సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేలా టీడీపీ శ్రేణులను ప్రేరేపిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలపై శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులందాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు ఈ ఫిర్యాదులు చేశారు. సమాజంలో అశాంతి కలిగేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, లోకేశ్, ఇతర నేతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లకు నారా లోకేశ్ కుట్ర చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి శనివారం విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విశాఖ జిల్లా కో కన్వీనర్ సదరం జ్ఞానేష్, ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ అనిల్ శర్మ తదితరులతో కలిసి ఆయన విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ కొల్లు గోపాలకృష్ణ తదితరులు ఫిర్యాదు చేశారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొప్పుల ప్రభాకరరెడ్డి, కో కన్వీనర్లు డెక్కత జయరాంరెడ్డి, కొమ్మన అనిల్ తదితరులు ఏలూరు వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల మండల సోషల్ మీడియా ప్రతినిధులు ద్వారకా తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో నాలుగు రోజుల్లో లోకేశ్ పాదయాత్ర నల్లజర్ల మండలం చేరుకుంటుందని, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఏలూరు జిల్లా కోకన్వీనర్ సైదం సురేష్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టి.నర్సాపురం పోలీసులకు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ శ్రీను రాజు, ఎంపీపీ దారబోయిన లక్ష్మీ వెంకటేశ్వరరావు, సహకార సంఘ చైర్మన్, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, వైఎస్సార్‌సీపీ యూత్ మండల నాయకుడు కన్నం సర్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాకు చెందిన బాకూరు సత్యనిరంజన్, ఉచ్చుల స్టాలిన్, కుక్కల బాలచందర్ తదితరులు ఫిర్యాదు చేశారు. కుక్కునూరు సీఐ సత్యనారాయణకు మండల సోషల్ మీడియా కన్వీనర్ మల్లెల చంటినాయుడు ఆధ్వర్యంలో పలువురు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట సీఐ కాశీవిశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment