మోకాళ్లలో ఉందంటూ.. రామచంద్రపురంలోని శెట్టిబలిజ సామాజిక భవనానికి తొలిసారి వచ్చిన సందర్భంగా మంత్రి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కులానికి సుభాష్ క్షమాపణ చెప్పాలని ఇశ్రాయేల్ డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మంత్రి సుభాష్ ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఇసుక దొంగతనాలు, సెటిల్మెంట్ల వంటి వాటికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తూనే, ఆ పార్టీ అగ్రనాయకులను ఇశ్రాయేల్ నేరుగా కలసి ఫిర్యాదులు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నుంచి నేరుగా హెచ్చరికలు రావడంతో తన ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్‌ను మంత్రి దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సుభాష్‌కు ఇశ్రాయేల్ మెయిన్ టార్గెట్ అయిపోయారు. దీంతో తాళ్లపొలం గ్రామానికి చెందిన భూ వివాదం ఆధారంగా ఇప్పటికే అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి ఎస్సీ, ఎస్టీ కేసు. అలాగే, బైకులు, చిల్లర దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి సినీఫక్కీలో తాళ్లపొలంలో స్కూటర్ తగులబెట్టించి, ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్, ఆయన కుమారులతో పాటు ఇశ్రాయేల్‌ను ఇరికించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలను వెంటపెట్టుకుని ఇశ్రాయేల్, తాళ్లపొలం సర్పంచ్‌లు ఈ నెల 10న అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తమను తప్పుడు కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. శనివారం రామచంద్రపురానికి కొత్త సీఐ బాధ్యతలు చేపట్టారు. శ్రీసీఐ గారు మాట్లాడి పంపించేస్తారశ్రీని చెప్పి ఇశ్రాయేల్‌ను అదే రోజు సాయంత్రం తీసుకుని వెళ్లిన పోలీసులు అతడిపై కొత్త కేసులు నమోదు చేసి అర్ధరాత్రి సబ్ జైలుకు తరలించారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలపై తప్పుడు కేసులు మోపి, జైలు పాలు చేస్తున్న అదే వర్గానికి మంత్రి సుభాష్ వైఖరిపై ఆ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు. -
నిన్న బూడిద.. నేడు కాంక్రీట్ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నిన్నటికి నిన్న బూడిద కోసం కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాంక్రీట్ పంచాయితీలోనూ ఇరుక్కున్నారు. ఆర్టీపీపీ నుంచి సిమెంటు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే ఫ్లైయాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానా యాగీ చేసి చివరకు పార్టీ నుంచి ఎలాంటి సహకారమూ లేకపోవడంతో సర్దుకున్నారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ‘కాంక్రీట్’ కంపెనీని చేజిక్కించుకోవడానికి ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిoచడం చర్చనీయాంశమైంది. ప్లాంటు నాకు ఇచ్చేయాలి.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం మక్కాజిపల్లి తండా వద్ద ఆర్ఎంసీ (రెడీమిక్స్ కాంక్రీట్) ప్లాంటు ఉంది. దీని నిర్వాహకులు కొన్నేళ్లుగా చిన్న చిన్న ఆర్డర్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఓ మంత్రి కన్ను ఈ ప్లాంటుపై పడింది. ‘నీకు ఎంతో కొంత ఇస్తా.. ప్లాంటు ఇచ్చేసి వెళ్లిపో’ అంటూ ఓనర్‌ను మంత్రి బెదిరించడం మొదలుపెట్టారు. ప్లాంటు యజమాని ప్రాధేయపడినా మంత్రి కనికరించలేదు. ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ప్లాంటుకు ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలకు ఫోన్ చేసి.. సరుకు ఇవ్వొద్దని, లారీలు తిప్పొద్దని హుకుం జారీ చేశారు. ముడిసరుకుతో వస్తున్న లారీలను మంత్రి అనుచరులు నిలిపివేశారు. తమ ప్లాంటుకు వచ్చే లారీలను ఆపుతున్నారంటూ స్థానిక కియా పోలీస్ స్టేషన్లో యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మంత్రి బెదిరింపులు పెరిగిపోవడంతో ఆ ప్లాంటు యజమాని విధిలేని పరిస్థితుల్లో మంత్రితో తీవ్ర రాజకీయ విభేదం ఉన్న అదే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రజాప్రతినిధికి ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం కల్పిస్తూ అగ్రిమెంటు చేసుకున్నారు. దీంతో మంత్రి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చిన్న పరిశ్రమలనూ వదలడం లేదు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అన్ని వ్యాపారాలు, మైన్లు, పరిశ్రమలను చేజిక్కించుకునేందుకు వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలనూ వదలడం లేదు. గుడ్‌విల్, కమీషన్లు ఇవ్వాలని, లేదంటే వాటిని అప్పగించి వెళ్లిపోవాలంటూ వేధిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, అపార్ట్మెంట్లకు పునాది వేసినా గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులకూ స్థానిక ఎమ్మెల్యేకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు నెలలుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. -
మఠం నిర్వాహకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు దాడులు, దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నదీతీరంలో మఠం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్న స్వామిపై దాడిచేశారు. దారి ఆక్రమిస్తుండటాన్ని ప్రశ్నించినందుకు రాడ్డుతో తలపగులగొట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం ఏపీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడు మహేంద్రస్వామి తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన మహేంద్రస్వామి స్వర్ణముఖినది ఒడ్డున నిజరూపమఠం ఏర్పాటు చేసుకున్నారు. మఠం పక్కన నది వెంబడి ఉన్న దారిని శనివారం విజయ్‌కుమార్ అనుచరులు ఆక్రమించుకుని యంత్రాలతో పనులు చేపట్టారు. ఈ ఆక్రమణను మహేంద్రస్వామి ప్రశ్నించారు. తమ నాయకుడు ఊకా విజయ్‌కుమార్ చెబితేనే పనులు చేస్తున్నామని, అడగడానికి నువ్వు ఎవడివి అంటూ వారు దురుసుగా చెప్పారు. వెంటనే వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మహేంద్రస్వామి వెళ్లకపోవడంతో రాడ్లతో దాడిచేసి తలపగులగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి మహేంద్రస్వామిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు కుట్లువేశారు. టీడీపీ వస్తే దాడులు చేస్తున్నారు తెలుగుదేశం అ«ధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని మహేంద్రస్వామి ఆవేదనతో చెప్పారు. గతంలోను ఊకా విజయ్‌కుమార్ పలుమార్లు తనపై దాడిచేసినట్లు తెలిపారు. గతంలో తన పళ్లు రాలగొట్టారని, పలుమార్లు రుయా ఆస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. న్యాయం చేయకపోతే తాను మరణించినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ కబ్జాలు, దౌర్జన్యాలు జరగలేదని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అవి పెరిగాయని చెప్పారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరతానని తెలిపారు. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆయన చెప్పారు. -
టీడీపీ నేతల అరాచకం
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్మార్గానికి తెగబడ్డారు. భార్యాభర్తల గొడవ విషయంలో తల దూర్చి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాత్రివేళ అపార్ట్మెంట్లోని ఇంట్లోకి చొరబడి మూకుమ్మడిగా దాడి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ హల్చల్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో కలెక్టరేట్ వెనుక ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. నగరంలో రామానాయుడుపేటకు చెందిన టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుమార్తెకు గాంధీనగర్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నూకల బాబూరావు కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వివాహమైన కొంతకాలానికి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ వివాదంపై కోర్టులో కేసు నడు స్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకుడు వాడపల్లి మహేష్ కుటుంబ సభ్యులు, కొంతమంది టీడీపీ డివిజన్ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో కలిసి బాబూరావు ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. బాబూరావు కుటుంబ సభ్యులను దుర్భాషలాడటంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ దొరకకూడదని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొన్ని సీసీ కెమెరాల్లో నాయకులు అపార్ట్మెంట్లో ప్రవేశించటం, బయటకు వెళ్లటం మాత్రం రికార్డు అయింది. ఘటన అనంతరం బాబూరావు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలు స్తోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకపోవటంతో బుధవారం ఉదయం అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారంతా ఎస్పీ ఆర్.గంగాధరరావును కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు సమాచారం. అయితే ఈ కేసును చిలకలపూడి సీఐకు రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులో పోలీసులు నాయకుల పేర్లు తప్పించి ఒకరిద్దరి పేర్లు నమోదు చేస్తామని బాధితులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై చిలకల పూడి సీఐ అబ్దుల్ నబీని ‘సాక్షి’ వివరణ కోరగా బాధితులు ఘటన విషయం చెప్పారని, అయితే ఇంతవరకు ఫిర్యాదు అందలేదని, అందిన వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు. -
అమరావతిలో భూమాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ.. ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.అక్రమంగా లబ్ధి పొందేందుకే..! అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇదీ పాత కథ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది. తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది. అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.ఆ భూములకు రైతులే లేరు సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు -
మీపైనా పెట్రోల్ పోసి తగలబెడతాం
సాక్షి, నంద్యాల: అధికారం అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా విచక్షణ రహితంగా హత్యకు తెగించారు. ఇష్టానుసారం దాడులకు పాల్పడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ‘అడ్డు వస్తే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం..’ అంటూ పోలీసులను సైతం బెదిరించారు. సీతారామాపురం గ్రామంలో టీడీపీ ముఖ్యనేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సుమారు 30 మంది అనుచరులతో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించిన తీరు నివ్వెర పరుస్తోంది. ‘రెడ్డిబుక్’ పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటలకు శ్రీనివాసరెడ్డి సమీప బంధువైన బుడ్డారెడ్డి గారి పెద్దిరెడ్డి ఇంట బీభత్సం సృష్టించారు. శేఖర్‌రెడ్డి ముందుండి దౌర్జన్యకాండను నడిపించాడు. పెద్దిరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి లక్ష్మిదేవిని దుర్భాషలాడుతూ దాడి చేశారు. వాడు (పెద్దిరెడ్డి) ఎక్కడున్నాడో చెప్పండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తామని హెచ్చరించారు. ఇంట్లోనే ఉన్న ఆమె కుమార్తె పద్మజపైనా చేయి చేసుకున్నారు. వాడిని వదిలేసే ప్రసక్తే లేదని, కచి్చతంగా చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ పెద్దిరెడ్డి ఇంటి నుంచి బయటికి వచ్చారు. తర్వాత 12 గంటల ప్రాంతంలో పల్లపు శేఖర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో శేఖర్ ఇంట్లో లేడు. ఆయన తండ్రి పల్లపు సుబ్బరాయుడు పెరాలసిస్‌తో బాధ పడుతున్నాడు. మంచంలో ఉన్న అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లి పడేశారు. ఇంటి ముందున్న బైక్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత 12.20 గంటలకు పసుపులేటి సుబ్బరాయుడు ఇంటికి శ్రీనివాస్‌రెడ్డి, మరో 30 మంది వెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య పసుపులేటి బాలసుబ్బమ్మ సోపాలో పడుకుని ఉంది. ఆమెను బలవంతంగా బయటికి లాక్చొచ్చారు. భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు గట్టిగా తట్టడంతో ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రోడ్డు మీదకు లాక్కొచ్చి మరోసారి కొడవలి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తలకు దెబ్బలు తగలడంతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు. చనిపోయాడనుకుని వెళ్లిపోతూ.. మళ్లీ వెనక్కి వచ్చి పరీక్షించి చూశారు. ‘వీడు చావలేదు’ అంటూ పక్కనే ఉన్న బండరాయితో తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న రెండో కుమారుడు జమాలయ్య, మూడో కుమారుడు నాగ ప్రసాద్‌తో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్లను చంపేందుకు ప్రయతి్నస్తే వాళ్లు తప్పించుకుని పారిపోయారు. దీంతో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదని ఈ ఐదేళ్లలో అందరినీ అంతమొందిస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. పోలీసులకూ హెచ్చరిక సుబ్బరాయుడిని హత్య చేసే సమయంలో మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ముఠాకు వారు నచ్చజెప్పేందుకు ప్రయతి్నంచగా.. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. లేదంటే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం’ అని హెచ్చరించారు. వారిని పక్కకు తోసేసి ముందుకెళ్లారు. కాగా, దాడిలో గాయపడిన పసుపులేటి బాలసుబ్బమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడి మృతదేహాన్ని ఆదివారం ఉదయం 7.30 గంటలకు పోస్టుమార్టం కోసం నంద్యాలకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మిరెడ్డి, బుడ్డారెడ్డి శేఖర్‌రెడ్డి, వంగాల పుల్లారెడ్డి, కంటరెడ్డి భరత్‌రెడ్డి, తాలూరి శ్రీనివాస్, మరికొంత మందిపై హత్య, హత్యాయత్నం, ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలి్పంచడం తదితరాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.టీడీపీకి ఓటెయ్యలేదని చంపేశారు నా భర్త సుబ్బరాయుడు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి మాపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి 30 మంది టీడీపీ గూండాలు మా ఇంటి వద్దకు వచ్చి బయట నిద్రిస్తున్న నన్ను లేపి నీభర్త ఎక్కడున్నాడు అని అడిగారు. లేడని చెప్పడంతో నాపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. చేతిని కత్తితో నరికారు. ఇంట్లోకి దూసుకెళ్లి నిద్రిస్తున్న నా భర్తను నడిరోడ్డుపై పడేసి ఇష్టం వచ్చినట్లు కర్రలతో, రాళ్లతో, కత్తులతో దాడి చేశారు. నా భర్త తలపై పెద్ద బండరాయి వేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడినా వినిపించుకోలేదు. – పసుపులేటి బాలసుబ్బమ్మ (మృతుడి భార్య)ఊళ్లో భద్రత కరువైంది వైఎస్సార్సీపీకి ఓటు వేసినందుకు మా ఇంటిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. బయట నిద్రిస్తున్న మా తల్లి బాలసుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లో నిద్రిస్తున్న మా నాన్నను దుర్భాషలాడుతూ బయటకు లాక్కెళ్లారు. రోడ్డుపై పడేసి కొడవళ్లు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. పథకం ప్రకారం కొట్టి హతమార్చారు. ‘మాకు వ్యతిరేకంగా చేస్తారా.. మీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ఊళ్లో అందరికీ భద్రత కరువైంది. – జమాలయ్య, మృతుడు సుబ్బరాయుడు కుమారుడు -
టీడీపీ నేతల వేధింపులు తాళలేక ‘అంగన్వాడీ’ ఆత్మహత్యాయత్నం
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసన.. అంగన్వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడికాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదుసామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్‌ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. -
టీడీపీ సమర్పించు కేబుల్ వార్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ సమర్పించు ‘కేబుల్ వార్’ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. సంపాదనే పరమావధిగా, పార్టీ అండ చూసుకొని నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలపై ఆధిపత్యం కోసం నల్లపాటి, కోడెల వర్గీయులు పోరుకు కాలు దువ్వుతున్న తీరు ఆ పార్టీలో కాక రేపుతోంది. తండ్రి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 2016లో కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి తన పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా కేబుల్ ఆపరేటర్లను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అండతో కేబుల్ ప్రసారాలు ప్రారంభించిన నల్లపాటి రాము కూడా విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎన్సీవీ కేబుల్ వైర్లను కత్తిరించి అగ్గి రాజేశారు. ఈ వ్యవహారంతో నల్లపాటి వర్సెస్ కోడెల వర్గీయులు మరోమారు ఘర్షణకు దిగడంతో ఇరువర్గాలపై కేసుల నమోదు వరకు వ్యవహారం వెళ్లింది.ఎన్‌సీవీపై దాడి చేసి కబ్జా...ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నల్లపాటి రామచంద్రప్రసాద్(రాము) నరసరావుపేట నియోజకవర్గంలో నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) పేరిట ప్రసారాలను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతినెలా రూ. లక్షల్లో ఆదాయం వస్తుండటంతో 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివరాం కేబుల్ వ్యవస్థను తన గుప్పెట్లో తీసుకునేందుకు కుట్ర పన్నారు. తన అనుచరులతో అప్పుడు వైఎస్సార్ సీపీలో ఉన్న నల్లపాటి రాముపై దాడి చేయడంతోపాటు ఎన్సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకొన్న శివరాం రాజాగారి కోటలోని తన ఇంటి నుంచి కే–ఛానల్ పేరిట కేబుల్ కార్యకలాపాలు నిర్వహించారు. జీసీటీవీ కార్యాలయాన్నీ ధ్వంసం చేసి ఆ వ్యవస్థను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించినా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు, పరిహారం లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దారుఅగ్రవర్ణ వ్యక్తి ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు...కే–ఛానల్లో భాగస్వామి అయిన విజయవాడకు చెందిన గన్నపనేని నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదుతో నల్లపాటి వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని నల్లపాటి రామచంద్రప్రసాద్ దీనిపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఓ వైపు నా కేబుల్ వ్యవస్థను నాశనం చేస్తూనే, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయిన తనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారట. ఈ కేసు నమోదు వ్యవహారంలో కోడెల శివరాం తెరవెనుక ఉండి చక్రం తిప్పారనే చర్చ పేటలో నడుస్తోంది.మరోసారి పట్టు కోసం పోరు.. తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే...తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకులు కేబుల్ వ్యవహారంలో పోరుకు దిగడం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు సంకటంగా మారింది. ఎటూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండటంతో చేతులెత్తేశారు. అయితే ఎన్నికల ముందు కేబుల్ వ్యవస్థను అప్పగిస్తానని నల్లపాటి రాముకు ఆయన హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల అనంతరం ఎన్సీవీ కేబుల్ ప్రసారాలను ప్రారంభించారు. కోడెల శివరాం మాత్రం కేబుల్ వ్యవస్థ తనకే కావాలంటూ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ఎవరికి సర్దిచెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 2016లో కేబుల్ అధిపత్యంలో జరిగిన పోరులో పెద్ద ఎత్తున ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యక్తిగత దాడులు జరిగాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉండి మరోసారి పోరుకు సిద్ధమవుతుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందన్న ఆందోళన టీడీపీలో నెలకొంది.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లపాటి రాము నియోజకవర్గంలో కేబుల్ ప్రసారాలను రెండు నెలలుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు మద్దతు తెలపడంతో ప్రస్తుతం రాముకు చెందిన ఎన్సీవీ కేబుల్ ప్రసారాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని కోడెల శివరాం భాగస్వామి నరసింహారావు తన సిబ్బందితో ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు అంతరాయం కలిగించారట. గత శుక్రవారం అరండల్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎన్‌సీవీకి చెందిన కేబుల్ వైర్లను కోడెల వర్గానికి చెందిన కొందరు కత్తిరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్సీవీ సిబ్బంది అక్కడికి చేరుకొని వైర్ల కత్తిరించిన ముగ్గురు యువకులను పట్టుకుని కార్యాలయానికి తరలించారు. యువకులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని విడిపించారు. -
తెలంగాణలో బాబు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం ప్రారంభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడిన విధంగానే ఇక్కడ బీజేపీతో కలిసి నాలుగు స్తంభాలాట ఆడాలనేది చంద్రబాబు వ్యూహమని, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని నిర్వీర్యం చేయలేరని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బి.లింగం యాదవ్, గజ్జి భాస్కర్లతో కలసి ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్ ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయినా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు విభజన సమస్యల పేరుతో మళ్లీ హైదరాబాద్‌లో బాబు ప్రవేశించారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సమరి్థంచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, హైటెక్‌సిటీకి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని, ఇప్పుడు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిన అభివద్ధినే బాబు, కేసీఆర్ కొనసాగించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజుయుద్ధం చేసి గెలిచినట్టు సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ ప్రజలు గెలిపించి తనను రాజును చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
సీనియర్లకు నిరాశే
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశ కలిగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. గంటా, అయ్యన్నకు దక్కని పదవులు ఉమ్మడి విశాఖ జిల్లాలో సూపర్ సీనియర్లయిన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యన్నారాయణమూర్తిని పక్కనపెట్టి జూనియర్ అయిన వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్, మరో నేత సంధ్యారాణిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి మాత్రమే మంత్రి పదవి దక్కగా కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్లకు మొండిచేయి చూపారు. తూర్పులో జనసేనకు ప్రాధాన్యం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ప్రాధాన్యత లభించింది. ఆ జిల్లా నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ మంత్రులయ్యారు. టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కి అనూహ్యంగా మంత్రి పదవి లభించింది. ఈ జిల్లకే చెందిన సీనియర్లు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై టీడీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా అనుకున్నట్లుగానే నిమ్మల రామానాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఈ జిల్లాలో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు పార్టీలోకొచ్చి మంత్రి అయిన పార్ధసారథి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య వంటి వారికి కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచిన కె. పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం గమనార్హం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబుకు నిరాశ తప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏలూరి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికీ అవకాశం రాలేదు. సీమలో సీనియర్లకు మొండి చేయి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరిక్కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని నిరాశకు లోనయ్యారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజుల రెడ్డి మంత్రి పదవులు ఆశించగా, మండిపల్లి రామప్రసాద్రెడ్డికి పదవి ఇచ్చారు. కర్నూలు జిల్లా నుంచి సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి మొండిచేయి చూపారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా వచ్చిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. సుజనా చౌదరికి ఎదురు దెబ్బ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. గతంలో చంద్రబాబు కోటరీలో కీలక నేతగా ఉండి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన్ని చంద్రబాబు కాదనలేరనే చర్చ జరిగింది. కానీ బీజేపీలోని ప్రధాన వర్గం, టీడీపీలోని మరో వర్గం ఆయన్ని వ్యతిరేకించడంతో మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి పొందలేకపోవడం సుజనాకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఉత్తరాంధ్రకు తగ్గిన ప్రాధాన్యం మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యం లభించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మంత్రి పదవుల్లో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలకు కలిపి నాలుగు పదవులే దక్కాయి. ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఒక్కరికే అవకాశం రాగా, విజయనగరం జిల్లాలో మాత్రం ఇద్దరికి అవకాశం లభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు మూడు చొప్పున మంత్రి పదవులు లభించాయి. విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెండేసి చొప్పున పదవులు ఇచ్చారు. శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు జిల్లాలకు ఒకటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. జనసేనకు మూడే జనసేన తరఫున నలుగురైదుగురికి మంత్రి పదవులు లభిస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ మూడు మాత్రమే దక్కాయి. జనసేన నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు మాత్రమే అవకాశం దక్కింది. దీంతో మంత్రి పదవులు ఆశించిన కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, పులపర్తి రామాంజనేయులు అసంతృప్తిలో ఉన్నారు. -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
మంత్రులుగా అనిత, పల్లాకు చాన్స్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో అమాత్య యోగం సీనియర్లకు దక్కే సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో తమకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సీనియర్లకు నిరాశే ఎదురుకానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఎస్సీ, బీసీ కోటాలో ఇద్దరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎస్సీ కోటాలో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనితతో పాటు గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావులకు బీసీ (యాదవ) కోటాలో మంత్రి హోదా దక్కనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వీరిద్దరికీ కూడా సమాచారం అందినట్టు ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, అయ్యన్న మాత్రం పట్టువదలకుండా తనకు మంత్రి పదవి కావాల్సిందేనని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఇక జనసేన తరపున అనకాపల్లి నుంచి గెలుపొందిన కొణతాల రామకృష్ణ పోటీలో ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. అయితే ఆయనకు కష్టమేనని తెలుస్తోంది.సీనియర్లను పక్కన పెట్టి...మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీగా సీట్లను సాధించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీ నుంచి మినహా మిగిలిన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మంత్రి పదవుల కోసం భారీగా పోటీ నెలకొని ఉంది. అయితే ఈ సారి మంత్రి వర్గంలో తన మార్క్ స్పష్టంగా కనిపించేందుకు వీలుగా పూర్తిస్థాయిలో సీనియర్లను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్లగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్యన్న, బండారులను పరిగణనలోనికి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఇందులో బండారు, గంటాలకు సీటు కేటాయించే సమయంలోనే మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అయ్యన్నకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే సీనియర్లను పక్కన పెట్టే ఉద్దేశంతో శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడుకు ఇవ్వడం లేదని సమాచారం. ఇదే కోవలో ఇక్కడ కూడా అయ్యన్న పాత్రుడిని పరిగణనలోనికి తీసుకోవడం లేదని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో కాకుండా మరో విధంగా గౌరవం కల్పిస్తానని అయ్యన్నను బుజ్జగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా సీనియర్లను పక్కన పెట్టి తన మార్క్ పూర్తిస్థాయిలో ఉండే విధంగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు మాత్రం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.జనసేనలోనూ పోటా పోటీ...జనసేన నుంచి కూడా మంత్రి పదవుల కోసం పోటీ నెలకొని ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన కొణతాలతో పాటు పంచకర్ల, సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే యాదవ సామాజికవర్గం నుంచి పల్లాకు బెర్తు ఉండటంతో వంశీకృష్ణకు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు మొదటిసారిగా గెలిచిన సుందరపు విజయ్‌కుమార్‌కు కూడా కష్టమేనని సమాచారం. ప్రధానంగా కొణతాలతో పాటు పంచకర్ల రమేష్‌బాబుల మధ్య పోటీ ఉంది. అయితే గవర సామాజికవర్గానికి చెందిన కొణతాల వైపే పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కాపు కోటాలో పంచకర్ల కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు ఎవరికి యోగం వరించనుందో మరో రెండు, మూడు రోజుల్లో తేలనుంది. మొత్తంగా అధికారపక్షంలో అమాత్యుల కోసం భారీగా పోటీ నెలకొని... ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. -
అసైన్డ్ భూములపై రామోజీవి రోత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు. తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. -
పల్నాడుపై పగబట్టిన బాబు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చావు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నాడులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్లో మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీసులేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
టీడీపీ దిగజారుడు రాజకీయం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు ఈస్ట్: ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి, వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించాలన్న కుట్రతో మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న మహిళలతో నామినేషన్లు వేయించారు. మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో ఓ దళిత మహిళ పేరిట నామినేషన్ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆ దళిత మహిళ స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది.గుంటూరు పశ్చిమలో కుట్ర బెడిసి కొట్టిందలా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరిట నామినేషన్ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడదల రజిని ఇంటికి వెళ్లి నామినేషన్ వేసేలా ప్రలోభ పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పొటు సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసే వరకూ తమతోనే ఉండాలని, స్కూృటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేళంగిణి మాత టెంపుల్‌కు పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకూ అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెను తీసుకువెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్మెంట్లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లడాన్ని చూసిన మహిళ తండ్రి దేవరాజ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథం, సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీసు స్టేషన్ ముందు హడావుడి చేశారు. అప్పటికే ఆమె నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్న టీడీపీ నాయకులు ఆమె తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న వైఎస్సార్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, లీగల్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఝాన్సి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, ఇతర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని దళిత మహిళ రజినిని కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న దళిత మహిళఈ రాజకీయాల్లోకి తనను లాగొద్దని దళిత మహిళ విడదల రజిని కోరారు. ఈమేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్ వేయడం ఇష్టంలేదని, టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.మంగళగిరిలో ఇద్దరు లావణ్యలతో నామినేషన్లుఈసారి మంగళగిరిలో గెలుస్తానంటూ లోకేశ్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఆయనపై రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ వర్గాలకు చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి ముందే ఖాయమైపోయింది. దీంతో ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు అదే పేరు ఉన్న మరో ఇద్దరు మహిళలతో ఇండిపెండెంట్లుగా చివరిరోజున నామినేషన్లు వేయించారు. వీరిలో ఓ మహిళ ఇంటిపేరు కూడా మురుగుడే కావడం గమనార్హం. రాజీవ్ గృహకల్పలో ఉండే బంగారం పని చేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్య గురువారం నామినేషన్ వేశారు. లావణ్య అనే పేరుతో ఉన్న మరో మహిళతో కూడా నామినేషన్ వేయించారు. -
అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్ విజన్.. ట్రాన్స్ఫార్మింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలుగెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది.ఏపీలో అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది.సీఎం జగన్ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.చరిత్ర ఎరుగని దుర్మార్గపు దాడి..ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై గత ఐదేళ్లుగా ప్రధాన మీడియాల్లో పదేపదే తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు రేణుక తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. ‘నిజం రెండు అడుగులు వేసేలోపు.. అబద్ధం వెయ్యి అడుగులు వేస్తుంది’ అనే నినాదాన్ని టీడీపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు నమ్ముకున్నాయయి’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ప్రధాన, సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.తెలుగుదేశం పార్టీ, న్యూట్రల్ ముసుగులో ఉన్న రెండు పత్రికలు, ఐదారు మీడియా సంస్థల అసత్య ప్రచార దాడిలో ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున 1.50 లక్షల వాట్సాప్ గ్రూప్‌లు, 100కు పైగా పెయిడ్ మీమర్స్, వెయ్యికి పైగా ఫేస్బుక్ పేజీలను నడిపిస్తూ నిత్యం ప్రజా పాలనపై చరిత్రలో ఎన్నడూ లేనంతగా దుర్మార్గపు దాడికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.ఐదేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధి, సంక్షేమం వివరాలు ప్రజలకు గణాంకాలతో సహా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల వెనుక ఏపీ భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా మారుతుందో, ఎంతటి గొప్ప మార్పులు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవడానికే కచ్చితమైన సమాచారంతో ‘జగన్ విజన్’ పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు’ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె చెప్పిన అక్షర సత్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
పచ్చ పార్టీ ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/చీరాల: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇక తమకు ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చి అడ్డదారులకు తెరలేపారు. ఓటర్లపై వారికి నమ్మకం సన్నగిల్లడంతో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వెదజల్లి ప్రత్యర్థి పార్టీకి చెందిన చోటామోటా నేతలను, కార్యకర్తలను లోబర్చుకునేందుకు బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి కార్యకర్తలకైతే రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ఈ కొనుగోళ్ల వ్యవహారం వారం రోజులుగా ఊపందుకున్నట్లు తాజాగా చోటుచేసుకున్న ఘటనల బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే.. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రూ.56 లక్షల డబ్బు కట్టలను గురువారం ఆయన మెరైన్ కంపెనీకి చెందిన కంటైనర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతల అక్రమాలు నిజమేనని స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతలకు రూ.లక్షల్లో చెల్లింపులు.. ఇదిలా ఉంటే.. బాపట్ల నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా బలంలేని టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ కేవలం డబ్బు బలంతోనే టీడీపీ టికెట్ సంపాదించారని అందరికీ తెలిసిన విషయమే. ఆ బలంతోనే ఎన్నికల్లో నెగ్గేందుకు వర్మ సిద్ధమయ్యారు. కానీ, కొంతకాలంగా ఓటర్లకు చీరలు పంపిణీ చేసినా ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఆయన డబ్బు రాజకీయానికి తెరతీశారు. గ్రామాల్లో ఉన్న చోటామోటా నేతలు, కార్యకర్తలను ప్రలోభపెట్టి డబ్బులు ముట్టజెప్పి కొనుగోళ్లకు తెరతీశారు. అధికార పార్టీలో పదవులున్న నేతకు రూ.10 లక్షలు, చోటా నేతకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గ్రామస్థాయిలో అయితే రూ.లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తున్నారు. పార్టీలో చేరిన వారికి రూ.పదివేలు చెల్లిస్తూ కండువాలు వేస్తున్నారు. అదే అధికార పార్టీ నుంచి పచ్చ పార్టీలో చేరితే మండల స్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 నుంచి 30 లక్షల ఆఫర్ చేస్తున్నారు. అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపిన వేగేశన నరేంద్ర వర్మపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా కంటైనర్ల ద్వారా తరలింపు? రాయల్ మెరైన్ అధినేత నరేంద్రవర్మ గత ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలకు ఈ కంటైనర్ వ్యవహారం బలం చేకూరుస్తోంది. కంటైనర్ల ద్వారా రొయ్యల బాక్సుల మధ్యలో డబ్బు తీసుకొస్తే ఎటువంటి అనుమానం రాదని, అందుకు పక్కా ప్లానుతో రాయల్ మెరైన్‌కు కంటైనర్ ద్వారా పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక ఆక్వా రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు నడిపే టీడీపీ నాయకులు చాలామంది ద్వారా ఇదే విధంగా నగదు అక్రమ రవాణా జరుపుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అసలు పట్టుబడ్డ నగదును నేరుగా తెచ్చుకోవాలి. కానీ, కంటైనర్లలో రొయ్యల బాక్సులలో మధ్యలో పెట్టి రహస్యంగా తీసుకురావడమే అనుమానాలకు తావిస్తోంది. ఇది ఒక్కసారి జరిగింది అయితే కాదని, ముందుగానే డబ్బును మెరైన్ కంపెనీలకు తరలించి అక్కడి నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా నరేంద్ర వర్మ ఒక్కరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగంలో ఉన్న టీడీపీ నేతల ద్వారా అక్రమమార్గాన విచ్చలవిడిగా నగదు రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రొయ్యల బాక్సుల మధ్యలో నోట్ల కట్టలు.. ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీకి నిజాంపట్నం నుంచి చీరాల పరిధిలోని ఈ సంస్థకు ఓ రొయ్యల కంటైనర్ చేరుకుంది. దీనికి సంబంధించి అప్పటికే సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ రాయల్ మెరైన్ వద్ద కాపు కాశారు. వచ్చిన కంటైనర్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, ఇన్‌కంటాక్స్, ట్రెజరీ అధికారులు గురువారం ఉ.11 గంటల సమయంలో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. కంటైనర్‌లో అన్నీ రొయ్యల బాక్సులు ఉండగా, ఒక బాక్సులో మాత్రం రూ.500 నోట్లు 112 కట్టలతో మొత్తం రూ.56 లక్షలు దొరికాయి. దీంతో అధికారులు ఈ డబ్బు ఎక్కడ నుంచి తరలించారు, వీటికి సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని విచారణ చేస్తున్నారు. ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు. మీడియా సహా ఎవరినీ ఆ కంపెనీలోకి అనుమతించకపోవడంతో డబ్బు కోట్లలోనే పట్టుబడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డబ్బుతోనే వర్మ ఓటర్లను, నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఐటీ అధికారులు వర్మ సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టారు. -
ఎల్లో కల్లోలం
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ... సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం... టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్ నేత భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంతో అక్కడి ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అభ్యర్థులకు గడ్డు పరిస్థితి నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్ చాంద్‌బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రమేష్‌కుమార్‌రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. శ్రీకాకుళం ఆగని ఆందోళనలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు. మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు. -
TDP: డబ్బు కొట్టు... టికెట్ పట్టు!
కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు. ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు. ‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. మండిపడుతున్న పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చాగల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మాట్లాడిన ఈ ఫోన్ సంభాషణలు టీడీపీలోనూ దుమారం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికెట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసుకునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటాయించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
మహిళా నేతలనూ వంచించిన బాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలకూ అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహిస్తానని, వారి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ వంచనపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పలువురు మహిళలకు ఆయన అవమానకర రీతిలో సీట్లు నిరాకరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పీతల సుజాతను అవమానకర రీతిలో పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుని చింతలపూడి సీటు ఇవ్వకపోగా, ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటూ అవమానించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు వంటి నేతల అహంకారానికి దళిత మహిళనైన తాను బలైనట్లు ఆమె వాపోతున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోలేదనే కారణంతోనే చంద్రబా బు సీటు తిరస్కరించారన్న వాదన పార్టీలో ఉంది. పనబాకను మోసం చేసిన బాబు టీడీపీలో మరో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి చంద్రబాబు మొండిచేయి చూపారు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమెను తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు మాట విని పార్టీ కోసం ఓటమికి సిద్ధమయ్యే పోటీకి దిగారు. వాస్తవంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. ఉప ఎన్నికలో పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతోపాటు ఆమె భర్త కృష్ణయ్యకు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని చంద్రబాబు మభ్యపెట్టి పనబాకను పోటీకి దింపారు. అసలు ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఆమెను వంచించారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా పక్కనపెట్టేశారు. బాపట్ల, తిరుపతి ఎంపీ స్థానాల్లో ఏదో ఒక చోట అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. కష్టకాలంలో పార్టీ వెంట నిలబడ్డ తనను చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభా భారతికి మొండిచేయి టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికీ బాబు సీటు నిరాకరించారు. ఆమె తన కుమార్తె గ్రీష్మకు శ్రీకాకుళం జిల్లా రాజాం సీటు ఇవ్వాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. గ్రీష్మ టీడీపీ మహానాడులో తొడకొట్టి మరీ వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతలకు పార్టీలో అవకాశాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ చివరికి రాజాం సీటును కొండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. తన తండ్రి హయాం నుంచి టీడీపీని నమ్ముకున్న ఆమె కుటుంబానికి టీడీపీలో న్యాయం జరగలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. శ్రీకాకుళంలోనూ ఆది నుంచి పార్టీకి దన్నుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్థానంలో ధనబలం ఉన్న గొండు శంకర్‌కు సీటిచ్చారు. అప్పుడు మభ్యపెట్టారు.. ఇప్పుడు మోసగించారు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పాడేరు, రంపచోడవరం, పామర్రు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలను మభ్యపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆ ముగ్గురూ ఓడిపోయినా నియోజకవర్గాల్లో తిరుగుతూ పనిచేశారు. కానీ సమీకరణలు, ధన బలం లేదనే కారణంతో ఈ ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకుని ఇప్పుడు సీటు లేకుండా చేశారు. చంద్రబాబు మోసం చేశారనే ఉద్ధేశంతో రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు అర్థమైందంటూ ఆమె ఎక్స్(ట్విటర్)లో వాపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఈసారి సీటు లేకుండా చేశారు. భవానీ బదులు ఆమె భర్తకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మకు కూడా హ్యాండిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఔను.. పుష్ప అంటే ఫ్లవరే!
సాక్షి, అమరావతి : అందరూ ఊహించినట్లుగానే కూటమి పేరుతో చంద్రబాబు అల్లిన సాలెగూటిలో బీజేపీ చిక్కుకుంది. పదేళ్లుగా ఎదురులేకుండా దేశాన్ని ఏలుతున్న బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు మాయోపాయంలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. బీజేపీకి రాష్ట్రంలో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారన్న మాటే కానీ, ఆ స్థానాలేమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చే సీట్లన్నింటిలో తన మనుషులే ఉండేలా చంద్రబాబు మంత్రాంగం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న అసలైన బీజేపీ నాయకులకు సీట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చంద్రబాబు వదిన అయిన పురందేశ్వరి కూడా సహకరిస్తుండటంతో బాబు నేతలకే సీట్లు ఇస్తున్నారని, అభ్యర్థుల ప్రకటనే మిగిలి ఉందని అసలైన బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలు, ప్రాంతాలను కూడా మార్చేసి చంద్రబాబు తన మనుషులను బీజేపీ టికెట్లపై రంగంలోకి దింపుతున్నారు. బాబు ముందస్తు వ్యూహం బీజేపీని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చంద్రబాబు గత దశాబ్దకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన వాళ్లు అనుకొన్న వారిని ఆ పార్టీలోకి పంపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం మరికొందరు అనుంగులను బీజేపీలోకి పంపి, కోవర్టు రాజకీయాలు నడిపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరగానే తన సొంత నాయకులకే ఆ పార్టీ సీట్లు ఇప్పించుకొంటున్నారు. ఈ నాయకులు ప్రాంతం, జిల్లా కూడా చూడకుండా ఎక్కడ వీలైతే అక్కడ వాలిపోతున్నారు. చంద్రబాబు అనుంగు సీఎం రమేష్ ఏకంగా కడప జిల్లా నుంచి ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనకు ఈ సీటు దాదాపు ఖరారు అయినట్టేనని కమలం పార్టీలో చర్చ సాగుతుంది. పొత్తు ఖరారు కాకముందు బీజేపీ ఒంటరిగా పోటీగా చేసేందుకు సిద్ధమైన సమయంలో అనకాపల్లి లోక్‌సభ సీటు కోసం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని కాదని రమే‹Ùకే ఇప్పుడు టికెట్టు ఇస్తున్నారు. జీవీఎల్‌కు సీటు దక్కకుండా.. విశాఖపట్నం బీజేపీకి రాష్ట్రంలోనే అత్యంత బలమైన ప్రాంతం. బీజేపీ బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల వారు విశాఖ పరిధిలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. విశాఖ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలన్న సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రెండేళ్లకు పైగా అక్కడే ఉంటూ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే, జీవీఎల్‌కు ఆ సీటు దక్కకుండా చంద్రబాబు, పురందేశ్వరి వ్యూహాత్మకంగా పక్కనే ఉన్న అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న విమర్శలూ ఉన్నాయి. సోము వీర్రాజు సీటుకే ఎసరు పెట్టిన పురందేశ్వరి రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకే పురందేశ్వరి ఎసరు పెట్టారు. రాజమండ్రి వీర్రాజు సొంత నియోజకవర్గం. తొలి నుంచి బీజేపీలో ఉన్న నేత. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి వీర్రాజు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ చంద్రబాబు అండతో పురందేశ్వరి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన పురందేశ్వరి 2014 ఎన్నికలకు ముందు వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆమె మధ్యలో ఏడెనిమిది లోక్‌సభ స్థానాలు దాటుకొని రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆమెకు టికెట్ ఖరారైనట్టేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ పోటీ చేసే మరో లోక్‌సభ స్థానం అరకు. ఇక్కడా మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన కొత్తపల్లి గీతకు టికెట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్సీపీ తరపున గెలిచి, చంద్రబాబుకు కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్పించి, ఆయనకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే రాజకీయం టీడీపీతో పొత్తు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీకి కూడా నిరాకరించిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరగానే కైకలూరు అసెంబ్లీ నుంచి కమలం గుర్తుపైనే పోటీకి సిద్ధపడుతూ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కామినేని శ్రీనివాస్ కూడా బాబుకు దగ్గరైన నాయకుడే. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ ఆ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఆయన కోసమే జమ్మలమడుగు స్థానాన్ని బాబు బీజేపీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి ఆ ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందు ఆయన మళ్లీ ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు సూరి కోసం ధర్మవరం సీటును బీజేపీకి చంద్రబాబు కేటాయిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా నేతకు బద్వేలు అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం బద్వేలును బీజేపీకి కేటాయించారు. సీఎం రమేష్ సూచించిన అభ్యర్థితో సహా బద్వేలు సీటు కోసం పురందేశ్వరి ప్రతిపాదించిన ముగ్గురు ఇప్పటికీ బీజేపీలో చేరలేదు. ఆమె ప్రతిపాదించిన వారిలో ఒకరికి అవకాశం ఇస్తే.. వారు పార్టీలో చేరి, పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బద్వేలు అసెంబ్లీ సీటు కూడా పరోక్షంగా టీడీపీకి ఇచ్చినట్లేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. -
ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు
సాక్షి, అమరావతి : తెలుగుదేశంలో పార్టీలో అనుకున్నదే జరుగుతోంది. ధనస్వామ్యానికే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. డబ్బున్నవారికే సీట్లు కట్టబెడుతున్నారు. తాజాగా.. శుక్రవారం ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం తేలిపోయింది. ఉదా.. విజయవాడ, గుంటూరు స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఎంపీ సీట్లు కేటాయించారు. నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక బీజేపీ కోరుతున్న విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ రెండవ అల్లుడు, లోకేశ్ తోడల్లుడు అయిన మోత్కుమిల్లి భరత్‌కు కట్టబెట్టారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. కడప నేతకు ఏలూరు సీటు.. ఏలూరు ఎంపీ సీటును మాత్రం అనూహ్యంగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి కేటాయించారు. కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడైన మహేష్‌కి ఏలూరు సీటు కట్టబెట్టడంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆ సీటును ఆశించి అక్కడ పనిచేస్తున్న గోపాల్ యాదవ్, మాజీ ఎంపీ మాగంటి బాబులను పక్కనపెట్టి మహేష్‌కి ఇవ్వడమేమిటని అక్కడి నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు.. బాపట్ల ఎంపీ సీటును ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కి ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే అవాక్కయ్యాయి. ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి కావడంతోపాటు పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. అలాంటి వ్యక్తికి చంద్రబాబు ఏపీలో సీటు ఇచ్చారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్క చంద్రబాబు చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించారు. ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూసినా ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌కు బాపట్ల సీటు ఇచ్చారు. నిజానికి.. వరంగల్ ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా ఏపీలో సీటు ఇవ్వడం గమనార్హం. సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్.. అలాగే, నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పలువురి కొత్త నేతల పేర్లు తెరపైకి తెచ్చి హడావుడి చేసినా చివరికి అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్బాబుకే ఆ సీటు కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లిని ఎట్టకేలకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆ సీట్లో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత సోమిరెడ్డి స్థానంలో మరొకరికి ఇచ్చేలా రాజకీయం చేశారు. ఒక దశలో సోమిరెడ్డి కాకపోతే ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు ఇవ్వాలని చూశారు. కానీ, చివరికి సోమిరెడ్డికే సీటు ఖరారుచేశారు. ధర్మవరం, హిందూపురం.. గరం గరం.. ఇక ధర్మవరం సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఓ వైపు పరిటాల శ్రీరాం, మరోవైపు వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. హిందూపురం ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంతో ధర్మవరం సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరు ఖరారు చేయడంతో నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ టికెట్ తనదేనని ప్రచారం చేస్తున్న బీజేపీ నేత పరిపూర్ణానందస్వామి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలాగే, వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి వాసు కారణంగానే టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకు ఎన్నికల్లో టికెట్ లేదని గతంలో నారా లోకేశ్ ప్రకటించినా నెల్లూరు జిల్లా సర్వేపల్లి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఊరించి ఉసూరుమనిపించారు. దేవినేని ఉమాకు షాక్.. వసంతకే మైలవరం టికెట్ మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివాదంగా మారిన పెనమలూరు, మైలవరం అసెంబ్లీ సీట్లకు బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారుచేశారు. మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీపడ్డారు. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు దేవినేని ఉమా గట్టిగా పట్టుబట్టినా ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు. మైలవరం టికెట్‌ను ఫిరాయింపు నేతకు ఇస్తున్న నేపథ్యంలో పెనమలూరు సీటుకు దేవినేని ఉమా పేరును పరిగణలోకి తీసుకుని అక్కడికి పంపుతున్నట్లు హడావుడి చేశారు. అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను పక్కనపెడుతున్నట్లు హంగామా చేసినా చివరికి ఆయనకే సీటు ఇచ్చారు. దీనివెనుకా భారీగా డబ్బు దండుకునే వ్యూహం అమలైనట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో చిక్కుకున్న బోడె ప్రసాద్ ఎలాగోలా టీడీపీ పెద్దలను సంతృప్తిపరచడంతో ఆయనకే సీటు ఖరారుచేశారు. దీంతో.. రెండు స్థానాల్లో ఏదీ దక్కక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఉమాను అన్ని రకాలుగా వాడుకున్న చంద్రబాబు చివరికి కరివేపాకులా పక్కన పడేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘దేశ’ ముదుర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ... కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అధికారికంగా జనసేనతోను, అనధికారికంగా కాంగ్రెస్‌తోను అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేశ్ ద్వారా... కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజీ అందజేసినట్లు నేరుగా ఎలక్టొరల్ బాండ్లే వెల్లడించాయి. అది కూడా తెలంగాణలోను, కాంగ్రెస్‌లోను ఎన్నికలకు ముందు ఏకంగా 30 కోట్ల రూపాయలను అధికారికంగా పార్టీ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు పంపించినట్లు వెల్లడయింది. ఇక అనధికారికంగా ఎంత ముట్టజెప్పారన్నది ఊహించటం కష్టమే. వీటన్నిటికీ తోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎలా మోశారో... కాంగ్రెస్ కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎలా కట్టడి చేశారో తెలియనివేమీ కావు. నిజానికి కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా... నూటికి నూరుపాళ్లూ తెలుగుదేశం మనిషి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఆయన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థను ఆరంభించి... బాబు అండదండలతో భారీ కాంట్రాక్టులు పొందారు. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్‌ల నుంచి నిధులు తెచ్చుకుని చాలా తక్కువ కాలంలోనే వేల కోట్లకు ఎదిగాడు. అందుకే... 2019లో తాను ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అప్పటి నుంచి బీజేపీలో ఉంటూనే... నారా వారి ప్రయోజనాల కోసం సకల కార్యాలూ చక్కబెట్టడం మొదలెట్టాడు సీఎం రమేశ్. అలాంటి సీఎం రమేశ్... బీజేపీలో ఉంటూ బీజేపీకి ఒక్క పైసా కూడా అధికారికంగా ఇవ్వకపోయినా... రూ.30 కోట్లను మాత్రం బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ ఖాతాలో వేయటం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అంతేకాదు. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో... వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చటం ఇవన్నీ రమేశ్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కల్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం వాడేస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. జగన్ టార్గెట్‌గా బాబు పావులు... 2019లో ప్రజా క్షేత్రంలో దారుణంగా ఓడిపోయినప్పటి నుంచీ చంద్రబాబు ఎన్ని పాచికలు వేసినా పారటం లేదు. ఆ తరవాత జరిగిన స్థానిక ఎన్నికలతో సహా ప్రతి ఎన్నికలోనూ ఘోరమైన ఓటమి పాలవుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రజాక్షేత్రంలో ఢీకొనటం కష్టమని తెలుసుకుని మాయోపాయాలకు దిగాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆసరాగా చేసుకుని ఆయన కుటుంబీకుల్లో చిచ్చు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చి... ఆ దిశగా పావులు కదిపాడు. హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటామేమోనని భయపడుతున్న సునీతను చేరదీయటంతో పాటు... అధికారం ఆశ చూపించి వైఎస్ షర్మిలనూ తమవైపు తిప్పుకున్నారు. వారు గనక తెలుగుదేశంలో నేరుగా చేరితే తమ మాటలెవరూ నమ్మరన్న ఉద్దేశంతో... తన సన్నిహితుడు రేవంత్‌రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో ఆమె పార్టీని విలీనం చేయించటం వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా చేయించాడు. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి కాంగ్రెస్‌కు తన బంటు సీఎం రమేశ్ ద్వారా రూ.30 కోట్లను ఎలక్టొరల్ బాండ్ల ద్వారా అందజేశారు. నిజానికి ఎలక్టొరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి. సీఎం రమేశ్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా రూ.45 కోట్ల మేర ఎలక్టొరల్ బాండ్లను కొనుగోలు చేసి, అందులో రూ.30 కోట్లను కాంగ్రెస్ ఖాతాలోకి, రూ.5 కోట్లను తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జనతాదళ్ (ఎస్) ఖాతాలోకి వేశారు. కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు... తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికై... బీజేపీలో కొనసాగుతూ... కాంగ్రెస్‌కు భారీగా నిధులిచ్చిన సీఎం రమేశ్... ఇటీవల చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు కలవటానికి కూడా ఇష్టపడనప్పుడు మొత్తం వ్యవహారాన్ని వెనక ఉండి నడిపించారు. మొత్తానికి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు సంపాదించి బాబును వారితో భేటీ అయ్యేలా చేశారు. ఇక వాళ్లేం చెబితే అది చేస్తానని చంద్రబాబు సాగిలపడటంతో వారు కూడా పొత్తుకు సరేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా నేరుగానే చెప్పారు. బాబుకు బుద్ధొచ్చింది కనకనే తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన చెప్పగా... గతంలో చంద్రబాబుజీ... నాయుడుజీ అన్న ప్రధాన మంత్రి మోదీ... ఇటీవల చిలకలూరిపేట సభలో మాత్రం నేరుగా చంద్రబాబు నాయుడు అని మాత్రమే... అదికూడా ఒక్కసారే సం¿ోదించడం గమనార్హం. బాబు మాత్రం మోదీజీ గారు అంటూ అతివినయం ప్రదర్శించటం ఎవ్వరి దృష్టినీ దాటిపోలేదు కూడా. కాకపోతే సీఎం రమేశ్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీని విలీనం చేయటంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచీ ఆమె నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్‌గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు కూడా తాను అండగా ఉన్నానని చెబుతూ... వివేకా హత్య విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకు దిగారు. ఒక దశలో వివేకా భార్యను గానీ, సునీతను గానీ కడపలో పోటీ చేయించాలని భావించి... ఇపుడు మాత్రం చంద్రబాబు సూచనలతో నేరుగా తానే పోటీక దిగే ప్రయత్నాలూ చేస్తున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఈ వ్యవహారాలపై ఎన్ని విమర్శలొచ్చినా కాంగ్రెస్‌తో తమకేం సంబంధమంటూ చంద్రబాబు దాటవేశారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో స్పందించేవారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఎలక్టొరల్ బాండ్ల మొత్తం వివరాలన్నీ బయటపెట్టింది. ఎవరు కొన్నారు? ఏ పార్టీకి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలన్నీ వెల్లడించటంతో... సీఎం రమేశ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చిన వ్యవహారం బట్టబయలయి... దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇవీ.. బాండ్ నంబర్లు కాంగ్రెస్‌కు సీఎం రమేశ్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన బాండ్ల నంబర్లు. ఒక్కొక్కటీ రూ.కోటి విలువ గల 30 బాండ్లను... అంటే రూ.30 కోట్లను కాంగ్రెస్‌కు అందజేశారు. 14402, 14412, 14414, 14416, 14418, 14420, 14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477. -
స్వ‘ప్రజాగళం’తో కూటమి ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సీతంపేట(విశాఖ ఉత్తర): తెలుగుదేశం పార్టీలో సీట్ల మంటలు ఆరడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ఆ పార్టీ అట్టుడుకుతోంది. నియోజకవర్గాల్లోనే కాకుండా చంద్రబాబు ఇళ్ల వద్దకు కూడా వచ్చి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం ఉండవల్లి, హైదరాబాద్‌లలోని చంద్రబాబు ఇళ్ల వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన గళం విప్పారు కర్నూలు జిల్లా ఆలూరు సీటును కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె మద్దతుదారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఆలూరు సీటును బయట వ్యక్తులకు ఇస్తే అంగీకరించేది లేదని హెచ్చరించారు. బాబును కలిసి తమ ఆవేదనను తెలుపుతామని లోపలకు పంపాలని గొడవ చేశారు. పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో వారు సుజాతమ్మకే ఆలూరు సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఉండవల్లి నివాసం వద్ద కూడా కదిరి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని, ఐదేళ్లు ఆయన నియోజకవర్గంలోనే ఉండి పని చేశారని, ఇప్పుడు వేరే వారికి సీటు ఎలా ఇస్తారని నిలదీశారు. కదిరి అసెంబ్లీ సీటు ఇవ్వలేనప్పుడు హిందూపురం ఎంపీ స్థానమైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో కనీసం లోకేశ్‌ను కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొందరిని లోపలకు పంపించారు. ఆయన వారితో సరిగా మాట్లాడకుండానే తిప్పి పంపించివేశారు. లోకేశ్‌ను కలిసిన కోడెల శివరామ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేత కోడెల శివరామ్ ఉండవల్లిలో మంగళవారం టీడీపీ నేత లోకేశ్‌ను కలిశారు. ఆయనకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరించడంతో కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు పిలిచిన లోకేశ్ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఇస్తామని సముదాయించారు. అయితే శివరామ్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ♦ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. నేనే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌పై పలువురు జనసైనికులు, వీరమహిళలు మండిపడుతున్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాన్ని దహనం చేశారు. వంశీ వద్దంటూ నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. కార్పొరేటర్ మహ్మద్ సాధిక్కుగానీ, డాక్టర్ మూగి శ్రీనివాసరావులలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ♦ పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకేనని అధిష్టానం తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఆశావహులంతా ఒక్కటై తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా సమ్మతమేనని, బీజేపీకి మాత్రం సీటు వదలొద్దని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాబును కలవాలని విజయవాడ వెళ్లి అధినేత దర్శనభాగ్యం కోసం ఐదురోజులుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. ఇంకా సీటుపై సందిగ్ధం వీడకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ♦ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన బలప్రదర్శన చేస్తోంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కంటే తానే బలమైన అభ్యర్థినంటూ సీటు దక్కించుకోవడానికి జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువే ఓట్లు వచ్చాయని, తనకు మెరుగైన ఓట్లు వచ్చాయని ఉషాకిరణ్ వాదిస్తున్నారు. సీటు విషయం పునరాలోచించాలని పార్టీకి లేఖ రాశారు. -
Fact Check: పోలీసులపైకి టీడీపీ తప్పులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏదో చేయబోతే మరేదో అయిందన్న తీరుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట సభ జరిగింది. మూడు పార్టీలు కూటమి కట్టాక జరుగుతున్న తొలి సభను, అదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేక, సభను సక్రమంగా నిర్వహించలేక, బోర్లాపడి, ఆ తప్పులను టీడీపీ నేతలు పోలీసులపైకి నెడుతున్నారు. అంతటితో ఆగక, సంబంధం లేనిదే అయినా ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. అదీ కొందరు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని పోలీసులు, విశ్లేషకులు అంటున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చేతిలో ఉన్న అంశాలను కూడా పోలీసుల మీదకు రుద్దడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట శివారు బొప్పూడి వద్ద ప్రజాగళం పేరుతో ఈ బహిరంగ సభ జరిగింది. ఇందులో ప్రధాని మాట్లాడుతుండగా మూడు సార్లు మైక్ మూగబోయింది. పోలీసులు మైక్ ఆపుతున్నారంటూ వేదిక మీద నుంచే నేతలు ఆరోపించారు. సాధారణంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో మైక్ ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో (పీఐబీ) చూస్తుంది. ఎన్నికల కోడ్ రావడంతో మైక్ ఏర్పాట్లను నిర్వాహకులే చూసుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. మైక్ సిస్టమ్ కూడా ఎప్పుడూ లేనివిధంగా మీడియా గ్యాలరీలో పెట్టారు. మైక్ సిస్టమ్‌కు మొదటి నుంచి సాంకేతిక, రిమోట్ సమస్యలు ఉన్నట్లు కార్యక్రమం మొత్తాన్ని చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. జనం తొక్కిడి కారణంగా కేబుల్ కట్ అయి ఉంటే పునరుద్ధరణ సాధ్యం అయ్యేదే కాదు. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సమయంలోనే మైక్ పలుమార్లు ఆగిపోయింది. ఆ సమయంలో గ్యాలరీలో ప్రజలే లేరు. ప్రధాని హెలీకాప్టర్ వచ్చే సమయంలో కూడా మైకులు సరిగ్గా పనిచేయడంలేదు చూడండంటూ నిర్వాహకులు చెప్పడం వీడియోల్లో స్పష్టంగా కనపడుతోంది. అప్పుడే సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి ఉంటే ప్రధాని ప్రసంగించే సమయంలో మైక్ సమస్యే ఉండేది కాదు. 4.15 గంటల సమయంలో టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎడమ వైపు గ్యాలరీ నిండిపోయినందున మిగతా వారిని కుడివైపు గ్యాలరీలలోకి పంపాలంటూ అనౌన్స్ చేశారు. ప్రధాని వచ్చే సమయానికి జనం పల్చగా ఉండటంతో వెనుక ఉన్న వారందరినీ ముందుకు రప్పించారు. అప్పటివరకూ విఐపీ పాసులు ఉన్న వారు మాత్రమే కుడివైపు గ్యాలరీలోకి వచ్చి కూర్చొగా, పుల్లారావు చెప్పిన తర్వాత సాధారణ కార్యకర్తలు కూడా వీఐపీ గ్యాలరీలలోకి చొచ్చుకువచ్చారు. సభకు వచ్చే వారికి వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఇవ్వాలని పోలీసులు, ఎస్పీజీ స్పష్టంగా చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదు. వారికి అర లీటర్ వాటర్ బాటిల్స్ అందజేశారు. దీంతో కొంతమంది ఆకతాయిలు వేదిక ముందు ఉన్న డి–సర్కిల్‌లోకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఇవన్నీ నిర్వాహకుల నిర్వాకాలే. శాలువా, బొకే తెచ్చుకోకుండా.. వేదిక పైన చంద్రబాబు ప్రధాని మోదీని సన్మానిస్తారని చెప్పి అవమానించిన ఘటనపై కూడా నిర్వాహకుల వైఫల్యాన్ని పోలీసుల పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బొకేలు తేకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. వాస్తవానికి హెలీప్యాడ్, డయాస్ అన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ చేతుల్లో ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పడానికి ఎవరు రావాలి, వీడ్కొలుకు ఎవరు రావాలి, వేదికపై ఎవరు ఉండాలనే విషయం కూడా ఎస్పీజీనే చూసుకుంటుంది. పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదు. పాసులు కూడా ఎస్పీజీనే ఇస్తుంది. ఓ శాలువా, బొకే ముందుగా తెచ్చుకొంటే వాటిని ఎస్పీజీ ముందుగా తనిఖీ చేసి, అనుమతిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తెచ్చిన వినాయకుని ప్రతిమను అనుమతించలేదా? ఈ విషయం తెలిసి కూడా పోలీసులపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ వాళ్లు చేసిందే ట్రాఫిక్ జామ్‌కు సంబంధించి కూడా బాపట్ల జిల్లా మేదరమెట్ల నుంచి గుంటూరు వరకూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం రెండు వేల మంది పోలీసులను ఉపయోగించారు. మామూలు సమయంలోనే చిలకలూరిపేట సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఆదివారం సభకు చిలకలూరిపేట, బొప్పూడి నుంచి వచ్చే వాహనాలు అన్నీ నాలుగున్నర తర్వాతే బయలుదేరాయి. దీంతో చిలకలూరిపేట వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు వాహనాల్లో వస్తున్నట్లుగా చూపించడం కోసం టీడీపీ నేతలే వాహనాలు అడ్డం పెట్టి ట్రాఫిక్ ఆపి డ్రోన్షాట్స్ తీశారు. దీనివల్ల వాహనాలు నిలిచిపోయాయి. సభ పూర్తయిన తర్వాత అవే వాహనాలు గంటలోనే తిరిగి వెళ్లిపోయాయి. పోలీసులు పట్టించుకోకపోతే ఇలా గంటలోనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేది కాదు. 12 మంది ఐపీఎస్‌లు, వేల మందిపోలీసులతో బందోబస్తు సభ ఏర్పాట్ల కోసం సుమారు 3,960 మంది పోలీసులను ఉపయోగించారు. ఏడీజీ నుంచి, ఐజీ, ఎస్పీల వరకూ 12 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తనిఖీల కోసం 20 డాగ్ స్క్వాడ్లను వాడారు. ప్రధాన మంత్రి కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడినప్పటికీ, హెలికాప్టర్ కూడా చీకట్లో సురక్షితంగా టేకాఫ్ తీసుకొని, ఆయన క్షేమంగా వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సభలో చిన్నపాటి తొక్కిసలాటగానీ, లాఠీఛార్జిగానీ జరగలేదు. ఒక్కరు కూడా గాయపడలేదు. జనం ఎక్కువగా వచ్చారన్న బిల్డప్ కోసం టీడీపీ నేతల సూచనలతో మైక్, లైటింగ్ టవర్స్‌పైకి ఎక్కిన వారిని దించాలని ప్రధాని కోరినప్పుడు వారిని క్షేమంగా దింపింది కూడా పోలీసులే. ఇవన్నీ వీడియోల్లో కనపడుతూనే ఉన్నాయి. అయినా టీడీపీ నేతలు పోలీసులను, ప్రత్యేకించి కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మాధవరెడ్డిని హెలీప్యాడ్ వద్ద నియమించడం ఏమిటని వారు టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ప్రధాన మంత్రి సత్యసాయి జిల్లా పర్యటన ఏర్పాట్లు చూసిన అనుభవం ఉన్నందున ఆయన్ని ఇక్కడ నియమించారు. దీనికితోడు మాధవరెడ్డి ఇటీవలి వరకు మూడేళ్లకు పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీకి ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఎస్పీలపైనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర కోణం ఉందన్న వాదన వినిపిస్తోంది. -
చీరాల టీడీపీలో నాలుగు స్తంభాలాట
చీరాల: చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. పార్టీ అధిష్టానం ఆశావాహులందరికీ అనేక ఆశలు పెడుతోంది. ఇందులో చంద్రబాబు దగ్గరకు కొందరు వెళ్లి బీసీ కార్డు చూపుతుంటే మరికొందరు మాత్రం సామాజిక సమీకరణాల పేరుతో లోకేష్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రతి ఎన్నికల మాదిరిగానే చీరాల్లో టీడీపీ టికెట్ చివరి వరకు దోబూచులాడుతూనే ఉంది. తండ్రీ, కొడుకులు ఆశావాహులకు గంపెడాశలు పెట్టడంతో చీరాల్లో టీడీపీ మూడు వర్గాలు.. ఆరు ముఠాలుగా మారింది. రెండేళ్ల కిందట నుంచి కందుకూరు ప్రాంతానికి చెందిన ఎంఎం కొండయ్యను చీరాల టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. చీరాల టీడీపీ టికెట్ నీకేనని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కొండయ్యను విజయవాడ, హైదరాబాద్ తిప్పుతున్నారే కానీ టికెట్ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే చేనేతలకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన మునగపాటి బాబు, సజ్జా హేమలత, మంగళగిరికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావులు పట్టుబడుతున్నారు. చీరాల టికెట్ ఇస్తే చేనేతలకే ఇవ్వాలని శుక్రవారం రజనీబాబాతో కలిసి చంద్రబాబును కలిశారు. అయినప్పటికీ వారికి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సర్వేలు, ఆర్థిక బలాలు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ కబురు పెడుతామని, టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలను తండ్రీ, కొడుకులు వెనక్కి పంపించారు. తల పట్టుకుంటున్న ఆశావహులు.. అయితే అద్దంకికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, తనయుడు కృష్ణచైతన్య వైఎస్సార్ సీపీని వీడి చీరాల టీడీపీ కోసం ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా చీరాలలోని కొంతమంది ప్రముఖులు మాజీ మంత్రి పాలేటిని వెంటబెట్టుకుని కలుస్తున్నారు. దీంతో చీరాల సీటు ఓసీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? బీసీల్లోని చేనేత వర్గానికి ఇస్తారా? అని డోలాయమానంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఓ అధికారి యాదవ సామాజికవర్గానికి సీటు ఇస్తే తనకే కేటాయించాలని చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ మాత్రం చీరాల నుంచి ఎవరూ పోటీ చేస్తారో అనే సందేహంతో నాయకులు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికి చీరాల టీడీపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు మైండ్ గేమ్ ప్రదర్శించడం చీరాల ఆశావాహులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉంది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. -
భగ్గుమన్న పొత్తు బంధం..
సాక్షి నెట్వర్క్: పొత్తులతో ఎన్నికల గోదారి ఈదాలన్న చంద్రబాబు ఎత్తుగడ టీడీపీ పుట్టి ముంచుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు కుంపట్లుగా రచ్చ రచ్చగా ఉన్న టీడీపీ పరిస్థితి తాజాగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుతో పూర్తిగా రోడ్డున పడింది. చంద్రబాబు గురువారం తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ తమ్ముళ్లు అధినేతపై నిప్పులు చెరిగారు. పార్టీ కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి డబ్బు మూటలతో దిగిన ప్యారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. పార్టీకోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై దుమ్మెత్తిపోశారు. టికెట్ల కేటాయింపులో మరోసారి పునరాలోచించాలని లేనిపక్షంలో పార్టీని ఓడించేందుకైనా వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లెక్సీలు చించివేసి ర్యాలీలు నిరసనలు తెలిపారు. కొందరు నాయకులు రాజీనామాలు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్లపై టైర్లను కాల్చి ఆందోళనలు నిర్వహించారు. మొత్తంగా టీడీపీ రెండో జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. పిఠాపురంలో అసమ్మతి సెగ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు. వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో క్యాడర్‌తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్‌ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. కొవ్వూరులో జవ‘హరీ’ టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు అధిష్టానం మొండిచెయ్యి చూపించింది. కొవ్వూరు టికెట్టు తనకే కేటాయిస్తారని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న ఆయనకు పరాభవం తప్పలేదు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేయడం ఆయన కంగు తిన్నారు. కొవ్వూరులోని జవహర్ నివాసానికి ఆయన వర్గీయులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి నిరసన తెలిపారు. కొవ్వూరు సహా 175 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమంటూ పలువురు టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. సీటు దక్కకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. కనీసం జిల్లాలో ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేస్తారన్న ఆశ కూడా పోయింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టికెట్‌పై ఎటువంటి సానుకూల స్పందనా రాకపోవడంతో జవహర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనంతరం జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. గత ఎన్నికల్లో గోపాలపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు చేతిలో ఘోర ఓటమి పాలైన ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరు టికెట్టు ఖరారు చేసిన అధిష్టానంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రకటించిన తొలి రోజే గ్రూపు రాజకీయాలు భగ్గుమనడం, జవహర్ వర్గీయులు నిరసనలకు దిగడంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయంలో పడ్డారు. టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకష్ణలు చంద్రబాబును మంగళవారం రాత్రి కలిసి, అభ్యర్థిని ఖరారు చేశారు. డబ్బు మూటలకు అధిష్టానం అమ్ముడుపోయిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నాయకులు ఇప్పటికే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. భగ్గుమన్న కొమ్మాలపాటి వర్గం పల్నాడు జిల్లా పెదకూరపాడు స్థానం భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. టికెట్ కొమ్మాలపాటికే కేటాయిస్తారని ముందుగా గుంటూరులోని ఆయన నివాసానికి గురువారం ఉదయం అనుచరులు భారీగా చేరుకుని స్వీట్లు, బాణసంచా సిద్ధం చేసుకున్నారు. చివరికి టికెట్ భాష్యం ప్రవీణ్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో భాష్యం ప్రవీణ్ కొమ్మాలపాటి ఇంటికి చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అచ్చంపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రవీణ్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకముందే నియోజకవర్గంలో ప్లెక్సీలు, వాల్పోస్టర్లుతో హడావుడి ఎందుకు చేశారు అని ప్రశ్నించారు? స్థానికేతరుడు అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రవీణ్ కూడా టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీకెందుకు ఏమైనా ఉంటే మేము మేము చూసుకుంటాం.. మీరెవ్వరు అంటూ గట్టిగా అరవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. టికెట్ దక్కకపోవడం పట్ల కొమ్మాలపాటి తన ముఖ్య అనుచరుల వద్ద జరిగిన అన్యాయంపై వాపోయారట. వరుసగా నాలుగు పర్యాయాలు పెదకూరపాడులో టీడీపీ ఓడిపోతూ అభ్యర్థులు కరువైన సమయంలో 2009లో అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని, పార్టీ కోసం 18 సంవత్సరాలు కష్టపడితే ఇదేనా నాకు దక్కిన గౌరవం అంటూ ఆవేదన చెందారట. పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసినా చంద్రబాబు కనీసం పిలిచి మాట్లాడకపోవడం అన్యాయమన్నారట. నియోజకవర్గ ప్రజలకు కతజ్ఞతలు తెలిపి శ్రీధర్ హైదరాబాద్ వెళ్లిపోయారు. పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ కష్ణా జిల్లా పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ తార స్థాయికి చేరింది. అక్కడ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్‌కు సీటు నిరాకరించడంపై ఆ పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని దుమ్మెత్తి పోశాయి. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల పార్టీ అధ్యక్షులు నుంచి బూత్ కన్వినర్ల వరకూ రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. సీటు బోడెకు కాని పక్షంలో స్థానికులకు ఇవ్వాలని, దిగుమతి నేతలను ఒప్పుకునేది లేదంటున్నారు. చంద్రబాబు కుటుంబం మినహా వేరెవరు పోటీ చేసినా తాను కూడా పోటీ చేస్తానని కరాఖండీగా చెప్పారు. ఈ విషయంపై అధిష్టానంతో తేల్చుకుందామని శ్రేణులకు సూచించారు. తాను టీడీపీ పార్టీకి ఎనలేని కషి చేశానని, తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందున టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తనకు అనుకూలంగా ఉన్న టికెట్ ఇవ్వకుండా ఎందుకు నిరాకరించారో తెలియటం లేదన్నారు. నాలుగున్నర ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు అన్ని విజయవంతం చేశానని, తనను మేకను బలిచ్చినట్లు బలిస్తే ఊరుకునేది లేదన్నారు. తనను టీడీపీ బహిష్కరించినా చంద్రబాబునాయుడు ఫోటో పెట్టుకోని టీడీపీ బీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. చివరి వరకు చంద్రబాబు, లోకేశ్ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. సీటు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న బోడెకు సీటు లేదని అధిష్టానం తేల్చిచెప్పేసింది. బోడె ఇసుక అక్రమ తవ్వకాలు, మట్టి విక్రయాలను ప్రోత్సహించారనే అభియోగాలున్నాయి. దొంగ పరీక్ష కేసులు, కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ విమర్శలు బురదలా అంటుకున్నాయి. వీటికి తోడు కార్యకర్తలను కలుపుకుని వెళ్లటంలో వైఫల్యం చెందారన్నది మరో కారణం. ప్రధానంగా పార్టీలో నెలకొన్న వర్గపోరు గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. మిత్రపక్షమైన జనసేనలోని వర్గాలతోనూ సఖ్యత లేదన్న ప్రచారం లేకపోలేదు. పెందుర్తిలో కార్యకర్తల తీవ్ర నిరసన పెందుర్తిలో బండారుకు టీడీపీ టికెట్ కేటాయించకపోవడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో వెన్నలపాలెంలోని బండారు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తామని ప్రకటించారు. తీవ్ర మనస్తాపంలో గండి బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బాబ్జీ విశాఖ దక్షిణ లేదా మాడుగుల నుంచి టికెట్ ఆశించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం, మాడుగుల టికెట్‌ను తెలుగుదేశం పార్టీ పైల ప్రసాద్‌కు కేటాయించడంతో గండి బాబ్జీకి అవకాశం దక్కలేదు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. రంపచోడవరంలో ఆగ్రహ జ్వాలలు రంపచోడవరం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవి పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా పైరవీలు చేసిన వారికి టికెట్ ఇవ్వడం అన్యాయమని వారంతా ధ్వజమెత్తారు. గురువారం రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నివాసంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వంతల రాజేశ్వరికి టీడీపీ టికెట్ ఇవ్వాలని రోడ్డుపై నిరసనకు దిగారు. టికెట్ విషయంలో నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా ఆమెకు టికెట్ ఏవిధంగా ఇచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు కష్టపడి తిరిగిన వంతల రాజేశ్వరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ఎంపికలో టీడీపీతో సంబంధం లేని మాజీ ఎంపీ పెత్తనమేంటని వారు ధ్వజమెత్తారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగదు అనడానికి ఈ పరిణామమే ఒక ఉదాహరణ అన్నారు. పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు వంతల రాజేశ్వరి నాయకత్వంలో పార్టీ శ్రేణులు శుక్రవారం విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ విషయంలో మార్పు లేకపోతే పార్టీ కోసం పనిచేసేది లేదని వారు బహిరంగంగా చెబుతున్నారు. మరోవైపు శిరీషా దేవి పేరు ప్రకటించిన వెంటనే రంపచోడవరం నుంచి గెద్దాడ వరకు ఉన్న ఆమె ఫ్లెక్సీలను కొంతమంది చింపేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్ స్తబ్ధతగా ఉన్నారు. వీరు టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీసీలకు చంద్రబాబు ద్రోహం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పదిరోజులుగా ఆందోళనలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న శంకర్ వర్గం టీడీపీ శ్రేణులు గురువారం చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో గళమెత్తారు. నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో రోడ్లపైకి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై మండిపడ్డారు. రోడ్లపై రాస్తారోకోలు నిర్వహించి అభ్యర్థి జయచంద్రారెడ్డిని తప్పించాలని, శంకర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. బీసీలపై మాటలకే పరిమితమని చంద్రబాబు నిర్ణయం బట్టి స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు పార్టీకోసం శ్రమించిన శంకర్‌ను నమ్మించి నట్టేట ముంచేసిన చంద్రబాబు తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. లేనిప„ýక్షంలో తంబళ్లపల్లెలో టీడీపీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడిచిత్తూరుజిల్లాలో ఉన్న ఏకైక బీసీ నాయకుడు శంకర్‌కు టికెట్ లేకుండా చేయడం బీసీలకు ద్రోహం చేయడమేనని ప్రశ్నించారు. సర్వేల్లో పదిశాతానికి మించి మద్దతు పొందని జయచంద్రారెడ్డిని ఎలా ఎంపిక చేసారని నిలదీశారు. బీసీలకు న్యాయం చేసేలా శంకర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే పార్టీని ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. పోల్ మేనేజ్మెంట్ కన్వినర్ కుడుం శ్రీనివాసులు, పెద్దమండ్యం మండల కన్వినర్ జిట్టా వెంకటరమణ, పెద్దతిప్పసముద్రంలో కట్టా సురేంద్రనాయుడు, ఈశ్వరప్ప, కురబలకోటలో లక్ష్మణ్, తిమ్మయ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. రగులుతున్న మంత్రాలయం మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డికి కాకుండా ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఎన్.రాఘవేంద్రరెడ్డికి ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోసిగి మండల కేంద్రంలో తిక్కారెడ్డి అనుచరులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. పన్నెండేళ్లు శ్రమించినా తిక్కారెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని వారు వాపోతున్నారు. టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. చంద్రబాబు నిర్ణయంపై అనుచరవర్గం మండిపడుతున్నారు. బాలనాగిరెడ్డి టీడీపీని వీడిన తర్వాత పార్టీకి నాయకత్వం కరువైన సమయంలో తిక్కారెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ క్యాడర్, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ కోసం శక్తివంచన లేకుండా శ్రమించారు. దాదాపు 12 ఏళ్లుగా పార్టీ మనుగడకు తనవంతు కృషి చేశారు. 2019 ఎన్నికల్లోనూ ఖగ్గల్ గ్రామంలో ప్రవేశించగా సొంత గన్మెన్ల కాల్పుల్లో కాలితొడ భాగంలో బుల్లెట్లు దిగి గాయపడ్డారు. స్ట్రెచర్ పైనే ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు మొండి చేయి ఎదురవడంతో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. తిరుపతిలో లోకల్.. నాన్ లోకల్ వార్! రెండు రోజుల క్రితం తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్లు పవన్ కళ్యాణ్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ పరిణామాన్ని తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీటు ఇవ్వడానికి వీల్లేదంటున్నారు. ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు ఉంటుందన్న సమాచారంతో తిరుపతి సీటును జనసేనకే కేటాయిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. అయితే తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని జనసేన నాయకులు ఢీ కొనలేరన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ పరిస్థితుల్లో తిరుపతి సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు. ఎలాగైనా చిత్తూరు నుంచే పోటీ చేయాలని భావించిన ఆరణి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ టికెట్ నిరాకరించడంతో జనసేన కండువా కప్పుకుని తిరుపతి టికెట్ కోసం భారీగా ముడుపులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పవన్ ఆరణిని తిరుపతి జనసేన అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ, జనసేన నాయకులు ఏకమై జనసేన అధినేతకు హెచ్చరికలు పంపారు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
తేలని గుంటూరు పశ్చిమ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరుసగా రెండుసార్లు గెలిచిన సీటులో కూడా తమ అభ్యర్థిని నిలబెట్టలేని పరిస్థితిలో తెలుగుదేశం ఉండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరు పశ్చిమలో వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెచిచారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మద్దాళి గిరిధర్ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పెద్దసంఖ్యలో గెలిచారు. అయితే ఇప్పటికీ ఇది తమకు బలమైన సీటు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేక పోయింది. రోజుకో అభ్యర్థిని రంగంలోకి తీసుకువచ్చి ఐవీఆర్ఎస్ సర్వే జరపడంతో ఆ పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సీటు తమకే వస్తుందంటూ పలువురు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. మరోవైపు పొత్తులో తమకే వస్తుందని జనసేన ఇటీవల వరకూ హడావుడి చేసింది. అయితే పొత్తు 24 సీట్లకే పరిమితం కావడంతో గుంటూరు జిల్లాలో మరోసీటు వచ్చే అవకాశం లేదని తేలడంతో వారు మౌనం పాటిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా పొత్తు కుదిరితే గుంటూరు పశ్చిమ సీటు తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర, మాజీ మంత్రి ఆలపాటి రాజా, గళ్లా మాధవి, పిడుగురాళ్ల మాధవి, తాడిశెట్టి మురళి, నిమ్మల శేషయ్య పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. వీళ్లే కాకుండా ఈ సీటు కోసం ఎన్ఆర్ఐలు ఉయ్యూరు శ్రీనివాస్, మన్నవ మోహనకృష్ణ తదితరులు కూడా ప్రయత్నాలు చేశారు. 2019 నుంచి కోవెలమూడి రవీంద్ర ఇన్చార్జిగా పని చేస్తున్నారు. పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ 2023 నుంచి సీటు కోసం ప్రయత్నాలు చేస్తూ వేర్వేరు కార్యక్రమాలతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మరో ఎన్ఆర్ఐ మన్నవ మోహనకృష్ణ కూడా పనిచేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇవ్వడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా ఈ సీటుపై కన్నేశారు. వైఎస్సార్సీపీ జోరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు నెలల ముందే చిలకలూరిపేటకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని సమన్వయకర్తగా ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆమె నియోజకవర్గంలో చొచ్చుకుపోవడం, ‘మనతో మన రజనమ్మ’ అంటూ డివిజన్లలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లడం, స్థానికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో టీడీపీ అప్పటి వరకూ తమ సామాజికవర్గ అభ్యర్థిని పరిశీలించినా, ఆ తర్వాత మనసు మార్చుకుని బీసీ మహిళను రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్‌ను పరిశీలించినా ఆమె ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన మహిళను రంగంలోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటివరకూ సీటు ప్రకటించకపోవడం రోజుకొకరు రంగంలోకి వస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. -
నారావారి నైవైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత వైద్య సదుపాయాలు మృగ్యమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వైద్యారోగ్యశాఖను నిర్విర్యం చేసింది. పేదల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నారావారి నైవైద్యంగా మలచుకుంది. ప్రభుత్వాస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు సంస్థలకు పందేరం చేసింది. ఈఎస్ఐ మందుల కుంభకోణానికి పాల్పడింది. ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాకు ఒక నిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో నెలలు నిండని శిశువును ఎలుకలు కొరికిన వైనం రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు తీరని మచ్చగా మిగిలింది. 2014–19 మధ్య ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వైద్యారోగ్యశాఖ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా సకల వసతులూ సమకూరాయి. అర్బన్, విలేజ్ హెల్త్‌క్లినిక్‌లు బలోపేతమయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటింటికీ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యసురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్రను సర్కారు ఆవిష్కరించింది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొ ల్పింది. వైద్యారోగ్యశాఖలో నెలకొన్న నాటి.. నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. చంద్రబాబు హయాంలో.. ఆరోగ్యశ్రీకి పేరుమార్చి తూట్లు నిరుపేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలనే సదుద్దేశంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ‘‘ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ఆపరేషన్ల సౌకర్యం కల్పిస్తాం.’ అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్ల»ొల్లి మాటలతో ప్రజలను వంచించారు. 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం రోగాల సంఖ్యను ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి 1,059కి అంటే కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. 108 ఊపిరి తీశారు 108, 104 సేవలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బాబు పట్టించుకోలేదు. సంచార వైద్యవాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఒక్క కొత్త వాహనమూ కొనుగోలు చేయలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలు ఉంటే కేవలం 336 అంబులెన్సులు (108) మాత్రమే ఉండేవి. అంటే మండలానికి ఒక్క సంచార వాహనం కూడా లేని దుస్థితి ఉండేది. కేవలం 292 ‘104’ మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వాహనాలు ఉండేవి. తూతూ మంత్రంగా పోస్టుల భర్తీ వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ 2014–19 మధ్య పట్టుమని 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ ఐదేళ్లలో వైద్య శాఖలో కేవలం 4,469 పోస్టులు భర్తీ చేశారు. ఆస్పత్రుల్లో పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేరని సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా అవి బుట్టదాఖలే అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే అందుబాటులో ఉండేవారు. దీంతో ఆ ఒక్క డాక్టర్ సెలవుపై వెళితే అక్కడ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. మందులు కావాలంటే బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. నిమ్స్ స్థాయి ఆస్పత్రుల ఊసే లేదు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నిమ్స్ స్థాయి) నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎటువంటి చొరవా చూపలేదు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించి తన అనుయాయుల జేబులు నింపడానికి బాబు పెద్ద పీట వేశారు. దీంతో వైద్య విద్యను అభ్యసించాలన్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. వైఎస్ జగన్ పాలనలో.. ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకానికి 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. కేవలం 1,059గా ఉన్న రోగాల సంఖ్యను 3,257కు పెంచింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది. చికిత్స వ్యయం పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా క ల్పించింది. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తృతంగా పెంచింది. అన్ని ఆస్పత్రుల్లో చేరిన వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్ తరఫున ఉద్యోగులను నియమించింది. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది. రూ.16,852 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేసింది. నెలకు రెండుసార్లు గ్రామాలకు వైద్యులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన 105 రకాల మందులు ఉచితంగా అందిస్తోంది. సంచార వైద్యానికి ప్రాధాన్యం 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సంచార వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి పల్లెకు వైద్య వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. 679 మండలాలు ఉంటే 689 వాహనాలు(108) సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి మొత్తం 910 ( 104) కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లు కొన్నారు. అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు, వీటి నిర్వహణ ఏటా రూ.188 కోట్ల ఖర్చుచేస్తున్నారు. జిల్లాకు ఓ వైద్య కళాశాల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల ఐదు నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులూ ప్రారంభించింది. మరో ఐదు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల బలోపేతం, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. -
అజ్ఞాతవాసి పొలిటికల్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. (ఇదీ చదవండి: లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్) పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే పవన్‌కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. 2019 - సినిమా నెరేషన్ 2021 - వకీల్ సాబ్ 2022 - భీమ్లా నాయక్ 2023 - బ్రో 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్(?) 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్) , ఓజీ (సుజిత్) , ఉస్తాద్ భగత్ సింగ్ (హరీష్ శంకర్) వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్ బిజీగా ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్‌టైమ్ జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్ షూటింగ్స్‌లోకి వెళ్లడం ఖాయం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్) తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్‌లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్‌లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్‌కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్‌గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్‌గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటివరకు భశుం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?) -
ఇచ్చుకో.. దండుకో
సాక్షి, అమరావతి: రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి.. ఓటుకు నోటు అలవాటు చేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు సొమ్ములున్న బడాబాబులకు రకరకాల ఆఫర్లతో సీట్లు ఎరవేస్తున్నారు. వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చుకో.. అన్నీ కుదిరి అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకో.. ఇదీ ‘పెట్టుబడి’దారులకు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నేతలను పక్కనపెట్టి.. సొమ్ములు సమకూర్చడానికి అంగీకరించిన ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకు అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేస్తున్నారు. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుని కీలక మంత్రిత్వ శాఖను అప్పగిస్తానని కొందరికి.. భారీ ఎత్తున లాభాలు వచ్చే కాంట్రాక్టు పనులు, గనులు అప్పగిస్తానంటూ మరికొందరికి భరోసా కల్పిస్తున్నారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో భారీగా నిధులు సమకూర్చిన నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఎమ్మెల్సీని చేసి, రాజధాని నిర్మాణంతో ముడిపడిన కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అప్పగించానని గుర్తు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన భారీ ఎత్తున భూములు కాజేసిన నారాయణ.. ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ మార్చేసి, రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలతోపాటు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు, శాశ్వత నిర్మాణల పనుల టెండర్లు, టిడ్కో గృహాల టెండర్లలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయాలను కొల్లగొట్టాడు.. అవన్నీ ఇపుడు కేసులై మెడకు చుట్టుకున్నాయనుకోండి.. అది వేరే సంగతి... పెమ్మసాని నుంచి అమిలినేని దాకా.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నేత, ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు ఆసక్తి చూపారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను 2013లో దక్కించుకున్న రాయపాటి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ప్రభుత్వం నుంచి తీసుకున్న సొమ్ములో రూ.150 కోట్లు 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఇవ్వడం వల్లే నరసరావుపేట లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని రాయపాటి తనయుడు రాయపాటి రంగరావు ఇటీవల అంగీకరించారు. ట్రాన్స్ట్రాయ్ దివాలా తీయడం, రాయపాటి ఆర్థికంగా కుదేలవడంతో ఈసారి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు కుండ బద్దలు కొట్టేశారట. తెనాలికి చెందిన ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఎత్తున పెట్టుబడి పెడుతుండడంతో ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇదే రీతిలో పెట్టుబడి పెట్టడంతో గుడివాడ నియోజకవర్గంలో సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థిగా ఎన్నారై వెనిగండ్ల రామును.. విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా కేశినేని చిన్నిలను చంద్రబాబు ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పక్కన పెట్టి.. పెట్టుబడి పెట్టిన ఎన్నారై కాకర్ల సురేష్‌ను చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ–నీవా రెండో దశ పనుల్లో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద తొలగించి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టిన చంద్రబాబు.. భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు పెట్టుబడి పెట్టడంతో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి మొండి చేయిచూపారు. అమిలినేని సురేంద్రబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు. ఓటమి భయంతో పెట్టుబడిదారులు వెనుకంజ.. ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. గత నెల 3న దెందులూరు.. గత నెల 18న రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభ అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. సార్వత్రిక ఎన్నికలక ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని రాప్తాడు ‘సిద్ధం’ సభతో తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్ నౌ, జీన్యూస్, రిపబ్లిక్ టీవీ, జన్మత్, జనాధార్ ఇండియా వంటి జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని.. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని వెల్లడించాయి. టీడీపీ–జనసేన పొత్తులో సీట్ల పంపకాల ‘లెక్క’ తేలాక ఇరు పక్షాలు తొలి సారిగా ఉమ్మడిగా పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో గత నెల 28న ‘తెలుగుజన విజయకేతన జెండా’ సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. అవకాశవాదంతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ రెండు పక్షాలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభలోనే జనం ఛీకొట్టారని.. ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమి ఘోరంగా ఓడిపోతుందనడానికి ఇది సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో వాస్తవ పరిస్థితిని పసిగట్టిన పెట్టుబడిదారులు ఓటమి భయంతో టీడీపీలో చేరేందుకు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. వైఎస్సార్సీపీలో సీట్లు దక్కని వారితో చేరికల డ్రామాలు.. వ్యక్తిగత కారణాలతో.. టికెట్లు దక్కక వైఎస్సార్సీపీని వీడిన వారిని చేర్చుకోవడం ద్వారా టీడీపీకి క్రేజ్ ఉందని చూపి పెట్టుబడిదారులను సమ్మెహనపరిచేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాలతో.. టిక్కెట్లు దక్కక వైఎస్సార్సీపీని వీడిన లావు కృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్, జంగా కృష్ణమూర్తి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిలకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా, ఆయన భార్య ప్రశాంతిని కోవూరు అభ్యర్థిగా.. లావు కృష్ణదేవరాయలును నరసరరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా.. వసంత కృష్ణప్రసాద్‌ను మైలవరం అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో మకాం వేసి రాయ‘భేరాలు’.. హైదరాబాద్‌లో మకాం వేసిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడిదారులతో రాయబారాలు.. భేరసారాలు జరుపుతున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టండి.. కోరుకున్న స్థానం నుంచి పోటీ చేయండి.. అధికారంలోకి వస్తే దొరికినంత దోచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తా అంటూ ఎన్నారైలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో చంద్రబాబు రాయబారాలు నడుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఫర్వాలేదు.. పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున దోచుకోవడానికి అవకాశం కల్పిస్తానంటూ రాజకీయాల నుంచి నిష్క్రమించిన ఆపార్టీ ప్రజాప్రతినిధితోనూ చంద్రబాబు బేరసారాలు జరిపినా ఫలితం రాలేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈసారి నారాయణ వాటా రూ.900 కోట్లు.. నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ 2014 వరకూ చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలను పరోక్షంగా చూశారు.. ఆ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. భారీ ఎత్తున ధనం వెదజల్లడంతో 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో నారాయణకు కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఐదేళ్లపాటు ఆకాశమే హద్దుగా చెలరేగిన నారాయణ భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాను.. ప్రజల ఆస్తులను దోచేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నారాయణ.. వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఎన్నికల ఖర్చుల కోసం ఇప్పటికే ప్రజల నుంచి మార్వాడీలు, వ్యాపారుల నుంచి రూ.650 కోట్లను సమీకరించిన నారాయణ చేర్చాల్సిన చోటకు చేర్చారు. వారం క్రితం మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో వ్యాపారుల నుంచి రూ.2 నుంచి రూ.3ల వడ్డీకి మరో రూ.250 కోట్లను సమీకరించిన నారాయణ టీడీపీకి ఎన్నికల నిధి కింద అందజేశారు. మొత్తమ్మీద ఈసారి తన వాటాగా నారాయణ రూ.900 కోట్లు సమకూర్చారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
కాపు కాయలేం
ఇన్నాళ్లూ ఓ అసమర్థుడి వెంట నడిచామన్న చేదు నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గు పడుతున్నాం. కాపులకు రాజ్యాధికారం అనే ఆశ మళ్లీ చిగురిస్తోందని సంబర పడుతున్న వేళ ఏమిటీ ప్రేలాపనలు? ఇదేం స్ట్రాటజీ? ఇవేం ఎత్తుగడలు? కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడతారా? ప్యాకేజీ స్టార్ అని వైసీపీ వాళ్లు అంటున్న మాట నిజమేనని ఆయన నోటే చెప్పకనే చెప్పారు. మా ఆశలను కూకటివేళ్లతో సహా పెకిలించేశారు. – సోషల్ మీడియాలో జనసేన అభిమానులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. వారందరిదీ అదే ఆవేదన గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గురువారం బహిరంగ లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ముద్రగడ.. తాజా రాజకీయ పరిణామాలపై తొలిసారి పవన్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కాపు ఉద్యమం సందర్భంగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపుల పైన, తన కుటుంబం పైన జరిపిన దాషీ్టకాలను సైతం దిగమింగుకుని పవన్‌కు మద్దతుగా నిలవాలని భావించానని చెప్పారు. అంతేకాకుండా ఆయనతో కలసి పని చేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని కలలుగన్న విషయాన్నీ తన లేఖలో ప్రస్తావించారు. పవన్ అభిమానులు ఆయనను ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే ఆయన మాత్రం 24 సీట్లకు మాత్రమే అంగీకరించడంపై ముద్రగడ విస్మయం వ్యక్తంచేశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం, ముందుగా రెండేళ్లు సీఎం, 80 అసెంబ్లీ సీట్లు కోరాల్సిందని ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టారు. బాబు మాటే పవన్‌కు శాసనం పవన్ తీరుతో మరో చారిత్రక తప్పిదం జరిగిపోయిందని కాపులు అంతర్మ«థనం చెందుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి భరోసా ఇవ్వడం ద్వారా బాబు పరపతి పెరగడానికి పరోక్షంగా పవనే కారకులయ్యారు. కానీ ఆ స్థాయిలో సీట్లు తీసుకు రాలేకపోవడంతో పవన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలై ఆ సామాజికవర్గంలో అంతర్మధనం మొదలైంది. సీట్లు, ఓట్లు బదిలీ, పవర్ షేరింగ్ కోసం అడుగుతున్న వారిపై పవన్ మాటలతో ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితుల్లో ఓటు షేరింగ్ ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. ఎలక్షన్ అంటే డబ్బుతో కూడుకున్న పని. అంత సత్తా మనకు ఉందా? కనీసం మనం భోజనాలు పెట్టించలేం..’ అని ప్రశ్నిస్తూ.. పవన్ తనకు తానుగానే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నిస్సత్తువ ఆవరించే పరిస్థితికి కారకులయ్యారని విశ్లేషిస్తున్నారు. అభిమానులు, ఆ సామాజికవర్గం మునుపటి మాదిరిగా ఉత్సాహంగా తాడేపల్లిగూడెం సభకు వెళ్లిన దాఖలాలు లేకపోవడానికి పవన్ నిర్ణయాలే కారణమని కాపు సామాజికవర్గ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటే పవన్‌కు శాసనమైందని వాపోతున్నారు. కనీసం 50 సీట్లు తీసుకుని ఉండాల్సింది పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నాలాంటి కాపు నాయకులకు ఇబ్బందిగా ఉంది. పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయికి తగినట్టుగా కనీసం 50 సీట్లు తీసుకుని ఉండుంటే మాకు సంతృప్తిగా ఉండేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ప్రయాణిస్తున్న క్రమంలో సీఎం పదవిలో కూడా షేరింగ్ ఉండుంటే మేమందరం ఆనందించే వాళ్లం. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఆవేదన కూడా ఇదే. – కల్వకొలను తాతాజీ, కాపు జేఏసీ నేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పవన్ నిర్ణయం సరికాదు పవన్ కాపు జాతిని నిరాశ పరిచారు. ఎన్నో ఏళ్లుగా కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ ద్వారా సాధ్యమవుతుందని కలలు కన్నాం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. ఇలాగైతే ఏ విధంగా సీఎం అవుతారు? చంద్రబాబుకు వత్తాసు పలకడానికే పవన్ ఉన్నట్టుంది. పవన్ నిర్ణయం సరికాదు. – కురుమళ్ల చిన్ని, కాపు నాయకుడు, కిర్లంపూడి, కాకినాడ జిల్లా 50–60 సీట్లు తీసుకోవాల్సింది రాష్ట్ర జనాభాలో 22 శాతం కాపులు ఉన్నారు. కాపు వర్గం వారు ఏ రోజైనా సీఎం అవుతారని ఊహించాం. టీడీపీతో పొత్తులో భాగంగా 50–60 సీట్లు వరకు తీసుకుంటారని ఆశించాం. కానీ 24 సీట్లకే పరిమితమవడం నిరుత్సాహానికి గురిచేసింది. – గుండాబత్తుల శ్రీను గోవిందరావు, మామిడికుదురు మండల కాపు నాడు అధ్యక్షుడు, కోనసీమ జిల్లా పవన్‌కు సీఎం పదవి ప్రకటిస్తారని ఆశించాం కోస్తా జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. పవన్ ద్వారా సీఎం పదవి వస్తుందని ఆశించాం. టీడీపీతో పొత్తు పేరిట 24 సీట్లకే పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా పవన్‌కు సీఎం పదవిని ఏడాదో, రెండేళ్లో ప్రకటిస్తారనుకున్నాం. ఆయన ఎందుకు తగ్గి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. – వెలుగుబండి సుబ్బారావు, కాపు నాయకుడు, వాకలపూడి, కాకినాడ జిల్లా -
టీడీపీ సభలో గాలిలో లేచిన కుర్చిలు
కర్నూలు సిటీ: తెలుగు దేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు శివారులోని ఎంఆర్సీ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ జిల్లా స్థాయి జయహో బీసీ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన కోట్ల వర్గీయుడిగా గుర్తింపుపొందిన మాచాని సోమ్‌నాథ్ సభకు హాజరయ్యారు. ఆయనను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వేదికపైకి ఆహ్వానించారు. దీంతో సమావేశంలో బీవీ అనుచరులు ఈలలు, కేకలు వేస్తూ వేదికపైకి సోమ్‌నాథ్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో బీవీ అనుచరులు, సోమ్‌నాథ్ అనుచరులు కుర్చిలు పైకెత్తి బాహాబాహీకి దిగారు. కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు సముదాయించినా వినిపించుకోలేదు. ‘ఓ జయ నాగేశ్వరరెడ్డీ .. నీ అనుచరులకు చెప్పుకుంటావా? సమావేశం నుంచి వెళ్లిపోతావా?’ అంటూ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ నాయకుడి పేరు రాకపోవడం..ఈసారి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్చార్జ్గా పని చేస్తున్న బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఏ సర్వేల్లో కూడా అనుకూలంగా రాకపోవడంతోనే సీటు ఖరారు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ తరుపున ఇన్చార్జిగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించడంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా బీసీలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీవీ వర్గానికి చెందిన వారు చంద్రబాబు నాయుడు ఆలోచనలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి ఉమ్మడి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు..మిగిలిన నియోజకవర్గాల్లో ఖరారు చేయకపోవడంతో అధినేత నిర్ణయంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం పంచాయతీ తేల్చకపోవడంతో ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జిల్లా స్థాయిలో జరిగిన జయహో బీసీ సభకు దూరంగా ఉన్నారు. ఇక ఆదోనిలో పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని టీడీపీ నేతలు ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు. మంత్రాలయంలోనూ అదే పరిస్థితి. ఈసారి అక్కడ బీసీలకు ఇస్తారని ప్రచారం ఉండడంతో ఇన్చార్జ్ తిక్కారెడ్డి అధినేత పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం ఇన్నేళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. సభలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
Fact Check: బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
కృష్ణా పుష్కరాలవేళ చంద్రబాబు ప్రభుత్వం పదుల సంఖ్యలో ఆలయాలు కూల్చేస్తే రామోజీకి చీమకుట్టినట్టయినా లేదు. అప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆయనకు అనిపించలేదు. పచ్చ కళ్ల మత్తులో జోగుతున్న ఈనాడుకు నిలదీయాలన్న ధ్యాసే లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని బాధ్యతగా పునరుద్ధరిస్తే కనీసం ప్రశంసించేందుకు కూడా మనసురాలేదు. పైగా కరోనా కల్లోల వేళ కొన్ని అసాంఘిక శక్తులు చేసిన దుష్టచర్యలను ఆనాడే జగన్ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తే ఇప్పుడు సర్కారును బాధ్యులను చేస్తూ ఈనాడులో వికృతరాతలు. ఎలాగోలా భక్తుల్లో అలజడి రేపితే మతఘర్షణలకు దారితీయదా... తద్వారా తెలుగుదేశానికి కలసిరాదా... ఈ ప్రభుత్వానికి అప్రదిష్ట కలగదా... అన్న ఉన్మాద రాతలకు తెగబడింది. ‘జగన్ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే’ అంటూ ఓ అబద్ధాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ♦ రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. ♦ అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. ♦ ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చింది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. ♦ ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. ♦ ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. ♦ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ♦ రాష్ట్రంలోనూ ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ నిర్వహణలోనూ రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్‌ను సుదీర్ఘకాలం తర్వాత 2022లో జగన్ ప్రభుత్వం రెండో విడత ఏర్పాటు చేసింది. -
గ్రూపులతో గుంజాటన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మొదలైంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది. ఎవరికివారే సొంత గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొత్తగా పా ర్టీలో చేరినవారికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుండటం పాతనేతలకు మింగుడుపడటం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. నాటి నుంచి ఇక్కడి టీడీపీ నాయకులు జనానికి ముఖం చాటేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారన్నది అగమ్యగోచరమే. విజయనగరంలో మూడు ముక్కలాట... విజయనగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. దశాబ్దాలుగా పా ర్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన అశోక్‌కు ఇంటా, బయటా వర్గపోరు తప్పట్లేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతోపాటు తాజాగా వాజీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు పోటీదారులుగా చేరారు. ఈ ఇద్దరి పోకడ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి సుతరామూ ఇష్టం లేదు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత అశోక్ వర్గంపై పైచేయి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి సామాజిక బలం, ఓటుబ్యాంకు లేకున్నా కేవలం ఆర్థిక బలంతో నెట్టుకొచ్చేద్దామన్న ఆలోచనతో వాజీ సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు మరోవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అశోక్ బంగ్లాతో ప్రమేయం లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నవారి జాబితాలో మీసాల గీత తర్వాత వాజీ శ్రీనివాసరావు చేరారు. ఆ ఇద్దరి నేతృత్వంలో జరిగే ఏ కార్యక్రమానికీ వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు అశోక్ ఇప్పటికే హుకుం జారీచేశారు. బేబినాయనకు కేడర్ సమస్య బొబ్బిలిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలుస్తున్న ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు(బేబీనాయన)కే టికెట్ లభిస్తుందనేది అందరి మాట. ఆయన సోదరుడు సుజయ్‌కృష్ణ రంగారావు సీన్లోకి వస్తే సీటు తన్నుకుపోతాడనే భయం బేబీనాయన అనుచరుల్లో ఉంది. కానీ మండలాల్లో కేడర్ మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అన్నిచోట్లా గ్రూపు తగాదాలున్నాయి. రామభద్రపురం మండలంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడక తిరుపతి, కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటా్నయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షుడు తెంటు రవిబాబు పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కళా, ప్రతిభల మధ్య నలుగుతున్న కోండ్రు రాజాం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న కోండ్రు మురళీమోహన్‌కు అక్కడి సీనియర్ నేతలైన కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి వర్గాలతో తెగని పేచీ ఉంది. ఇప్పటికే రేగిడి మండలంలో కళా వెంకటరావు సోదరుడు కిమిడి రామకృష్ణంనాయుడు కోండ్రుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాజాం మండలం పొగిరికి చెందిన టీడీపీ మాజీ ఎంపీపీ జడ్డు విష్ణుమూర్తి కోండ్రు ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికీ రావట్లేదు. మరోవైపు ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఈసారి తనకు ఎలాగైనా రాజాంలో పోటీ చేసే అవకాశం వస్తుందనే ఆశలో పావులు కదుపుతున్నారు. కోళ్లకు కృష్ణ సెగ శృంగవరపుకోటను మొదటి నుంచీ ఏలుతున్న కోళ్ల కుటుంబానికి గొంప కృష్ణ రూపంలో సెగ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తానే సీనియర్‌ననీ... లోకేశ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని చెప్పుకుంటుండగా చంద్రబాబు అండతో ప్రవాస భారతీయుడు గొంప కృష్ణ వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తలను తనవైపునకు తిప్పుకుంటున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు లలితకుమారి ప్రతి గ్రామానికి వెళ్లి బంధువుల ఇళ్లల్లో ఆంతరంగిక సమావేశాలు పెడుతున్నారు. నెల్లిమర్లలో అంతా అయోమయం నెల్లిమర్ల టీడీపీ టికెట్ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి భోగాపురం మండలానికి చెందిన కర్రోతు బంగార్రాజుకు ఖరారైనట్లేనని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినా మరో ముగ్గురు ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డెంకాడ మండలానికి చెందిన కంది చంద్రశేఖర్, పూసపాటిరేగ మండలానికి చెందిన పతివాడ తమ్మునాయుడు, నెల్లిమర్ల మండలానికి చెందిన కడగల ఆనంద్‌కుమార్ ఉన్నారు. బంగార్రాజు స్పీడుకు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు వర్గీయులు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్చార్జి లోకం మాధవికే అవకాశం ఉంటుందన్న ప్రచారమూ లేకపోలేదు. నిమ్మకకు పెరిగిన అసమ్మతి పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణకు సొంత పా ర్టీలోనే అసమ్మతి పెరిగిపోతోంది. ఆయనకు పోటీగా పడాల భూదేవి, వంగర మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు తేజోవతి కళా వెంకటరావు ప్రోత్సాహంతో టికెట్ కోసం పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన టీడీపీ నాయకులైన సామంతుల దామోదరరావు, ఖండాపు వెంకటరమణ తదితరులు నిమ్మక తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు భూదేవికి పరోక్షంగా మద్దతిస్తున్నారు. వీరికి అచ్చెన్నాయుడు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ వ్యవహారాలవల్ల నియోజకవర్గంలోని కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. నాయుడు పక్కలో బల్లెంలా ‘కరణం’ గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీకి అంతా తానే అని భావిస్తున్న కేఏ నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పక్కలో బల్లెంలా మారారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతుండటంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పడాల అరుణ జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆమె కూడా పొత్తులో భాగంగా తనకే టికెట్ కేటాయించాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. గంటా పేరుతో గందరగోళం చీపురుపల్లిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నా చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు వార్తలొచ్చాయి. గంటా ఇక్కడ పోటీ చేయకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పనిసరైతే స్థానిక కేడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్న కిమిడి నాగార్జున అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. అంతో ఇంతో కేడర్ బలమున్న కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజుకు ప్రతిసారీ పార్టీ అధిష్టానం మొండి చెయ్యి చూపిస్తుండటంతో ఆయన స్తబ్దుగానే ఉన్నారు. కురుపాంలో కుమ్ములాట... కురుపాంలో టీడీపీ టికెట్ కోసం ఎనిమిది మంది కుమ్ములాడుకుంటున్నారు. తోయక జగదేశ్వరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇప్పించడంలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కీలక పాత్ర పోషించారు. ఇది నచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు మరో ఏడుగురు ఆశావాహులను తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి టికెట్ ఇప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ప్రదీప్‌కుమార్ దేవ్ తనయుడు వీరేశ్‌దేవ్ కూడా టికెట్‌కోసం అశోక్ గజపతి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్వతీపురంలో తెరపైకి ఎన్నారై దశాబ్దాలుగా పా ర్టీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఇక్కడ డబ్బు పెట్టగలిగిన ప్రవాస భారతీయుడు బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్న బాబు హామీతో చిరంజీవులు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... అంత ఉత్సాహం అయితే ఆయనలో కనిపించడం లేదు. మరో సీనియర్ నాయకుడు గర్భాపు ఉదయభానుకు చంద్రబాబు గత రెండు ఎన్నికలుగా మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సాలూరులో ఆగని వర్గపోరు... సాలూరులో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్.కె.భంజ్‌దేవ్ మధ్య వైరం కొనసాగుతోంది. ఇరువురూ బయటకు సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా... ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదర్చలేని అధిష్టానం ఇక్కడ కూడా ఓ ఎన్ఆర్ఐని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
పారాచూట్ నేతలతో.. టీడీపీలో భగభగలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీలోకి వివిధ నియోజకవర్గాల్లో పారాచూట్ నాయకులు దిగిపోవడంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడ నుంచో ఉన్నట్టుండి నియోజకవర్గాల్లో దిగిన వారితో స్థానిక నేతలు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ఏమాత్రం పొసగడంలేదు. పైగా.. ఈ పారాచూట్ నేతలకు ఉన్న ధనబలం, హంగు ఆర్భాటాలకే చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం తాముపడ్డ కష్టాలు, చేసిన పనులన్నింటినీ మరచిపోయి ఇప్పుడు ఒక్కసారిగా బయట నుంచి ఎవరెవరినో తీసుకొస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వారిని ఏమాత్రం ఖాతరు చేయకుండా డబ్బున్న వారే తన దగ్గరకు రావాలని స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలను కూడా పక్కనపెట్టి ఈ పారాచూట్ నేతలను ఇన్ఛార్జిలుగా ప్రకటిస్తున్నారు. దీంతో వీరికి.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కాకినాడలో ‘సానా’ వర్సెస్ సీనియర్లు.. కాకినాడ ఎంపీ సీటు రేసులో వ్యాపారవేత్త సానా సతీష్ దూసు కురావడంతో సీని యర్ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక దాన్నుంచి పోటీచేసేందుకు రెడీగా ఉండడం, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మద్దతు ఆయనకే ఉండడం జ్యోతుల నెహ్రూ వర్గానికి మింగుడు పడడంలేదు. నెహ్రూ తన కుమారుడు నవీన్‌కుమార్‌తో ఎంపీగా పోటీచేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అసలు పార్టీలో సభ్యత్వం కూడా లేని సతీష్ అడ్డుపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను ఉన్నట్టుండి తీసుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న యనమలకు వరుసకు సోదరుడైన కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక దశలో ఆయన పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధమయ్యారు. దివ్యను వ్యతిరేకిస్తూ ఆమె వర్గానికి చెందిన యనమల రాజేష్‌పై కృష్ణుడు వర్గం దాడి కూడా చేసింది. ఈ విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ తెరపైకి రావడంతో ఇప్పటివరకు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న బాలయోగి తనయుడు గంటి హరీష్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏలూరు ఎంపీ సీటుపై సిగపట్లు.. ఇక ఏలూరు జిల్లా చింతల పూడి అసెంబ్లీ నియో జకవర్గ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ సొంగా రోషన్‌ను నియమించడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు భగ్గు మంటున్నారు. అలాగే, ఏలూరు పార్లమెంటు సీటు కోసం ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ ముందుకురావడంతో ఆ సీటు తమదేనని భావి స్తున్న మాగంటి బాబు, బోళ్ల కుటుంబీకులు ఆందోళనలో మునిగిపోయారు. గోపాల్ నాలుగు నెల లుగా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు సభలకు ఫుల్‌పేజీ యాడ్స్ ఇస్తూ హడావిడి చేస్తుండడం, పార్టీ నేతలతో సంబంధం లేకుండా విడిగా తన హంగు ప్రదర్శిస్తుండడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. గుడివాడ, గుంటూరులో గరం గరం.. మరోవైపు.. కృష్ణాజిల్లా గుడి వాడ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని నియమించడంతో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న రావి వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహంతో రగి లిపోతోంది. కేవలం ధన బలం ఉందనే కారణంతో నే రావిని కాదని వెనిగళ్లకు చంద్రబాబు సీటు ఖరా రుచేయడం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. అలా గే, గుంటూరు ఎంపీ సీటు రేసులో ఎన్ఆర్ఐ పెమ్మ సాని చంద్రశేఖర్‌ను చంద్రబాబు రంగంలోకి దింపడం అక్కడున్న నేతలకు మింగుడుపడడంలేదు. నాగబాబు ఎంట్రీతో అనకాపల్లిలో సీన్ రివర్స్.. ఇక అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సీనియర్లను కాదని బయట ప్రాంతం నుంచి వచ్చిన బైరా దిలీప్‌కుమార్ పేరును తెరపైకి తీసుకొ చ్చారు. టీడీపీ కార్యక్రమాలకు, లోకేశ్ యువగళం యాత్రకు భారీగా ఖర్చుచేసిన దిలీప్ టీడీపీ, జనసేన పొత్తులో పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టేలా పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోతోంది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు ఎన్ఆర్ఐ గొంప కృష్ణను దిగుమతి చేయడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం రగిలిపోతోంది. పార్వతీపురం అసెంబ్లీ ఇన్చార్జి కొత్తగా బోనెల విజయచంద్రను నియమించడంతో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పల్నాడులో భాష్యం ప్రవీణ్ హల్చల్.. పల్నాడు జిల్లాలో వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్ హడావుడితో సీనియర్ నేతలు మండిపడుతున్నారు. మొదట్లో ఆయన చిలకలూరిపేటపై దృష్టిపెట్టి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎసరు పెట్టడంతో పార్టీలో అలజడి రేగింది. కేడర్ ఆందోళనతో ప్రవీణ్‌ను చిల కలూరిపేట నుంచి తప్పించినా ప్రస్తుతం పెదకూరపాడు సీటును ఆయనకు ఇస్తామని చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో అక్కడి ఇన్‌ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్ ఆందోళన చెందుతూ తన వర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ ఏంచేయాలో చర్చిస్తున్నారు. ఎన్నికల ఫండ్ ఇచ్చిన వ్యక్తికి అందలం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌ను దాదాపు ఖరారు చేశారు. లోకేశ్ సన్నిహితుడిగా ఉన్న ఆయన ఎన్ఆర్ఐల నుంచి ఎన్నికల ఫండ్ సేకరించి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన దెబ్బకు ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు సీటు నిరాకరించడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కావలి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి దాదాపు ఖరారుచేయడంతో అక్కడి ఇన్‌ఛార్జి సుబ్బానాయుడు, సీనియర్ నేత బీద రవిచంద్రలు గుర్రుగా ఉన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవలే పార్టీలో తిరుగుతున్న డాక్టర్ థామస్‌కే సీటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో పలువురు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. కళ్యాణదుర్గం రేసులో కాంట్రాక్టర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుని పోటీకి దింపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుండడం సీనియర్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్న పేరును అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమైంది. -
ఉనికి కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సీఎం వైఎస్ జగన్ మరింత పెంచుకున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం, నిత్యం జనంతో మమేకమవడం, ప్రజలకు మంచి చేయడం, మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరడమే సీఎం జగన్ సిద్ధాంతమని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మద్దతు తెలిపామని ఆయన చెప్పారు. సెక్యులర్ భావనకు విఘాతం కలిగించే ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులను వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రేపల్లె, వేమూరులో టీడీపీకి గట్టి షాక్ వైఎస్సార్సీపీలో చేరిన ఆ నియోజకవర్గాల టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. రేపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు, వేమూరు నియోజకవర్గం చుండూరు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాలకు చెందిన వందలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో లోక్‌సభ, శాసన సభ అభ్యర్థుల ఎంపికలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని తెలిపారు. వేమూరు ప్రజలు వరికూటి అశోక్‌బాబును గెలిపించాలని, ఆయన అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. ఎస్సీ సామాజికవర్గంలో వర్గ విభేదాలు సృష్టించేందుకు చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండే ఊవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలు గెలిపించాలని కోరారు. రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు మూడో అవకాశం ఇవ్వొద్దని కోరారు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని జూదం ఆడుకుంటాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని చెప్పారు. పార్టీ కోసం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారన్నారు. -
అదంతా ‘పచ్చ’ అబద్ధం!
సాక్షి, అమరావతి: నిత్యం కట్టుకథలతో పేజీలకు పేజీలు నింపేస్తున్న ఈనాడు పత్రిక గురువారం మరో అబద్దాన్ని అందంగా అచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల పోద్బలంతో అక్కడి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు యత్నిస్తున్న అమరావతి ఈనాడు విలేకరిపై ఏకంగా పెట్రోల్‌పోసి నిప్పంటించేస్తామని బెదిరించి... చంపబోయారన్నట్టు... ఓ అబద్దపు వార్త ప్రచురించింది. వాస్తవానికి ఆ విలేకరి పీడీయాక్ట్పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన టీడీపీ నేత దండా నాగేంద్రతో సన్నిహితంగా ఉంటూ అతను చెప్పినట్టు ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న ఆ విలేకరిని వేరే పత్రిక తొలగిస్తే టీడీపీనేత దండా సిఫార్సుతో ఈనాడులో కొన్నాళ్ల క్రితం చేరాడు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్న నాగేంద్రం సూచనమేరకు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. ఇసుక ర్యాంపులోకి అక్రమంగా... అమరావతి మండలం మల్లాది ఇసుకరీచ్‌ను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం స్వయంగా పరిశీలించారు. కానీ తవ్వకాలు ఆపమని బుధవారానికి ఎటువంటి ఆదేశాలు రాకపోవటంతో యథావిధిగానే ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థాయి అధికారులు ఉదయం 10.30గంటలకు వచ్చి తవ్వకాలు ఆపేయాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడింగ్ చేయటానికి నిర్వాహకులు బిల్లులు రాశారు, ఇంకా బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనక్కు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలతో ఇసుక పంపించేశారు. అదే సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో “ఏంటబ్బాయ్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నావు... గతంలో కూడా ఇలాగే ఫొటోలు తీసి నిజాలు దాచిపెట్టి అబద్దాలు రాసి మన ఊరి పరువుతీస్తున్నావ’ని సరదాగా అన్నారు. దానికి ఆయన “నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రీచ్‌లోకి రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తాను’ అంటూ దురుసుగా మాట్లాడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదం జరిగింది. ఈనాడు కంట్రిబ్యూటర్ కవ్వింపు చర్యలకు దిగడంతో తోపులాట జరిగింది. వెంటనే ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి కంట్రిబ్యూటర్‌ను ద్విచక్ర వాహనంపై పంపించేశారు. కిందపడిపోయిన ఆయన సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం ద్వారా అప్పగించారు. ఈనాడులో వచ్చింది అబద్ధం జరిగిన సంఘటన ఒకటైతే... ఈనాడు పత్రికలో వేరేవిధంగా వార్త వచ్చిందని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు మీడియాకు తెలిపారు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఈనాడు కంట్రిబ్యూటర్ ఇసుక రీచ్‌లోకి ప్రవేశించడమే గాకుండా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగాడనీ ఆ సమయంలో “పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం’ అని ఎవరూ అనలేదని, అసలు నిర్బంధించలేదని చెప్పారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్సీపీ అనిగానీ, ఎమ్మెల్యే శంకరరావు పేరుగానీ ప్రస్తావించకపోయినా ఈనాడులో తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, రాజకీయ రంగు పులిమారనీ పేర్కొన్నారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో కంట్రిబ్యూటర్ గుంటూరు ఈనాడు కార్యాలయానికి వెళ్లాక, అక్కడ కట్టు కథ అల్లి అడ్డగోలుగా వార్త ప్రచురించినట్టు స్పష్టమైంది. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
పాతపట్నంలో కొత్త రచ్చ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్ఓఎస్, ఎస్ఎంఎస్ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి. ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ, గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్లో కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్ సర్వే అని రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి. కుమ్ములాటలు కొత్తకాదు.. పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ నేపథ్యం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్‌విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్‌కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు. అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు. ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్ మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం? అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్‌గానీ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్‌రావు వివరించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. -
నరకం చూపి ‘నారా’ నాడు
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు. పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది.. అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు. నేడు వేకువజామునే ఇంటికి.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి. కాళ్లు లేకున్నా.. కరుణించలేదు నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్‌దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్‌దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
ఎవరికి వారే..'బాపట్ల' తీరే !
బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు. ‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యా... ఏందయ్యా ఇది? చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది. ‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా? వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది. ‘వేగేశన’తో వేగలేం ! బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది. వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్‌వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్‌ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది. ‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం.. రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది. ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే.. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రామంటున్న జనం.. టీడీపీలో కలవరం
టీడీపీ సభలకు జనం ‘కదలిరా’వడం లేదు. కార్యకర్తలు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా... చివరి వరకూ ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు... అదేపనిగా రాగాలు తీస్తూ జగన్‌పై నిందారోపణలు... జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు... సభలను నీరుగార్చేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కోసభ నిర్వహించాలని యోచించినా... పట్టుమని పది సభలే నిర్వహించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దత్తపుత్రుడి సాయం తీసుకుందామను కుంటే... ఆయన నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు తేలకుండా సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదు. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రా కదలిరా’ పేరిట ప్రారంభించిన సభలు అర్ధంతరంగా ఆపేస్తున్నారా... అంటే తమ్ముళ్లనుంచి ఔననే సమాధానం వస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం... టీడీపీ నేతలు, క్యాడర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పటివరకు 10 సభలు నిర్వహించినా మిగిలిన జిల్లాల్లో వాటిని నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి.. మరికొన్ని చోట్ల రద్దు చేసి.. మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకూ షెడ్యూల్ ప్రకటించినా... జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలు నిలిచిపోయాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరు సభ, బుధవారం జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గోపాలపురంలో సభ నిర్వహించాల్సి వున్నా అక్కడ రద్దు చేసి 29న రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. సభలన్నీ అట్టర్ ఫ్లాపే ఇప్పటివరకు నిర్వహించిన సభలన్నీ విఫలమవడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. తిరువూరు, కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ తదితర సభలు జనం లేక వెలవెలబోయాయి. సభలు విజయవంతమైనట్లు ఎల్లోమీడియా ఎంతగా బూస్టప్ ఇచ్చినా వాస్తవానికి అవన్నీ ఫ్లాపేనని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అరకులో పెట్టిన సభ తర్వాత ఇక నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగంలో సీఎం జగన్‌పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి చేశారో చెప్పలేకపోవంతో జనం విసిగెత్తిపోతున్నారు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి హామీలను ఏమాత్రం నమ్మడం లేదు. కార్యక్రమాలన్నీ విఫలమే... బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నాయి. బాదుడే బాదుడు,, ఆయన కుమారుడు లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికీ సరైన ఆదరణ లభించలేదు. బాబుపై నమ్మకం పోయింది జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రా కదలిరా సభలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం దీనికి నిదర్శనం. సీట్లు ఖరారు కాకుండా సభలకు ఎందుకెళ్లాలని పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రా కదలిరా సభలకు ఇక ఫుల్స్టాప్ పెట్టనున్నారు. త్వరలో మరో కొత్త పేరుతో, కొత్త కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నా... అసలు జనాన్నిఆకర్షించలేకపోవడంతో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం ఏమిటనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో అయోమయం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా తయారైంది. పార్టీ టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోలేక తల బొప్పి కట్టిపోతోంది. జనసేనతో పొత్తుపై పార్టీ నేతలంతా పెదవి విరుస్తుండటంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమ టికెట్ సంగతి తేలిస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఎక్కడికక్కడ నేతలు తెగేసి చెబుతుండటంతో తండ్రీ కొడుకులకు నిద్ర కరువైంది. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పాతాళానికి కుంగిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతోంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పూర్తిగా అయోమయం నెలకొంది. పలుచోట్ల పార్టీకి ఇన్‌ఛార్జిలు లేకపోవడాన్ని బట్టే ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతోంది. నాయకులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదే బాటలో మరికొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ.. బీజేపీతో కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తుండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. తమ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఏ స్థానంలో తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ క్యాడర్ అయోమయంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పలుచోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా ముందు తమ సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. గాల్లో గంటా శ్రీనివాసరావు సీటు సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంటా వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన తంటాలు పడుతున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం కూడా టీడీపీపై రగిలిపోతోంది. పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతోంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అయ్యన్న అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా.. మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తితో రగిలి పోతున్నారు. తన సీటు జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన.. అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి చూస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్‌లు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో టీడీపీకి హెచ్చరికలు కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతుండగా, చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చు పెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దేవినేని ఉమకు సీటు లేదు ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన తనను మోసం చేశారని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది. సీటు లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పని చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంత, కర్నూలు జిల్లాల్లోనూ అదే తీరు ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎవరికి సీటిచ్చినా రెండో వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. దీంతో పరిటాల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనను నమ్మించి పని చేయించుకుని ఇప్పుడు మాట మారిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడులో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను నియమించడంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంది. బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలూరు సీటు ఇవ్వకపోతే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారు. డోన్ అభ్యర్థిగా చంద్రబాబు.. ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా, కేఈ ప్రభాకర్ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు. అదే జరిగితే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
చంద్రబాబు, లోకేశ్ దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఇదేం పద్ధతని, లోకేశ్ ఏమైనా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
తెలుగుదేశంలో గందరగోళం
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడం, పొత్తుల నేపథ్యంలో శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించడం టీడీపీ అధిష్టానం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలంటేనే అభ్యర్థులు వెనుకాడుతున్నారు. మెజార్టీ ఎంపీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎన్నికలకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించేవారు. ఈ ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసేవారు. ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఆ హడావుడి ఏమీ కనిపించడం లేదు. మరోవైపు పొత్తుల వల్ల నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దశలో జనసేన–టీడీపీ మధ్య సీట్ల పంపకం కత్తిమీద సాములా మారనుంది. దీనికితోడు బీజేపీతోనూ పొత్తు కోసం బాబు తహతహలాడుతున్న నేపథ్యంలో స్థానాల కేటాయింపు మరింత సంక్లిష్టంగా మారే ఆస్కారం ఉందనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ఎత్తుగడలతో కలవరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ఎత్తుగడలు టీడీపీని కలవరపెడుతున్నాయి. సీఎం చకచక వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు సామాజిక సమతూకం పాటిస్తుండడం, కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి త్వరగా వెళ్లేలా చూడడం వంటి చర్యలు టీడీపీని సతమతం చేస్తున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం సొంత సోషల్ మీడియా, ఎల్లో మీడియా, నోటి ప్రచార వ్యూహాలతో బలంగా ఉన్నట్టు కలరింగ్ ఇచ్చుకునేందుకు యతి్నస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగోలేవని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆత్మరక్షణగా తొలి జాబితా విడుదలకు యత్నం ! బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు, క్యాడర్‌ను సమాధానపరిచేందుకు టీడీపీ ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది. పొత్తులతో సంబంధం లేకుండా ఇబ్బందులేమీ లేవని భావిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి వంటి కొన్ని స్థానాలను గుర్తించి 25 మందితో తొలి జాబితాను ప్రకటించాలని చూస్తోంది. సంక్రాంతికి ఈ జాబితా విడుదలకు యతి్నస్తున్నా.. అది ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. బాబు పక్కచూపులు టీడీపీ నుంచి పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీలోని అసంతృప్తుల వైపు చంద్రబాబు చూస్తున్నారు. అక్కడ చోటు లేక బయటకు వచ్చేవారిని చేర్చుకుని సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికార పార్టీలో సీటు దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనకు పెనమలూరు లేదా నూజివీడు సీటు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా చాలాచోట్ల వైఎస్సార్సీపీ సీటు నిరాకరించిన నేతలను చేర్చుకుని అభ్యర్థుల కొరత తీర్చుకోవాలని బాబు చూస్తున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందనే వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. -
తెలుగువాళ్లు నా వల్లే బాగుపడ్డారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని: తెలుగువాళ్లు తన వల్లే బాగుపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొన్నారు. టెక్నాలజీకి ప్రాముఖ్యత కల్పించి ముందుగా తాను తీసుకున్న నిర్ణయం వల్లే ప్రపంచమంతా తెలుగువారు రాణిస్తున్నారని అన్నారు. తాను ఆరోజు కష్టపడితేనే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ఈరోజు హైదరాబాద్‌పై తన ప్రగాఢ ముద్ర కనపడుతోందని అన్నారు. రా కదలి రా పేరుతో బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు, ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఇటీవల తనకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో సంఘీభావం ప్రకటించారని, అదీ తన సత్తా అని చెప్పారు. ఐదేళ్లుగా మన రాష్ట్రం వెనుకబడిపోయిందని, తామొస్తే ప్రజల భవిష్యత్తు బంగారం చేస్తానని అన్నారు. యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, కరెంటు చార్జీలు తగ్గిస్తాం అంటూ పలు హామీలు గుప్పించారు. తాను చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నది రద్దుల ప్రభుత్వమని, పేదవాడి వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. నోటికొచ్చినట్లు... ‘పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో పెడతారా? ఆయనో ఏసుప్రభువు. ఎక్కడకు పోతున్నారు? ఆయన పంపించారా ఏసు ప్రభువని? సర్వే రాళ్లపై ఆయన ఫొటో ఏంటి? భూ రక్షణ కాదు. భూ భక్షణ చట్టం. ఇది అమలయితే మీ ఇల్లు మీది కాదు. మీ భూమి మీది కాదు. కబ్జా అయితే నేరుగా హైకోర్టుకు పోవాలి. మీ రికార్డులు తారుమారు చేస్తున్నాడు జగన్. దీనికి మద్దతు ఇవ్వం’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. బొత్సపై నోరు పారేసుకున్న బాబు ‘ఉత్తరాంధ్రలో బొత్స ఉన్నాడు. మనిషి లావు. ఆయనేం చెబుతాడో మనకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వచ్చారు. బొత్స మాట్లాడడు. పెత్తందార్లకు పెత్తనం’ అంటూ దుర్భాషలాడారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో నంబర్ వన్ పెత్తందారు జగన్ అన్నారు. తునిలో మంత్రి రాజా చెక్ పోస్టులలో వసూళ్లు. మామూళ్ల దెబ్బకు జనం పారిపోతున్నారన్నారు. బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడినే అని ఆరోపించారు. కార్యకర్తలపైనే చులకన మాటలు ఈ సభల్లో కార్యకర్తలపైనే చంద్రబాబు చులకనగా మాట్లాడారు. ‘మా తమ్ముళ్లు మందు బాబులు. సాయంత్రం క్వార్టర్ వేసుకుని నిద్రపోదామనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాదుడే బాదుడు. 50 రూపాయల బాటిల్ ఇప్పుడు రూ.200కు అమ్ముతున్నారు. మద్యం ధరలు పెంచి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు’ అంటూ ఆరోపించారు. ‘టీడీపీ, జనసేన జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లండి. గ్లాసు కూడా తీసుకెళ్లండి. నీళ్లు తాగడానికి పనికొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. పోతాం.. మేమెళ్లిపోతాం.. ‘రా కదిలి రా’ అంటూ టీడీపీ నిర్వహించిన ఈ సభలకు టీడీపీ నేతలు రూ.300ల నుంచి రూ.500 నగదు, క్వార్టర్ మందు, పలావు ప్యాకెట్ ఇచ్చి జనాన్ని అయితే తీసుకు వచ్చారు కానీ, చంద్రబాబు ప్రసంగం అయ్యే వరకు వారిని ఆపలేకపోయారు. పార్టీ కేడర్ ఎంత ప్రయత్నించినా జనం వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. ముఖ్యంగా మహిళలు మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడంతో పార్టీ కేడర్ చేతులెత్తేసింది. కుర్చీలు ఖాళీ అయిపోయినా, చంద్రబాబు మాత్రం ఎక్కడా ఆపకుండా రెండు సభల్లోనూ గంటకు పైగా ఏకబిగిన ప్రసంగించారు. బొబ్బిలి సభకు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గైర్హాజరయ్యారు. -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
‘దేశం’లో ధనస్వామ్యం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పేదల కోసమే పుట్టిందంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఎన్నికల్లో సీట్లు మాత్రం పెత్తందారులకే కట్టబెడుతున్నారు. ఇందుకోసం మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి ఆ జెండానే నమ్ముకున్న వారిని పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ధనబలం ఉన్న వారికే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇస్తామని, ఇందులో మరో ఆలోచనకే తావులేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత ఇటీవల చంద్రబాబును కలిసి పార్టీని నిలబెట్టేందుకు తాను ఎంతలా కష్టపడ్డానో చెప్పి ఈసారి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడం సాధ్యంకాదని ఆయన తెగేసి చెప్పారు. పోటీ చేసేవాళ్లు బయట వాళ్లా, పార్టీ వాళ్లా అనేది ముఖ్యం కాదని డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సీట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పార్టీ వ్యూహ రచన సమావేశాల్లోనూ చంద్రబాబు, ముఖ్య నేతలు ఇదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అభ్యర్థుల అన్వేషణ, ఎంపికలోనూ దీన్నే పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చాలాచోట్ల కొత్త పెత్తందారుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు గేట్లు బార్లా తెరిచేశారు. పార్టీ ఫండ్ ఇవ్వండి, సీట్లు తీసుకోండని టీడీపీ సీనియర్లు బడాబాబులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. వలలో పడిన వారిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. బాబు చేసే ఈ ధన యజ్ఞంలో పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న నేతలూ కొట్టుకుపోయే పరిస్థితి దాపురించిందని పార్టీనే నమ్ముకున్న సీనియర్లు వాపోతున్నారు. డబ్బులేదని నానికి ఝలక్.. తమ్ముడికి ఛాన్స్.. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ప్రస్తుతం డబ్బు ఖర్చుచేసే పరిస్థితి లేదని తెలియడంతో చంద్రబాబు ఆయన్ను అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు. ఎంపీగా ఉన్నా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు పిలవడంలేదు. చోటామోటా నేతలతో ఆయన్ను తిట్టిస్తున్నారు. పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి సృష్టించారు. నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు ఇటీవల స్పష్టంచేశారు. రూ.100 కోట్లకుపైగా డబ్బును ఖర్చుపెట్టేందుకు ఆయన సిద్ధపడడంతో చిన్నికి అవకాశమిచ్చారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదించి, సొంత అన్నతోనే విభేదించిన చిన్ని చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి సీటు తెచ్చుకున్నారనే ప్రచారం టీడీపీలోనే విస్తృతంగా జరుగుతోంది. గుంటూరు బరిలో విద్యా సంస్థల అధినేత! గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానంలో పార్టీ కోసం ఇప్పటివరకూ పనిచేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన చంద్రబాబు చేతులు మీదుగా ప్రజలకు పండుగ కానుకలు ఇస్తామని మభ్యపెట్టి తొక్కిసలాటలో ముగ్గురి మృతికి కారణమయ్యారు. అలాగే, గుంటూరు ఎంపీ స్థానం నుంచి భాష్యం విద్యా సంస్థల యజమాని రామకృష్ణను పోటీచేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు బడా బాబుల కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. ♦ కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం మొదటి నుండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌ను కాదని వ్యాపారవేత్త సానా సతీష్ కు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ♦ తుని అసెంబ్లీ స్థానంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోసిన కృష్ణుణ్ణి నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు సీటు కట్ట బెడుతున్నారు. ♦రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ను తప్పించి ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణను ఇన్‌ఛార్జిని చేశారు. ♦ అమలాపురం ఎస్సీ రిజర్వు స్థానంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కాదని ఆర్థికంగా ధన బలం ఉన్న అయితాబత్తుల సత్యశ్రీకి సీటు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ చివరికి పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కూడా కాదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ధనవంతుడు, కాంట్రాక్టర్ చంద్రమౌళికి సీటు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబానికే ఓటు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పెత్తందారులకే సీట్లు కట్టబెట్టేందుకు చంద్రబాబు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గండి బాబ్జి స్థానంలో తన కుటుంబానికి చెందిన ‘గీతం’ భరత్‌ను రంగంలోకి దించేందుకు చంద్రబాబు రంగం సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. తెరపైకి ఎన్ఆర్ఐలు ♦ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కోళ్ల అప్పలనాయుడు కుటుంబాన్ని కాదని ఎన్ఆర్ఐ కొంప కృష్ణను రంగంలోకి దించారు. తనదే సీటని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ♦ నెల్లిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామిని కాదని బంగార్రాజు అనే వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబాన్ని పక్కనపెట్టి ఎన్ఆర్ఐ గోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చారు. ♦ కృష్ణాజిల్లా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కుటుంబం ఎన్టీఆర్ నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. ఇప్పుడు డబ్బులేదనే కారణంతోనే రావిని పక్కకు నెట్టి ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. రాముకున్న అర్హత కేవలం ధన బలం మాత్రమేనని, డబ్బు లేకపోవడంవల్లే తనను దూరం పెట్టారని రావి వెంకటేశ్వరరావు వాపోతున్నారు. -
‘పాత సామాన్లు కొంటాం.. చెత్తా చెదారం కొంటాం!’
పొద్దున్నే లేవగానే వీధుల్లోకి మైకేసుకుని రిక్షాలో వస్తుంటారు ఇలాంటి వాళ్ళు.. పెద్ద సౌండ్ చేస్తూ పాత కుర్చీలు.. వాడని సైకిళ్ళు.. ప్లాస్టిక్ బకెట్లు కొంటాం.. ఉల్లిపాయలు ఇస్తాం అంటుంటారు.. అంటే ఈ సామాన్లు సదరు కాలనీవాసులకు పనికిరాదు కానీ ఆ వ్యాపారికి మాత్రం లాభసాటి అన్నమాట.. తడిచెత్త.. పొడిచెత్త మనకు పనికిరాదు కానీ దాంతో విద్యుత్ తయారు చేసేవాళ్లకు మాత్రం అదే బంగారం. తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి సైతం అలాగే మారింది. గత కొన్నాళ్లుగా.. క్షయ రోగి మాదిరిగా క్షీణిస్తూ వస్తున్న తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేవాళ్లే తప్ప కొత్తగా చేరేవాళ్ళు కానరావడం లేదు. దీంతో ఏ మొక్కా లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం అయినట్లుగా.. ప్రజలు పూర్తిగా మరచిపోయిన, ప్రజాదరణ లేని కొందరిని తెలుగుదేశంలో చేర్చుకుని అదే మహాప్రసాదంగా భవిస్తూ సంబరపడిపోతున్నారు. దాంతోబాటు తెలుగుదేశం మద్దతుదారు అయిన పచ్చ మీడియా సైతం తెలుగుదేశం బలపడుతోందంటూ ఊదరగొడుతున్నారు. ►వాస్తవానికి నిన్న టీడీపీలో చేరినవాళ్లలో ద్వారకానాథ రెడ్డి 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో ద్వారకానాథరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో టికెట్ దక్కలేదు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తర్వాత 2014లో టికెట్ ఆశించగా దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా 2019లో వైఎస్సార్సీపీ, టీడీపీల నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఇప్పుడు అయన టీడీపీలో చేరడం.. దాన్ని చూసి సంబరపడిపోవడం చూస్తుందే. ►ఇక సి.రామచంద్రయ్య అయితే ఎన్నడూ ప్రజల నుంచి గెలవలేదు.. టీడీపీ.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం అన్ని పార్టీలూ చూసేసారు.. అయన మేధావి అని చెప్పుకుంటూ ఇన్నాళ్లూ పబ్బం గడిపేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాక ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అయినా ఇప్పుడు తాజాగా టీడీపీలో చేరారు. అయన ఉనికి కూడా కడప జిల్లావాసులకు తెలియదు. ►1999లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్ర రావు సైతం గత ఇరవయ్యేళ్లులో గెలిచింది లేదు. ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన్ను చేర్చుకోవడం మహా ఘనత అని తెలుగుదేశం చెప్పుకుంటోంది. ►ఇది కాకుండా కడప జిల్లాకు చెందిన డీ.ఎల్ రవీంద్ర రెడ్డి, వీర శివారెడ్డి సైతం టీడీపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా దాదాపు రిటైర్ అయినట్లే.. ప్రజలకు దూరమై చాన్నాళ్లు ఐంది. కానీ ఎవరో ఒకరు వచ్చారు కదా అన్నట్లుగా టీడీపీ సంబరపడుతోంది. ✍️:::సిమ్మాదిరప్పన్న -
అభిమానులపై ‘పంజా’!
సాక్షి, అమరావతి: పదేళ్ల కిందట పెట్టిన పార్టీ. కానీ... ఇప్పటిక్కూడా వేదిక ఎక్కి మాట్లాడే నాయకుడు ఒక్కడే!!. మరీ ముఖ్యమైన సందర్భాల్లో అయితే అటుపక్క సోదరుడు... ఇటుపక్క తన వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఓ కార్యదర్శి స్థాయి నాయకుడు. ఏ జిల్లాకెళ్లినా అంతా అభిమానులే తప్ప వాళ్లలో ఒక్కరూ నాయకులుండరు. అసలు జనసేన రాజకీయ పార్టీయేనా? అలాగైతే పదేళ్లుగా ఎక్కడా ఒక్క బలమైన నాయకుడూ ఎందుకు తయారు కాలేదంటారు? ఎందుకంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమే అది. తనకు అధికారం అక్కర్లేదని పదేపదే ఆవేశాన్ని అభినయిస్తూ చెప్పే పవన్ కళ్యాణ్ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవటంతో... ఆ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్సార్ సీపీకి గంపగుత్తగా పడకుండా చీల్చాలని చంద్రబాబు ఆదేశించటంతో... కొత్త పాత్ర పోషిస్తూ బాబు స్నేహితుడి నుంచి బాబు ప్రతినాయకుడి పాత్రలోకి మారిపోయారు. లేని ఆవేశాన్ని తెచ్చుకుని, చంద్రబాబును చెడామడా తిట్టేస్తూ... ఆగ్రహంతో ఊగిపోయారు. రక్తి కట్టించాననుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలిచారు. మరి ఇప్పుడూ అదే చంద్రబాబు కదా? అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏం మారింది? ఏం మారిందంటే చంద్రబాబు పాత్ర మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఒంటరిగా అయితే జగన్‌ను ఎదుర్కోలేనన్నది చంద్రబాబు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ తనతో ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తాయనే ఆశ. కాబట్టి పొత్తు పెట్టుకోవటం ద్వారా వాటన్నిటినీ తనకు బదిలీ చేయాలని పవన్‌కు ఆదేశించారు. మళ్లీ పవన్ వేషం మారింది. కాకపోతే రెండుసార్లు ఈయన్ను నమ్మి మోసపోయిన ఆ సామాజికవర్గం మళ్లీ నమ్ముతుందా? అది కూడా తమను పదేపదే మోసం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేయమంటే వేసేస్తారా? అందుకే పవన్ రకరకాల అభినయాలకు దిగుతున్నారు. ‘నేను ఎవరినీ ముఖ్యమంత్రిని చేయడానికి లేను’. ‘సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం’ సీఎం పదవి ఇస్తే ఎవరైనా వద్దంటారా?’ ‘జనసేన గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తరవాత తేలుతుంది’. ‘మనకు తగిన బలం లేనప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు’ అనే పంచ్ డైలాగ్‌లు విసిరివిసిరి.. ఇప్పుడు దార్లోకి వచ్చారు. తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు అక్కర్లేదని, పొత్తుకు కట్టుబడ్డవారే తనతో ఉండాలని, తెలుగుదేశం కోసం జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని కుండబద్దలుగొట్టేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకే కోట్లకు కోట్లు ఖర్చుచేసిన సినిమా రిలీజయ్యాక డిజాస్టరని తెలిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా తయారయింది జనసేన అభిమానుల పరిస్థితి. బాంబు పేల్చిన ‘తమ్ముడు’ లోకేశ్ సీఎం ఎవరన్నదీ అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ– జనసేన చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయని పవన్ కళ్యాణ్ చెబుతుంటే... అసలే గందరగోళంలో ఉన్న జనసేన అభిమానులపై చంద్రబాబు తనయుడు లోకేశ్ ఓ పిడుగు వేశాడు. ఇన్నాళ్లు పవన్ చెబుతున్న మాట పచ్చి అబద్ధమని తేల్చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ... ‘‘పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి. దీన్లో రెండో ఆలోచనే లేదు’’ అని తెగేసి చెప్పారు. అంతేకాదు. 150 సీట్లలో తమ అభ్యర్థులు ఖరారైపోయారని మరో బాంబు పేల్చారు. ఈ ఇంటర్వ్యూ చూసి జనసేన అభిమానులు హతాశులయ్యారు. ఇన్నాళ్లూ తమ ‘బ్రో’ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అనుమానాస్పదంగానే మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 15 మందితో కలిసి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘నా దృష్టిలో లేదు, తెలియదు’ అని తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు. నిజానికి పొత్తుపై టీడీపీతో ఏ చర్చ జరిగినా, జనసేన తరుఫున పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉంటారు. సీఎం అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకుండా ఉంటే లోకేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించే వారు. కానీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్ కూడా చాలాసార్లు చెప్పారని లోకేశ్ స్పష్టంగా చెప్పారు. దీన్ని మనోహర్ ఖండించలేదు. మనోహర్ ఇలా మాట్లాడటంతో... పవన్ ఉద్దేశపూర్వకంగానే సీఎం అభ్యర్థిత్వంపై అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ పవన్ రాజకీయ కార్యక్రమాలన్నీ చంద్రబాబు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనకు మరింత బలాన్నిచ్చేలా పవన్ తీరు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు కోసమే తమ నాయకుడు పనిచేస్తున్నారని, చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంతర్గతంగా అంగీకరించి ఉంటారని, అయినా నిండా 20 సీట్లు కూడా ఇవ్వలేమని లోకేశ్ చెబుతుండగా ఇక సీఎం వంటి పదాలను పలకడం వృథా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేశ్ ఏమన్నారంటే.. విలేకరి ప్రశ్న: ఓట్లను పంచుకుంటున్నారు. సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? లోకేశ్: చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెంకడ్ థాట్ (రెండో మాటే లేదు). పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. దేర్ ఈజ్ నో యాంబిగ్యుటీ (ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు) లోకేశ్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ స్పందన.. విలేకరి ప్రశ్న: టీడీపీ – జనసేన పొత్తులో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్ ఇన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించి నిర్ణయం ఉంటుందంటున్నారు కదా? నాదెండ్ల : నేను పర్టిక్యులర్‌గా వినలేదు. మీరు అనేది నిజమే అయితే, పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చోని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే, (దీనిపై నిర్ణయం జరిగినట్టు) లేదు. -
జగన్ అభివృద్ధి మంత్రానికి టీడీపీ కకావికలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న జిల్లా. వైఎస్సార్సీపీ రాకతో గత ఎన్నికల్లోనే ఈ కోటకు బీటలు వారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం, ఈ ప్రాంతాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి, పలు ఐటీ కంపెనీల ఏర్పాటు, బడుగు బలహీనవర్గాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషితో టీడీపీ ఇక్కడ కకావికలైంది. ఆ పార్టీకి కార్యకర్తలూ చేజారిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం వారి నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు. దీంతో పక్క నియోజకవర్గాలపై దృష్టి సారించారు. మరోపక్క పార్టీలో ఆధిపత్యం కోసం ఇతర నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారు. దీంతో ఓ నియోజకవర్గం.. వంద గ్రూపుల్లా ఆ పార్టీ వ్యవహారం ఉంది. ఈ గ్రూపుల మధ్య సంక్రాంతికి ముందే కోళ్ల పందేలకు దీటుగా కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. యువగళం ముగింపు సభకు జనసమీకరణ కోసం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిర్వహించిన సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. యువగళం సభకు వచ్చేది లేదని ఆయనకు తేల్చి చెప్పినట్టు సమాచారం. గంటా తీరుతో విసిగిపోతున్న విశాఖ నేతలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో విశాఖ నేతలు విసిగిపోతున్నారు. గంటా గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవలి వరకు ఆయన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు మూడు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఇక్కడ గెలిచే అవకాశాలు మృగ్యమైపోవడంతో ఆయన భీమిలి వైపు చూస్తున్నారు. భీమిలిలో వివిధ కార్యక్రమాలకు గంటా హాజరవుతున్నారు. ఇది భీమిలి టికెట్ ఆశిస్తున్న కోరాడ రాజబాబుకు మింగుడుపడటం లేదు. ఆయన గంటా రాకను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటాను నమ్మరంటూ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. భీమిలిలోనే కాదు.. గంటా శ్రీనివాసరావు పాయకరావుపేట నియోజకవర్గంలోనూ రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ సొంత పార్టీ నేత అనితకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఆయన వర్గం జనసేన అభ్యర్థికి మద్దతుగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలోనూ ఆయన జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీలోకి ఎవరూ రాకుండా కూడా అడ్డుపడుతున్నారని పలువురు తెలిపారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీని కూడా సాగనంపి.. ఇక్కడ జనసేనకు సీటు కేటాయించే అవకాశం ఉందంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలను పొగబెడుతూ పొరుగు పార్టీని ప్రోత్సహిస్తున్నారని గంటాపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లిలో అయ్యన్న కినుక అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో తన కొడుకుకు హామీ లభించకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించేకొద్దీ అయ్యన్న వర్గం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అయ్యన్న ఒత్తిడికి అధిష్టానం తలొగ్గినా, మిగతా నేతలు సహకరిస్తారా అన్నది అనుమానమేనని అంటున్నారు. మాడుగులలో మూడు ముక్కలాట మాడుగుల నియోజకవర్గం టీడీపీలో మూడు పందెం కోళ్లు కొట్టుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి పీవీజీ కుమార్‌తో పాటు రామనాయుడు, పైలా ప్రసాదరావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పెందుర్తిలో బండారుకు సీటు ఇవ్వరని, ఆయనకు మాడుగులలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పెందుర్తి నుంచి బండారును బయటకు పంపేందుకు సొంత పార్టీ నేతలే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే మాడుగుల బరిలో నలుగురు ఉన్నట్టే. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్టు దక్కినా మిగిలిన వారు సహకరించే పరిస్థితి లేదు. అరకు నియోజకవర్గం ఇన్చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దొరకు సహకరించబోమని అబ్రహం వర్గం కరాఖండిగా చెబుతోంది. -
పవన్ సీఎం రేసులో లేనట్టే!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తాను సీఎం రేసులో లేనన్న విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది. ఆ భేటీలో ఏమి చర్చించారో ఎవరికీ తెలియదు. అయితే, ఆ మరుసటి రోజే (గురువారం) ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడంలేదని పవన్ విశాఖపట్నంలో జరిగిన సభలో పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పదని ఆ సభలో స్పష్టం చేశారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీని కూడా గెలిపించాలని చెప్పారు. సీఎం పదవిపై తాను, బాబు మాట్లాడుకుంటామని అన్నారు. అవసరమైతే తనను తాను తగ్గించకుంటానని కూడా చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. తనను తాను తగ్గించుకుంటానంటే సీఎం రేసు నుంచి తప్పుకొన్నట్లేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అదీ కాక.. పొత్తులో జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలవడం పక్కనపెడితే.. మిగిలిన స్థానాల్లో టీడీపీని జనసేనే గెలిపించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పొత్తుల చరిత్ర పరిశీలిస్తే.. మిత్రపక్షాలనే మోసం చేస్తారన్నది సుస్పష్టమని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు చంద్రబాబు ఇచ్చేదే అరకొర సీట్లేనని, అక్కడా తన మనుషులను పోటీకి దింపి, పొత్తులో ఉన్న పార్టీనే దెబ్బేసే ఘనుడని, అలాంటి బాబు జనసేనకు ఇచ్చే సీట్లెన్ని, అందులో గెలిచేవెన్ని అని చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎక్కువ సీట్లు తీసుకొనే టీడీపీని జనసేన కష్టపడి గెలిపిస్తే.. అప్పుడు మెజార్టీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ జనసేనకు ఎందుకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర తెలిసిన వారెవరూ ఇలాంటి భ్రమలు పెట్టుకోరని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పవన్ ఇలా మాట్లాడారంటే.. ఆయన సీఎం పదవిపై ఆశ వదులుకున్నట్లేనని భావిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన భేటీలో జనసేనకు చాలా తక్కువ సీట్లిస్తామని చంద్రబాబు చెప్పి ఉంటారని, ముఖ్యమంత్రి పదవిపై సైతం ఎటువంటి పంపకాలకు అవకాశమే లేదని తేల్చి చెప్పి ఉంటారని, అందువల్లే పవన్ విశాఖలో అటువంటి వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు అంటున్నారు. తొలి నుంచి పవన్ నోట భిన్నమైన మాటలే.. జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ సొంత పార్టీ ప్రయోజనాలకన్నా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పవన్ పెద్ద పీట వేస్తున్నారని బలమైన ప్రచారం ఉంది. అదే నిజమని నిరూపించేలా పవన్ పలు మార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – టీడీపీతో పొత్తుపై చర్చ మొదలైనప్పుడు, పవన్‌కు కూడా సీఎం పదవిని కేటాయించాలని టీడీపీని కోరాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీనిపై పవన్ స్పందిస్తూ.. తాను సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమంటూ కొన్ని సందర్భాల్లో, 2019లో రెండు చోట్లా ఓడిపోయాక ఇప్పుడు టీడీపీని సీఎం పదవి ఎలా అడుగుదామంటూ పార్టీ నాయకులందరినీ గందరగోళపరుస్తూ మరోసారి మాట్లాడారు. ఆ తర్వాత రెండ్రోజులకే మళ్లీ సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమని అన్నారు. టీడీపీ కోరకముందే పొత్తుకు పవన్ సిద్ధపడటం, జనసేనకు కేటాయించే సీట్లు ప్రాధాన్యతే కాదన్నట్టు మాట్లాడుతున్న తమ అధినేత అజెండా ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోందని జనసేన నేతల్లో చర్చ సాగుతోంది. -
‘అట్లూరి’ మామూలోడు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కేసులో అరెస్టు అయిన తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణరావుకు తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టు వెలుగులోకి వచ్చింది. సదరు నారాయణరావు అయితే ఏకంగా తనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పుకునే వాడని తెలిసింది. వందల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.540 కోట్లు వసూలు చేసి నిలువునా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్న ఈ స్కామ్‌లో గత వారం అరెస్టు అయిన నారాయణరావుని సీసీఎస్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారంతో కస్టడీ గడువు పూర్తవడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సినీ రంగంలోకి ప్రవేశించాకే మోసగాడిగా... ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నారాయణరావు అప్లైడ్ మాథమేటిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చిన అతను కొన్నాళ్ళు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. బంజారాహిల్స్‌లోని ఆదిత్య హిల్‌టాప్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తూ సినీ రంగంపై ఉన్న మోజుతో నిర్మాతగా మారాడు. 2018లో ‘నీది నాది ఒకే కథ’, 2022లో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండు’చిత్రాలు తీశాడు. దీనికి అవసరమైన డబ్బు కోసమే మోసాలు చేయడం మొదలెట్టాడు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు 3 ఎకరాల భూమి ఉంది. ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసిన నారాయణ రావు దాన్ని ఎవరికైనా అంటగట్టి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. ఎన్.రామాచార్యులు అనే వ్యక్తిని దీనికి యజమానిగా మార్చాడు. ఆ మేరకు నకిలీ పత్రాలు సృష్టించిన నారాయణరావు వాటి ఆధారంగా ఖైరతాబాద్‌లో ఎస్ఎంహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహించే బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి సయ్యద్ మహమూద్ హుస్సేన్‌ను సంప్రదించి ఆయన నుంచి రూ.1,65,12,500 కాజేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ’బాబు’ల వ్యవహారాలు చూసేవాడినంటూ.. నారాయణరావుకు తెలుగుదేశం నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మేరకు నేతలతో దిగిన ఫొటోలను చూపించే వాడు. ఇక చంద్రబాబు, లోకేశ్‌తో సైతం తాను దగ్గరగా మెలుగుతుంటానని ప్రచారం చేసుకునేవాడు. తరచుగా చంద్రబాబు, లోకేశ్‌లను కలుస్తుంటాననీ, వారికి సంబంధించిన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటానని చెప్పుకునే వాడని తెలిసింది. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. న్యాయ విభాగంలో పరిచయాలు ఉన్నాయంటూ... గడిచిన కొన్నాళ్ళుగా న్యాయ విభాగంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయంటూ చెప్పి నారాయణ రావు అనేక మంది నుంచి డబ్బు గుంజాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంబాబు, కృష్ణంరాజుకు ఇలానే చెప్పి వారి నుంచి నగదు, రూ.కోటి విలువైన బంగారం తీసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఓ కంపెనీకి, కర్ణాటకకు చెందిన మరో కంపెనీకి మధ్య వివాదం నడుస్తోంది. విశాఖ కంపెనీ యజమానిని సంప్రదించిన నారాయణరావు తనకు న్యాయ విభాగంలో పలుకుబడి ఉందని నమ్మబలికాడు. ఆర్బిట్రేషన్ విధానంలో సమస్య పరిష్కరించడంతో పాటు నష్టం నివారిస్తానంటూ నమ్మించాడు. ఇలా వారి నుంచి భారీ మొత్తం తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న విశాఖ కంపెనీ సంబం«దీకులు బయటకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆ డబ్బుతోనే మరో సినిమా.. ఎఫ్ఎంసీజీ కేసులో నారాయణరావును అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణతో పాటు రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణలో కీలక విషయాలు సేకరించారు. ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా రాంబాబుకు పరిచయమైన నారాయణరావు తన పలుకుబడి వినియోగించి కేసు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు రూ.2 కోట్లు ఇవ్వాలంటూ అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. కానీ ఆ కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చి ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో దాఖలు చేయించే ప్రయత్నం చేశాడు. ఈలోగా బంగారు ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ డబ్బుతోనే మరో చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బుధవారం నారాయణరావుకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇతడి వ్యవహారాలను మ రింత లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు. -
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు. టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్‌లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్‌రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి కోరారు. 2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని 2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. -
టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం. పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. -
తోకముడిచిన టీడీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లు చావు కబురు చల్లగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర వుతున్న పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకే తమకు సమయం సరిపోతుందని, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేంత స్థాయిలో తాము దృష్టి కేంద్రీకరించలేమని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. తండ్రీ కొడుకుల ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను నట్టేట ముంచారంటూ తమ్ముళ్లు ఆందోళనకు గురవుతు న్నారు. కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న లోపాయి కారీ ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీకి మేలు చేసేందుకు తమను బలిపశువులను చేశార ని ఆవేదనకు గురవుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి తీరతామని, బీఫారాలు ఇవ్వకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలుగుదేశం అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. లోకేశ్‌తో మాట్లాడుకోవాలన్న బాబు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా నాన్చుతూ వస్తోంది. అన్నిచోట్లా పోటీ చేయకపోయినా, బలమున్న చోటయినా పోటీకి దిగుదామని పార్టీ నేతలకు చెప్పుకుంటూ వచ్చింది. కాగా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పోటీ విషయమై తేల్చుకునేందుకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవల చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయ్యారు. అయితే తెలంగాణలో పోటీ చేసే విషయం తాను మాట్లాడలేనని, లోకేశ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జ్ఞానేశ్వర్ అధ్యక్షతన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఆహ్వానం పంపారు. అయితే లోకేశ్ హాజరు కాకుండా.. తెలంగాణలో పోటీ చేయడం లేదనే సమాచారాన్ని పంపించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడాల్సి వచ్చింది. తాము ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని, బలమున్న నియోజకవర్గాల్లో నైనా పోటీకి అంగీకరించాలని డిమాండ్ చేశారు. కానీ లోకేశ్ ససేమిరా అనడంతో సమావేశానికి వచ్చిన నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. తండ్రీకొడుకుల కోసం తాము త్యాగాలెందుకు చేస్తామని ప్రశ్నించిన నేతలు.. కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలన్న ఆలోచనతోనే తెలంగాణలో పోటీని విరమించుకున్నారంటూ బహిరంగ ఆరోపణలకు దిగారు. స్వతంత్ర అభ్యర్థు లుగానైనా బరిలోకి దిగుతామంటూ సమావేశంలో తీర్మానం చేశారు. -
హిస్టరీ మారుతుందా?...హ్యాట్రిక్ కొడుతుందా?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు టర్మ్‌ల తర్వాత పాలన మార్పు ఒరవడి ఈసారి బ్రేక్ అవుతుందా..? లేక కొనసాగుతుందా..? అనే చర్చకు తావిస్తున్నాయి. 1983లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్‌లు రెండుసార్లు వరుస విజయాలు సాధించాయి. కానీ మూడోసారి అధికారం చేపట్టడంలో విఫలమయ్యాయి. అయితే మధ్యలో 1989లో ఒకసారి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 1994లో మాత్రం రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కాగా 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్, టీడీపీలకే అధికారం చేజిక్కుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) రెండోసారీ (2018లో) అధికారంలోకి వచ్చింది. తాజాగా 2023 నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఒరవడికి భిన్నంగా వరుసగా మూడో విజయాన్ని బీఆర్ఎస్ నమోదు చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూడు ప్రధాన పార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అన్ని ఎన్నికల్లోనూ స్పష్టమైన మెజారిటీ..! గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. ఎక్కడా అసందిగ్ధతకు తావివ్వలేదు. అయితే ఈసారి ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు తమ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ హంగ్ ఏర్పడుతుందని, అయినా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పడం చర్చనీయాంశమయ్యింది. అయితే తర్వాత ఆ పార్టీ తమ నేత అలా మాట్లాడలేదంటూ హంగ్‌ను కొట్టిపారేసింది. తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. ఇక మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా హంగ్‌ను కొట్టిపారేయడం గమనార్హం. బీఆర్ఎస్ నేతల్లో ధీమా అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు పూర్తి దీమాతో ఉన్నారు. గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారడం తప్పకుండా సానుకూల ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిందని, బెంగళూరును వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరిస్తున్నారు. కేసీఆర్ కూడా తరచూ తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలోనూ దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ అని.. సాగు, తాగునీటి రంగాలే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందనడానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే నిదర్శనం అని నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయనేది అధికార పక్షం వాదన. ఢీ అంటే ఢీ అంటున్న మూడు పార్టీలు గడిచిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఈసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన పోటీదారుగా ఉండటంతో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఢంకా బజాయిస్తున్నాయి. సాధారణ ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి, ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ మూడోసారి అధికార పీఠాన్ని అధిష్టించే అవకాశమే లేదని, తాము గెలుపొందడం ఖాయమనే భావనలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. విజయ సాధన దిశగా ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై అపార నమ్మకం.. అదే సమయంలో తెలంగాణ ఇచ్చి న పార్టీగా, ఆరు గ్యారంటీలతో ఈసారి తాము తప్పనిసరిగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అవినీతి, కుటుంబ పాలనతో పాటు నిరుద్యోగులను మోసం చేసిందని ప్రధానంగా ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూముల విక్రయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అనుయాయులకే ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నదని విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని పాలించే అర్హత బీఆర్ఎస్కు లేదని తేల్చి చెబుతోంది. డబుల్ ఇంజన్ నినాదం రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ అధి కారంలో ఉంటే అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ చెబుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ప్రచారం చేస్తోంది. రాష్ట్రానికి తొమ్మిదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది. బీసీ నినాదం ఎత్తుకోవడంతో పాటు బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. ఉచితాల జోలికి వెళ్లకుండా అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టి విజయం సాధించాలనే ఆలోచనలో ఉంది. -
బాబుకు నో బెయిల్
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. వివిధ కేసుల్లో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఏపీ ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయనకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైబర్‌గ్రిడ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను.. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సైతం ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. ముందస్తు బెయిల్‌కు బాబు పిటిషన్.. ఏపీ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థకు ప్రాజెక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు.. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌తో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేష్‌రెడ్డి సుదీర్ఘ విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని ఈ నెల 5న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసిన విషయంతెలిసిందే. ఈ కేసులో సోమవారం ఉదయం జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పును వెలువరించారు. ఆయన ఏమన్నారంటే.. అంతిమంగా నిధులెక్కడికి వెళ్లాయన్నది దర్యాప్తు చేయాలి.. ‘టెరాసాఫ్ట్‌తో చంద్రబాబుకున్న సంబంధం, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపిన శ్రద్ధ తదితర అంశాలకు సంబంధించి సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాలను కోర్టు ముందుంచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పటి అధికారులను ప్రభావితం చేశారు. ఎలాంటి విధి విధానాలను పాటించకుండా, ఎలాంటి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను తయారుచేశారు. అలాగే, టెరాసాఫ్ట్‌కు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మార్చడానికి సంబంధించిన ఆధారాలను.. టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించడం, టెండర్ గడువు తేదీని పొడిగించడం వంటి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది. రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన నోట్‌ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలను, ప్రతికూల అభిప్రాయాలను రాయవద్దని చంద్రబాబు తనకు సూచించారంటూ అప్పటి ఎనర్జీ డిపార్ట్మెంట్ కార్యదర్శి నుంచి వాంగ్మూలాన్ని కూడా సీఐడీ సేకరించింది. అలాగే, టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్పారంటూ అప్పటి పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీఐడీ ఈ కోర్టు ముందుంచింది. అంతేకాక.. వేమూరి హరికృష్ణ ప్రసాద్, అప్పటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (ఇన్‌క్యాప్) మాజీ ఎండీ కె. సాంబశివరావులతో కలిసి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాంబశివరావు చేసిన ప్రతిపాదన మేరకు హరికృష్ణ ప్రసాద్‌ను టెండర్ కమిటీ సభ్యునిగా నియమించారు. నిబంధనలకు, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఆమోదించారు. కానీ కేసు నమోదు చేసిన రెండేళ్లకు చంద్రబాబును నిందితునిగా చేర్చారని.. ఇప్పుడు నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయని సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు సాధ్యం కాదు.. ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు పట్టే సమయాన్ని, సీఐడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, ఈ కేసుతో ముడిపడి ఉన్న పలువురు సాక్షులను గత నెల 14న విచారించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయన్న వాదనలో ఎలాంటి బలం ఈ కోర్టుకు కనిపించడంలేదు. విస్తత ప్రజా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కేసులో నేర తీవ్రతను, టెరాసాఫ్ట్‌కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర ఆయాచిత లబ్ధిచేకూర్చారన్న ఆరోపణలను, తద్వారా ఖజానాకు నష్టం కలిగించిన విషయాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అందువల్ల ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యంకాదు. అంతిమంగా నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ దశలో దర్యాప్తునకు ఎలాంటి భంగం కలగరాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేస్తున్నా’.. అని జస్టిస్ సురేష్‌రెడ్డి తన తీర్పు చెప్పారు. -
మండలిలోనూ మితిమీరిన టీడీపీ
సాక్షి, అమరావతి: శాసన మండలిలోనూ తెలుగుదేశం పార్టీ సభ్యులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి మితిమీరి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, టీడీపీ ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా పోడియం పైకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. గురువారం శాసన మండలిలో చంద్రబాబు అరెస్టు వ్యవహరంపై చర్చకు పట్టుపడుతూ టీడీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పై చర్చ కోరుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మరో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఈ రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు మొదలెట్టారు. పోడియంపైకి రావడం మంచిది కాదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొవాలని చైర్మన్ చెప్పారు. అయినా పరిస్థితి సానుకూలంగా లేకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా.. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమవుతుండగా, చైర్మన్ రాకముందే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం పైన చేరారు. చైర్మన్ లోపలికి వస్తూనే, పోడియంపైన టీడీపీ సభ్యులను చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కొత్తగా ఎన్నికై తొలిసారి సమావేశాలకు హాజరవుతున్న టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా పోడియంపైన ఉండడం చూసి.. ‘శ్రీకాంత్ గారూ మీరు కొత్తగా వచ్చారు. సభ మొదలు కాకమునుపే మీరు పోడియం పైకి రావడం సభా మర్యాద కాదు. కిందకు దిగండి’ అని సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంౖపెనే ఉన్నారు. దీంతో చైర్మన్ తన సీటులో కూర్చోకుండా.. టీడీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి ‘సభ మొదలుకాక మునుపే పోడియంపైకి వచ్చి కూర్చుంటే ఎలా? లేకపోతే ఇక్కడ (తాను కూర్చునే సీటును చూపిస్తూ) కూర్చొండి వచ్చి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు తమకు ఉండే ప్రివిలేజీ మేరకు వారు చెప్పదలుచుకున్నది సభలో చెప్పవచ్చు గానీ, ఇలా ప్రవర్తించడం మర్యాద అనిపించుకోదన్నారు. ఇది పెద్దల సభ అని, మర్యాద పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. అప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో ‘మీకు కావాల్సింది కూడా∙అదేనా..’ అని చైర్మన్ అన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ స్పెషల్ మెన్షన్ వినిపించే సమయంలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తుండడంతో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుని చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, టీడీపీ ఎమ్మెల్సీలే మండలి ప్రతిష్టను, చైర్మన్ స్థానాన్ని అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంపైనే ఉండి నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పలువురు తమ స్థానాల వద్ద నిల్చొని ‘అవినీతి పరుడు చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మండలి చైర్మన్ మోషేన్‌రాజు రెండోసారి సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. నాలుగో విడత సభ ప్రారంభమయ్యాక కూడ టీడీపీ ఎమ్మెల్సీల తీరులో మార్పు లేకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రకటించారు. -
ఫేక్ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఆయన అవినీతి స్పష్టంగా కనబడుతుండడంతో ప్రజల్లో ఏమాత్రం మద్దతు లభించడంలేదు. దీంతో ఎల్లో మీడియా, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాతోపాటు టీడీపీ శ్రేణులు, రంగంలోకి దిగి చంద్రబాబు సత్యహరిశ్చంద్రుడంటూ ప్రజలను ఏమార్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు చేసిన అవినీతిపై సీఐడీ స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా.. ఆధారాల్లేవని, చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, దార్శనికుడికి ఇలాంటి పరిస్థితి కల్పించారంటూ సానుభూతి వచ్చేలా బుకాయిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటైన పెయిడ్ ప్రమోషన్‌కు తెరలేపారు. ఇందులో భాగంగా రెండ్రోజులుగా ప్రజలకు అదేపనిగా ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ‘మచ్చలేని రాజకీయాలకు మారుపేరైన చంద్రబాబునాయుడు వంటి నిజాయితీ గల నాయకుడిని చేయని తప్పుకు జైల్లో పెట్టారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి’.. అంటూ 50 సెకన్ల ఫోన్‌కాల్ రాష్ట్రంలోని అన్ని మొబైల్ యూజర్లకు వెళ్లేలా భారీ పెయిడ్ ప్రమోషన్ చేపట్టారు. ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో హడావుడి ఎల్లో మీడియా అయితే అడ్డూఅదుపు లేకుండా చంద్రబాబును సమర్థించే పనిలో మునిగిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తూ అది నిజంగా అమలు జరిగినట్లు భ్రమ కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని జనం నుంచి స్పందన లేకపోవడంతో ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ ఐటీ, ఎన్ఆర్ఐ విభాగాలు ప్లాన్‌చేసి హైదరాబాద్‌లో కొందరు ఐటీ ఉద్యోగులను సమీకరించి ఆందోళనలు చేయించారు. కానీ, ఇందులో ఐటీ ఉద్యోగుల కంటే బయటి వ్యక్తులే భారీగా ఉన్నట్లు తేలింది. వారిలో చాలామందికి స్విగ్గీ కూపన్లు ఇచ్చి తీసుకొచ్చినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. బెంగళూరులోనూ ఇదే తరహాలో కొందరు ఐటీ ఉద్యోగులతో ఆందోళన చేయించారు. నిజానికి.. చంద్రబాబు అరెస్టయితే టీడీపీ శ్రేణులు, నాయకులే పెద్దగా బయటకు రాలేదు. దయచేసి బయటకు రావాలని అచ్చెన్నాయుడు, యనమల వంటి నేతలు పార్టీ శ్రేణుల్ని టెలీకాన్ఫరెన్స్‌లో బతిమాలుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగులతో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనలు చేయిస్తున్నట్లు తేలింది. దీనికి వారు తెరవెనుక వ్యూహ రచనచేసి అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. పథకం ప్రకారం ఫేక్ ప్రచారం.. ఇక టీడీపీ ప్రొఫెషనల్స్ విభాగానికి చెందిన తేజశ్విని అనే యువతి చంద్రబాబుకు మద్దతుగా విడుదల చేసిన ఒక వీడియోను వైరల్ చేశారు. అమరావతి ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పలు కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. టీడీపీకి సంబంధించి ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆమెను ఐటీ ప్రొఫెషనల్‌గా రంగంలోకి దింపి వీడియోలు చేయించి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి మరికొందరిని టీడీపీ ఒక వ్యూహం ప్రకారం పనిచేయిస్తూ చంద్రబాబు నిజాయితీపరుడని కలర్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. ‘స్కిల్ డెవల ప్మెంట్’ను సమర్థించుకుంటూ శుక్రవారం ఆ పార్టీ ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడం విశేషం. వీటన్నింటినీ చూపిస్తూ ‘వీ స్టాండ్ విత్ చంద్రబాబు’.. పేరుతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ, సాధారణ ప్రజానీకంలో మాత్రం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పెద్దగా స్పందన కనిపించడంలేదు. వారి నుంచి ఎలాగైనా సానుభూతి పొందడానికి ఆ పార్టీ అన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలకు దిగింది. -
రామోజీ పైశాచికత్వం
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి? చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది. భార్య అనారోగ్యం అని చెప్పినా.... వాస్తవానికి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్ పేషెంట్‌గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది. అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు. కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్ ఇంటర్వ్యూలు... స్కిల్‌డెవలప్‌మెంట్‌పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి. దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్ పెద్ద సంస్థకాదా? సీమెన్స్ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్‌కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది. అవి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిల ద్వారా కూడా ట్వీట్ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది. అసలు ఇరోమ్ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్ మెసేజ్‌లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ 40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య కిరణ్మయి మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్‌ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయన్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెను చూసుకునేందుకు రాహుల్ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. -
ముసుగు తీసిన చంద్రసేనాని
సాక్షి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం–జనసేన మధ్య బంధానికి ఉన్న ముసుగు తొలగిపోయింది. కొత్తగా పొత్తు పొడుస్తున్నట్లు పవన్‌కళ్యాణ్ పాతపాటనే కొత్తగా పాడారు. చంద్రబాబు చాటుగా ఇన్నేళ్లు ఒదిగి ఉన్న జనసేన అధ్యక్షుడు తాజాగా పొత్తు ప్రకటనతో పాత పాటకు కొత్త పల్లవి అందుకున్నారు. పాత బంధాన్నే కొత్త పొత్తుల రాగంగా ఆలపించేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పొత్తుల ప్రకటన వరకు చంద్రబాబు చెంతనే పవన్ అతిథి రాజకీయ నాయకుడి పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చి.. చంద్రబాబు రాసిన స్క్రీన్ ప్లేను పక్కాగా రక్తి కట్టించారు. ప్రశ్నించేందుకే జనసేన అంటూ డబ్బాలు కొట్టుకుని.. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళా అధికారులపై దాడులు, ప్రకృతి వనరుల దోపిడీ, ఇచ్చిన వందల హామీలను నెరవేర్చకపోయినా ఎన్నడూ ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా నాలుగేళ్లు పత్తా లేకుండా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండగా చంద్రబాబుకు మేలు చేసేందుకు మళ్లీ తెరపైకి వచ్చారు. అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే కుయుక్తిలో భాగంగానే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు నాటకమాడారు. చివరికి ప్రజా క్షేత్రంలో చావు దెబ్బ తినడంతో మళ్లీ టీడీపీతో అంటకాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశంతో బంధాన్ని కొనసాగిస్తూనే తన పార్టీ కార్యకర్తలను, ప్రజలను మోసగించారు. గతంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించిన నోటితోనే ఇప్పుడు వారితోనే కలిసి రాజకీయ పయనం చేస్తానంటూ ప్రకటించడం పవన్ రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటి చెబుతోంది. సమష్టిపోరు అవసరమట! స్కిల్ స్కామ్‌లో అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబును పరామర్శించిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ, జనసేన పొత్తు ఉందంటూ పవన్ చెప్పడం చూస్తుంటే.. జైలు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు అవగతమవుతోంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని.. బీజేపీ కూడా మా వెంట వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమంటూ కలరింగ్ ఇచ్చారు. చంద్రబాబుతో విభేదించి గతంలో ప్రత్యేకంగా పోటీ చేశానని, వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలంటే సమష్టిపోరు అవసరం అంటూ తమ బంధాన్ని బయటపెట్టారు. చంద్రబాబుతో పవన్, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ గురువారం ఉదయం ములాఖత్ అయ్యారు. ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పవన్, లోకేశ్, బాలకృష్ణ 40 నిమిషాలపాటు బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపారని విమర్శించారు. మోదీ పిలిస్తేనే వెళ్లాను.. ‘జనసేన ఆవిర్భావ సభలో సగటు మనిషి ఆవేదన గురించి మాట్లాడాను. మా నాన్న ఆస్థికలు కాశీలో కలిపేందుకు వెళ్లిన సమయంలో ముంబయిలో తాజ్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది. అంతకు ముందు పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలను చూసి దేశానికి సమర్థుడైన నాయకుడు కావాలని మోదీకి మద్దతు తెలిపిన విషయంలో నన్ను అందరూ తిట్టారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గనని వెల్లడించా. ఏ రోజైనా నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే వెళ్లానే తప్ప.. నేనంతకు నేనే ఎప్పుడూ వెళ్లలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. బాబుకు నాకు మధ్య పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి. కానీ, ఆయన అనుభవం, సమర్థతపై పూర్తి విశ్వాసం ఉంది’ అని పవన్ స్పష్టం చేశారు. సైబరాబాద్ నిర్మిచిన వ్యక్తికి రూ.300 కోట్ల స్కామ్‌ను అంటగడతారా? అని ప్రశ్నించారు. ‘బాబును ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారించాల్సింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తోంది? అభియోగాలు అంటగట్టిన వ్యక్తి ఏమైనామహానుభావుడా? వాజ్‌పేయా? లాల్ బహదూర్శాస్త్రినా? కేసులు, రాజ్యాంగ ఉల్లంఘన, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి మద్యపాన నిషేధం చేస్తాడా?’ అని దుయ్యబట్టారు. అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదు రాష్ట్రంలో అడ్డగోలు హామీలిచ్చి నేటికీ అమలు చేయలేదని పవన్ మండిపడ్డారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు వద్ద మూడు వేల కిలోల హెరాయిన్ దొరికితే దాని మూలాలు విజయవాడలో తేలాయని.. వీటిపై మీడియాలో వార్తలే రాకుండా చేశారని చెప్పారు. ‘అడ్డగోలు దోపిడీ చేస్తే ఎవరూ ప్రశ్నించకూడదా? నన్ను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆపేస్తానంటావు, ఆ హక్కు నీకు ఉందా?’ అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తుడైన సీఎం వైఎస్ జగన్.. తాను కోనసీమ పర్యటనకు వెళ్తే 2 వేల మంది క్రిమినల్స్‌ను దాడికి దించారన్నారు. బాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలా ఎన్నడూ వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు అరెస్టయితే వైఎస్సార్సీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారని చెప్పారు. విడివిడిగా ఎదుర్కోవడం కష్టం సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం కష్టమని.. జనసేన, టీడీపీ కలిసి సమష్టిగా పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు. 2019లో వేర్వేరుగా పోటీ చేసి నష్టపోయామని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీట్ల విషయం తర్వాత మాట్లాడతానని చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. జైల్లో చంద్రబాబు భద్రత విషయమై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తానన్నారు. మేం అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదలం ‘వైఎస్సార్సీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందు ఆలోచించుకోవాలి. మేం అధికారంలోకి వస్తే మాపై రాళ్లు వేసిన వారెవరినీ వదలం. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. డీజీపీ, సీఎస్‌తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగతోడే అవకాశం ఉంది. చట్టాలను అధిగమించే అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లిని, తల్లిని వదిలేసిన వ్యక్తి, బాబాయిని చంపించిన వ్యక్తిని అధికారులు నమ్ముకుంటున్నారు. మీకు రేపు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఆలోచించుకోండి. జగన్‌ను నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకుని గోదావరి ఈదినట్లే’ అని పవన్ అధికారులు, పోలీసులను హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులు తప్పులు సరిదిద్దుకునేందుకు ఆరు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. యుద్ధం కావాలంటే సిద్ధంగా ఉంటామని ఆవేశంతో ఊగిపోయారు. -
కన్నుమూస్తే.. టీడీపీ కౌంట్లోకి
సాక్షి, నంద్యాల/తాళ్లపూడి/కొవ్వూరు/వెంకటగిరి రూరల్: తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలను వీడడం లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి, జైలుకు వెళ్లిన నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో రాష్ట్రంలోని చనిపోయిన వారిని చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే చనిపోతున్నారంటూ టీడీపీ తమ ఖాతాలో వేసుకుంటోంది. ఈ మరణాలను పచ్చపత్రికల్లో ప్రచురిస్తూ బాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయారంటూ కలరింగ్ ఇస్తున్నారు. ఇది చూసి మృతుల కుటుంబసభ్యులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకు, చంద్రబాబు అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ ఖాతాలో వేసుకున్న మరణాలు.. వాటి వెనుక నిజాలు.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం, గోరుమానుకొండ గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు కుటుంబ సమస్యలతో చాలాకాలం క్రితం మద్యానికి బానిసయ్యాడు. గత నెల రోజులుగా మరింత ఎక్కువగా మద్యం సేవిస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం ఎక్కువగా తాగి.. ఆ మత్తులో పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లి అదేరోజు మరణించాడు. ఈ మరణాన్ని టీడీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని లింగాల గ్రామానికి చెందిన నెత్తికప్పుల నాగరాజు కుటుంబమంతా గతకొన్నేళ్లుగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. మంగళవారం నాగరాజు గుండెనొప్పితో మరణించారు. ఇతని కుటుంబ సభ్యులను బతిమలాడి, పార్టీ నుంచి ఆర్థికసాయం అందుతుందని మభ్యపెట్టి చంద్రబాబు రిమాండ్‌ను తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన టీడీపీ నాయకుడు చెరుకూరి సూర్యనారాయణ (80) వృద్ధాప్య సంబంధిత బాధలతో మంగళవారం మృతి చెందారు. ఈ మరణాన్ని సానుభూతి ఖాతాలో టీడీపీ నేతలు వేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త జొన్నకూటి శేఖర్ (45) కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి మూత్రవిసర్జనకు లేచి కుప్ప కూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య సోదరుడు టీడీపీ సానుభూతిపరుడు. అతని మాట ప్రకారం టీడీపీ వాళ్లు సాయం చేస్తారనే ఉద్దేశంతో వారి ఖాతాలో వేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాణిపేటకు చెందిన వీర కృష్ణయ్య (63) చేనేత కార్మికుడు. మంగళవారం సాయంత్రం తమ మిద్దెపైకి ఎక్కిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కృష్ణయ్య మనుమడు మహేశ్ ఆయనను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. కృష్ణయ్య మృతికి చంద్రబాబు గృహ నిర్బంధం పిటిషన్ తిరస్కరణకు సంబంధం లేదని ఆయన మనుమడు మహేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గండమాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటి షుగరు, బీపీతో బాధపడుతున్నాడు. మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు వెంకటి మృతికి ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు తెలిపారు. -
పరాకాష్టకు టీడీపీ శవ రాజకీయం
సాక్షి నెట్వర్క్ : చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో సహజ మరణాలను సైతం చంద్రబాబు అరెస్టు, జైలుకు ముడిపెట్టి శవ రాజకీయం కొనసాగిస్తోంది. ఈ విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, సానుభూతి పొందేందుకు పచ్చ బ్యాచ్ తెగతాపత్రయ పడుతోంది. నిజానికి.. ‘పచ్చ’ మీడియా పేర్కొన్న వారంతా అనారోగ్య కారణాలతో మరణిస్తున్నా ‘బాబు అరెస్టును తట్టుకోలేక..’ అంటూ నానా హడావుడి చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా భజనతో గ్రామాల్లో ప్రజలు నివ్వెరపోతున్నారు. మొత్తానికి ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వాస్తవాలివి. -
కవ్విద్దాం.. రెచ్చగొడదాం..
సాక్షి, అమరావతి: ఎన్ని జాకీలతో పైకి లేపినా లోకేశ్ యువగళం పాదయాత్రకు జనాదరణ రాకపోవడంతో ఘర్షణలు సృష్టించడం ద్వారా లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీ కనిపించినా, వైఎస్సార్సీపీ జెండా కనిపించినా ఓర్వలేని రీతిలో పాదయాత్రలో టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. లోకేశ్ నిర్వహించే సభలు, యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇలా వైఎస్సార్సీపీ శ్రేణులను కవ్వించడం, రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. తద్వారా ఘర్షణలు చలరేగేలా చేసి పాదయాత్రపై ప్రజల దృష్టి పడాలని కోరుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని కవ్వించి, చివరికి వారిపైనే దాడులకు దిగారు. లోకేశ్ బహిరంగ సభ జరిగే ప్రాంతంలో ఉన్న సీఎం జగన్ ఫ్లెక్సీపైకి టీడీపీ రౌడీ మూకలు రాళ్లు విసరడం, అడ్డుకున్న పోలీసులను సైతం గాయపరచడం, యాత్ర వెళ్లే రూటులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా విచక్షణారహితంగా దాడులు చేయడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేశ్ యాత్రల సందర్భంగా టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగడం, మళ్లీ తమపైనే దాడులు జరిగాయని ఎదురుదాడి చేయడం పరిపాటిగా మారింది. పథకం ప్రకారమే ఉద్రిక్తతలు సీఎం జగన్‌ను బూతులు తిట్టడం ద్వారా మీడియా దృష్టిలో పడేందుకు లోకేశ్ నోటికి పనిజెప్పారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో అధికార పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చింపి వేయించడం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఏవైనా సూచనలు చేస్తే పోలీసులతో గొడవలకు దిగడం నిత్యకృత్యంగా మారింది. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం తన వెనుక ఉన్న అల్లరి మూకల ద్వారా లోకేశ్ చేయిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
సమస్యలు సృష్టిస్తుంటే యాత్రకు అనుమతులు రద్దుచేయండి
సాక్షి, అమరావతి: సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని హైకోర్టు పేర్కొంది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో, అలాగే పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా యువగళం యాత్రలో భాగంగా మందలపర్రు గ్రామంలో లోకేశ్ చర్చి వైపు వేలు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారని చెప్పారు. లోకేశ్ బహిరంగంగానే టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కనీసం 12 నుంచి 20 కేసులున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించే బాధ్యత తనదంటూ లోకేశ్ ప్రతి సభలోను బహిరంగంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం చూడవచ్చన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోను చంద్రబాబునాయుడు ఇదే రీతిలో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. అందుకే పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు పెట్టుకున్న పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించామని, ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి ఘటనలు పునరావృత్తం చేస్తూ ఉంటారని ఆ రోజు మొత్తుకున్నామని చెప్పారు. ఆ రోజున తాము వ్యక్తం చేసిన ఆందోళన ఈ రోజు నిజమైందన్నారు. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆ రోజున టీడీపీ నేతల అరాచకాలు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరించామని తెలిపారు. కేసులు పెడితే వెంటనే హైకోర్టుకు వస్తున్నారన్నారు. అదే వారి ధైర్యమని చెప్పారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని స్పష్టం చేసింది. ‘మీరు (ప్రభుత్వం) ఇచ్చిన అనుమతితోనే కదా యాత్ర చేస్తున్నది. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనుమతులు రద్దుచేయవచ్చు కదా?’ అని ఏఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లోకేశ్ పాదయాత్ర గురించి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పెద్దగా అరుస్తూ.. ప్రస్తుత కేసులతో లోకేశ్ పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదని, యువగళం ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. టీడీపీ న్యాయవాదులు గొంతు పెద్దదిగా చేసి మాట్లాడుతుండటంతో న్యాయస్థానం వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? లేక కోర్టు అనుకుంటున్నారా? అంటూ వారిని మందలించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తున్నప్పుడు మధ్యలో ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించింది. ఆయన వాదనలకు సమాధానం ఇచ్చేందుకు మీకు అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకోవాలే తప్ప ఇలా చేపల మార్కెట్లో అరిచినట్లు అరవడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేసింది. ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు గతంలో ఇతర నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇచ్చిన ఉత్తర్వులను తాజా వ్యాజ్యాల్లోనూ ఇస్తూ ఆ వ్యాజ్యాలను పరిష్కరించాలని టీడీపీ న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ, పుల్లగూర నాగరాజు తదితరులు కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అలా చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కనీసం కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని వారు అభ్యర్థించారు. అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వేర్వేరు పిటిషన్లు వేసిన టీడీపీ నేతలు అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, గంటా నరహరి, షాజహాన్ బాషా,దొమ్మాలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు, ఎం.రాంప్రసాద్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయా లంటూ టీడీపీ నేతలు వి.చంద్రశేఖర్, ఎం.రాంప్రసాద్రెడ్డివేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా విచారణ సబబు కాదు అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబు తదితరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సుప్రీంకోర్టులో సవాలు చేశామని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని పలు అంశాలను తాము సుప్రీంకోర్టు ముందు లేవనెత్తామన్నారు. టీడీపీ నేతల తీరుపై ఆందోళనతోనే వారికిచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు చెప్పారు. తమ పిటిషన్లకు సుప్రీంకోర్టులో డైరీ నంబర్ కూడా జారీ అయిందని, అయితే ఎప్పుడు విచారణకు వస్తాయో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేయడం సబబుగా ఉంటుందని కోర్టు భావిస్తే, అలాగే వాయిదా వేయచ్చన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై తాము విచారించడం సబబుగా ఉండదని అభిప్రాయపడింది. -
పొత్తు లేకుండా గెలవలేమని తేలికగా చూస్తున్నార్సార్!
పొత్తు లేకుండా గెలవలేమని తేలికగా చూస్తున్నార్సార్! ఈ సారే సింగిల్‌గా పోటీ చేసి మన సత్తా చూపిద్దాం! -
టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల
సాక్షి ప్రతినిధి, బాపట్ల: తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకు బాపట్ల జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ఇక్కడ వెల్లడైన దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఒక్క పర్చూరు నుంచే 12,944 ఫారం–7 దరఖాస్తులను స్థానికులు అధికారులకు సమర్పించారు. దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు చాలా మంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతోపాటు పర్చూరులోనూ ఓట్లు ఉంచుకున్నారు. కొందరు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ ఓట్లతోనే పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు వేమూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించుకొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,407 ఫారం–7 దరఖాస్తులు ఇవ్వగా రేపల్లెలో 5,544, బాపట్లలో 3,155, అద్దంకిలో 2,619, చీరాలలో 1,870 ఫారం–7 దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఓట్ల జాబితానూ ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. టీడీపీ ఉలికిపాటు దొంగ ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పట్టుబట్టడంతో టీడీపీ ఉలిక్కిపడింది. దీనినుంచి బయట పడేందుకు అధికారపార్టీ నేతలు టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. ఎన్నికల కమిషన్‌కూ తప్పుడు ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేస్తోంది. కృష్ణజిల్లా నాగాయలంకలో ఉంటున్న జాగర్లమూడి లక్ష్మీతులసికి బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో, మార్టూరు మండలం బొల్లాపల్లి పోలింగ్ బూత్ నంబర్ 70లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. పర్చూరు మండలం నూతలపాడులో ఉంటున్న మిరియా చాయమ్మకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్, నూతలపాడు 159 బూత్‌లో ఓట్లు ఉన్నాయి. సోమేపల్లి చిన్నవెంకటేశ్వర్లు తండ్రి వెంకటాద్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకి హైదరాబాద్‌లో ఓటు ఉంది. దాంతోపాటు దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో సీరియల్ నంబర్ 631లో కూడా ఓటు ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే కొమ్మాలపాటి వీరాంజనేయులుకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబర్ 581తో ఓటు ఉంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పోలింగ్ బూత్ నంబర్ 430లో సీరియల్ నంబర్ 247తోనూ ఓటు ఉంది. దొంగ ఓట్లు తొలగిస్తాం జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల వరకు ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్‌తో విచారణ చేయిస్తున్నాం. ఫారం–7లను పూర్తిగా పరిశీలించాం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లుంటే తొలగిస్తాం. నిబంధనల మేరకు దొంగ ఓట్లపై చర్యలు తీసుకుంటాం. ఫేక్ దరఖాస్తులు చేసిన వారిపైనా చర్యలు ఉంటాయి. – రంజిత్‌బాషా, కలెక్టర్, బాపట్ల జిల్లా -
AP: రాష్ట్రంలో అల్లర్లకు లోకేశ్ కుట్ర
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేలా టీడీపీ శ్రేణులను ప్రేరేపిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలపై శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులందాయి. వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు ఈ ఫిర్యాదులు చేశారు. సమాజంలో అశాంతి కలిగేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, లోకేశ్, ఇతర నేతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లకు నారా లోకేశ్ కుట్ర చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి శనివారం విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విశాఖ జిల్లా కో కన్వీనర్ సదరం జ్ఞానేష్, ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ అనిల్ శర్మ తదితరులతో కలిసి ఆయన విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ కొల్లు గోపాలకృష్ణ తదితరులు ఫిర్యాదు చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొప్పుల ప్రభాకరరెడ్డి, కో కన్వీనర్లు డెక్కత జయరాంరెడ్డి, కొమ్మన అనిల్ తదితరులు ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల మండల సోషల్ మీడియా ప్రతినిధులు ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో నాలుగు రోజుల్లో లోకేశ్ పాదయాత్ర నల్లజర్ల మండలం చేరుకుంటుందని, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఏలూరు జిల్లా కోకన్వీనర్ సైదం సురేష్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టి.నర్సాపురం పోలీసులకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శ్రీను రాజు, ఎంపీపీ దారబోయిన లక్ష్మీ వెంకటేశ్వరరావు, సహకార సంఘ చైర్మన్, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, వైఎస్సార్సీపీ యూత్ మండల నాయకుడు కన్నం సర్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు చెందిన బాకూరు సత్యనిరంజన్, ఉచ్చుల స్టాలిన్, కుక్కల బాలచందర్ తదితరులు ఫిర్యాదు చేశారు. కుక్కునూరు సీఐ సత్యనారాయణకు మండల సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటినాయుడు ఆధ్వర్యంలో పలువురు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట సీఐ కాశీవిశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
బీజేపీతో పొత్తుపై చులకన కాలేను.. ఇష్టాగోష్టిలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడు మాట్లాడి తాను చులకన కాదలచుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తుపై విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తూ.. ఎవరెవరో మాట్లాడే వాటిపై తాను స్పందించనని అన్నారు. అవసరమైతే ఢిల్లీతో పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం, ప్రజలు గట్టిగా ఉంటే కేంద్రం దిగి వస్తుందని, ఇందుకు జల్లికట్టు ఘటనే ఉదాహరణ అని అన్నారు. ఇటీవల బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు గాశారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడి వచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిద్ధమైందంటూ ఎల్లో, సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అయితే, బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను గందరగోళంలో పడేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వలంటీర్లను ప్రజా సేవకే పరిమితం చేస్తాం తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను ప్రజా సేవకు మాత్రమే పరిమితం చేసే విషయాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ వలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. వలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్ల సేవలను గౌరవిస్తామని, కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా పనిచేస్తామంటే సహించేది లేదని అన్నారు. వైఎస్సార్సీపీ విధ్వంసం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఉంటాయన్నారు. అయినా తనకున్న బ్రాండ్, పాలసీలతో వేగంగా సంపద సృష్టిస్తానని తెలిపారు. తాను చెప్పిన పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కష్టమేనని, కానీ దానివల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ నెల 14న పార్టీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమంపై ప్రచారం ప్రారంభిస్తామన్నారు. బస్సులు, కార్ల ద్వారా మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 50 రోజులు పర్యటనలు చేస్తారని తెలిపారు. మహిళలకు ఇంకా ఏం చేయవచ్చనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. రామోజీకి ఇచ్చే గౌరవం ఇదేనా? రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా పడిందని, అది ఎప్పుడు తేలుతుందో తెలియదన్నారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా అని ప్రశ్నిoచారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ అసమర్థతతో నాశనం చేశారని విమర్శించారు. నదుల అనుసంధానం కోసం తాను ప్రతిపాదించిన ప్రణాళికను చేపట్టి ఉంటే నీటి కరువు ఉండేది కాదన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందని, ఏపీ మాత్రం పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందని అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారంపై పోరాటాన్ని తీవ్రం చేస్తామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదిలేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా సంస్థగా ఈనాడు ప్రశ్నిస్తోందనే మార్గదర్శిపై కేసులు పెట్టారని విమర్శించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వడానికి సీఐడీకి అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. మార్గదర్శిని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. పద్మవిభూషణ్ రామోజీరావును గౌరవించుకునే విధానం ఇదేనా అని చంద్రబాబు అన్నారు. -
అలా గెలిచావా వెలగపూడి రామకృష్ణబాబు..!
సాక్షి, విశాఖపట్నం: మరోసారి ఓటమి భయంతో ఏం చేయాలో పాలుపోక అధికారులపై అడ్డగోలు ఫిర్యాదులు.. ఎల్లో మీడియా అండతో పచ్చి అబద్ధాల రాతలతో రోత పుట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా.. ఏ ఒక్కటి డూప్లికేట్ ఓటు లేకుండా ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే వలస వెళ్లిపోయిన వారి ఓట్లు, మృతుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లని తొలగిస్తున్నారు. అయితే దీనిపై వెలగపూడి రామకృష్ణబాబు విష ప్రచారానికి తెరతీశారు. తూర్పు నియోజకవర్గంలో 40 వేల మంది ఓట్లని తొలగించేశారంటూ పచ్చపత్రిక ఈనాడు సహకారంతో హడావిడి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ని ఆదేశించింది. తొలగించిన ఓట్లు వివరాలు.. ఎందుకు తొలగించారో సహేతుకంగా వివరిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించారు. ఓట్లు తొలగింపు సక్రమంగానే సాగిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో వెలగపూడి మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఒకే చిరునామాతో 300 ఓట్లు నమోదు చేశారంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ చేస్తే వెలగపూడి బాగోతం బయటపడింది. 73 రోజుల్లో 40 వేల ఓట్లు నమోదు చేసిన టీడీపీ నేతలు వెలగపూడి ఫిర్యాదు చేస్తూ.. హడావిడి చేస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పు ఎక్కడ జరిగింది.? దీనికి ఎవరు బాధ్యులు అనేది పూర్తిగా అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ముందు గంపగుత్తగా వెలగపూడి బ్యాచ్ నమోదు చేసిన ఓట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2019 జనవరి 11న ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాని ప్రచురించింది. ఆ తర్వాత ఓటరు నమోదు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 మార్చి 2019న తుది ఎన్నికల ఓటరు జాబితాని ప్రచురించింది. ఈ 73 రోజుల కాల వ్యవధిలో తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40,300 మంది అదనపు ఓటర్లు చేరారు. ఆ తానులో లిస్టే ఇది.. ఇక టీడీపీ ఫిర్యాదు చేసినట్లుగా.. ఒకే ఇంటి నంబర్‌తో 300 ఓట్లు కూడా అప్పటి ఓటర్ల జాబితాలోని దేనని స్పష్టమైంది. 2019 డ్రాఫ్ట్‌రోల్‌లో డోర్ నంబర్ 13–733తో 282, 769తో 186, 790తో 166 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా అప్పట్లో టీడీపీ నేతలు నమోదు చేయించిన ఓట్లేనని స్పష్టమవుతోంది. ఇలా 2019 ఎన్నికలకు ముందు నమోదు చేసిన 40,300 అనుమానాస్పద ఓట్లను ఈ మధ్య కాలంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో గుర్తించిన ఎన్నికల సిబ్బంది వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 13,085 డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి ఓట్లుగా ఉన్న 1226, శాశ్వతంగా విశాఖ తూర్పు నుంచి వలస వెళ్లినట్లుగా గుర్తించిన 17,769 మంది ఓట్లు.. మొత్తం 32,080 ఓట్లను తొలగించేశారు. ఇది ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు.. 2024 ఎన్నికల్లో ఓటమి ఖాయమని భయపడి.. ఆ ఓట్లు తిరిగి చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల ముందే కథంతా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా తుది జాబితా ముద్రణ అయ్యింది. అలా ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్ తూర్పు నియోజవర్గంలో ఏకంగా 40,300 దొంగ ఓట్లని నమోదు చేయించారు. 2019 ఎన్నికల్లో వెలగపూడికి 87,073 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలకు 60,599 ఓట్లు వచ్చాయి. అంటే 26,474 ఓట్లు తేడాతో వెలగపూడి విజయం సాధించారు. ఈ విజయం కూడా సదరు టీడీపీ నేతలు నమోదు చేసిన 40,300 ఓట్ల కారణంగానే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అకారణంగా ఓటు తొలగించే ప్రసక్తే లేదు ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల సిబ్బంది ఓట్లు తొలగించారని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తి పారదర్శకంగా ఓటరు నమోదు ప్రక్రియతో పాటు.. వెరిఫికేషన్ కూడా పక్కాగా నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా బీఎల్వోలపై చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 24, 104, 236 పోలింగ్ కేంద్రాల పరిధిలో 222 మంది తాత్కాలిక వలసదారుల ఓట్లని విధుల్లో అలసత్వం కారణంగా తొలగించారు. తుది పరిశీలనలో వీటిని గుర్తించి తిరిగి చేర్చాం. సదరు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. గతంలో ఉన్న జాబితాలో మూడు కారణాలతో పలు దశల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసిన అనంతరం తొలగించాం. ఎవరైనా ఓటు లేదని భావించినా, చిరునామా మారినా, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నా ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. అకారణంగా ఓటు తొలగించారని తెలిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దొంగ ఓట్లు సృష్టించారు 2019 ఎన్నికలకు ముందే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా వేల కొద్దీ దొంగ ఓట్లు సృష్టించారు. ఇప్పుడు అవి తొలగిస్తుంటే భయం పట్టుకుని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా జాబితాని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ దొంగ ఓట్లు బాగోతం బట్టబయలవుతోంది. నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్లలో ఎక్కువగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నవారి పేర్లే ఉన్నాయి. ప్రతిసారీ దొంగ ఓట్లతోనే విజయం సాధిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ సారి ఆ పప్పులు ఉడకక పోవడంతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారు. – అక్కరమాని విజయనిర్మల, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త -
ఓటర్లను ‘చంపేస్తున్న’ టీడీపీ
పిఠాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాకినాడ జిల్లాలో తమ అనుచరులకు భర్తలు బతికుండగానే వితంతు పింఛన్లు ఇప్పించారు ఇక్కడి టీడీపీ నేతలు కొందరు. ఇప్పుడు బతికున్న ఓటర్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. టీడీపీ ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టగా, దాదాపు అందరూ జీవించే ఉన్నట్టు వెల్లడైంది. టీడీపీ తీరుపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలోని కొందరి పేర్లు, వారి ఓటరు నంబరు ఇతర వివరాలు ఇచ్చి, వారు చనిపోయారని, ఓట్లను తొలగించాలని టీడీపీ ఎలక్టోరల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వేలాది నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేసి వీటిని గుర్తించినట్లు అందులో తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. బూత్ లెవల్ అధికారులు నాలుగు రోజులుగా గ్రామాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు చనిపోయారని చెబుతున్న వారిలో 90 శాతానికి పైగా ఓటర్లు బతికే ఉన్నారని గుర్తించారు. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల ఓట్లను డబుల్ ఎంట్రీలని, ఫేక్ ఓట్లని టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. టీడీపీ ఫిర్యాదు తప్పుడుది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి బూత్ నంబరు 206లో ఓటరు కార్డు నంబరు వైఓయూ 1794924 మామిడాల వెంకటరమణ, వైఓయూ 0130591 వి.బుల్లి అప్పారావు, వైఓయూ 1791920 చోడిశెట్టి మాణిక్యం, వైఓయూ 1791805 సానా సీతారాముడు చనిపోయినట్లుగా టీడీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి వారంతా జీవించే ఉన్నారు. అధికారులు వారి ఇంటికి వెళ్లగా... వారే సమాధానాలిచ్చారు. ఈ విచారణకు అధికారులు రోజుల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల అధికారుల విలువైన సమయంతోపాటు ప్రజా ధనమూ వృథా అవుతోంది. విచారణ జరుపుతున్నాం చనిపోయిన వారివి, నకిలీ ఓట్లు ఉన్నట్లు టీడీపీ ఎలక్టోరల్ సెల్ నుంచి ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మాకు పంపించారు. దానిపై గ్రామాల్లో విచారణ చేయిస్తున్నాం. నకిలీలు, చనిపోయిన వారు ఉంటే వాటిని తొలగిస్తాం. లేకపోతే యథావిధిగా ఉంటాయి. ఎవరో ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన ఎవరి ఓటు హక్కు పోదు. పూర్తిగా విచారణ చేసే ఎన్నికల కమిషన్‌కు పంపుతాం. – కె.సుబ్బారావు, ఎన్నికల ఓటరు జాబితా నమోదు అధికారి, పిఠాపురం నియోజకవర్గం నేను చనిపోవడం ఏమిటి? కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. నేను చనిపోయానని, ఓటు తొలగించాలంటూ ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి అడిగారు. అసలు నేను చనిపోవడమేమిటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలి. – మామిడాల వెంకట రమణ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 50 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. ఇంతకు ముందు టీడీపీ వారెవరూ మా ఇంటికి వచ్చి విచారణ చేయలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి మీరు ఉన్నారా.. అని అడుగుతున్నారు. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – సానా సీతారాముడు నేను ఆరోగ్యంగానే ఉన్నా నాకు 86 సంవత్సరాలు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాను. కొత్తపల్లి బూత్ నంబరు 206లో 60 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. అసలు నేను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో కూడా తెలియకుండా ఎవరో ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న వారిని చంపేస్తారా? అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – చోడిశెట్టి మాణిక్యం -
విశాఖ తూర్పులో దొంగ ఓట్ల రగడ
మహారాణిపేట: విశాఖ తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు రగడ సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఇళ్లలో వాస్తవంగా ముగ్గురు, నలుగురు ఉంటే.. 10 నుంచి 15 వరకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉండడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ ఓట్లను తొలగించారు. వాటిని తిరిగి చేర్చాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేర్పించిన దొంగ ఓట్లని, వాటిని తిరిగి జాబితాలో చేర్చవద్దని వైఎస్సార్సీపీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వారే అక్రమంగా జాబితాలో చేర్పించారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వివాదాలు చెలరేగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలుపు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికలకు ముందు వెలగపూడి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల ఆరోపించారు. ఈమేరకు ఆమె కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దొంగ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చవద్దని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వెలగపూడి స్థానికేతరుడు కావడం వల్ల విజయవాడ, గుంటూరు, గన్నవరం తదితర ప్రాంతాల ప్రజలు, గీతం కాలేజీ విద్యార్థులను ఓటర్ల కింద నమోదు చేశారని ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్‌పై 20 ఓట్లు ఉంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనవరి నుంచి మార్చి వరకు కనీసం 40,000 ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం నిజమైన విజయం కాదన్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇష్టానుసారం తొలగించేశారు: వెలగపూడి మరోపక్క టీడీపీ ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అక్రమంగా 40,000 ఓట్లు తొలగించారని వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకు 30,000 నుంచి 40,000 ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. తొలగించిన ఓట్లన్నీ తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. -
అవి ప్రణాళికాబద్ధంగా నిర్మించే ఊళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా, అమరావతి రైతుల ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ వచ్చేది కాలనీలు కావని.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ లబ్దిదారుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకోవడం చూశాం. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అండ్ కో వాదించారు. చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకేసి.. ఒక సెంట్ స్థలం సమాధులకు సరిపోతుందని వ్యాఖ్యానించడం.. దానిపై పేదలు, సామాజికవేత్తలు భగ్గుమనడంతో ఇప్పుడు తాజాగా ఆయన వర్గం మురికివాడలు అంటూ ప్రచారం ప్రారంభించింది. పక్కా ప్లానింగ్‌తో నిర్మాణం ప్రభుత్వం 25 లే అవుట్లలో 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రతి లే అవుట్‌ను కూడా సీఆర్డీఏ, టౌన్ ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లే అవుట్లో 38 శాతం మాత్రమే ప్లాట్ల కోసం, మిగిలిన స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఉదాహరణకు కృష్ణాయపాలెం లే అవుట్ 58.15 ఎకరాల్లో వేశారు. ఇందులో 2,234 మంది లబ్దిదారులకు స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్ ఆరు మీటర్ల వెడల్పు, 6.80 మీటర్ల పొడవు ఉండేలా ఏర్పాటు చేశారు. మొత్తం స్థలంలో 38.72 శాతం మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 36.52 శాతం రోడ్లకు, 10.28 శాతం భూమిని ఓపెన్ స్పేస్‌గా, ఇతర అవసరాల కోసం 8.79 శాతం, పార్కింగ్ కోసం 5.69 శాతం కేటాయించారు. ప్రతి లేఅవుట్లో ప్రధాన రహదారులు 40 అడుగులు, అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీలో అంగన్న్వాడీ కేంద్రం, విలేజి క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద లేఅవుట్లలో ప్రైమరీ స్కూల్ కూడా మంజూరు చేస్తారు. నవులూరు, కృష్ణాయపాలెంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇన్ని మౌలిక సదుపాయాలతో వచ్చే కాలనీలు మురికివాడలు ఎలా అవుతాయో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఆధిపత్యం తగ్గిపోతుందని టీడీపీ భయం పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా సామాజిక న్యాయం చేకూర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించి 50,793 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో సగానికి పైగా బీసీలకు దక్కాయి. రెండు జిల్లాల్లో 26,869 మంది బీసీలకు, 8,495 మంది ఎస్సీలకు, 1579 మంది ఎస్టీలకు, మిగిలిన 13,850 మంది ఇతరులకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. వీరందరూ వస్తే తమ ఆధిపత్యం తగ్గి పోతుందనే భయం తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. -
మహానాడులో జగన్నామస్మరణ
రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ మహానాడు ఆసాంతం జగన్నామస్మరణతో మార్మోగిపోయింది. ఉదయం సమావేశం ప్రారంభమైంది మొదలు రాత్రి ముగిసే వరకు ప్రతి నిమిషం సీఎం పేరు తలుచుకోకుండా ఏ నాయకుడూ తన ప్రసంగాన్ని ముగించలేదు. తిట్లు, శాపనార్థాలు, ఆక్రోశాలు, ఆగ్రహావేశాలు, విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా నేతలంతా ఇదే ఒరవడి కొనసాగించారు. అసలు మహానాడు నిర్వహిస్తోంది సీఎం జగన్‌ను తిట్టడానికే అన్నట్లు వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక పేరుతో వర్ల రామయ్య పార్టీ కార్యక్రమాల గురించి చెప్పడం కంటే జగన్‌ను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు తీర్మానాలు మినహా మిగిలిన ఏపీకి చెందిన తీర్మానాలన్నీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పెట్టినవే కావడం గమనార్హం. ఎన్టీఆర్ కుటుంబానికి అవమానం మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన కుటుంబీకుల ఎవరికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్‌లకే అత్యంత ప్రాధాన్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించారు. ప్రధాన బ్యానర్లో నందమూరి బాలకృష్ణ ఫొటో ముద్రించక పోవడంపై పలువురు నేతలు చర్చించుకున్నారు. ప్రకటనలు, కరపత్రాలు.. అన్నింటా చంద్రబాబు, లోకేశ్‌కే ప్రాధాన్యం కనిపించింది. తద్వారా టీడీపీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉండదనే రీతిలో మహానాడు నిర్వహించారు. కాగా, మహానాడుకు జన స్పందన కరువైంది. ఆశించిన మేరకు జనం రాకపోవడంతో సభ వెలవెలబోయింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గ్యాలరీల్లో జనం లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు..’ ప్రస్తావన మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించారు. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు. -
Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ?
సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడు విషపు రాతలు విపత్తులకంటే ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం ఉషోదయంతో అబద్ధాలు నినదించే రామోజీకి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సంస్కరణల యజ్ఞం కనిపించట్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయంలో తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. రైతులపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. వాస్తవానికి రైతులకు అన్ని రకాలుగా దగా చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీ హయాంలో సగటున 20.28 లక్షల మంది రైతుల పంటలకు మాత్రమే బీమా కవరేజ్ ఉండేది. అదీ సకాలంలో చెల్లించేవారు కాదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్ల పాలనలో 1.66 కోట్ల మంది రైతులకు బీమా కల్పించారు. ఒక్క 2022–23 సంవత్సరంలోనే 54.11 లక్షల మందికి పంటల బీమా రక్షణ క ల్పించారు. ఇది ఓ రికార్డు. పంట కోత ప్రయోగాల ఆధారంగా వేసే దిగుబడి అంచనాకంటే.. వాస్తవ దిగుబడులు ఏమాత్రం తగ్గినా తదుపరి సీజన్ ప్రారంభం కావడానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం బీమా పరిహారం చెల్లిస్తోంది. ఈవేమీ పట్టని ఈనాడు ఉచిత బీమాపై అసత్య కథనంతో విషం కక్కింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ– క్రాప్ నమోదు ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 2020 –21 సంవత్సరంలో రూ. 1,739 కోట్లు, 2021 –22 లో రూ. 2,978 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అదీ.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యాన పంటలకు రూ.423.73 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. మామిడి పంట నష్టపోయిన 4,197 రైతులకూ రూ. 4.97 కోట్లు పెట్టుబడి రాయితీ అందించింది. రబీ 2022–23 సీజన్‌కి పంటల బీమా కింద పంటలను నోటిఫై చేయలేదన్న మాటాఉత్త అబద్ధమే. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలుకు 2022–23 రబీలో ఈ– క్రాప్ నమోదు పూర్తయిన రైతుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, బీమా కంపెనీలకు ఈ ఏడాది మార్చిలోనే పంపించింది. నేషనల్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పోర్టల్‌లో నోటిఫికేషన్ డిజిటైజేషన్ కూడా పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందం రైతువారీ వివరాల పరిశీలన తర్వాత పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో రబీ డేటా ప్రదర్శిస్తుంది. పంటల బీమాను సరళతరం చేసింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. బీమా అన్నది రైతుకు గుది బండగా మారకుండా, బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు ప్రతి ఎకరాకూ బీమా వర్తింపజేస్తోంది. రైతుపై భారం లేకుండా పూర్తి ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా కంపెనీలు గడువులోగా పరిహారం చెల్లించేలా పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. రాష్ట్రంలో రైతులకు బీమా పరిహారాన్ని తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. మిర్చి పంటకు బీమాను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లిస్తోంది. 2019–20లో 58,968 మంది రైతులకు రూ.90.24 కోట్లు, 2020–21లో 19,983 మంది రైతులకు రూ.36.02 కోట్లు, 2021–22లో 70,229 మంది రైతులకు రూ.439.78 కోట్లు చెల్లించింది. 2023–24లో బీమాకు మిర్చి పంట కవరేజీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీమా కవరేజ్, పరిహారం ఇలా.. తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదేళ్లలో 74.37లక్షల మంది రైతులకు బీమా కవరేజ్ అయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్లలో 1.67 కోట్ల మంది రైతులు బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే, ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3.24 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించింది. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 44.66 లక్షల మందికి రూ.6,488.84 కోట్ల బీమా పరిహారం అందజేసింది. బీమా కవరేజ్ పొందిన రైతులు, విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో) ఇలా.. -
బాబూ.. ఐ లవ్యూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి రావాలనిగానీ, ముఖ్యమంత్రి అవ్వాలనిగానీ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఏకోశానా లేదు. రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉన్నా.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనమైతేనే రాజకీయంగా కనీసం తమ ఉనికి అయినా ఉంటుందని, ఈ విషయం సాధారణ కార్యకర్తను అడిగినా చెబుతారు. కానీ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయం తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఈ నేతలిద్దరికీ చంద్రబాబును సీఎంను చేయాలనే తపన తప్ప మరో ఉద్దేశం కనిపించడంలేదు. ఎదగడానికి ఉన్న అవకాశాలను పట్టించుకోకుండా చంద్రబాబుతో పవన్ సమావేశం కావడం, మరిన్ని భేటీలుంటాయని నాదెండ్ల చెప్పటం చూస్తే.. నమ్ముకున్న నాయకుల్ని, కార్యకర్తల్ని మీదారి మీరు చూసుకోండని చెప్పినట్లే ఉంది. కేవలం వాళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికై చంద్రబాబు సీఎం అయితే చాలని వారు భావిస్తున్నట్లు ఉంది. తాజాగా జనసేన అధినేత తీరుపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబూ.. ఐ లవ్యూ.. అంటూ ఆయన ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి మీ గెలుపు బాధ్యత నాదే అంటూ భరోసా ఇచ్చి రావడం తమకు తీవ్ర అవమానంగా ఉందని జనసేన నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత పార్టీ కోసం కాదు.. టీడీపీ కోసమే.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నా, ఇప్పటికీ రెండు మూడు నెలలకొకసారిగానీ రాష్ట్రానికి రాని పవన్‌కళ్యాణ్ ఇటీవల కాలంలో వెంటవెంటనే మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏ మాత్రం ఇష్టం లేని బీజేపీని సైతం ఒప్పించేలా పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పవన్ సొంత పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. పవన్ సీఎం కావాలంటే టీడీపీ నేతలే కించపరిచారు పవన్‌కళ్యాణ్ సీఎం కావాలని తాము డిమాండ్ చేసిన సందర్భాల్లో తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరకరంగా స్పందించినట్లు జనసేన నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ఉండాలని జనసేన నాయకులు డిమాండ్ చేసినప్పుడు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘క్వింటా కాటా తూగడానికి ఒక్కొక్కసారి కొన్ని వడ్లు అవసరమవుతాయి. కానీ, ఆ కొన్ని వడ్ల వల్లే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా సేనాధిపతీ!’ అంటూ జనసేన అధినేతను కించపరుస్తూ ట్వీట్‌ను చేశారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో జనసేనను రాజకీయంగా బలహీనపరచడానికి అధికార వైఎస్సార్సీపీ మాదిరే తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేస్తోందని కాపు సంక్షేమసేన తరఫున మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి నేతలు ఇటీవల పవన్‌కళ్యాణ్‌తో జరిగిన భేటీలో చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీని గద్దె దింపడానికి విపక్షాలన్నీ కలవాలని చెబుతూనే చంద్రబాబు.. జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్‌లాంటి వారిని తెలుగుదేశంలో చేర్చుకున్నారని హరిరామజోగయ్య నేరుగా పవన్‌కళ్యాణ్ వద్దే ప్రస్తావించారు. చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారు లేరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న పార్టీలు గానీ, చంద్రబాబును నమ్మినవారుగానీ రాజకీయంగా ఎదిగి న చరిత్ర లేదని పవన్ అభిమానులు గుర్తుచేస్తున్నారు. అలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ రాజకీయ ఎదుగుదల కోసం మరొకరిని రాజకీయ సమాధి చేయడానికే చూస్తారనేది తెలిసినా పవన్ ఇలా వ్యవహరిస్తుండటం చూ స్తే ఆయనకు ఎదగాలని లేదని అర్థమవుతోందని పేర్కొంటున్నారు. పొత్తుల్లో జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండే అవకాశం ఉండొచ్చని అభిమానులే అంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో 15 సీట్లు బీజేపీకి కేటాయించిన టీడీపీ.. అందులో నా లుగుచోట్ల ఫ్రెండ్లీ పోటీ అంటూ అభ్యర్థుల్ని నిలబెట్టిందని, మరో మూడుచోట్ల టీడీపీ నేతలే ఇండిపెండెంట్లుగా పోటీచేశారని జనసేన నేతలు గుర్తుచేసుకుంటున్నారు. ఎప్పుడైనా టీడీపీ వ్యవహారం అలాగే ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నేతల్నే జనసేనలో చేర్పించి పోటీచేయిస్తారని అనుమానిస్తున్నారు. ఇక మనదారి మనం చూసుకోవాలి్సందేనా అని జనసేన నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
దళితులపై బాబు ‘చిన్న’ చూపు
నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘చెప్పేటందుకే నీతులు’ అన్న మాట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అతికినట్లు సరిపోతుంది. మైకు పట్టుకుంటే దళితులు, వారి అభ్యున్నతి అంటూ మాట్లాడే చంద్రబాబు.. పార్టీలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం సున్నా. కొన్నిమార్లు దళితుల పట్ల చిన్న చూపును కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు. పార్టీ వ్యవహారాల్లోకొచ్చేసరికి అదే చిన్నచూపు చేతల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిల నియామకం, వారిపై ఆధిపత్యం చెలాయించే బాబు బృందాలే ఇందుకు నిదర్శనం. పేరుకే ఎస్సీలను ఇన్చార్జిలుగా నియమించినప్పటికీ, ఆ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం, నిర్వహణ, కార్యక్రమాల అమలులో వారి పాత్ర శూన్యం. ఈ నియోజకవర్గాల్లో బాబు తన వర్గీయులతో వేసిన కమిటీలదే ఆధిపత్యం. వారేమి చెబితే ఇన్చార్జిలు, పార్టీ ఇతర నేతలు అది చేయాల్సిందే. దళితుల పట్ల వ్యతిరేకత, ఆ వర్గాలను చులకన చేసి మాట్లాడటం, పదవుల పంపిణీలో మోసగించడం, రాజకీయంగా ఎదగనీయకపోవడం, ఆ ప్రాంత ముఖ్య నేతల ద్వారా విభేదాలను రాజేయిస్తూ వర్గాలను ప్రోత్సహించడం, ఎన్నికలప్పుడు తమ వర్గీయుల సిఫార్సుల మేరకే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం తొలి నుంచి చంద్రబాబు సాగిస్తున్న తంతే. సీనియర్ దళిత నేతలకూ చుక్కలు చూపించడం బాబు బృందానికి రివాజే. దళితులపై చిన్న చూపులో తండ్రిని మించిన లోకేశ్ దళితులను చిన్న చూపు చూడటంలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ తండ్రిని మించిపోయాడన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో గెలిపించండని లోకేశ్ చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం ఆయన ఎవరి పేరూ చెప్పకపోవడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో నగరిలో గాలి భానుప్రకాశ్, చంద్రగిరిలో పులివర్తి నానిలను గెలిపించాలని ఆయన చెప్పారు. వాటి పొరుగునే ఉన్న పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఇన్‌ఛార్జిల ప్రస్తావనే లోకేశ్ నోటి వెంట రాలేదు. ♦ కొవ్వూరు స్థానాన్ని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆశిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు ఆయన్ని కొవ్వూరు నుంచి తప్పించి తిరువూరుకు పంపగా అక్కడ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం కంఠమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరితో కూడిన ద్విసభ్య కమిటీ అక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీరివురూ బాబు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక్కడ వీరిదే హవా. దళితుడైన మాజీ మంత్రి పార్టీ కార్యాలయానికి కూడా వచ్చే అవకాశం లేదు. సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన కార్యక్రమాలేవో ఆయన చేసుకుంటున్నారు. ♦ చింతలపూడి నుంచి మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం అక్కడ ఆమెకు ఇన్చార్జి బాధ్యతలు కూడా లేవు. నియోజకవర్గానికి చెందిన గంటా మురళీరామకృష్ణ, గంటా సుధీర్, పరిమి సత్తిపండు, గరిమెళ్ల చలపతి తదితరులదే పెత్తనం. ♦ చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు పరిధిలోని గంగాధర నెల్లూరులో చిట్టిబాబు నాయుడుదే ఆధిపత్యం. పూతలపట్టులో యువరాజు నాయుడు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కె.విశ్వనాథ నాయుడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెద్దరత్తయ్యలే పార్టీ పెద్దలు. అనంతపురం జిల్లా సింగనమలలో బండారు శ్రావణితో పాటు పలుకుబడి కలిగిన వేర్వేరు సామాజికవర్గాల నేతలు అజమాయిషీ చలాయిస్తున్నారు. కోడుమూరు, నందికొట్కూరు, బద్వేలు స్థానాల్లోనూ ఇదే తంతు. ♦ డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఇన్ఛార్జిగా లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్‌ను నియమించారు. హరీష్ అమలాపురం లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఇన్చార్జి. కానీ, ఆయన మాటకు ఇక్కడ విలువ లేదు. నామని రాంబాబు, డొక్కా నాథ్‌బాబు ఎలా చెబితే అలా ఆడాలి. ♦ విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళిమోహన్ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ, అక్కడ రాష్ట్ర పార్టీ మాజీ అ«ధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుదే ఆధిపత్యం. మాజీ సభాపతి కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె కావలి గ్రీష్మకూ పార్టీలో ఎటువంటి విలువా లేదు. ♦ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇన్ఛార్జిగా చావల దేవదత్తుని నియమించినప్పటికీ, ఆయనకు ఏ అధికారమూ లేదు. పార్టీలో హవా అంతా బాబు వర్గానికి చెందిన చెరుకూరి రాజేశ్వరరావు, సుంకర కృష్ణమోహన్‌రావు, నెక్కలపు వెంకట్రావులదే. ఆర్థికంగా బలవంతులైతే చాలు... ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ సీనియర్లు ఇటీవల చంద్రబాబుకు, లోకేశ్‌కు ఝలక్ ఇచ్చారు. గుడివాడ పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ప్రత్యామ్నాయంగా తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఎన్నారై వెనిగండ్ల రామును ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లపై పలుసార్లు సమావేశమైన సీనియర్లు రాముకు ఆహ్వానం కాదు కదా కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. దీనిపై రాము అలకబూనారన్న సంగతి తెలియగానే బాబు సీరియస్ అయ్యారు. నియోజకవర్గాలలో ఎవరైనా పార్టీ కోసం పనిచేయవచ్చని, ఇందుకు ఎవరి అనుమతీ అవసరంలేదని ఫత్వా జారీ చేశారు. దీంతో బాధ్యతలు అప్పగించిన వారు మినహా మరెవరూ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌కు విలువలేకుండా పోయింది. స్థితిమంతులు, తన వర్గానికి చెందిన నేతల విషయంలో ఒకలా, ఇతర వర్గాల విషయంలో మరోలా బాబు వ్యవహారం ఉంటుందనే పార్టీ నేతల అభిప్రాయానికి గుడివాడ వ్యవహారం ఒక నిదర్శనం. -
రాష్ట్ర ప్రజలకు దయ్యం పట్టింది
సాక్షి, నరసరావుపేట/సత్తెనపల్లి: రాష్ట్ర ప్రజలకు దయ్యం పట్టిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారికి శని దాపరించి, తనను ఓడించారని అన్నారు. ఆయన బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రజలు తనను ఓడించినందువల్లే అమరావతి నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను నిర్మించానని, అదే విధంగా అమరావతి నిర్మాణం మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోయిందన్నారు. గుంటూరు ప్రజలు సైతం అమరావతికి కుల ముద్ర వేశారని అన్నారు. తన సూచనలతోనే వాజపేయి దేశంలో రోడ్లు వేశారన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదలందర్నీ ధనవంతులను చేయడమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. పాసుపుస్తకం, భూసరిహద్దు రాళ్లపైనా జగన్ ఫొటోనేనా అని ప్రశ్నించారు. బాబాయిని చంపి తనపై నెపం మోపి నారాసుర రక్త చరిత్ర అంటూ వాళ్ల పేపర్లో అచ్చు వేసుకున్నారని ఆరోపించారు. అంబులెన్స్‌కు దారివ్వని చంద్రబాబు కాన్వాయ్ చంద్రబాబు సత్తెనపల్లి పర్యటనలో అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం పట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. బుధవారం రాత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రచార రథంపై పట్టణంలోకి ప్రవేశించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ అంబులెన్స్ వచ్చినప్పటికీ దానికి దారి ఇవ్వలేదు. అక్కడి నుంచి చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లే వరకు అంబు లెన్స్ అక్కడే ఉండాల్సి వచ్చింది. కాగా, సత్తెనపల్లిలో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభ కార్యక్రమాల్లో మద్యం ఏరులై పారింది. జన సమీకరణ నిమిత్తం ఒక్కో మహిళకు రూ.300తో పాటు చీర, పురుషులకు ఒక్కొక్కరికి రూ.500, క్వార్టర్ మద్యం, బిరియానీ ప్యాకెట్, టీ షర్ట్ పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ‘గో బ్యాక్ చంద్రబాబూ..’ అంటూ తాలూకా సెంటర్లో వెలిసిన ఫ్లెక్సీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చిన మాట వాస్తవం కాదా? అంటూ ఆ ఫ్లెక్సీలో పలు ప్రశ్నలు సంధించారు. -
తెలుగుదేశం పార్టీని దళితులు నమ్మే పరిస్థితి లేదు
-
నా రిపోర్టుతోనే డిజిటల్ కరెన్సీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐటీ విషయంలో నీకు బాగా అనుభవం ఉంది. డిజిటల్ కరెన్సీ మీద రిపోర్టు ఇవ్వు అని ప్రధాని మోదీ అడిగితే రిపోర్టు ఇచ్చాను. నేనిచ్చి న రిపోర్టు ఆధారంగానే డిజిటల్ కరెన్సీని తెచ్చారు. ఈరోజు కూరగాయల దుకాణం నుంచి ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ఉంది. అలాగే 500, వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీని డెవలప్ చేద్దామని చెప్పాను. అది వస్తే దేశ ఆదాయం పెరుగుతుంది..’’అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగానే తన గురించి చెప్పుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని, అప్పుడే అవినీతి పోతుందని చెప్పారు. నా వల్లే సెల్ఫోన్లు వచ్చాయి: గతంలో తాను ఇచ్చి న రిపోర్టు ఆధారంగానే వాజ్‌పేయి టెలికం రంగంలో సంస్కరణలు తెచ్చారని, సెల్ఫోన్లు వచ్చాయని అన్నారు. ఇటీవల ఓ సమావేశంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు విజన్–2027 రిపోర్టు తయారు చేయాలని.. దానితో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ అవుతుందని చెప్పానని వివరించారు. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ టీడీపీ అని, జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరాని తనం లేకుండా చేశానని అన్నారు. మొదటి నేషనల్ హైవే తెలుగుదేశం హయాంలోనే వచ్చిందన్నారు. 1995లో తాను సీఎం అయిన తర్వాతే రంగారెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టారన్నారు. త్వరలో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సభలో పార్టీ తెలంగాణ, ఏపీల అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, నందమూరి రామకృష్ణ, పార్టీ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
పుంగనూరులో తారస్థాయికి చేరిన టీడీపీ ఆగడాలు
14 ఏళ్లు అధికార మదంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అవసరాలను అవకాశంగా చేసుకుని ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పడడంతో ఏమిచేయాలో దిక్కుతోచక వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాటను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారు. తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో పచ్చని పల్లెల్లో నిప్పురాజేసి రాక్షస క్రీడకు ఆజ్యం పోస్తున్నారు. అభిమానంతో ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అడ్డుకున్న కార్యకర్తలు, ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. హాకీ స్టిక్‌లు, రాళ్లతో దాడులు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పుంగనూరు నియోజకవర్గ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతోందన్న అక్కసుతో దాడులకు తెగబడుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించివేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అడ్డుకుంటున్న కార్యకర్తలు, ప్రజలపై విక్షణారహితంగా దాడులు చేస్తూ రచ్చకీడుస్తున్నా రు. తర్వాత వాటన్నింటినీ ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపైకి నెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలమైన పత్రికలు, మీడియాలో అసత్య కథనాలు వళ్లిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దాడులు ఎందుకంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లో పుంగనూరు నియోజకవర్గం కూడా ఉంది. 14 ఏళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర వాటిని టీడీపీ కార్యకర్తకో, వారి కుటుంబ సభ్యులకో మంజూరు చేయడం రివాజుగా మారేది. లేదంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పడం.. ఆపై మొండిచేయి చూపడం అటవాటుగా మారింది. ఆ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే రోడ్లు, ఇతర పథకాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. 2019 సాధారణ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా సంక్షేమ పాలన మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ పాలనకు మెచ్చి పుంగనూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. ఆయన అనేక మందికి తనవంతు సాయం చేస్తుండడంతో ఆ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు సైతం వైఎస్సార్సీపీ జెండా కిందకు వస్తున్నాయి. ప్రస్తుతం పల్లెబాట పేరుతో ఊరూరా తిరుగుతున్న మంత్రికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో.. నియోజకవర్గంలో అక్కడక్కడా మిగిలిపోయిన టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. రెచ్చిపోతున్న తమ్ముళ్లు మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట నేపథ్యంలో రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్యగారిపల్లె, పెద్దగొట్టిగల్లు, బోడిపాటివారిపల్లెకు చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబ డ్డారు. రెండు రోజుల క్రితం రొంపిచెర్ల క్రాస్‌లో వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలను చించివేశారు. అలాగే ఈనెల 1వ తేదీ రాత్రి చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె పంచాయతీ, తెల్లనీళ్లపల్లిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్‌రెడ్డి (చిట్టి), అతని అనుచరులు కలిసి ఎంపీటీసీ శ్రీరాములును చితకబాదారు. ఆ గ్రామంలో బ్యానర్లు కట్టకూడదని దౌర్జన్యానికి ఒడిగట్టారు. అదేవిధంగా ఈనెల 3న దిగువపల్లె పంచాయతీ భవానీనగర్‌లో భూ విషయమై టీడీపీ వర్గాలు రెండు ఘర్షణకు దిగాయి. దీన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా ద్వారా అతస్య కథనాలు రాయించడం కొసమెరుపు. బరితెగిస్తూ.. నియోజకవర్గంలో ‘చల్లా’యిస్తూ.. ఇటీవల టీడీపీ నియోజకవర్గ నేత చల్లా బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ‘ఇందేం ఖర్మ’ కార్యక్రమా న్ని చేపట్టారు. గత శుక్రవారం పీలేరు, కలికిరి నుంచి ర్యాలీగా సోమల మండలానికి చేరుకున్నా రు. పెద్ద ఉప్పరపల్లి మీదుగా సోమల దళితవాడకు చేరుకున్న టీడీపీ ర్యాలీని స్థానికులు అడ్డుకున్నారు. ‘టీడీపీ ప్రభుత్వంలో మాకేం చేశారు..’ అంటూ ఎదురుతిరిగారు. తమ గ్రామంపై ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు వికృతచేష్టలకు ఒడిగట్టారు. అడ్డు తప్పుకోకపోతే వాహనాలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహించలేని టీడీపీ శ్రేణులు స్థానికులపై హాకీ స్టిక్స్, రాళ్లతో దాడికి దిగారు. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకుడు పీఎల్ఆర్ రాజారెడ్డిపై దాడిచేశారు. ఆయన కాలు, చేయిని విరగ్గొట్టి పంతం నెగ్గించుకున్నారు. చివరకు సోమల ఎస్ఐ లక్ష్మీకాంత్ పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. (క్లిక్ చేయండి: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్) -
Telidevara Bhanumurthy: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండంత్రాల బంగ్లల బేతాలు డుంటున్నడు. ఎటూ పొద్దుబోక టీవీ జూస్కుంట గూసున్నడు. విక్రమార్కుడు బొందల గడ్డకు బోయిండు. బేతాలుని ఇంటి ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతల కొచ్చిండు. మోటరెన్క సీట్ల గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ‘‘నన్ను గూసుండ బెట్టుకోని ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతవు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు తిక్క లేవొచ్చు. కోపం రావొచ్చు. యాస్ట లేకుంట ఉండె తంద్కు నీకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ అని మోటరెన్క సీట్ల గూసున్న బేతాలుడన్నడు. ‘‘నీకు కత జెప్పుడు, నాకు ఇనుడు అల్వాటే గద’’ అని మోటర్ నడ్పుతున్న విక్రమార్కుడన్నడు. ‘‘గీనడ్మ తెలంగానలున్న కమ్మం పట్నంల తెలుగు దేసం శంకు సప్పుడు సబ బెట్టింది. గాడ కిష్నుని యేసంల శంకమూదుతున్న ఎన్టీఆర్ కటౌట్ బెట్టిండ్రు. పచ్చ జెండలు ఎగిరేసిండ్రు. పచ్చ తోర్నాలు గట్టిండ్రు. బుక్క గులాల్లెక్క తెలుగు దేసమోల్లు ఒకల మీద ఒకలు పస్పు జల్లుకుండ్రు. శంకు సప్పుడు సబ కాడ రెండేల్లు సూబెడ్తున్న చెంద్రబాబు కటౌట్ గుడ్క బెట్టిండ్రు. ‘తెలుగుదేసం పిలుస్తున్నది కదలిరా. సైకిల్ పంపు దీస్కోని ఉర్కిరా’ అని రాసి ఉన్న బ్యానర్లను గట్టిండ్రు’’ అన్కుంట బేతాలుడు ఇంకేమొ జెప్పబోతుంటె – ‘‘సైకిల్ పంపు దీస్కోని వొచ్చుడెందుకు?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాలిబోయిన టీడీపీ సైకిల్ల గాలిగొట్టెతంద్కు. శంకు సప్పుడు సబకు చెంద్రబాబొస్తుంటె జెనం గాయిన మీద పస్పు జల్లిండ్రు. నందమూరి సుహాసిని పస్పుతోని గాయినకు బొట్టు బెట్టింది. కడ్మ టీడీపీ ఆడి లీడర్లు గాయినకు మంగలార్తి ఇచ్చిండ్రు. పచ్చంగి దొడుక్కున్న గాయిన గాల్లకు రెండేల్లు సూబెట్టిండు. ‘తెలుగుదేసం జిందాబాద్, చెంద్రబాబు జిందాబాద్’ అని తెలుగు దేసపోల్లు లాసిగ వొల్లుతుండగ గాయిన స్టేజ్ ఎక్కిండు. ముందుగాల పచ్చ రంగు శంకం దీస్కోని ఊదిండు. గని జెర్ర సేపటికే గాయినకు దమ్మొచ్చింది. ఇక దాంతోని శంకమూదుడాపి గాయిన గిలాస నీల్లు దాగిండు.’’ ‘‘తెలుగుదేసంను ఇడ్సిపెట్టి పోయిన తెలుగు తమ్ముండ్లూ మల్లొక్కపారి మీ ఇంటికి రాండ్రి. సైకిల్ పంపుచర్లు జుడాయించి గాలి గొట్టుండ్రి. టీడీపీ తెలంగానలనే పుట్టింది. తెలంగానలనే పెరిగింది. (‘తెలంగానలనే సచ్చింది’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు) నేను ఒక్క తీర్గ బత్మిలాడంగ బత్మిలాడంగ బిల్స్ గేట్స్ పట్న మొచ్చిండు. కుద్దు నేనే గాలి మోటర్ అడ్డంకు బోయి గాయినకు మంగలార్తి ఇచ్చిన. మూడు నచ్చత్రాల హోటల్ల ఉంచి కుద్దు నేనే ఒక కోపుల చాయ్ ఇచ్చిన. గాయినకు ఒక్క తీర్గ మస్క గొట్టి హైటెక్ సిటీ దెచ్చిన. గాలి మోటర్ల దునియ అడ్డను నేనే గట్టిపిచ్చిన. నేను జెయ్యబట్కెనే ఇయ్యాల పట్నంల కరోన టీక తయ్యారైంది. తెలంగాన, ఆంద్ర నాకు రొండు కండ్లు. గీ రొండు కండ్లు ఒక్కటి గావాలని సిగ్గు శరం లేనోల్లు అంటున్నరు. ఏ కన్నుకు ఆ కన్ను ఉంటెనే నాకు మల్ల ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్తది. టీడీపీ సైకిల్ ఒక గిర్రల ఆంద్ర తమ్ముండ్లు గాలిగొడ్తున్నరు. ఇంకొక గిర్రల తెలంగాన తమ్ముండ్లూ గాలి గొట్టుండ్రి. మీరు గాలిగొడ్తెనే నా సైకిల్ నడుస్తది. నా సైకిల్ నడుస్తనే బీజేపీ కాడికెల్లి అన్ని పార్టిలు నా దిక్కు జూస్తయి. నాతోని సోపతి జేస్తయి అన్కుంట చెంద్రబాబు సుత్తిగొట్టిండు.’’ ‘‘తెలంగానలనే గాకుంట ఆంద్రల గుడ్క చెంద్రబాబు సబలు బెట్టిండా?’’ ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు సబలు బెట్టిండు. ముక్యమంత్రి కుర్సి పోయిన కాన్నుంచి నాకు బువ్వ దిన బుద్దయితలేదు. కన్ను మలుగుతలేదు. కన్ను మల్లకుంటె కలలు యాడబడ్తయి. కలలు బడక ఆకర్కి కలల గుడ్క ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్త లేదు. ఫికర్ తోని బక్కగైన. నన్ను ముక్యమంత్రిని జేస్తిరా అంటె అందరి ఇండ్లకు పచ్చ రంగేపిస్త. ఇండ్లకే గాకుంట బళ్లకు, గుళ్లకు, సర్కార్ దప్తర్లకు పచ్చరంగు ఏపిచ్చి ఆంద్రప్రదేస్ను బంగారి రాస్ట్రం జేస్త. గిదేం కర్మ రాస్ట్రంకు...’’ అని గాయిన ఇంకేమొ మాట్లాడబోతుంటె – ‘నువ్వే కర్మ రాస్ట్రంకు’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు. చెంద్రబాబుతోని ముచ్చట బెట్టెటప్పుడు బిల్‌గేట్స్ తప్పిజారి గూడ గాయిన ఈపు ఎందుకు సూబెట్టలేదు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ టైర్లల్ల గాలి బోతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఈపు గిన గండ్లబడ్తె చెంద్రబాబు యాడ ఎన్నుపోటు పొడుస్తడోనని బిల్‌గేట్స్ బయపడ్డడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంటి దిక్కు బోయిండు. (క్లిక్ చేయండి: కొంపలు ముంచే కొత్త దుక్నాలు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Palle Raghunatha Reddy: పుట్టపర్తిలో ఓటమి భయం.. కదిరిలో టికెట్ కష్టం
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రానున్న ఎన్నికల్లో బరిలే నిలిచేందుకు ఆయన సిద్ధమవుతుండగా, అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పైగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై స్పష్టత లేదు. పుట్టపర్తిలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. అందువల్లే కదిరి నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై వ్యక్తిగత సర్వే చేపట్టినట్లు సమాచారం. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ మనుగడ కష్టంగా మారింది. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో పని చేసినా.. ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడంతో పార్టీలో కొనసాగాలా? వీడాలా? అనే సందిగ్దంలో పడ్డారు. 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందో? లేదో? తెలియని పరిస్థితి. దీనికి తోడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా.. గెలుస్తామన్న నమ్మకం లేదు. దీంతో ఆయన అనుచర వర్గం కూడా అయోమయంలో పడిపోయారు. పల్లె వెంట నడవాలా? వద్దా? అనే అనుమానంతో స్తబ్ధతగా ఉండిపోయారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే టీడీపీకి రాజీనామా చేసేందుకు పల్లె రఘునాథరెడ్డి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరుతారనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఆయన వెంట నడిచేందుకు టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. అసమ్మతి నేతల బెడద.. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డికి భారీ వ్యతిరేకత ఉంది. మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న టీడీపీ హయాంలో కూడా పల్లెపై తిరుగుబాటు చేశారు. దీనికి తోడు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకత ఉంది. నల్లమాడ మండలానికి చెందిన సైకం శ్రీనివాసరెడ్డికి పల్లె రఘునాథరెడ్డికి పడదు. అంతేకాకుండా సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తికి చెందిన పెదరాసు సుబ్రమణ్యం టీడీపీకి అనుకూలంగా ఉన్నా... పల్లెకు వ్యతిరేకం. ఇప్పటికే రెండుసార్లు ప్రెస్మీట్లో తన అసమ్మతి బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లె’ పుట్టపర్తిని వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్వం వైఎస్సార్సీపీ కైవసం.. పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, అమడగూరు మండలాలు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే 2019 నుంచి ఈ రెండు మండలాల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. అమడగూరు మండలంలోని పది పంచాయతీ సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిసార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్.. పల్లె రఘునాథరెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన అల్లాబకాష్, ఇస్మాయిల్ కూడా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ‘పల్లె’కు సీటు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై ‘పల్లె’ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కదిరి నుంచి పోటీ?.. పుట్టపర్తిని దాదాపుగా వద్దనుకుంటున్న పల్లె రఘునాథరెడ్డి వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన సొంత మండలం తనకల్లు కావడంతో కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే టీడీపీ అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్‌ను కాదని.. పల్లెకు కదిరి టికెట్ ఇచ్చే సాహసం చేయదు. అందువల్లే ‘పల్లె’నే దీనికి ప్రత్యామ్నాయ మార్గం సూచించినట్లు సమాచారం. కందికుంట వెంకట ప్రసాద్‌ను ధర్మవరం నుంచి బరిలో దింపి.. తనకు కదిరి టికెట్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. వెంటాడుతున్న ఓటమి భయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడంతో ఈప్రాంత వాసులంతా వైఎస్సార్ సీసీ వెంట నడుస్తున్నారు. ఇక జాతీయ రహదారి 342కు శ్రీకారం, బెంగళూరు నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారంతో జనం ఆలోచనా విధానం కూడా మారింది. అభివృద్ధికే పట్టం కట్టాలని వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులనే జెడ్పీటీసీ సభ్యులుగా గెలిపించారు. ప్రజాభిమానంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లోని 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఓటమి భయం వెంటాడుతుండగా.. పల్లె ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. (క్లిక్ చేయండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!) -
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
ఎంపీ గల్లా కనపడటం లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే. మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. అమలుకానీ హామీలు.. వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. -
ఊరేగుతున్న ఉన్మాదం
‘కామాతురాణాం న భయం న లజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు గానీ, భయం గానీ ఉండవని అర్థం. క్రోధంతో కళ్లు మూసుకుపోయిన వారి సంగతి కూడా అంతే! కక్షతోనూ, అసూయతోనూ, నిస్పృహ తోనూ కళ్లు మూసుకుపోయిన వారి పరిస్థితీ అంతే! అటువంటి దశలో ఉన్నవారు మాట్లాడే భాష సభ్యతా సంస్కారాల ఛందస్సును ధిక్కరిస్తుంది. ‘పోగాలము దాపురించినవారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్రవాక్యాన్ని వినలేరు’ అనే సూక్తి మనకు ఉండనే ఉన్నది. దిగజారిన రాజకీయాలతో విసుగెత్తి ఒకాయన ‘పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్’ అని వ్యాఖ్యానించారు. అట్లాగే పొలిటీషియన్లకు చిట్టచివరి అస్త్రం – సానుభూతి. అది కూడా విఫలమైనప్పుడు ఏం చేస్తారు? సంస్కారం అటకెక్కుతుంది. క్రోధం కళ్లను కప్పేస్తుంది. అసూయ, ద్వేషాలు వివేకాన్ని నిద్రపుచ్చుతాయి. కంఠస్వరం నుంచి కాలకేయుల భాష దూసుకొస్తుంది. ఉన్మాద స్థితి ఊరేగింపు తీస్తుంది. కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొ న్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువమంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు. లాలూ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్జేడీ కార్యకర్తలు ఈ జాతీయ నినాదాన్ని లోకలైజ్ చేశారు. ‘జబ్ తక్ రహేగా సమోసామే ఆలూ... తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ’ అనేవారు. అటువంటి సృజనా త్మకతతో మనవాళ్లు కూడా మిరపకాయ బజ్జీలో మిర్చీ దాగినంతకాలం, ఉప్మాలో ఉల్లిపాయ వేగినంతకాలం బాబు రాజకీయాల్లో ఉంటారనే నినాదాలు వినిపిస్తారని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది. సభికుల్లో అధికులు పేటీఎమ్ బ్యాచ్ కనుక ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. కొద్దిమంది కార్యకర్తల కేరింతలు క్లైమాక్స్ సన్నివేశాన్ని రక్తి కట్టించలేకపోయాయి. ఆ విధంగా ఆఖరి బాణం విఫలమైంది. ఆ తర్వాత? చివరకు మిగిలేది ఉక్రోషమే! ఆఖరి రోజు కర్నూలు పట్టణంలో బాబులోని ఉక్రోషం బయటకొచ్చింది. పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి విద్యార్థులు, లాయర్లతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని గట్టిగా చెబుతూ పార్టీ కార్యకర్తలు కూడా అనాలని వారిని బలవంతపెట్టారు. దీంతో మరింత బిగ్గరగా జేఏసీ సభ్యులు బాబుకు నిరసన తెలిపారు. సీనియర్ మోస్ట్ రాజకీయ వేత్త వెంటనే రెచ్చిపోయారు. ‘కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొన్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువ మంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు. ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్ తక్ సూరజ్, చాంద్ రహేగా తబ్ తక్ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు.’ లాయర్లు, విద్యార్థుల మీద బాబు నోటి వెంట అనర్ఘరత్నాలు రాలడం మొదలైంది. ‘‘పనికిమాలిన వ్యక్తుల్లారా... నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా... రేయ్ వాణ్ణి తన్ను.. రేయ్ రారా చూపిస్తా... మా ఆఫీసుకే వస్తార్రా మీరు... ఎంత ధైర్యంరా మీకు... ధైర్యముంటే రాండ్రా గాడిద ల్లారా... బోడినాకొడుకులు తామాషాలాడతారా... రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమి కొట్టిస్తా... గుడ్డలిప్పదీసి కొట్టిస్తా..’’ ఇలా లాఠీ లేకుండా నోటి తుంపర్లతోనే ఆయన ఛార్జ్ చేశారు. ఈ వాక్ప్రవాహంలో కొసమెరుపు ఏమిటంటే కక్కాల్సినంత అసభ్యాన్నంతా వెళ్లగక్కుతూనే ఆయన సభ్యతను కూడా అడ్డం పెట్టుకున్నారు. ‘నన్ను రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టిన వాళ్లంతా పతనమయ్యారు. నాకు వస్తున్న కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అదీ నా సభ్యత’ అని చెప్పుకున్నారు. ఈ సభ్యత బాణం పవన్ కల్యాణ్ మీద కావచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈమధ్యనే పవన్ కల్యాణ్ ఒక సభలో ఆవేశంతో ఊగిపోతూ చెప్పు తీసి చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. బాబు తన తాజా వ్యాఖ్యానం ద్వారా పవన్‌కు సభ్యత లేదని చెప్పదలుచు కున్నారా? అదే నిజమైతే ఆయనకు ఎందుకింత కోపం వచ్చింది? లోగుట్టు తెలిసిన పెరుమాళ్లే దీనికి సమాధానం చెప్పాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబునాయుడులో పెరుగుతున్న అసహనాన్నీ, నిస్పృహనూ అర్థం చేసుకోవచ్చు. అనుభవం కారణంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంతో ఇంతో అంచనా వేయగలరనే అనుకోవాలి. అలా అంచనా వేయగలిగిన స్థితిలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదనే విషయం అర్థమయ్యే ఉండాలి. అర్థం కాలేదు, తాము గెలవగలమనే భ్రాంతిలోనే నిజంగా ఉన్నాడంటే ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే వాక్యాన్ని అక్షరాల నమ్ముతున్న అమాయకుడై ఉండాలి. ఆయన అమాయకుడు కాదు, గుండెలు తీసిన మొనగాడనే విషయం లోకోత్తర వ్యావహారికం. కనుక అసలు విషయం ఆయనకు తెలుసనే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం దాదాపు అసాధ్యమన్న భావన ఎందుకు ఏర్పడింది? దానికి కారణా లున్నాయి. గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పేదల అనుకూల విధానాలు, సాధించిన బలహీనవర్గాల సాధికారత, విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ మద్దతుదార్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. తమ గోబెల్స్ ప్రచారం ఫలితంగా అధికార పార్టీ ఓట్లలో రెండు మూడు శాతం ఓట్లను తగ్గించ గలమనే నమ్మకంతో ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమని నమ్మినా, అధికార పార్టీకి పేదవర్గాల నుంచి కొత్తగా జమ కానున్న ఓట్లతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి తగ్గని ఓట్ల బ్యాలెన్స్‌తో ఉన్న అధికార పార్టీని ఓడించేదెట్లా? రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే సామెత కూడా ఒకటున్నది. ఏవైనా అద్భుతాలు జరిగితే?... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనే ఆశ ఏదో ఎల్లో కూటమిలో ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉండేది. సదరు మిణుగురు ఆశను సాకారం చేసుకోవడానికి చాలాకాలం నుంచే ఎల్లో కూటమి ఒక ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. ఇందులో మొదటిది – సుడిగాలి మాదిరిగా సాగించే గోబెల్స్ ప్రచారంతో వైసీపీ మద్దతు ఓట్లను తగ్గించడం! రెండోది – కుడి నుంచి ఎడమకూ, ఎడమ నుంచి కుడికీ సమస్త పార్టీలనూ, రథ గజ తురగ పదాతి శ్రేణులన్నింటినీ తమకు అనుకూలంగా ఏకం చేసుకోవడం! ఈమధ్య పవన్ కల్యాణ్‌ను పరామర్శించినప్పుడు చంద్రబాబు ఉద్ఘాటించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’ అనే పిలుపులోని పరమార్థం ఇదే! ఈ ఐక్యతలో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్ర బాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’లో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్రబాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్ వేయాలి. ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలోచించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షే పించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవించిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మళ్లీ ఆట మొదలుపెట్టాలి. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవచ్చు. మరోపక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ’ ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలో చించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షేపించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవిం చిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇది తాత్కాలిక వియోగమే అయినా, మళ్లీ ఆట మొదలుపెట్టడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఈలోగా పుణ్య కాలం గడిచి పోవచ్చు. మరో పక్కన గోబెల్స్ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఒక్కో బోగస్ కథనాన్ని వంద సార్లు అచ్చొత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేప థ్యంలో చంద్రబాబు నిర్వహించిన కర్నూలు తరహా యాత్రలు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా చేపట్టవచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన రెచ్చగొట్టే తుంపర్లు మరిన్ని రాలవచ్చు. ఇది రాజకీయ వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్మాదపు మేఘాలు ఆవరించకుండా ఉండుగాక! వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు
-
Sakshi Cartoon 03-10-2022
సంతోషం! అలా అయినా మనకో ట్విట్టర్ అకౌంట్ ఉందని పబ్లిసిటీ అయింది! -
ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?
ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?! ఏపీలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్.టి.ఆర్. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్‌ని చూస్తే అసలు ఎన్.టి.ఆర్. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్‌ను పూర్తిగా చూద్దాం. ‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్.టి.ఆర్. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్. ఎంత అర్థరహితంగా ఉంది! ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా! ఎన్.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్.టి.ఆర్. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్‌పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మి నల్కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు? అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్.టి.ఆర్. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్ అయ్యారు తప్ప ఎన్.టి.ఆర్. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు. అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్.టి.ఆర్.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆమెను ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా? ‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండేవారు. ఎన్.టి.ఆర్. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది? ఎన్.టి.ఆర్. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్.టి.ఆర్. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యర్ధులు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అయితే ఎన్.టి.ఆర్.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్.టి.ఆర్. పేరు పెట్టలేదా? రాజీవ్ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్.టి.ఆర్. ఎందుకు తొలగించారు? తెలుగుదేశం వారికి ఎన్.టి.ఆర్.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్.టి.ఆర్. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
గెలుపుపై నమ్మకం కోల్పోయిన టీడీపీ ప్రముఖులు
సాక్షిప్రతినిధి కర్నూలు : గెలుపు, ఓటమి సమస్య కాదు.. గత 20 ఏళ్లుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అత్యంత బలహీనంగా ఉంది. ఇది మాకు తెలుసు. అయితే నియోజకవర్గస్థానం ముఖ్యం. ఒక్కసారి టిక్కెట్ వదులుకుని నియోజకవర్గాన్ని పోగొట్టుకుంటే తిరిగి అందుకోవడం చాలా కష్టం. అందుకే గెలిచినా, ఓడినా పోటీ చేయడం ముఖ్యం. – ఇటీవల టీడీపీ నేతలు బాహాటంగానే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు చూస్తే తెలుగుదేశం పార్టీ నేతల్లో గెలుపుపై పెద్దగా ఆశల్లేవనే విషయం సుస్పష్టమవుతోంది. కేవలం రాజకీయ ఉనికి కోసం పోటీ చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంత శ్రమించినా అధికార పార్టీని ఢీకొట్టడం అంత సులభం కాదనే ధోరణిలో ఉన్నారు. అయితే నియోజకవర్గ స్థానాలను కాపాడుకోవడంలో ఎవరికివారు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో వర్గవిభేదాలు బట్టబయలవుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంట్ స్థానంలో కూడా వర్గవిభేదాలతో టీడీపీ సతమతమవుతోంది. నంద్యాలలో నాలుగు ముక్కలాట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేదని, మూడు నెలల్లో మార్పు రావాలని, లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం చూసుకుంటుందని లోకేశ్ చెప్పినట్లు తెలిసిందే. ఈ క్రమంలో అఖిల ఆదివారం నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని నంద్యాల, గోస్పాడు కార్యకర్తలకు వారం రోజుల నుంచే ఆమె వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహా్వనించారు. విషయం తెలిసి అఖిలతో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడారు. ఇన్చార్జ్గా భూమా బ్రహ్మనందరెడ్డి ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సరికాదని చెప్పారు. ఆమె ససేమిరా అనడంతో అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అఖిలతో నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎవ్వరినీ ఖాతరు చేయకుండా అఖిల ఆఫీసు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అఖిల సోదరుడు భూమా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌తో పాటు వీరి అనుచరులు దూరంగా ఉన్నారు. కార్యక్రమానికి ఎవ్వరూ వెళ్లకుండా భూమా బ్రహ్మానందరెడ్డి కట్టడి చేశారు. ఫరూక్ కూడా తన వర్గాన్ని వెళ్లకుండా నివారించారు. ఇప్పటికే నంద్యాలలో భూమా బ్రహ్మనందరెడ్డి, ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి ఉన్నారు. ఈ క్రమంలో అఖిల రాకతో టీడీపీలో నాలుగో కుంపటి రగిలినట్లయింది. అయితే అఖిల మాత్రం.. నంద్యాలలో తన తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, తాను ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. భవిష్యత్‌లో నంద్యాల మునిసిపల్ చైర్మన్‌గా విఖ్యాత్‌ను పోటీ చేయించి, 2029 ఎన్నికల్లో విఖ్యాత్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ అడుగుతామని అఖిల వివరిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఆళ్లగడ్డలో పరిస్థితి బాగోలేకపోవడంతో నంద్యాల టిక్కెట్ అఖిల ఆశిస్తున్నారని భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూక్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి దసరా నుంచి పూర్తిగా ఆళ్లగడ్డ రాజకీయాలపై దృష్టి పెడతానని తన వర్గీయులతో వ్యాఖ్యానిస్తున్నారు. ఆదోని టిక్కెట్ ‘మీనాక్షి’కి లేనట్టే! వయోభారంతో తాను పోటీచేయలేనని తన కుమారుడు భూపాల్చౌదరికి ఆదోని టిక్కెట్ ఇవ్వాలని లోకేశ్‌కు మీనాక్షినాయుడు విన్నవించారు. అయితే ఆదోని టిక్కెట్ ఈ దఫా బీసీలకు ఇచ్చే యోచనలో ఉన్నామని లోకేశ్ తేల్చిచెప్పారు. ఆదోనిలో ‘కమ్మ’ సామాజికవర్గానికి టిక్కెట్ ఇస్తే ఫలితం ఉండబోదని, అక్కడ బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆదోని నుంచి టీడీపీ నేతలు దేవేంద్రప్ప, సూరం భాస్కర్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మతో పాటు మైనారీ్టనేత రవూఫ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మనుగడ కోసం ‘కోట్ల’ యత్నం కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి 2014 వరకూ కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అతని రాజకీయ ప్రయాణం దారితెన్నూ లేనివిధంగా తయారైంది. 2014, 2019లో ఎంపీగా ఓడిపోవడంతో రాజకీయ మనుగడపై నమ్మకం సన్నగిల్లింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుస్తారని, తాను పోటీ చేసినా ‘హ్యాట్రిక్ ఓటమి’ తప్పదు అనే భావనకు వచ్చారు. అందుకే ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ఈ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి టీడీపీ మరింత బలహీనమైంది. ఎమ్మిగనూరులో కార్యాలయం ప్రారం¿ోత్సవం నుంచి కోట్ల చేస్తున్న రాజకీయాలపై లోకేశ్‌కు జయనాగేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధిష్టానంతో మాట్లాడిన కోట్లకు పార్టీ కొత్త విషయం చెప్పింది. కుటుంబానికి ఒక్క టిక్కెట్ మాత్రమే ఇస్తామని, మీ ఇంట్లో ఎవరు పోటీ చేస్తారో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తే మంత్రాలయం టిక్కెట్ ఇస్తామని, ఆలూరు బోయలకు ఇస్తామని, సుజాతమ్మ ఆలూరు నుంచి పోటీ చేస్తే మంత్రాలయం బోయలకు ఇస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ‘కోట్ల’ కుటుంబం ఉంది. ఇటీవల గోనెగండ్లలో విలేకరుల సమావేశంలో కూడా ‘కర్నూలు ఎంపీగా తానుకానీ లేదా మరొకరు కానీ పోటీ చేస్తారని’ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. తాను ఎంపీ అభ్యరి్థగా రాలేదని, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వచ్చానన్నారు. ఎంపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని ధైర్యంగా చెప్పలేకపోయారు. అంటే తన స్థానంపై తనకే నమ్మకం, స్పష్టత లేదనే విషయం సుస్పష్టమవుతోంది. మరోవైపు జయనాగేశ్వరరెడ్డిపై కూడా టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు నుంచి ఈ దఫా కొత్త ముఖాన్ని బరిలోకి దింపే యోచనలో టీడీపీ ఉందని లోకేశ్‌ను కలిసిన కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో జయనాగేశ్వరరెడ్డికి కూడా టిక్కెట్ దక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. -
టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ మనుగడపై ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలని ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం, అంచనాలను అందుకోవడంలో నాయకత్వం దారుణంగా విఫలమైందని, అస్తవ్యస్త విధానాలతో ఉనికి కోల్పోయి కొట్టుమిట్టాడుతోందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నాడి గుర్తించే సత్తా నాయకత్వానికి లేదని, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ మూడేళ్లలో చేపట్టలేదని అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం, అడ్డుకోవడం ద్వారా ప్రజాగ్రహానికి గురవుతున్న విషయాన్ని గుర్తించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే కలసి వస్తుందని, టీడీపీ అంతర్గత సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు పలుమార్లు హెచ్చరిస్తున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. వీటిని ఆమోదిస్తే మరింత మంది గళం విప్పుతారనే భయంతో అధినేత గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే అభిప్రాయంతో సీనియర్లు.. పార్టీని గెలిపించే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేవని తాజాగా ఓ ఎంపీ కూడా అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సీనియర్లు ఇప్పటికే ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక లోకేష్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ‘పార్టీ లేదూ.. బొ. లేదూ’ అని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పార్టీ బలహీన పడిన ఈ సమయంలో మహారాష్ట్రలో మాదిరిగా టీడీపీలోనూ ఏక్నాథ్ షిండేలకు కొదవలేదనే వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. -
ఇలాంటి ఒక రోజు వస్తుందని.. ఎప్పుడూ భావించలేదు: దివ్యవాణి
-
మహానాడు వేదికపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం
చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. వరుస ఓటముల తర్వాత చెట్టుకొకరు.. పుట్టకొకరు చందంగా తయారయ్యారు. ఏ నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్ పటిష్టంగా లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. అప్పుడప్పుడూ చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో కంటితుడుపు చర్యగా పాల్గొని మిన్నకుండిపోతున్నారు. తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో నేతలు తలమునకలవగా.. కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం తమదేనంటూ జబ్బలు చరచడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు పెద్ద జోకర్ అని నవ్వుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: ‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. 150 సీట్లకు పైగా గెలుపు గ్యారెంటీ’’ అంటూ చంద్రబాబు మహానాడు వేదికగా డప్పు కొట్టారు. అయితే, సొంత జిల్లా చిత్తూరులోనే పచ్చపార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్చార్జులే లేరు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్‌చార్జ్‌లూ ముఖం చాటేశారు. ఫలితంగా పార్టీ కేడర్, కార్యకర్తల్లో తీవ్ర నైరాస్యం ఆవహించింది. వరుస ఓటములతో కోలుకోలేని దెబ్బ 2019 సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడి 23 సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి రావడంతో ఆ పార్టీ మరింత చతికిలపడింది. దాదాపు 90 నుంచి 95శాతం వరకు స్థానాలను వైఎస్సార్సీసీ కైవసం చేసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్ స్థానాల్లో పచ్చపార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ అధినేతతోపాటు ఇన్‌చార్జ్‌లు, కేడర్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికలంటే భయపడే స్థాయిలో ఆ పార్టీ కేడర్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ కోలుకునే స్థితి కనిపించడం లేదు. కేడర్ వలసబాట పార్టీ కేడర్‌నే విస్మరించిన చరిత్ర చంద్రబాబుకు మొదటి నుంచీ ఉంది. గతంలో 2014లో బీజేపీ, జనసేనతో జతకట్టి, వారి అండతో అధికారంలోకి వచ్చి, ఆ కార్యకర్తలను పక్కకు నెట్టేశారు. పదవుల్లోనూ, అధికార బలాయింపుల్లోనూ కార్పొరేట్ కల్చర్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో బాబూ అడ్రస్ గల్లంతైంది. ‘‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’’ అని చెప్పుకునే చంద్రబాబు 23 సీట్లతో చతికిలపడ్డారు. తన సొంత నియోజవర్గంలో కుప్పంలోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన, ఓటమి అంచులు చూసి ఆఖరు నిమిషంలో గట్టెక్కారు. తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు. అనంతరం వరుసగా జరిగిన ఎన్నికల్లో పచ్చపార్టీ కుదేలైంది. టీడీపీ కేడర్‌లో పునరాలోచన మొదలైంది. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా ఉండేందుకు నేతలు ముఖం చాటేస్తున్నారు. నామమాత్రంగా ఉన్నవారు కూడా వారి వ్యక్తిగత వ్యాపారాల్లో తలమునకలైపోయారు. మరికొందరి నేతల చూపు పక్క పార్టీలవైపు మళ్లుతోందనే వాదన పెరిగింది. నగరి నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా గాలి భానుప్రకాష్ ఉన్నారు. గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ పోటీచేసి ఓడారు. కన్నతల్లి గాలి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయన ఓటమిపాలయ్యారు. ఇంటిపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. గాలి భానూ ఇన్చార్జ్గా వ్యహరిస్తున్నా, పండగలు, చావులు, పెళ్లిళ్లలో కనిపించడం తప్ప కార్యకర్తలకు అందుబాటులో లేడనే వాదన ఉంది. ఒకవైపు ఇంటిపోరు మరోవైపు ఇన్చార్జ్ అందుబాటులోకి లేకపోవడంతో ఆ పార్టీ కేడర్, కార్యకర్తల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. ఇక టీడీపీలోనే టికెట్టు ఆశించి భంగపడిన అశోకరాజు ఈ దఫా కూడా సీటు ఆశిస్తున్నారు. సీటు ఇవ్వకుంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ పట్టుకోల్పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లలితకుమారి, తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండాపోయింది. కిందిస్థాయి కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. దీంతో పార్టీ హైకమాండ్ పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్గా ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరుకు చెందిన శ్రీనివాసుల రెడ్డిని నియమించారు. ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో పార్టీలో నిస్తేజం ఆవహించింది. పలమనేరు నియోకజవర్గం ఇన్చార్జ్గా మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన పార్టీ కేడర్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేసి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం టీడీపీలో అమరనాథ్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. మిగిలినవారితో పోల్చుకుంటే ఆయన కొంత అందుబాటులో ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి మరదలు అనీషారెడ్డి పోటీ చేసి ఓడారు. తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో బాధ్యతలు చల్లా రామచంద్రారెడ్డికి అప్పగించారు. గతంలో ఆ పార్టీ తరఫున మూడు పర్యాయాలు పోటీ చేసిన బీసీ నాయకుడు వెంకటరమణరాజు 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరడంతో టీడీపీ గల్లంతైంది. ఇక వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత దగ్గరయ్యారు. కేడర్, కార్యకర్తలు వలస బాట పట్టడంతో టీడీపీ ఖాళీ అయ్యింది. పైగా ఆపార్టీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్వగ్రామం రొంపిచెర్లకావడం, వ్యాపార పరంగా బిజీగా ఉండడంతో కార్యకర్తలకు అందుబాటులో లేడన్న చర్చ సాగుతోంది. పెద్దాయనవైపు అన్ని పార్టీ నేతల చూపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ట్రబుల్ షూటర్‌గా పేరుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో వైఎస్సార్సీపీ బాధ్యతల్ని చూస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సహచర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని గెలుపువైపు నడిపించారు. ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించారు. పెద్దాయన పేరు చెబితేనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడనే విషయాన్ని స్వయంగా పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విపక్ష నేతల చూపు అధికార పార్టీ వైపు మళ్లింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లని చూపునకు వివిధ పార్టీల నేతలు పరితపిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏఎస్ మనోహర్ 2019లో పోటీ చేసి ఓడారు. బాబు సామాజికవర్గం వారే పనిగట్టుకుని ఓడించారనే మనస్తాపంతో ఏఎస్ మనోహర్ రెండేళ్లకు ముందు ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇన్చార్జ్ లేకపోవడంతో పార్టీ మూడు గ్రూపులైంది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఆయన జాడ కనిపించలేదు. కాజూరు బాలాజీ, మాజీ మేయర్ హేమలత, చెరుకూరి వసంతనాయుడు గ్రూపు రాజకీయాల్లో తలమునకలయ్యారనే వాదన ఉంది. మరోవైపు పులివర్తి నాని, దొరబాబు, మహదేవ్ సందీప్ తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఒక వైపు ఇన్చార్జ్ లేకపోవడం, మరోవైపు గ్రూపు రాజకీయాలతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అంచు వరకూ వెళ్లి వచ్చిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఆయన తరపున ఇన్చార్జ్గా పీఎస్ మునిరత్నం వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుప్పంలోనే పంచాయతీ, స్థానిక సంస్థలతోపాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పచ్చపార్టీ ఘోరంగా ఓటమి చవి చూడటంతో చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్ద మైనస్‌గా నిలిచిపోయింది. సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంతో కుప్పంలో టీడీపీ పునాదులు కదిలిపోయాయి. దీంతో చంద్రబాబు తీవ్ర అంతర్మథనం చెందినట్టు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక పరువు నిలుపుకునేందుకే అన్నట్టుగా అడపాదడపా కుప్పంలో పర్యటిస్తూ తన ఉనికిని చాటుకునే పనిలో బాబూ తలమునకలై ఉన్నారని ఆ పార్టీ నేతలే చెబుతుండడం కొసమెరుపు. -
సాక్షి కార్టూన్ 30-05-2022
సర్వేలు, కొలమానాలొద్దు సార్! మహానాడులో ఎక్కువ బూతులు మాట్లాడినోళ్లకే టికెట్స్ ఇస్తే సరి! -
చంద్రబాబు దిగజారుడు చేష్టలపై కేఎస్ఆర్ కామెంట్
-
యనమలకు తలనొప్పిగా తుని టీడీపీ పోరు
-
కర్నూలు జిల్లాలో రచ్చకెక్కిన టీడీపీ ఆధిపత్య పోరు
-
అయోమయంలో బాబు - టీడీపీ దుస్థితి పై కేఎస్ఆర్ కామెంట్
-
నేతలు కావలెను: టీడీపీకి ఇంచార్జ్ లు దొరకని దుస్థితి
-
బెడిసికొట్టిన పచ్చ బాబుల అక్రమ మైనింగ్ డ్రామా
-
టీడీపీ జెండా తీయమన్నందుకు మహిళను చితకబాదిన టీడీపీ కార్యకర్తలు
-
అన్నీ ఎదురు దెబ్బలే: 2021లో టీడీపీకి వరుస పరాజయాలు
-
మూడో కంటికి తెలియకుండా థాయిలాండ్ లో బాబు పర్యటన
-
కాషాయం లోకి వెళ్లినా ఆ ఇద్దరు పచ్చ పార్టీ అడుగుల్లోనే!
-
ముసుగులు తీసేసి ఈ సారి పబ్లిగ్గా..!!
-
చినబాబు లోకేష్ కు కొత్త కష్టాలు
-
ఇంత బతుకూ బతికి...
అవును మరి! ఎక్కడి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ! ఎక్కడి నందమూరి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్!! తొమ్మిదినెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత ఎన్టీరామారావు. 1994లో రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరేలా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసగొల్పి ఆయన సీఎం పోస్టుకే ఎసరు పెట్టిన చంద్రబాబు చరిత్ర జగద్విదితమే. ఆ తర్వాత చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు 2004 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. వైఎస్సార్ అయిదేళ్ల పాలనతో సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరిగెత్తించడంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది బాబుకు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హిట్ మీద హిట్ తో అగ్రహీరోగా రాణిస్తున్నారు. చంద్రబాబు మరోసారి గతాన్ని పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ కరిష్మాను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. తన తండ్రికి, తమ కుటుంబానికి చంద్రబాబు చేసిన నమ్మకద్రోహాన్ని విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీకి అధికారం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ హీరో ముందు తన కొడుకు లోకేశ్ నాయుడు వెలవెలబోతాడని అతి స్వల్పకాలంలోనే గ్రహించిన చంద్రబాబు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టసాగారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పొత్తు ప్రభావంతో వైసిపి కన్నా కేవలం ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అమరావతి అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి రాజధాని నిర్మాణం పేరుతో రాబోయే పాతికేళ్లు తనదే అధికారం అనే ఊహా లోకంలో తేలియాడారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు కనీవినీ ఎరుగని విధంగా కుదేలైంది తెలుగుదేశం. అటు లోకేశ్‌ను చూస్తే మూడేళ్లు మంత్రిగా పనిచేసి, తన కలల రాజధాని ప్రాంతంలోనే ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవమే. (చదవండి: అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!) చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని కిందిస్థాయి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుముందే జూనియర్ రావాలి అంటూ నినాదాలు చెయ్యడమే కాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చెయ్యడంతో ఆయన కంగుతిన్నారు. ఆ తరువాత కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా ఊడిపోయింది. బాబును 7 సార్లు అసెంబ్లీకి పంపిన కుప్పంలో మొదటిసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది. చంద్రబాబుకు డెబ్బై ఏళ్ళు దాటాయి. లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపకపోవడంతో పార్టీలో చాలామందికి ఆయన నాయకత్వంమీద నమ్మకం పోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు చేబట్టాలని స్వరాలు వినిపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యలాంటి సీనియర్ నాయకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ గొంతులు విప్పుతున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. (చదవండి: తెలుగుదేశం విలాపం) తన సతీమణికి అవమానం జరిగిందన్న చంద్రబాబు రోదన ఆయన మనసెరిగినవారికి కలిసొచ్చింది. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫలితమే జూనియర్ మీద విమర్శలు ప్రారంభించారు. మేనత్తకు అవమానం జరిగితే జూనియర్లో ఫైర్ ఎక్కడ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాతగారు పెట్టిన పార్టీ పట్ల జూనియర్‌కు బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు! ఆ ఘట్టం ముగిసిన మూడు రోజులదాకా లోకేశ్ అసలు పెదవి విప్పిన దాఖాలానే లేదు. లోకేశ్లోనే లేని ఫైర్ జూనియర్‌కు ఎలా వస్తుందో అర్థం కాదు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చెరపట్టడంలో చంద్రబాబుకు సహకరించిన ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు.. ఆ తరువాత చంద్రబాబు పాల్పడిన నమ్మకద్రోహానికి ఎలా బలయ్యారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు సహకరించిన తన తండ్రి హరికృష్ణకు, ఆ తర్వాత తన మామ చంద్రబాబు స్వయానా పొడిచిన వెన్నుపోటును జూనియర్ మర్చిపోవడం సాధ్యమేనా? - ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
తెలుగుదేశం విలాపం
నారా చంద్రబాబు నాయుడు గార్కి– ‘విధిరహో బలవానితి మేమతిః’ ఎంతటివారయినా విధిచేతికి చిక్కి అనుభవించాల్సిందే. మొన్న మీ ఏడుపు చూశాక ఈ ఉత్తరం రాయాల నిపించింది. ఆరోజు మా వ్యవస్థాపక అధ్యక్షుడు నీవల్ల దుఃఖించిన సంఘటన గుర్తుకు వచ్చింది. నాతో పాటు యావదాంధ్ర జాతికీ గుర్తొచ్చి వుంటుంది. ‘సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంత్యను గచ్ఛంతి.’ ఇది కూడా భర్తృహరి లాంటి పెద్దలే చెప్పారు. చేసిన పాపాలు వెంట తరుముతూ ఉంటే, మీడియా సాయంతో కట్టుకున్న అబద్ధాల కోట కూలిపోయే దృశ్యం ఆనందంగా చూశాను. నువ్వు చేసిన కర్మలే నిన్ను వెన్నంటి వస్తాయి అని భగవద్గీత కూడా చెప్పింది. ఎటువంటి పార్టీని నేను, ఎలాంటి స్థితికి చేరుకున్నాను! చెడ్డవాడి చేతి ధనంలాగా నీ చేతిలో పడి ఎంత పతన మయ్యాను! ఎన్టీఆర్ దగ్గర నా వైభవం ఆకాశానికి ఎగసింది. హరివిల్లు సప్తరంగులను ఒకే పసుపురంగుగా మార్చుకుంది. దేశమంతా తిరిగాను. ఎక్కడికెళ్ళినా జేజేలు అందుకున్నాను. 1982 మార్చి 29న నా జననం జరిగింది. నాకు రూప మిచ్చిన నా తండ్రి, గురువు ఎన్టీఆర్ 35 సంవత్సరాలు సినిమా నటుడిగా అఖండ ప్రజాభిమానాన్ని పొంది, పురాణ పురు షుడిగా తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానటుడు. రాజకీయాలు తెలియకపోయినా పేదప్రజల ఆకలి ఆర్తనా దాలు, అసమానతలు తెలుసు కనుక రెండు రూపాయలకే కిలోబియ్యం, పది రూపాయలకే చీర– ధోవతి, బడుగు వర్గాలకు పక్కా ఇళ్ల పథకం వంటివి అందించి అందరికీ అన్నగా నిలబడిపోయారు. పేదవాని ముంగిట అన్నంగిన్నెగా మారిపోయారు. 35 సంవత్సరాల కాంగ్రెస్ కోటను బీటలు పర్చి, 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. ఆంధ్రదేశమే కాదు, భారతావనిలో, ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా నాపేరు విని పులకరించారు. ఈ జాతికో దిక్సూచి దొరికిందని, రాష్ట్రంలోనే కాక కాంగ్రెసుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. నేషనల్ ఫ్రంటుగా ఏర్పడి మా నాయకుడి ఆధ్వర్యంలో నన్ను ముందుపెట్టుకుని పోరాటం సాగించాయి. అబ్బో ఆనాటి వైభవం ఏం చెప్పను. ఒక నోరు సరిపోతుందా? వీపీ సింగ్, లాలూప్రసాద్ యాదవ్, రామకృష్ణ హెగ్డే, బొమ్మయ్, బిజూ పట్నాయక్, దేవీలాల్, కమ్యూనిస్టు కురువృద్ధుడు సూర్జీత్ సింగ్, ప్రఫుల్లకుమార్ మహంతా, కరుణానిధి లాంటి అతిరథ మహారథులందరూ మా నాయ కుడికి నమస్కారాలు పెడుతుంటే ఈ కళ్ళతోనే చూసి ఆనంద బాష్పాలు రాల్చాను. ఈ నాయకులంతా ఎందుకు ఎన్టీఆర్ వెనకే నడిచారు? అది ఆయన వ్యక్తిత్వం, ఇచ్చినమాట మీద నిలబడే గుణం, విశ్వసనీయత, అవినీతి రాహిత్యం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లగల గుండె ధైర్యం, ఇవే ఆయన్ని జాతీయ నాయకుడిని చేశాయి. అవన్నీ కళ్ళముందే కరిగిపోయి ‘ఈన గాసి నక్కల పాలయినట్లు’ వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, విలువలు లేనివ్యక్తి, అవినీతి స్వార్థ పరత్వమే అడ్రసుగా కలిగిన నీ చేతుల్లో పడి దుష్టుడికి చిక్కి భ్రష్టత చెందిన సాధ్విలా ఎటువంటి పతనావస్థకు చేరుకున్నాను! నా రాజ్యాంగంలో శాశ్వత అధ్యక్షుడిగా చెక్కబడిన ఆ శిలాక్షరాలపై దాడి చేశావు, కత్తులతో పొడిచి వాటిని లాగేశావు, అవమానాల అగ్నిలో వేసి కాల్చావు. 74 ఏళ్ళ వయసులో, అనారోగ్యంతో ఉండికూడా రాష్ట్రమంతా తిరిగి సాధించుకున్న ముఖ్యమంత్రి పదవిని చెప్పులేసి రోడ్డు పాల్జేశావు. బ్యాంకు ఖాతాను కూడా స్తంభిం పజేసి చివరకు ప్రాణాలు తీశావు. ఆనాడు ఆయన మరణాన్ని కన్నీళ్ళతో చూస్తుండిపోయాను. అక్రమంగా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నీకు బానిసగా మార్చుకున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు సాగించిన అరాచకాలు ఎన్నని చెప్పగలను. ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. నా శరీరాన్ని, మనస్సును, ఆత్మను దిగజారుస్తూ నువ్వు ఎదిగావు. నేను మాత్రం రోజురోజుకు పాతాళానికి జారిపోతూనే ఉన్నా. 1982లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు, 43 శాతం ఓట్లు; 1984లో జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు, అంతే ఓట్ల శాతం. ఇంకా పెరిగినయ్యేమో గుర్తులేదు. 1989లో నీవల్లనే ఓడి పోయినా ఏ మాత్రం తగ్గని ఓటింగు. వెంటనే 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ మరణం ముందు వరకు జరిగిన పోల్ నేనే సొంతం చేసుకున్నా. తరువాత సాను భూతితో కాంగ్రెసుకు పోయాయి. 1994 ఎన్నికల్లో 222 సీట్లు, 36 మిత్రపక్షాలకు వెరసి 258 సీట్లతో 51 శాతం ఓట్లతో రికార్డు తిరగరాశాను. అజేయమైన శక్తిగా నిలబడ్డాను. అదీ మా నాయకుడి సత్తా. మరి ఇప్పుడో! ఒక్కసారి కొన్ని నా చరిత్ర పుటలు తిరగేయ్. నువ్వేంటో, నీ బతుకేంటో తెలుస్తుంది. 40 సంవత్సరాల పుట్టుక నాది. ఎంతోమంది నాయకుల్ని తయారు చేశాను. దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా నిలిచాను. లక్షలాది మంది సభ్యులు కలిగినదాన్ని. కోట్లాది రూపాయల ఫండ్. నెలకు దానిమీద వచ్చే వడ్డీయే 3 కోట్ల రూపాయలు ఉంటుందంటే ఎంత ఆర్థిక పరిపుష్టి ఉన్నదాన్ని! ప్రతి జిల్లాలో సొంత భవనాలు– కొన్ని మండలాల్లో కూడా. నువ్వేమైనా తక్కువ వాడివా. 1978లోనే మంత్రిగా చేశావు. 8 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా వెలగ బెట్టావు కదా. ప్రధానమంత్రుల్ని నువ్వే పెట్టానన్నావు. దేశ రాజకీయాలు నీ కనుసన్నల్లో నడిచాయని చెప్పావు. నువ్వు చెప్పుకునే సొంత డబ్బాలో ప్రపంచ మేధావివి. అపర చాణక్యుడివి. హైటెక్ నిర్మాతవు. అబ్బో చాలా చెప్పుకుంటావులే. ఇక సింబలా? సామాన్యుడి చేతి చక్రాయుధం లాంటి సైకిలు. ఓటర్లా – రాష్ట్రంలోనే 60 శాతానికి మించి ఉన్న బీసీ గణాలు. సొంత కులం అండ. ఒక పది దాకా కుల మీడియా వ్యవస్థలు నిన్నెప్పుడూ పొగుడుతూనే ఉంటాయి. మరోపక్క న్యాయ వ్యవస్థ. ఇన్ని కొమ్ముకాస్తుంటే ఇంత స్థాయిలో ఎలా ఓడి పోయావు? అసలు 2014 ఎన్నికల్లోనే ఓడిపోవాల్సింది. మోదీ జోడుతో పవన్ కల్యాణ్ గాలితో ఎలాగో చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డావు. ఇక 2019 ఎన్నికల్లో నీ ఐదు సంవత్సరాల ముదనష్టపు పాలనకు విసిగిపోయిన జనం నిన్ను ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నారు. వైకాపాకు 49.95 శాతం ఓట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. మరి నాకో 39.18 శాతం ఓట్లు అంటే 10 శాతం తక్కువతో ఓడిపోయాను. 2014లోనే పోయుంటే బాగుండేది. ఈ ప్రజలకు నీ కష్టాలు తప్పేవి. పోనీ రెండున్నర సంవత్సరాల తర్వాతైనా నువ్వు పుంజు కుంటావనుకుంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో వైకాపాకు 52.6 శాతం. నాకేమో 30.7 శాతం. ఇదీ నా దురవస్థ. చివరకు 40 ఏళ్ల నుండి దొంగ ఓట్లతో గెలుస్తున్న నీ సొంత నియోజక వర్గం కుప్పం జనాలు కూడా తరిమేశారు. ఈనాటికి కదా నా నాయకుడికి ఆత్మశాంతి. ఒకనాడు పేద వర్గాలకు అమ్మలాగా, అక్కలాగా అండగా నిలబడ్డాను. ఈరోజు నా పార్టీలోకి ఎవరెవరో సూట్లుబూట్లు వేసుకుని వస్తున్నారు. అసలు కార్యకర్తలు కనుచూపు దూరంలో లేరు. విలువలు, సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ఎప్పుడో అటకెక్కాయి. ఇప్పుడంతా కార్పొరేట్ వ్యక్తులు, అవినీతి సొమ్ముకు బినామీలు, బ్యాంకుల లూటీదార్లు, సారా కాంట్రాక్టర్లు, కాల్మనీవాళ్లు... ఛీ..ఛీ.. నా బ్రతుకిలా అయి పోయింది. నావాళ్లనుకున్న వాళ్లను దూరం చేశావు. ఇంకా ఏం మిగిలిందని? చివరకు నా పతనానికి పరాకాష్టగా– ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నా తండ్రి నన్ను పుట్టించాడో ఆ కాంగ్రెస్ వాళ్ల కాళ్ల దగ్గర పడేశావు కదా. ఆ రోజే నేను కూడా పూర్తిగా చచ్చిపోయాను. పవిత్ర గంగలాంటి నన్ను మురికిగుంటగా మార్చావు. ఇక ఈ బాధలు నాకొద్దు. ఈ హీన జీవితం గడపలేను. నన్ను ప్రేమతో సృష్టించి, గౌరవించి, దేశ స్థాయిలోనే ఉన్న తంగా నిలబెట్టిన నా తండ్రి దగ్గరకే పోతున్నా. ఇంకా నన్నేదో ఉద్ధరిద్ధామనుకోకు. ఈ శరీరంలో రక్తమాంసాలు ఇంకిపోయి నాయి. ఆత్మ, మనస్సు చచ్చిపోయాయి. శరీరం చిక్కి శల్యా వస్థకు చేరుకుంది. ఇక రాసే ఓపిక కూడా లేదు. సెలవు. జన్మలో నీ ముఖం చూడను. ఇట్లు తెలుగుదేశం పార్టీ -
పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతే: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా టీడీపీ గెలవదని లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని నాని పేర్కొన్నారు. ఈ పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతేనని పడుతుందని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాను తలచుకుంటే ఇంకా దారుణంగా తిట్టగలనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. -
రేవంత్ ఆరోపణలన్నీ అబద్ధాలే..
సాక్షి, హైదరాబాద్: ‘భూ ఆక్రమణలకు సంబంధించి రేవంత్‌రెడ్డి నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే. నకిలీ కాగితాలను తెచ్చి నమ్మించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలను అప్పట్లోనే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లా. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని పబ్బం గడుపుకునే వ్యక్తి రేవంత్’ అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీపీసీసీని రేవంత్‌రెడ్డి సర్కస్ కంపెనీలాగా మార్చాడు. కాంగ్రెస్‌లో కొంతమందిని బకరాలను చేసి మీటింగ్‌ల పేరిట వసూళ్లు చేస్తున్నాడు. రేవంత్‌కు ఎవరెవరు ఎంత ఇచ్చారో.. నా దగ్గర వివరాలు ఉన్నాయి. నాకు 600 ఎకరాలకు రైతుబంధు వస్తోందని ఎమ్మెల్యే సీతక్క ద్వారా ఆరోపణలు చేయిస్తూ ఆమెను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు’ అని మల్లారెడ్డి విమర్శించారు. తనకు ఉన్న భూమిలో 400 ఎకరాల్లో కాలేజీలు ఉంటే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘తెలంగాణకు దేవుడి లాంటి కేసీఆర్‌ను తిడితే మాకు కోపం రాదా? సీఎంను తిట్టేందుకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారా, రేవంత్ బ్లాక్‌మెయిలింగ్‌ను త్వరలో బయట పెడతా’అని మల్లారెడ్డి హెచ్చరించారు. పార్లమెంటులో క్లీన్చిట్ ఇచ్చారు.. ‘రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది నాలాంటి పెద్ద మనిషిని వేధించేందుకేనా? జవహర్‌నగర్‌లో నా కోడలి పేరిట 350 చదరపు గజాల స్థలమే ఉండగా, అందులో నిబంధనల మేరకు ఆస్పత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నా. పార్లమెంటులో నా విద్యాసంస్థలపై రేవంత్ వేసిన ప్రశ్నకు క్లీన్ చిట్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లిలోని 16 ఎకరాలు నా యూనివర్సిటీ ఆవరణలో లేవు. నేను కష్టపడితే ఆస్తులు సమకూరాయి. రేవంత్‌కు బంజారాహిల్స్ ఇల్లుతో పాటు ఏం చేశాడని అన్ని ఆస్తులు వచ్చాయి’అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఏటా రూ.2 కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, సొంత డబ్బుతోనే ప్రజాసేవ చేస్తున్నానని స్పష్టంచేశారు. -
అవినీతికి బ్రాండ్ వరదాపురం సూరి
ధర్మవరం టౌన్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి∙అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆయన హయాంలోనే ఉపాధి హామీ పనులు, ఉద్యాన పథకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. సామాజిక తనిఖీల్లో ఈ విషయాలు బట్టబయలవ్వడంతో సూరిలో కలవరం మొదలైందన్నారు. ఆదివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ నిధులు వ్యక్తిగతంగా డ్రా చేయడం సాధ్యం కాదనే విషయం కూడా తెలియకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో నిధులు ఖర్చు చేస్తారన్న కనీస అవగాహన లేకుండా ప్రజాప్రతినిధిగా ఎలా చలామణి అయ్యావంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సూరి చేసిన అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, డబ్బులు వసూళ్లపై లఘు చిత్రం తీసి ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ముదిగుబ్బ మండలంలోనే మొత్తం రూ.27.73కోట్ల పనులు జరిగితే రూ.9 కోట్ల మేర అవినీతి జరిగిందని, ఇందులోనూ సంకేపల్లి పంచాయతీ పరిధిలో రూ.4.36కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బట్టబయలైందని గుర్తు చేశారు. ఇందుకు కారకులైన 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నీరు చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పందిరి తీగలు, పాత తోటల పునరుద్ధరణ, పండ్ల తోటల విస్తరణ తదితర పథకాలకు సంబంధించి రూ.కోట్లను బినామీ పేర్లతో టీడీపీ నేతలు దోచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే టీడీపీ పాలనలో సూరి సాగించిన అవినీతి, ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి సాధించిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. సమావేశంలో సర్పంచ్ నాగానందరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పోతిరెడ్డి, కత్తెకొట్టాల కృష్ట, వెంకట్రామిరెడ్డి, నాయకులు మల్లాకాలువ మురళి, కనంపల్లి రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, తుంపర్తి కృష్ణారెడ్డి, పోతులనాగేపల్లి శివారెడ్డి, బిల్వంపల్లి హరి, గొట్లూరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
టీడీపీపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, కర్నూలు: అధికార పార్టీపై నానా యాగీ చేస్తున్న విపక్ష నేతలు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమరంపై కర్నూలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసిన టీడీపీ నేతలు రోజుకో పంచాయతీని తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. నందికొట్కూర్ వైఎస్సార్సీపీ విభేదాలపై స్పందించిన మంత్రి .. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ల కోసం వైఎస్సార్సీపీ నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు సహజమేనని పేర్కొన్నారు. ఇది తమ అంతర్గత వ్యవహారమని, త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షానికి లబ్ధి చేకూరే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వమని స్పష్టం చేశారు. ఎంపీటీసీలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది దారుణమని, అసంబద్ధమని పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థి చనిపోతే ఎన్నికల కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లడం అనేది మొదటిసారిగా చూస్తున్నానన్నారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే సునీల్ గవాస్కర్ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు పరిస్థితి గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. -
బాలయ్యా.. ఇదేందయ్యా!
సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లోనూ ‘పచ్చ’ నాయకులు తమ బుద్ధి చూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మాస్కులు, కూరగాయలు పంపిణీ పేరుతో యథేచ్ఛగా అందరి మధ్య తిరుగుతూ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత లాక్డౌన్ అమల్లో ఉన్నా నిత్యం రైతుబజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో సంచరిస్తూ మాస్కుల పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నిత్యావసర వస్తువుల బ్యాగులపై ఎమ్మెల్యే బాలకృష్ణ బొమ్మలు ముద్రించి పంచుతున్నారు. మచ్చుకు కొన్ని... విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న పీలా శ్రీనివాసరావు సరుకులు ఇస్తూ ఫొటోతో పాటు పాంప్లేట్ ఇస్తున్నారిలా.. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాజశేఖర్ ఏకంగా చంద్రన్న కానుక సంచులు పంచుతున్నారిలా.. గుంటూరు జిల్లా గుజ్జనగండ్ల ప్రాంతంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర పార్టీ కండువాలు, జెండాలతో ప్రచారం చేస్తున్నారిలా.. -
ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట!
సాక్షి, అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేసే వారంతా టీడీపీ వాళ్లు కాదని.. బిర్రు ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించి కావాలనే ఎన్నికలు ఆలస్యం చేశారని ఆరోపించారు. హైకోర్టు ఒక నెల సమయమిచ్చినా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. (సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీయేనా..?) 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై పోరాడతామని, సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే 16 వేల మంది బీసీలకు పదవులు పోతాయన్నారు. తమకు కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి ఉన్నందునే.. 50 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని అధికార పార్టీ చెప్పడం సరికాదన్నారు. దీనివల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు వల్లే సీట్ల కోత) చంద్రబాబు బీసీల వ్యతిరేకి టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. ఆయన నైజం తెలుసుకున్న బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. – రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి -
ప్రభుత్వ ఉద్యోగిని దూషించిన కేసులో కూన అరెస్ట్
-
ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల
సాక్షి: పరిపాలన, అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనేకచోట్ల మానవహారాలు నిర్వహించారు. మరికొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి ప్రజలు తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. విశాఖ నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును శాసన మండలిలో కుట్రపూరితంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎన్ఏడీ, మద్దిలపాలెం జంక్షన్లలో పెద్దఎత్తున మానవహారాలు నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన విశాఖపైనే విషం కక్కుతున్న వెలగపూడి రామకృష్ణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంవీపీ కాలనీలోని ఆయన ఇంటివద్ద బుధవారం రాత్రే ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం మరోసారి ప్రజలు భారీఎత్తున తరలివెళ్లి ముట్టడించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. తర్వాత ఆ బొమ్మను దహనం చేశారు. ఇక కొమ్మాది, చోడవరంలో, బుచ్చయ్యపేట మండలం వడ్డాది, రావికమతంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రోలుగుంట మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. నక్కపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో జరిగిన నిరసన ప్రదర్శనలో భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నర్సాపురంలో వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి, రాస్తారోకో చేశారు. తణుకు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెంలలో చంద్రబాబువి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎమ్మెల్సీలు ఫరూక్ ఆఫీసు, బీటీ నాయుడు ఇల్లు ముట్టడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ బి.సత్యన్న, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ వై.జయరాజు ఆధ్వర్యంలో భారీఎత్తున ధర్నా నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు. నంద్యాలలో విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ ఫరూక్ కార్యాలయాన్ని ముట్టడించాయి. అనంతరం చంద్రబాబు చిత్రపటాలను, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదోనిలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గేటుకు వినతిపత్రాన్ని అంటించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, నిండ్ర, ఐరాల మండలంలో పార్టీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు డౌన్..డౌన్.. అంటూ సాగిన నినాదాలతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మార్మోగింది. అమరావతి భూ మాఫియా కోసం ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగలవద్దని అచ్చెన్న సొంత నియోజకవర్గంలోనే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. టెక్కలిలో పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ధర్మపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో అర్ధనగ్న ప్రదర్శన అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధ నగ్నంగా ర్యాలీ నిర్వహిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ సీమ ద్రోహులని మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మండిపడ్డారు. బాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ.. విజయనగరంలో చంద్రబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి కాళ్లతో కొడుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. అలాగే, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం సమంజసం కాదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం గుంటూరు నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి విమర్శించారు. వికేంద్రీకరణ అంశంపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఆయన చిత్రపటాన్ని మహిళలు పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు. -
వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజకీయ క్రీడలో పెద్దల సభ ప్రతిష్ట మసకబారిందా? గీత దాటి గౌరవాన్ని కోల్పోయిందా? అనే ప్రశ్నలకు మేధావుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలి వైఖరి నేపథ్యంలో విన్పిస్తున్న వాదనలివి. ప్రజల ద్వారా ఏర్పడిన అసెంబ్లీ పంపిన బిల్లులకు మండలి సవరణలతో సరిపెడితే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పిన మండలి చైర్మన్, విచక్షణాధికారం వాడుకున్నానని చెప్పడంతో కౌన్సిల్ పరువు గంగపాలయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ఎజెండాకు తామెందుకు సహకరించాలని మండలి సభ్యులే ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినా సర్వాధికారం శాసనసభకే ఉన్నప్పుడు అనవసరంగా శాసనమండలి రాజకీయ వివాదాలకు వేదికవ్వడాన్ని బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలూ వ్యతిరేకిస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపే విధానం సరైంది కాదంటూనే.. విచక్షణాధికారం తప్పలేదని మండలి చైర్మన్ చెప్పడం అన్ని వర్గాల్లోనూ చర్చకు ఆస్కారమిచ్చింది. ‘సలహాలు సూచనలు ఇవ్వొచ్చు... లేదంటే తిరస్కరించవచ్చు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకు పెద్దల సభ వేదిక కాకూడదు’ అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఎవరి కోసం ఈ వివాదం? అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి మండలి చైర్మన్‌నే రాజకీయ ఉచ్చులోకి దించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ప్రభావితం చేయడం ఓ సమస్య అయితే.. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే మండలి లక్ష్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘శాసన మండలి రాజకీయంగా నడుస్తోందన్న సంకేతాలిచ్చినట్లయింది. నిబంధనల ప్రకారం వెళ్లాలని సూచించాం. కానీ ఇక్కడ రూల్స్ అతిక్రమించామని చైర్మనే అంటున్నారు. ఇవి మంచి సంకేతాలా?’ అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ఇష్టపడని ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులూ గతంలో సభకొచ్చాయి. వాటికి సవరణలు చేస్తూ పంపారు. పరోక్షంగా వీటిని టీడీపీ తిరస్కరించినా.. ఇబ్బంది లేకుండా అభిప్రాయం చెప్పగలిగారని మరో ఎమ్మెల్సీ అన్నారు. సీఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలోనూ ఇదే చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. రాజకీయంగా పంతం నెగ్గించుకోవడమే అంతిమ ధ్యేయంగా మండలి పరువును టీడీపీ బజారుకీడ్చిందని ఆయన అన్నారు. సభలో బలముందని ఇలా వ్యవహరించడం వల్ల రాజ్యాంగ బద్ధమైన వేదిక విలువ పడిపోతుందని మండలిలో బీజేపీ పక్ష నేత మాధవ్ ఆక్షేపించారు. ఇంత చేసినా బిల్లును ఆపగలరా? కీలకమైన బిల్లులను రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకోవడంతో ఇప్పుడు శాసనమండలి అందరి నోళ్లలో నానుతోందని, ఇది మంచి పరిణామం కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ‘అసలు మండలి చైర్మన్ విచక్షణాధికారంపై చర్చ జరగాల్సిందే’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తీరును ఆయన తప్పుబట్టారు. పెద్దల సభ లోతైన విశ్లేషణతో మంచి సలహాలిచ్చే వేదికన్న భావన ఇప్పటి వరకూ ఉందని, ఇప్పుడు అదో రాజకీయ కుట్రలకు వేదికగా మారిందని మరో రాజకీయ విశ్లేషకుడు అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపి చెడ్డపేరు తెచ్చుకోవడం మినహా బిల్లును ఆపగలిగే శక్తి మండలికి ఉంటుందా? అలాంటప్పుడు ఈ యాగీ ఎందుకని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘జాప్యం చేయవచ్చేమోగానీ.. ఆపలేనప్పుడు అనవసరంగా వివాదం కావడమేనన్న భావన న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ మాటల్లో వ్యక్తమైంది. ఏదేమైనా బిల్లులపై మండలి తీరు విస్తృత చర్చనీయాంశమవ్వడం మండలి సభ్యులకు చిన్నతనంగా అన్పిస్తోంది. విశ్వసనీయతకు సవాల్ ఏ సభ అయినా ప్రజాభిప్రాయానికే విలువివ్వాల్సి ఉంటుంది. కానీ మండలి దారి తప్పడం రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందనే వాదన గట్టిగా విన్పిస్తోంది. వివాదాస్పదమైన బిల్లుల విషయంలో మండలి చైర్మన్‌కు సభ్యులు అవసరమైన సలహాలిచ్చారు. కానీ విపక్ష టీడీపీ ఒత్తిడే ఆయనపై పని చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఇది మండలి విలువను దిగజార్చడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘మండలి చైర్మన్ వివాదంలోకి వెళ్లడమేంటి? ఆయన నిర్ణయం రాజకీయ ప్రయోజనం కావడం ఏంటి?’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీనియర్ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ ఈ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబు కుట్రలో భాగమై.. మండలి చైర్మన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా దొడ్డిదారిన అడ్డుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. -
గ్రానైట్ మాఫియా దోపిడీ రూ.1,000 కోట్ల పైమాటే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్‌్కఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్‌్కఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. -
రక్తికట్టని పెయిడ్ డ్రామాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, గుంటూరు/ గుడివాడ/ధర్మవరం: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీ తీరులో మార్పురాకపోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ డ్రామాలు, శవరాజకీయాలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా.. ఆ పార్టీ నేతలు వాటిని కొనసాగిస్తుండటంపై మండిపడుతున్నారు. టీడీపీ అధినేత మొదలు.. కార్యకర్తల వరకూ చేస్తున్న డ్రామాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఓ పెయిడ్ ఆర్టిస్ట్‌తో సోషల్ మీడియాలో పెట్టించిన పోస్టు రాష్ట్ర మంత్రిని, ఆయన సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉండటంతో ఆ ఆర్టిస్ట్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు. అయినా టీడీపీ నేతలు డ్రామాలు కొనసాగిస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటాన్ని వారు నిలదీస్తున్నారు. మరోపక్క శవరాజకీయాలు చేస్తున్న టీడీపీ నేతలను ప్రజలే ఛీ కొడుతున్నారు. పరస్పర దాడుల్లో, ఇతర పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే దానిని వైఎస్సార్సీపీ నేతలకు ముడిపెట్టడం టీడీపీ నేతలకు రివాజుగా మారిందంటూ ధ్వజమెత్తుతున్నారు. వరదల సమయంలో పెయిడ్ ఆర్టిస్టులతో.. ఈ ఏడాది వర్షాలకు కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంటే.. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ దుష్ప్రచారం చేయాలని అనుకున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్టకు చెందిన జూనియర్ ఆర్టిస్టు కుడితిపూడి సోమశేఖర్ చౌదరితో టీడీపీ ఓ వీడియో చేయించింది. ఈ వీడియోలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను, ఆయన సామాజికవర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై కృష్ణాజిల్లా పోలీసులు కేసు నమోదు చేసి పెయిడ్ ఆర్టిస్టు సోమశేఖర్ చౌదరితో పాటు మరికొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీ హాల్లో కూర్చోవచ్చని వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఉసిరికాయల అంకారావు సెప్టెంబర్‌లో పనిమీద గుంటూరుకు వచ్చాడు. అదే సమయంలో పల్నాడు బాధితుల పునరావాస కేంద్రం పేరిట టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రబాబును చూడటానికి, ఏసీ హాల్లో కొద్దిసేపు కూర్చోవచ్చనే ఆశతో అక్కడకు వెళ్లాడు. అతన్ని సైతం వైఎస్సార్సీపీ బాధితునిగా టీడీపీ చిత్రీకరించింది. జిల్లాలోని బ్రాహ్మణపల్లికి చెందిన మౌలాలీ, యుసూబ్ సోదరులతో వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా ఆ శిబిరంలో స్టేట్మెంట్లు ఇప్పించారు. తన 40 ఎకరాల పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా వైఎస్సార్సీపీ నాయకులు గ్రామం నుంచి వెళ్లగొట్టారని మౌలాలీ చెబితే.. 40 సెంట్ల స్థలం లేని మౌలాలీకి 40 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తోడికోడళ్ల మధ్య గొడవ జరిగితే.. తోడి కోడళ్ల మధ్య జరిగిన గొడవనూ వైఎస్సార్ సీపీకి ఆపాదించాలని చంద్రబాబు ప్రయత్నించడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రమాంబపురంలో ఈ ఏడాది జూన్ 25న బసంగారి పద్మ (28)తో ఆమె తోడికోడళ్లు పాపమ్మ, పెదలక్ష్మి, లక్ష్మిలు గొడవపడ్డారు. ఈ గొడవలో పద్మను తోడికోడళ్లు నడి బజారులో తీవ్రంగా కొట్టడంతో అవమానంగా భావించి ఉరివేసుకొని మృతి చెందింది. ఆ మహిళ మృతికి వైఎస్సార్సీపీ నాయకులే కారకులంటూ కట్టుకథ అల్లారు. ఘటన జరిగిన పది రోజుల తరువాత అక్కడకి వచ్చిన చంద్రబాబు రాజకీయ డ్రామాను రక్తి కట్టించేందుకు హంగామా చేశారు. గొడవకు కారణం కుటుంబ కలహాలే అని మృతురాలి బంధువులు, గ్రామస్తులు చెప్పడంతో పచ్చ గ్యాంగ్ తోక ముడిచింది. పద్మ మృతికి కుటుంబ కలహాలే కారణమని ఇంకొల్లు సీఐ ఆర్ రాంబాబు కూడా స్పష్టం చేశారు. రైతు బజారులో వ్యక్తి చనిపోతే.. గుడివాడలో నూనె సాంబిరెడ్డి రైతుబజార్‌కు కూరగాయల కోసం వెళ్లి గుండెపోటుతో మరణిస్తే.. అక్కడ కూడా టీడీపీ నేతలు శవరాజకీయానికి తెరతీశారు. ఆయన ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోయారంటూ దుష్ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనకు రోజూ శివాలయానికి వెళ్లడం అలవాటని, అక్కడి నుంచి రైతు బజారుకు వెళ్లిన సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయారని, తమకు సబ్సిడీ ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు తమ తండ్రి మరణాన్ని వాడుకోవడం సిగ్గు చేటు అంటూ మృతుడి కుమారుడు మహేష్‌రెడ్డి విమర్శించారు. పక్షవాతం బాధితుడితో డ్రామా టీడీపీ బురద చల్లే రాజకీయాలకు ఇది తాజా నిదర్శనం. పక్షవాతం కారణంగా కాళ్లు చేతులు చచ్చుబడ్డ ఓ వ్యక్తిని తెరపైకి తెచ్చి వైఎస్సార్ సీపీ బాధితుడంటూ టీడీపీ నేతలు బుకాయించారు. ఈనెల 18, 19, 20వ తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష జరుగుతున్నపుడు డి.చెర్లోపల్లికి చెందిన శివయ్యను టీడీపీ నేతలు కుర్చీలో వేదికపైకి తెచ్చారు. బత్తలపల్లి మండలం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వైఎస్సార్సీపీ నేతల దాడిలో ఇలా అయ్యాడంటూ చెప్పారు. అయితే ఆటో నడిపే శివయ్యకు ఈ ఏడాది జూలై 29న పక్షవాతం వచ్చి కుర్చీకే పరిమితమయ్యాడు. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరేందుకు చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాడు. శివయ్యను చూసిన టీడీపీ నేతలు డ్రామాకు తెరతీశారు. ఇతను వైఎస్సార్సీపీ బాధితుడు అంంటూ చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించి ఇవ్వకుండానే వెళ్లిపోయారు. అయితే టీడీపీ డ్రామా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తాను కేవలం ఆర్థిక సాయం కోసమే వెళ్లానంటూ శివయ్య చెప్పాడు. ‘లక్ష ఇచ్చిందీ లేదు.. పొయ్యిందీ లేదు.. దళితుడినైన నన్ను ఇలా రచ్చ కీడ్చడమేంటి?’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
తెలుగుదేశం పార్టీ శవ రాజకీయం
సాక్షి, ప్రత్తిపాడు/కాకుమాను: గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నవ శ్రీనివాసరావు(47) ఈ నెల 11వ తేదీన ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 12వ తేదీన జీజీహెచ్‌లో పోలీసులు శ్రీనివాసరావు భార్య అనసూయ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అప్పుల బాధతోనే తన భర్త పురుగు మందు తాగాడని ఆమె పేర్కొంది. 15వ తేదీన శ్రీనివాసరావు మరణించాడు. అయితే, అతడి మరణాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ శుక్రవారం ప్రత్తిపాడులో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాసరావు ఏ తప్పు చేయకున్నా దొంగ కేసు పెట్టి, హింసించి, వేధించి వైఎస్ జగన్ ప్రభుత్వం చంపేసిందంటూ ఆరోపించారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీనివాసరావుపై ఓ కేసు నమోదైంది. తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రత్తిపాడుకు చెందిన నాగమణి 2018 జూలై 22న ఉన్నవ శ్రీనివాసరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోకేష్ పద్ధతి మార్చుకోవాలి: హోం మంత్రి శవ రాజకీయాలు చేస్తున్న నారా లోకేష్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం హితవు పలికారు. టీడీపీ పాలనలో అధికారులకు సైతం రక్షణ లేకుండా చేసిన మీరా ప్రజల గురించి మాట్లాడేది అని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. -
టీడీపీకి మరో ఎదురుదెబ్బ; రాజా రాజీనామా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి గురువారం రాజీనామా చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని వాపోయారు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, తానెప్పుడో టీడీపీ నుంచి బయటకు రావాలనికున్నానని వెల్లడించారు. టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని అన్నారు. మాటపై నిలబడే వ్యక్తులు టీడీపీలో లేరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చాలా బాగుందని, పేద ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారని ప్రశంసించారు. మూడు నెలల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పక్షాళన చేశారని మెచ్చుకున్నారు. రాజధాని మారుస్తానని సీఎం జగన్ ఎక్కడా చెప్పలేదని, టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు 90 శాతం భూములు కొన్నారని వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ వరుపుల రాజా 4611 ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్రప్రసాద్ చేతిలో ఓడిపోయారు. -
బీజేపీ వైపు.. టీడీపీ నేతల చూపు
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలబోతోందా! అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీలో చేరదామనుకున్న వీరికి ద్వారాలు మూసుకుపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. పల్నాడుకు చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఒకరు విశాఖపట్నంకు చెందిన బీజేపీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకుని బీజేపీ ముఖ్యనేతను కలిసినట్టు తెలిసింది. అక్రమ మైనింగ్ కేసుల నుంచి బయటపడటంతోపాటు, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు సదరు నాయకుడు అధికార పార్టీలో చేరాలని చూస్తున్నట్టు గ్రహించిన బీజేపీ ముఖ్యనేత ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో కొత్తదారులు వెతుకుతున్నట్టు తెలిసింది. తనకో దారి చూపించమని బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడిని ఆశ్రయించినట్టు భోగట్టా. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. వీరంతా టీడీపీకి మరో 20 ఏళ్లపాటు రాజకీయ భవిష్యత్ లేదనే నిర్థారణకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అత్యధికులు పార్టీని వీడి బీజేపీలోకి క్యూ కట్టేందుకు వెంపర్లాడుతుండటం విశేషం. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
తమ్ముళ్లకే ఉపాధి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం తెలుగుదేశం పార్టీ నేతలకు కల్పతరువుగా మారింది.2014లో అధికారంలోకి రాగానే పథకం ఆరంభం నుంచిఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన వారిని తొలగించి వారి స్థానంలోతమ అనుచరులను టీడీపీ నేతలు నియమించుకున్నారు.ఫలితంగా అప్పటివరకు ఏటా కూలీల పనులకు రూ.5 లక్షల మేర చెల్లించిన గ్రామాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రూ.25లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకంలో ఎక్కువమంది నిరుపేద కూలీలకు పని కల్పించిన సంవత్సరాలలో 2012–13 ప్రధానమైంది. ఆ ఏడాదిలో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామంలో పథకం ద్వారా కూలీలకు రూ.5.75 లక్షల మేర ఉపాధి కల్పించారు. అంతకుముందు ఆరేళ్ల పాటు ఆ గ్రామంలో కూలీల పని విలువ కేవలం రూ.4.20 లక్షలు మాత్రమే. కానీ, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ గ్రామంలో ఫీల్డు అసిస్టెంట్‌ను మంత్రి మార్చేసి పార్టీలో కీలకంగా పనిచేసే వ్యక్తిని నియమించేశారు. అంతే.. ఆయన తొలి ఏడాదిలో రూ.12.91 లక్షలు, రెండో ఏడాది రూ.19.94 లక్షలు, మొన్న మార్చి నెలాఖరుతో ముగిసిన మూడో ఏడాది రూ.29.08 లక్షల మేర కూలీలు పనిచేశారని బిల్లులు డ్రా చేశారు. అలాగే, 2012–13 సంవత్సరంలో ఆ గ్రామంలోకూలీల సంఖ్య 678 మందే. ఇప్పటికీ అక్కడ ఆ సంఖ్యలో మార్పులేదు. కానీ, ఒక్కో కుటుంబానికి ఇచ్చే కూలీ కార్డుల సంఖ్య మాత్రం 442 నుంచి 648కి అమాంతంగా పెరిగింది. ఈ పెరుగుదలలో మతలబు ఏంటని సదరు గ్రామంలో ‘సాక్షి’ విచారిస్తే విస్తుగొలిపే నిజాలు తెలిశాయి. అధికార పార్టీకి చెందిన ఈ ఫీల్డు అసిస్టెంట్ గ్రామంలో తనకు కావాల్సిన వారు పనిచేసినట్లు బిల్లులు సృష్టించి వారి పేరున బ్యాంకులో డబ్బులు పడిన తర్వాత వారితో డబ్బులు డ్రా చేయించి, వాళ్లకు కొంత ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఆయన జేబులో వేసుకుంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఏడాదికి ఆ ఒక్క గ్రామంలోనే ఆ ఒక్క ఫీల్డు అసిస్టెంటే రూ.10 లక్షల దాకా జేబులో వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ దొంగ మస్తర్లతో ఐదేళ్లుగా టీడీపీ నేతలు సాగించిన స్వాహా పర్వం. కరువు ప్రాంతాలకు అరకొర.. డెల్టాకు దండిగా.. ఈ పథకం నిధులను కూలీల పనుల కల్పనకు కాకుండా కాంట్రాక్టర్ల పనులకు మళ్లిస్తున్నారు. అంతేకాక.. వలసలు ఎక్కువగా ఉండే అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఇటీవల ఈ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పన పెరగడంలేదుగానీ.. రెండు మూడు పంటలు పండే డెల్టా ప్రాంతాలైన పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ పథకం ద్వారా పనుల కల్పన గత మూడేళ్లలో బాగా పెరిగింది. అలాగే.. ►రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టిన మొత్తాన్ని 2012–13 ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం మూడు రెట్లు దాకా పెరిగింది. కానీ, విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కూలీలకు పనుల కల్పన మాత్రం బాగా తగ్గిపోయింది. ►2012–13లో రాష్ట్రంలో ఈ పథకం కింద రూ.3,140 కోట్లు ఖర్చు పెట్టగా.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అది రూ.9,212 కోట్లకు పెరిగిపోయింది. ►మరోవైపు.. అదే ఏడాది విజయనగరం జిల్లాలో కూలీలకు రూ.3.09 కోట్ల మేర పని దినాలు కల్పిస్తే, 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2.61 కోట్ల పని దినాలను మాత్రమే కల్పించారు. ►శ్రీకాకుళం జిల్లాలోనూ రూ.70 లక్షల పని దినాల మేర పేదలకు ఉపాధి తగ్గిపోయింది. ►పథకం ఖర్చు మూడింతలు పెరిగిందేగానీ అనంతపురం వంటి కరువు జిల్లాలో కూలీలకు పనుల కల్పన మాత్రం పెరగలేదు. ►పశ్చిమ గోదావరి జిల్లాలో 2012–13లో రూ.69 లక్షల మేర కూలీలకు ఉపాధి కల్పిస్తే, అది ఇప్పుడు రెట్టింపు కన్నా పెరిగి ఏడాదికి రూ.1.45 కోట్లకు పెరిగింది. దీంతో గ్రామాల్లో టీడీపీ నాయకులు ఈ పథకాన్ని పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతటా అప్పటివరకు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మార్చేసి, వారి స్థానంలో తమ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ పెద్దలు నియమించడంతో ఈ పథకం తమ్ముళ్లకు ‘ఉపాధి హామీ’గా మారిపోయింది. ఎస్సీ, ఎస్టీలకు తగ్గిన ‘ఉపాధి’ ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి హామీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. బీసీలకు సైతం పని కల్పించడం తగ్గించి.. అగ్రవర్ణాలలోని తమకు కావాల్సిన వారికి ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా గ్రామాల్లో నిరుపేద కూలీలు ఏటా రూ.170 కోట్లు నుంచి రూ.200 కోట్లు వరకు నష్టపోయినట్లు ఓ అంచనా. ఉదాహరణకు.. 2012–13 సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి ఖర్చు పెట్టిన నిధులలో 22.77 శాతం నిధులను నాటి ప్రభుత్వం ఎస్సీలకు ఖర్చుపెట్టగా.. 2014 నుంచి వరుసగా ఈ శాతం 22.51, 22.42, 22.03, 22.00, 21.48 శాతానికి పడిపోతూ వచ్చింది. మొత్తంగా ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు 1.29 శాతం నిధులు తగ్గిపోయాయి. అంటే.. ఏటా రూ.70 కోట్లు మేర ఎస్సీ కూలీలు ఉపాధిని కోల్పోయారు. అలాగే, ఎస్టీ వర్గాల పరిస్థితి కూడా ఇంతే. వీరికి 2012–13లో 11.69 శాతం నిధులు ఈ పథకంలో ఖర్చుపెట్టగా.. గత ఐదేళ్లుగా ఈ మొత్తం తగ్గిపోతూ ఈ ఏడాది మార్చి నాటికి 10.19 శాతానికి పడిపోయింది. అంటే ఎస్టీలు కూడా ఏటా రూ.74 కోట్లు చొప్పున నష్టపోయారన్న మాట. అలాగే, బీసీలకు కూడా ఏటా రూ.26 కోట్ల మేర ఉపాధి తగ్గిపోయింది. పని అడిగే వారికి అరకొర ఉపాధి కాగా, ఉపాధి హామీ పథకం చట్టం నిబంధనలు ప్రకారం పనిచేయడానికి ముందుకొచ్చే కూలీలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంటుంది. అయితే, గత ఐదేళ్లలో కుటుంబానికి సరాసరి కల్పించే పనిదినాల సంఖ్య కూడా తగ్గిపోయింది. 2011–12, 2012–13 సంవత్సరాల్లో సరాసరి కుటుంబానికి 65 రోజుల పని కల్పించగా, ఈ మొత్తం ఇప్పుడు 58 రోజులకు పడిపోయింది. గత ఐదేళ్లలో ఈ పథకానికి కేంద్ర సాయం.. ఏడాది కేంద్రం ఇచ్చిన నిధులు (కోట్లలో) 2015–16 3,073.80 2016–17 3,776.37 2017–18 5,127.63 2018–19 6,684.53 2019–20 1,510.89 (కేవలం 28 రోజులకే.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు) అంకెల్లో ఉపాధి హామీ పథకం.. ►పథకంలో నమోదు చేసుకున్న కుటుంబాలు 88,68,329 ►జాబ్‌కార్డులో నమోదై పని కోరుతూ సంఘాలుగా ఏర్పడ్డ కూలీల సంఖ్య 91,63,273 ►2018–19 ఆర్థిక ఏడాదిలో పని కల్పించిన కుటుంబాలు 42,35,321 ►వంద రోజులపాటు పని పొందిన కుటుంబాలు 8,56,727 -
విజయనగరం: ఇక ప్రచార యుద్ధం షురూ!
అసలైన యుద్ధం మొదలు కానుంది. నామినేషన్ల ప్రక్రియలో అన్ని అంకాలూ గురువారంతో ముగిశాయి. ఉపసంహరణల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఇప్పటికే పోటీలో ఉన్నవారు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా కొందరు అభ్యర్థులు హోరాహోరీ పోరాడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీలోకి వలసల జోరు ఎక్కువైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతిరోజూ వందలకొద్దీ కుటుంబాలు తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ పార్టీ నాయకులు వారిని చేర్చుకోవడంలో తలమునకలవుతున్నారు. ఇప్పటికే వరుసగా క్యూకడుతున్నవారిని చూసి అధికార తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇక బరిలో మిగిలిన అభ్యర్థులు ప్రచార పర్వంలోకి పూర్తి స్థాయిలో దిగనున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు, విమర్శల కత్తులు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ), తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోరు సాగనుంది. జిల్లాలోని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో టీడీపీయే పైచేయి సాధించింది. విజయనగరం పార్లమెంట్ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలను అప్పట్లో కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన బొబ్బిలి ఎమ్మెల్యేను లాక్కున్న టీడీపీ తన బలం ఏడుకు పెంచుకుంది. కానీ ఈ సారి ఎన్నికల్లో పరిస్థితులు మారనున్నట్టు కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లలో అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ చేసిన అరాచకాలు, అన్యాయాలకు జనం విసిగిపోయారు. సరైన సమయం ఎప్పుడొస్తుందా, టీడీపీకి బుద్ధిచెప్పి తమను ఇన్నాళ్లూ ఎక్కితొక్కిన నేతలను ఇంటికి సాగనంపుదామని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైపు పరుగులు దీస్తున్న నేతలు, కార్యకర్తలే దీనికి నిదర్శనం. ఇంటిపోరుతో సతమతం ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు ఎక్కువైంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత రావడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. జిల్లాలో టీడీపీ అధికారంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీలో అసంతృప్తులు భారీగానే తెరపైకి వచ్చారు. సిట్టింగ్‌లకు టిక్కెట్టు ఇవ్వవద్దని బహిరంగంగానే అధినేతకు స్పష్టం చేశారు. అయినా ప్రజలు, పార్టీ నేతల అభిప్రాయం కంటే తన స్వార్థ, సొంత నిర్ణయాలకే ప్రాధాన్యమిచ్చే బాబు మాత్రం అసంతృప్తుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే టిక్కెట్టు కేటా యించి తప్పు చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కష్టపడ్డ నేతలు చంద్రబాబు తీరుతో తీవ్ర మనో వ్యధకు లోనయ్యారు. తమకు ఎన్నటికీ పార్టీలో గుర్తింపు రాదని తెలుసుకున్నారు. వారిలో కొందరు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోతున్నారు. అభ్యర్థుల ఎంపికలోనే తేడాలు అభ్యర్థుల ఎంపికలోనే ఇరుపార్టీల వైఖరి తేటతెల్లమైంది. పార్టీ కోసం కష్టపడ్డవారికి, సామాన్యులకు, ఎలాంటి అవినీతి మరకలు లేనివారికి వైఎసాŠస్‌ర్‌సీపీ టిక్కెట్లు ఇచ్చింది. టీడీపీ మాత్రం సిట్టింగ్‌లకు, కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చింది. విజయనగరంలో మాత్రం బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎంపీ అశోక్ కుమార్తెకు టిక్కెట్టు ఇచ్చిం ది. అర్హులను కాదని ఒకే కుటుంబంలో తండ్రీ, కూతుళ్లకు టిక్కెట్టు ఇవ్వడం ద్వారా తమకు తమ వ్యక్తులే ప్రాధాన్యమనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇవన్నీ గమనించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిం దని గ్రహించారు. వైఎస్సార్సీపీకి జైకొడుతూ ఆ పార్టీ కండువాలు వేసుకుంటున్నారు. దీంతో నిత్యం వైసీపీ నేతలు ఇతర పార్టీల నుంచి వస్తున్న వలస నేతలు, కార్యకర్తలను ఆహ్వానించడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు రావాలి జగన్– కావాలి జగన్ అంటూ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. టీడీపీ మాత్రం మళ్లీ నువ్వేరావాలి అనే నినాదాన్ని జనానికి చెబితే ఎందుకు బాబూ మళ్లీ నువ్వే అంటారని భయపడుతోంది. -
లోకేశా! అది మానవమాత్రులకు సాధ్యం కాదు..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాబు ప్రచారం మూడు జోకులు.. ఆరు నవ్వులుగా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రచారానికి వచ్చిన ప్రజలను, నెటిజన్లను వచ్చిరాని తెలుగుతో.. విషయాలపై అవగాహన రాహిత్యంతో లోకేష్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. పలుమార్లు తన ప్రసంగాలతో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అవగాహన లేకుండా ఆవేశంగా మాట్లాడి పప్పులో కాలేశారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. దీంతో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, అక్కడున్న వాళ్లు పట్టపగలే చుక్కల వైపు చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. లోకేశా! అది మానవమాత్రులకు సాధ్యం కాదు... దేవుడా!.. తెలంగాణలో అసలు సముద్రమేలేదు కదయ్యా!!... చంద్రబాబు అమరావతి కడితే కేసీఆర్ తీసుకుపోతాడని అందుకే కట్టడంలేదు.. అంటూ లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. -
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
-
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ‘ఎర్రర్’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారిక వెబ్సైట్ www.telugudesam.org షట్‌డౌన్ కావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్‌సైట్‌ను మూసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆన్లైన్ సభ్యత్వాన్ని కూడా ఇంతకుముందే హఠాత్తుగా నిలిపివేశారు. (అంతా పథకం ప్రకారమే!) మంత్రి నారా లోకేశ్‌తో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్‌కు సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్‌తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం బయటపడింది. గుట్టురట్టు కావడంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు దీని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనబడుతోంది. (అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!)